సాక్షి, తాడేపల్లి : హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించారని, పేదలకు ఇచ్చే ఇళ్లపై సైతం కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం దురదృష్టకరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారాయన. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎండీ అజయ్ జైన్, అన్ని జిల్లాల పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ డెల్టా, మెట్ట ఏరియాలలో బిల్డింగ్ నిర్మాణ ఖర్చు ఎంత అవుతుందో చర్చించాము. ఖర్చు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాము. ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్లు నిర్మిస్తాము. తామే కట్టుకుంటామనే లబ్దిదారులకు 1 లక్ష 80 వేల రూపాయలు నిర్మాణ ఖర్చులకు ఇస్తాము. ప్రభుత్వమే కట్టివ్వాలనుకునే వారికి అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తాము. రోడ్డు, వాటర్, పవర్ వంటి వసతులతో ఇళ్లు నిర్మిస్తాము. (సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి )
అప్ల్యాండ్ ఏరియాలో 1 లక్ష 80 వేల రూపాయల ఇంటి నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనా వేశాము. ఇసుక ఉచితంగా ఇస్తాము. కృష్ణ, గోదావరి, పెన్న ఏరియాల్లో ఫిల్లింగ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుంది. అర్బన్, రూరల్ ఏరియాలో 15 లక్షల ఇల్లు కట్టి పేదలకు ఇస్తాము. కట్టుకునే వారికి సైతం తక్కువ రేటుకే మెటీరియల్స్ అందేలా చర్యలు తీసుకుంటాము. సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు. మొదటిగా ప్రతి జిల్లాలో రెండు, మూడు ప్రాంతాల్లో మోడల్ కాలనీలు నిర్మిస్తాము. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు లోన్స్ ఇచ్చి కాంక్రీటు మిక్చర్ల వంటివి కొనుక్కునేలా ఉపాధి కల్పిస్తామ’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment