
బెజవాడలోనే ఎయిమ్స్: కామినేని
విజయవాడ : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) విజయవాడలోనే ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ కోసం కేంద్రం రూ.12 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కామినేని తెలిపారు. మెడికల్ హబ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు.