
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఎంబీబీఎస్ –2018 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో 2,705 అమ్మాయిలు సహా.. 7,617 మంది అర్హత సాధించారు. మొదటిసారిగా అమ్మాయిలే తొలిమూడు ర్యాంకులు చేజిక్కించుకోవడం విశేషం. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న 9 (న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రుషికేశ్, మంగళగిరి, నాగ్‌పూర్) ఎయిమ్స్‌లలోని 800 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. కాగా, తొలి 10 ర్యాంకుల్లో తొమ్మిది రాజస్తాన్‌లోకి కోటాలోని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు చేజిక్కించుకున్నారు. రెండు నుంచి 10వ ర్యాంకు వరకు అన్నీ ఈ సంస్థ ఖాతాలో చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment