Housing Corporation
-
గృహ నిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం
-
ఏపీతో ’ఈఈఎస్ఎల్’ ఒప్పందం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు విద్యుత్ ఆదా చేయగల గృహోపకరణాలను తక్కువ ధరకు పంపిణీ చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కుకే అందచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఈఎస్ఎల్ సంసిద్ధత వ్యక్తంచేసింది. గృహ నిర్మాణ శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం జరిగిన టెలీకాన్ఫెరెన్స్లో ఈఈఎస్ఎల్ సీఈఓ విశాల్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సామర్థ్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు సహకరించేందుకు ఈఈఎస్ఎల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఏపీసీడ్కో ప్రాజెక్టు నిర్వహణ సలహాదారు (పీఎంసీ)గా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఒక ఎంపిక మాత్రమే కానీ తప్పనిసరి కాదని, అయితే.. వీటి వినియోగంవల్ల ఒక్కో గృహంలో ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆ విధంగా మొత్తం 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్లు విలువైన విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్ మాట్లాడుతూ గృహ నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచటమే లక్ష్యమన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీశా, స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, జేఎండీ ఎం. శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ఓటీఎస్‌పై అదే దూకుడు
ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారికిఆ అప్పు ఎంత ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు మాత్రమే చెల్లించి దానిని పూర్తిగా మాఫీ చేసుకుని శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సొంతిల్లు ఉన్నా దానికి శాశ్వత గృహ హక్కు పత్రాలు లేక, అత్యవసర సమయాల్లో కుటుంబ అవసరాల కోసం బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందడానికి కూడా వీలులేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది భారీ ఊరట కలిగించే పథకం. ఈ పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇంకా సందేహాలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఈ పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు... ఓటీఎస్ పథకానికి జిల్లా వ్యాప్తంగా 1,56.914 మంది అర్హత కలిగినవారు ఉండగా, వారిలో ఇప్పటికే 1,13,665 మంది దరఖాస్తు చేసి సొమ్ము చెల్లించారు. మొత్తం రూ.16 కోట్ల 63 లక్షల 32 వేల 793 ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వానికి అందించారు. దరఖాస్తుదారుల్లో 83,707 మందికి ఇప్పటికే డేటా నమోదు ప్రక్రియను తహసీల్దార్లు పూర్తిచేశారు. వారిలో 52,281 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలు అందజేశారు. ఇంకా 31,426 మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అమలులో ముందు వరుసలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావించి ఈ హక్కు పత్రాల కార్యక్రమాన్ని లాంఛనంగా జిల్లాలోనే ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు మొదట్లో చూపించిన వేగాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి లబ్ధిదారునికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబరు 21న అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పత్రాలు సీఎం జగన్మోహన్రెడ్డి తణుకులో అందించారు. జిల్లాలో అర్హులకు హక్కు పత్రాలు అందించడంలో భాగంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేయడంలో ముందు వరుసలో నిలబడటంపై జిల్లా అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ, గృహనిర్మాణ అధికారులు ఓటీఎస్ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అర్హులందరికీ పట్టాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 52,281 మందికి పట్టాలు అందించాం. త్వరలోనే మరింత మందికి అందించేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నాం. – సూరజ్ ధనుంజయ్, జాయింట్ కలెక్టర్ -
ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులపై రేట్ల భారం తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మార్కెట్ కంటే తక్కువ ధరలకు సర్కార్ సమకూరుస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కంపెనీల సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ. 310 నుంచి రూ. 450 వరకూ ఉంది. ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ప్రభుత్వం మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకు సిమెంట్ సరఫరా చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంల్లో పోర్ట్‌ల్యాండ్ పోజోలానా సిమెంట్ (పీపీసీ) బస్తా రూ. 235 కు, ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ (ఓపీసీ) బస్తా రూ. 245కు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పది జిల్లాల్లో పీపీసీ బస్తా రూ. 225కు, ఓపీసీ రూ. 235 చొప్పున అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సిమెంట్ తయారీ ఫ్యాక్టరీలు లేకపోవడంతో రవాణా ఖర్చులు అధికంగా ఉండటం వల్ల స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కిలో ఐరన్‌ను రూ. 62 నుంచి 64లతో అందిస్తున్నారు. 90 బస్తాల సిమెంట్.. 480 కిలోల ఐరన్ ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్‌తో పాటు 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోంది. అదే విధంగా ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. డోర్లు, కిటికి ఫ్రేమ్‌లు, ఇతర వస్తువులను తమ అభిరుచులకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ వస్తువులను కూడా ఎవరైనా కావాలని అడిగితే అధికారులు సరఫరా చేస్తున్నారు. సిమెంట్, ఐరన్‌లో సబ్సిడీ ఇస్తుండటంతో ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 14 వేల నుంచి రూ. 20 వేలు వరకూ ఆర్థిక భారం తగ్గుతోంది. ఈ డబ్బు ఇంటిపై ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడానికి వీలు కలుగుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఆర్థిక భారం తగ్గింది నేను భవన నిర్మాణ కార్మికుడిని. ప్రభుత్వం స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించింది. నేనే స్వయంగా నా ఇంటిని నిర్మించుకుంటున్నాను. ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన సిమెంట్, ఐరన్ తీసుకున్నాను. సబ్సిడీ కింద ప్రభుత్వం సిమెంట్, ఐరన్, ఉచితంగా ఇసుక సరఫరా చేయడంతో ఆర్థిక భారం తప్పింది. – డి. నాని, లబ్ధిదారుడు బాపట్ల, గుంటూరు జిల్లా ముందుగానే ఇండెంట్ తీసుకుంటున్నాం సిమెంట్, ఇసుక, ఐరన్ సరఫరాకు లబ్ధిదారుల నుంచి ముందే ఇండెంట్ తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. ఏఈలు ఇండెంట్ పెట్టిన వెంటనే పైస్థాయి అధికారులు వస్తువుల సరఫరాకు అనుమతులు ఇస్తున్నారు. ఎక్కడా కొరత రాకుండా భవిష్యత్ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుతున్నాం. – నారాయణ భరత్ గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
పేద ప్రజలకు ఇదో వరం
పేద ప్రజలకు అద్భుతమైన వరం లాంటి ‘వన్ టైమ్ సెటిల్మెంట్‘ (ఓ.టి.యస్.) చెల్లించటం ద్వారా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధి పొందిన ప్రజలు రాష్ట్ర మంతటా ఎంతో ఉత్సాహంతో డిసెంబర్ 21న మంగళవారం పండుగ జరుపుకొంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం ప్రారంభించారు. ఓ.టి.యస్. లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల లబ్ది కల్పించింది. రుణ బకాయిల రద్దుతో మరో రూ. 10 వేల కోట్ల లాభం ప్రజలకు చేకూరింది. ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి తేడా చూపబోమని తొలినాళ్లలో ప్రకటించిన విధంగానే గత ప్రభుత్వ హయాంలో కట్టిన వారికికూడా మేలు కలిగేలా ప్రభుత్వం నిర్ణయం చెయ్య డంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి వారు గమనించాల్సినది ఏమిటంటే వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలనూ గత ప్రభుత్వం అసలు పరిశీలించనేలేదని! సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా గృహ నిర్మాణాల రుణం నిమిత్తం చెల్లించారు. గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కోరినా పట్టించుకోని చంద్రబాబు రేపు అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని అనడం ప్రజలను మభ్య పెట్టడమే. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేస్తున్న ప్పుడు ప్రజల గుండె చప్పుడు విన్నందున.. వారి సంక్షేమానికి అనుకూలమైన నవరత్నాల ద్వారా జనరంజక పాలన అందిస్తున్నారు. (చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు) గత ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ము కునే హక్కు కల్పించలేదని, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసిందని పాదయాత్రలో తెలుసుకుని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఓ.టి.ఎస్. పధకాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు పేద ప్రజలకు అందు తోంది. డి.ఫారం పట్టాలపై రుణం తీసుకుని ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేదలకు ప్రస్తుతం అమలులో వున్న నిబంధనలను సవరించి ఓ.టి.ఎస్. ద్వారా శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన పేదలు తమ ఇల్లు అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా పూర్తి హక్కులు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధి దారులు మొత్తం 56,69,000 మంది. ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసు కున్నారు. వీరి రుణ బకాయిలు వన్‌టైమ్ సెటిల్మెంట్ కన్నా తక్కువ ఉంటే ఆ మొత్తం కడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌లో చెప్పిన మొత్తం కట్టి సెటిల్ చేసుకుంటున్నారు. ఎలాంటి రుణం తీసుకోని వారు 12 లక్షల మంది వరకూ ఉన్నారు. వాళ్లు కేవలం 10 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ లేవు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(అ) జాబితా నుంచి తొలగించినందువల్ల ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజి స్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుంది. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచి వాలయంలోనే రిజిస్ట్రేషన్‌చేసి సచివాలయంలోనే అందజేస్తారు. సామాన్యుల ఇళ్లలో పేదరికం ఎంత దారుణంగా ప్రభావం చూపుతుందో తన పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వారికి ఆత్మగౌరవం కలిగేలా పేదలకు ఇచ్చిన వరం లాంటి ఓ.టి.ఎస్.ను వినియోగించుకొని తమ ఆస్తికి విలువను కల్పించు కోవడంలో ప్రజలు ఎంత మాత్రం వెనుకాడటం లేదు. - దవులూరి దొరబాబు చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ -
తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా డబ్బు కొట్టేసింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో రూ.10 కోట్లును కొట్టేసిన సాయికుమార్.. ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో రూ.5 కోట్ల ఎఫ్డీలను డ్రా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు సాయికుమార్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) ఏపీ సంస్థల నుంచి డిపాజిట్లను ఐవోబీ బ్యాంక్ నుంచి బదిలీ చేశారు. ఐవోబీ నుంచి ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బదిలీ, విత్ డ్రా చేయగా, ఏపీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఏపీ అధికారులకు సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు. చదవండి: అత్త తిట్టిందని.. కోడలు ఎంత పని చేసిందంటే..! -
పేదలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ (ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్) వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్న పేద వర్గాల ప్రజలకు భారీ సాంత్వన చేకూర్చుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా వారు ఆ రుణాన్ని చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. తనఖా పెట్టిన ఇంటి స్థలాలను ప్రైవేటు ఆస్తులుగా మారుస్తూ.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రంలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవ్’ గృహ రుణం నుంచి పేదలకు విముక్తి ► రాష్ట్రంలో 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి.. ఇళ్ల నిర్మాణం కోసం రూ.9,320 కోట్లను పేదలు రుణంగా తీసుకున్నారు. దీనిపై వడ్డీ రూ.5,289 కోట్లకు చేరుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.14,609 కోట్లు అయింది. ఈ రుణాన్ని వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కింద చెల్లింపులు చేస్తే, వారికి ఇంటి స్థల పత్రాలను అప్పగించడంతోపాటు వారి పేర్లతోనే రిజిష్ట్రేషన్ చేసి ఇస్తారు. తద్వారా వారికి పూర్తి హక్కులు వస్తాయి. ► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొందిన వారిలో.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూ.10 వేలు, మున్సిపాల్టీలకు చెందిన వారు రూ.15 వేలు, నగర పాలక సంస్థలకు చెందిన వారు రూ.20 వేలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లిస్తే సరిపోతుంది. ► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని నిర్మించుకున్న ఇంటిని ఒకవేళ ఎవరికైనా అమ్మిన పక్షంలో.. ఆ ఇంటిని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం లేకపోతే.. వారు పేద వారైతే అలాంటి వారికి గ్రామీణ æప్రాంతాలలో రూ.20 వేలు, మున్సిపాల్టీల్లో రూ.30 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.40 వేలు ఈ పథకం కింద చెల్లిస్తే సరిపోతుంది. ► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకోకుండా సొంతంగా ఇల్లు కట్టుకుని ఉంటే, రూ.10 చెల్లిస్తే వారికి ఇంటి స్థలంపై ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. ఇలాంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం లేకపోతే.. వారు పేద వారైతే గ్రామీణ æప్రాంతాలలో రూ.10 వేలు, మున్సిపాల్టీల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలను చెల్లించి పూర్తి హక్కులు పొందవచ్చు. ► వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద చెల్లింపులు చేయడానికి తుది గడువు డిసెంబర్ 15. చెల్లింపులు చేసిన వారికి డిసెంబర్ 21న ఇంటి స్థలం పత్రాలను అప్పగిండచంతో పాటు వారి పేర్లతోనే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయించి పూర్తి హక్కులు కల్పిస్తారు. ► వలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయ, మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి.. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం గురించి అవగాహన కల్పిస్తారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేల రుణం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో 31 లక్షల గృహాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో తొలి దశ కింద 15,60,227 ఇళ్లను నిర్మిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఆ ఇళ్ల నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద లబ్ధిదారులైన డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు అందరికీ 9 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి రూ.35 వేల రుణం ఇప్పిస్తారు. ఇందులో ఆరు శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మూడు శాతం అంటే.. పావలా వడ్డీని మాత్రమే అక్కచెల్లెమ్మలు చెల్లిస్తే సరిపోతుంది. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం రూపేణా అక్కచెల్లెమ్మలు ఒక్కొక్కరి చేతికి దాదాపు 4 – 5 లక్షల రూపాయల ఆస్తిని ప్రభుత్వం అప్పగించింది. వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద రూ.6470.76 కోట్లు ► 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తామంటూ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అప్పటికి రుణంగా ఉన్న రూ.27,168.83 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం అందిస్తోంది. ► ఈ డబ్బును మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికి వినియోగించేలా పలు బహుళ జాతి, పెద్ద కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని.. ఉపాధి మార్గాలు చూçపుతోంది. ఇప్పటికే ఈ పథకం తొలి విడత కింద 8 లక్షలకు పైగా గ్రూపులకు రూ.6,318 కోట్లను ప్రభుత్వం ఆయా గ్రూపులకు జమ చేసింది. ► రెండో విడతలో రూ.6,470.76 కోట్లను అక్కచెల్లెమ్మలకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ఒక్క వైఎస్సార్ ఆసరా పథకం ద్వారానే రూ.12,788 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల ఖాతాల్లో డబ్బులు జమ కాని గ్రూపుల్లోని మహిళలకు రెండు విడతలూ కలిపి ఒకేసారి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ► వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలపై మహిళల్లో అవగాహన, చైతన్యం, సాధికారిత దిశగా అడుగులు వేయించే మార్గంలో చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేసేందుకు 10 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. చదవండి: గ్రహణం వీడింది: సజ్జల విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడుకు దాతలకు పిలుపు ► ఆస్పత్రి, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లను ఆయా ఆస్పత్రులు, పాఠశాలలకు పెట్టేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ► కనెక్ట్ టు ఆంధ్రా కార్యక్రమం కింద నాడు – నేడు కోసం నిధులు అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. ► రూ.50 లక్షలు ఇస్తే శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు, రూ.1 కోటి దానం చేస్తే ఫౌండేషన్ స్కూలుకు, రూ.3 కోట్లు ఇస్తే హైస్కూల్‌కు దాతల పేర్లు పెడుతారు. ► కోటి రూపాయలు ఇస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, రూ.5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెడతారు. ► ఒక కాలేజీలోగానీ.. స్కూల్లోగానీ క్లాస్‌రూం, అదనపు క్లాస్‌రూం, హాస్టల్, లైబ్రరీ, గ్రామంలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి అయ్యే ఖర్చును నూటికి నూరు శాతం దానం చేస్తే సంబంధిత నిర్మాణాలకు 20 ఏళ్లపాటు దాతల పేర్లు పెడతారు. నకిలీ, కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ 1940 చట్టం సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కల్తీ, నకిలీ మందుల విక్రయాన్ని అడ్డుకునేందుకు ఈ చట్ట సవరణ చేసింది. నకిలీ, కల్తీ మందుల వల్ల రోగులు ప్రాణాలు కోల్పోయినప్పుడు.. ప్రస్తుతం చట్టంలో వాటిని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో అలాంటి మందులను విక్రయించిన వారిని కఠినంగా శిక్షించేలా చట్ట సవరణ చేసింది. నకిలీ, కల్తీ మందులు విక్రయిస్తే.. లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమానా విధిస్తారు. అరకులో ఏకలవ్య పాఠశాల ► విశాఖపట్నం జిల్లా అరకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణం కోసం 15 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్, టెర్మినల్ నిర్మాణం కోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. ► వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెంటర్ ఏర్పాటు కోసం 53.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► గుంటూరు వెస్ట్ మండలం అడవి తక్కెళ్లపాడులో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 2 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అంగీకరించింది. ► గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు.. ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాకే ఆ భూములను ఏపీఎండీసీకి బదలాయించాలని స్పష్టం చేసింది. ► తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో 31 సెంట్లను కమ్యూనిటీ హాలు, విద్యా సంస్థ నిర్మాణానికి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ► శ్రీశైలంలో శ్రీశైల జగద్గురు పండితారాధ్య సేవా సమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గజం రూ.10 చొప్పున లీజును నిర్ణయించింది. ► ప్రతి మూడేళ్లకు లీజు మొత్తాన్ని 30 శాతం పెంచాలని సూచించింది. పాఠశాలæ, అన్నదాన సత్రం, ఆస్పత్రి నిర్మాణానికి ఆ సంస్థకు ఈ భూమిని కేటాయించింది. పిల్లల సంరక్షణకు గ్రీన్ సిగ్నల్ ఏపీ ఫాస్టర్ కేర్ గైడ్‌లైన్స్ 2021కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జువైనల్ జస్టిస్ చట్టం– 2015 కింద మార్గదర్శకాలు రూపొందించారు. తల్లిదండ్రులు శారీరక, మానసిక అనారోగ్యంతో ఉండి, పిల్లల సంరక్షణ చేపట్టలేకపోతే.. ఆ పిల్లలను సంరక్షకులకు అప్పగించే విషయంలో.. సంరక్షకుల సమర్థత, ఉద్దేశం, సామర్థ్యం, పిల్లల సంరక్షణలో వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకునేలా మార్గదర్శకాలను రూపొందించారు. దేశంలో ప్రథమంగా రాష్ట్రంలోనే మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమం విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.30.79 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు వ్యయంలో పది శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ ప్రాజెక్ట్ అమలుకు మానిటరింగ్, ఎవల్యూషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. దేశంలో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమం చేపట్టడం రాష్ట్రంలోనే ప్రథమం కావడం గమనార్హం. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణకు ఓకే రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2లో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకు రూ.1,929 కోట్లతో విస్తరించే పనులకు ఎఫ్ఆర్బిఎం నిబంధనల నుంచి మినహాయింపును ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. అత్యంత కరవు పీడిత ప్రాంతాలైన తంబళ్లపల్లి, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తాగు నీటి కల్పనే లక్ష్యంగా ఈ పనులను ప్రభుత్వం చేపట్టింది. 84 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్ సాగు రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై మంత్రివర్గానికి వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను అందజేశారు. ఇప్పటి వరకు 84 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు వివరించారు. సాధారణ వర్షపాతం 462.7 మి.మీ. కాగా, ఇప్పటి వరకు 504.9 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. 9.1 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వివరించారు. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ► రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల తరహాలోనే మైనార్టీ వర్గాలకూ సబ్ ప్లాన్ అమలు చేసేందుకు మంత్రివర్గం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ► వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలో లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు. ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు, 5 అవుట్సోర్సింగ్ పోస్టులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక స్వీపర్ పోస్టు మంజూరు. ► సీఐడీ డిపార్ట్మెంట్లో అడిషనల్ హోంగార్డు పోస్టుల మంజూరు. ► శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు. ► రాష్ట్రంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం. ఏడాది కాలానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1.5 కోట్లు అందించనుంది. రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ కృషి చేస్తుంది. దీని వల్ల రాష్ట్రంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం దూరాభారంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ► వైఎస్సార్ జిల్లా బద్వేలు కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. ఈ డివిజన్ పరిధిలోకి పది మండలాలు వస్తాయి. వ్యవసాయానికి కేంద్ర సౌర విద్యుత్ వ్యవసాయానికి అవసరమైన ఉచిత సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఎన్ని అవాంతరాలు సృష్టించినా..ఎంత మంది అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలను ఆదుకోవడానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు ఉచితంగా అందించడానికి వీలుగా 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. అయితే న్యాయస్థానం ద్వారా కొంత మంది ఈ పథకానికి మోకాలడ్డారు. ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పునే సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. దేశంలో ఎక్కడి నుంచి సౌర విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసినా ట్రాన్స్మిషన్ చార్జీలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మించ తలపెట్టిన చోట మిగులుతున్న భూములను ఇతర ప్రజా అవసరాలకు వినియోగించుకునే విషయమై అధ్యయనం చేయాలని కేబినేట్ నిర్ణయించింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ► ఆస్తులపై పూర్తి హక్కులు దక్కుతాయి... అత్యవసరాల్లో అమ్ముకోవచ్చు. ► వారసులకు గిఫ్ట్ డీడ్ కింద ఆస్తులను బదలాయించవచ్చు. ► స్థలాలకు మార్కెట్ విలువ పెరుగుతుంది. ► పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్య పరమైన అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందవచ్చు. ► రుణం సులువుగా దొరకడంతో కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుంది. ► భూముల ధరలు పెరిగిన ప్రాంతాల్లో కబ్జాలకు అడ్డుకట్ట పడుతుంది. -
లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 25న వీటి నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా పనులు ప్రారంభించేలా కసరత్తు మొదలైంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని రాష్ట్రవ్యాప్తంగా 3,25,899 మంది లబ్ధిదారులు ఎంచుకున్నారు. వీరందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 12,855 గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల్లో 10 నుంచి 20 మందిని ఒక్కొక్క గ్రూపుగా గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,77,421 మందితో 12,855 గ్రూపులను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ నూరు శాతం పూర్తయింది. ఈ జిల్లాలో 12,632 మంది లబ్ధిదారులు ఉండగా.. 1,087 గ్రూపులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలో 92%, కర్నూలు జిల్లాలో 78 %గ్రూపుల ఏర్పాటు పూర్తయింది. అత్యల్పంగా విజయనగరంలో 14% మాత్రమే గ్రూపుల ఏర్పాటు జరిగింది. తగ్గనున్న నిర్మాణ వ్యయం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రూపులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లను గుర్తించి అనుసంధానిస్తున్నారు. ఈ విధానం వల్ల గ్రూప్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్లన్నింటికీ ఒకే నిర్మాణ ధర వర్తిస్తుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ నెలాఖరు నాటికి స్థానికంగా కాంట్రాక్టర్ల గుర్తింపు, గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారుల గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఏర్పాటు పూర్తికి కృషి చేస్తున్నాం. వచ్చే నెల 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్ కార్పొరేషన్ -
అక్టోబరు 25 నాటికి పునాది పడాల్సిందే..!
సాక్షి,శ్రీకాకుళం(కాశీబుగ్గ): అక్టోబరు 25 నాటికి వైఎస్సార్ జగనన్న కాలనీలలో పునాదులు కట్టే ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.గణపతి స్పష్టం చేశారు. జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితి, గ్రౌండింగ్, నిర్మాణ సామగ్రి తదితర వివరాలను గురువారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రశ్న: జగనన్న కాలనీలు ఎన్ని మంజూరయ్యాయి? ఎంతమంది లబ్ధిదారులు? జవాబు: మొత్తం 866 జగనన్న కాలనీలు సిద్ధం చేశాం. అందులో స్థల సమస్యతో 13 మాత్రమే పెండింగ్‌లో ఉండగా, 91,138 మందికి స్థలాలు కేటాయించాం. ప్ర: నిర్మాణదారులకు సాయమెలా..? జ: దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. రూరల్ పరిధిలో 1.5 సెంట్లు, అర్బన్‌లో సెంటు స్థలం పట్టా అందించాం. కాలువ, రోడ్లు, విద్యుత్ సౌకర్యంతో పాటు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుని ఖాతాలో రూ.1,80,000 జమ చేస్తున్నాం. వీరు కావాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదాముల్లో సబ్సిడీపై సిమెంట్, ఐరన్ పొందవ చ్చు. ఇసుక ఉచితమే. ప్ర: రాయితీ సామగ్రి పొందడమెలా? జ: సచివాలయం పరిధిలో ఎమినిటి కార్యదర్శి వద్ద ఇసుక, సిమెంట్, ఐర న్ బుక్ చేసుకోవాలి. ఇసుకను ఉచి తంగానే ఇస్తారు. సిమెంట్ బస్తాను సబ్సిడీపై రూ.240కు అందిస్తున్నారు. అది కూడా ఇంటి బిల్లులోనే మినహాయించుకుంటా రు. ఒక్కో లబ్ధిదారుకు 90 బస్తాలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి అర్బన్, రూరల్ చొప్పున రెండు సిమెంట్ గోదాములు ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 36 ఇసుక డిపోలను ఏర్పాటు చేశాం. 877 చోట్ల లేఅవుట్లకు విద్యు త్ కనెక్షన్లు ఏర్పాటు చేశాం. 371 బోర్లు వేశాం. ప్ర: గ్రౌండింగ్ ఎంతవరకు వచ్చింది? జ: ఇప్పటివరకూ 70 శాతం గ్రౌండింగ్, 90 శాతం మ్యాపింగ్, 83 శాతం జియోటాగింగ్ పూర్తయ్యింది. పునాదులు కట్టిన వారికి ఇప్పటికే రూ.53 వేలు నగదు, రెండు ట్రాక్టర్ల ఉచిత ఇసుక అందించాం. ప్ర: రుణ సదుపాయం కల్పిస్తున్నారా..? జ: దరఖాస్తు చేసుకున్న మొత్తం లబ్ధిదారుల్లో 76,651 మంది రుణాలు పొందడానికి అర్హులు. వీరికి రానున్న రోజుల్లో రుణాలు మంజూరు చేస్తాం. ప్ర: ఎప్పటిలోగా పునాదులు వేయాలి..? జ: అక్టోబరు 25 నాటికి పునాదుల నిర్మాణం పూర్తిచేయాలి. సెప్టెంబరు 15 నాటికి 35 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఇప్పటికే లక్ష్యం నిర్దేశించారు. లబ్ధిదారు ఇల్లు కట్టనని తెలియజేస్తే వారి స్థానంలో కొత్త లబ్ధిదారునికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ 90 రోజుల్లో ఇంటి స్థలం, ఇల్లు మంజూరు పథకం ఉంది. దానిని యాక్టివ్ చేస్తాం. అదే విధంగా ఆప్షన్–3లో జిల్లాలో 703 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతాం. చదవండి: ఏపీ: నేడు రీస్టార్ట్–2 ప్యాకేజీ విడుదల -
75 వేలు లంచం: సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: లంచం తీసుకున్న కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. గిడ్డంగుల సంస్థలో గ్రేడ్–1 మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బానోత్ సుందర్‌లాల్‌కు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే రూ.75 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కరాచారి, సుధాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం సుందర్‌లాల్ రూ.75 వేల నగదును సుధాకర్‌రెడ్డికి ఇచ్చాడు. అక్కడే మాటేసిన అధికారులు తొలుత సుధాకర్‌రెడ్డి.. ఆ తర్వాత భాస్కరాచారిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ జడ్జి ముందు నిందితులను ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు ఏసీబీ అధికారులు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఘటనపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘బాధితుడు సుందర్‌లాల్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 6 నెలలుగా తిప్పించుకుంటున్నారు. రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సుందర్‌లాల్ గతంలో కరీంనగర్లో ఏసీబీ కేసులో ఉండటంతో దానిని కారణంగా చూపి, అతని ఫైల్ ముందుకు సాగనివ్వలేదు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి..’అని ఆయన సూచించారు. -
వాటిపై కూడా స్టేలు తేవడం దురదృష్టకరం
సాక్షి, తాడేపల్లి : హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించారని, పేదలకు ఇచ్చే ఇళ్లపై సైతం కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం దురదృష్టకరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారాయన. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎండీ అజయ్ జైన్, అన్ని జిల్లాల పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ డెల్టా, మెట్ట ఏరియాలలో బిల్డింగ్ నిర్మాణ ఖర్చు ఎంత అవుతుందో చర్చించాము. ఖర్చు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాము. ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్లు నిర్మిస్తాము. తామే కట్టుకుంటామనే లబ్దిదారులకు 1 లక్ష 80 వేల రూపాయలు నిర్మాణ ఖర్చులకు ఇస్తాము. ప్రభుత్వమే కట్టివ్వాలనుకునే వారికి అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తాము. రోడ్డు, వాటర్, పవర్ వంటి వసతులతో ఇళ్లు నిర్మిస్తాము. (సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి ) అప్ల్యాండ్ ఏరియాలో 1 లక్ష 80 వేల రూపాయల ఇంటి నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనా వేశాము. ఇసుక ఉచితంగా ఇస్తాము. కృష్ణ, గోదావరి, పెన్న ఏరియాల్లో ఫిల్లింగ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుంది. అర్బన్, రూరల్ ఏరియాలో 15 లక్షల ఇల్లు కట్టి పేదలకు ఇస్తాము. కట్టుకునే వారికి సైతం తక్కువ రేటుకే మెటీరియల్స్ అందేలా చర్యలు తీసుకుంటాము. సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు. మొదటిగా ప్రతి జిల్లాలో రెండు, మూడు ప్రాంతాల్లో మోడల్ కాలనీలు నిర్మిస్తాము. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు లోన్స్ ఇచ్చి కాంక్రీటు మిక్చర్ల వంటివి కొనుక్కునేలా ఉపాధి కల్పిస్తామ’’న్నారు. -
హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ విరాళాన్ని ప్రకటించారు. తమ తరుపున రెండు రోజుల వేతనం 74 లక్షల 40 వేల 112 రూపాయలు సాయం చేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలోనే గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ నవీన్ కుమార్, ఉద్యోగుల సంఘం జేఏసీ ఛైర్మన్ రామచంద్రారెడ్డి, భాస్కరరావు, శ్రీరాములు, మల్లిఖార్జున్ రావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
వణుకుతున్న అక్రమార్కులు..
సాక్షి, విశాఖపట్నం: అవినీతిపరులపై దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతిని ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటిపై శుక్రవారం ఏబీసీ దాడులు చేపట్టింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. విశాఖ గాజువాకలోని శ్రామికనగర్, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కిలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. (బినామీల ఇళ్లలో సిట్ సోదాలు) -
హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్లో తాత్కాలిక వేతనంతో ఐదేళ్లు పనిచేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పటికీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కార్పొరేషన్ తెలంగాణలో ఉన్నందున తమ ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 1991లో ఉమ్మడి ఏపీలో జీవో 182 జారీ అయింది. దీని ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలి. తాము 1989లో నియమితులయ్యామని, కార్పొరేషన్లో అసిస్టెం ట్ ఇంజనీర్లు, అర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మన్, డ్రాఫ్ట్మన్లుగా ఐదేళ్ల సర్వీసు పూరై్తందని, తమకు జీవో 182 వర్తించదంటూ 2006లో ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని తాత్కాలిక ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. జీవో 182 ప్రకారం అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వర్క్ ఇన్స్పెక్టర్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును కార్పొరేషన్ సవాల్ చేసింది. జీవో 182 అమలు వర్తించదనే కార్పొరేషన్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
గృహమిత్రలు ఇంటికే!
ఇంటికో ఉద్యోగం, ప్రతి ఏటా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి దొంగ హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా వరుసగా ఉన్న ఉద్యోగాలు సైతం ఊడబెరుకుతోంది. కొలువుల్లో కూర్చొబెట్టినట్టే బెట్టి ఆ వెంటనే ఇంటికి పంపిస్తోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖలో మూడు నెలల క్రితం నియమించిన వర్క్ ఇన్స్పెక్టర్లను (గృహమిత్రలను) తొలి జీతం కూడా ఇవ్వకుండానే ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. నెల్లూరు(అర్బన్): జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోని 73 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను (గృహమిత్రలను) తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా హౌసింగ్ అధికారులు వారిని తొలగిస్తూ కలెక్టర్‌కు ఫైల్ పంపారు. కలెక్టర్ సంతకంతో ఒకటి.. రెండు రోజుల్లోనే వర్క్ ఇన్స్పెక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. కొత్తగా విధుల్లోకి చేరి సరిగ్గా మూడు నెలలు కూడా కాలేదు.. అంతలోనే తొలగించడంతోఆ చిరుద్యోగులు వీధిన పడ్డారు. తమకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి తొలగించడంపై వర్క్ ఇన్స్పెక్టర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో హౌసింగ్ పథకం కింద ఇప్పుడు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సుమారు 50 వేల ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ (హెచ్ఎఫ్ఏ), గ్రామీణ (పీఎంజీ), రూరల్ పథకాల పేరుతో మంజూరయ్యాయి. వీటి పర్యవేక్షణకు, పేదలకు సకాలంలో ఇళ్లు నిర్మించేందుకు తప్పని సరిగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హౌసింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి 5 నెలల క్రితమే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మూడు నెలల క్రితం 160 మందికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. బీటెక్, డిప్లొమో, డిగ్రీ కంప్యూటర్స్ తదితర అర్హతలతో వీరంతా రిజర్వేషన్, రోస్టర్ పద్ధతిలో నియమితులయ్యారు. వీరు కాకుండా రెగ్యులర్‌గా మరో 28 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నారు. మొత్తం 188 మంది హౌసింగ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో బిటెక్, డిప్లొమో తదితర టెక్నికల్ కోర్సులు చదివిన వారిని ఉద్యోగాల్లో ఉంచుకుని అదనపు భారం పేరుతో మిగతా 73 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేవు వీరు ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచే అంటే మూడు నెలలుగా వీరికి ప్రభుత్వం ఒక్క నయా పైసా జీతం ఇవ్వలేదు. చార్జీలు, భోజనానికి అప్పులు చేసి పని చేస్తున్నారు. జీతాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నట్టుండి పిడుగు లాంటి విషయం తెలియడంతో దిక్కు తోచడం లేదు. జీతంలోనూ మోసమే! ప్రభుత్వం వీరిని విధుల్లోకి తీసుకునేటప్పుడు నెలకు రూ.15 వేలు జీతం ఇస్తామని ప్రకటించింది. తీరా విధుల్లోకి చేరాక ఇల్లు నిర్మాణ దశలను బట్టి డబ్బులిస్తామంది. అంటే ఒక ఇంటికి బేస్మెంట్ వేస్తే రూ.150, రూఫ్ లెవల్‌కు వస్తే మరో రూ.150, శ్లాబు వేస్తే ఇంకో రూ.150 వంతున చెల్లిస్తామంది. 20 ఇళ్లు శ్లాబు లెవల్లో పూర్తి చేయిస్తే మరో రూ.300 ఇస్తామని చెప్పింది. తీరా ఇప్పుడు అటు జీతం ఇవ్వక.. ఇటు చెప్పిన దశల ప్రకారం ప్రభుత్వం డబ్బులివ్వక నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందని వర్క్ ఇన్స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చేతుల్లో ఏమి లేదు హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ఉన్నతాధికారులు మండలానికి ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లను మాత్రమే విధుల్లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు సబ్ డివిజన్ డీఈ కార్యాలయాల్లో ఒకరు చొప్పున, గోడౌన్లో ఒకరు చొప్పున ఉంటే సరిపోతుందని చెప్పారు. అందువల్ల అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. వారిని ఉద్యోగాల్లో కొనసాగించే విషయం తమ చేతుల్లో లేదు. – ఎన్.రామచంద్రారెడ్డి,పీడీ, హౌసింగ్ కార్పొరేషన్ -
హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు
సాక్షి,హైదరాబాద్ : డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరుకుగాను ఈ ఏడాది వరుసగా రెండోసారి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు దక్కింది. ఢిల్లీలో ఈనెల 25న ఈ అవార్డు అందజేయనున్నట్లు హడ్కో గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండోసారి ఈ అవార్డు రావడం పట్ల గృహ నిర్మాణ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. -
పనితీరు మెరుగుపరుచుకోకపోతే బదిలీలే
గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక నెల్లూరు(పొగతోట): పనితీరు మెరుగుపరుచుకోకపోతే జిల్లా నుంచి బదిలీ చేయిస్తామని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు గృహ నిర్మాణ సంస్థ అధికారులను హెచ్చరించారు. స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అసంపూర్తి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసిన గృహాల లక్ష్యాలను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ప«థకాల అమలకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గృహ నిర్మాణ సంస్థ పీడీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో 3670 ఇళ్లు మంజూరుకాగా, ఇప్పటి వరకు 2,372 గృహనిర్మాణాలు పూర్తి చేశామన్నారు. నెలఖారుకు 400 గృహాలు నిర్మించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 203 గృహాలను పూర్తి చేశామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
గూడు చెదిరిన‘హౌసింగ్ కార్పొరేషన్ ’
♦ గృహనిర్మాణ సంస్థకు మంగళం పాడనున్న సర్కారు ♦ విడతల వారీగా ఇతర శాఖలకు ఉద్యోగుల డిప్యుటేషన్లు ♦ తాజాగా 106 మంది ఏఈలు బదిలీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ గూడు చెదిరిన పక్షివోలే మారింది. దానికి అస్తిత్వం లేకుండా పోతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరిట కార్పొరేషన్ హవా నడిపించింది. అవినీతిలో కూరుకుపోయిన ఇళ్ల పథకానికి ప్రభుత్వం చెక్ పెట్టడంతో గృహనిర్మాణ సంస్థకు పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఆ శాఖకు మంగళం పాడి అందులోని ఉద్యోగులకు ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు మహానగర మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల బోర్డుకు డిప్యుటేషన్‌పై పంపింది. ఇదే తరహాలో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖకు సైతం ఇంజనీర్లను బదిలీపై పంపేందుకు చర్యలు చేపట్టింది. జలమండలిలోకి 66 మంది: హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ అధికారులను పొరుగు శాఖలకు సాగనంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత డిప్లొమా అర్హతతో ఉన్న ఇంజనీర్లకు డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 66 మంది ఏఈ(సహాయక ఇంజనీర్లు)లను జలమండలికి కేటాయించింది. డిప్యుటేషన్ ఉత్తర్వులు తీసుకున్న ఏఈలు జలమండలిలో రిపోర్టు చేశారు. బివరేజెస్ కార్పొరేషన్‌కు 40 మందిని డిప్యుటేషన్‌పై పంపింది. సుముఖత వ్యక్తం చేస్తే...: తాజాగా 106 మంది ఏఈలను డిప్యుటేషన్‌పై పంపిన హౌజింగ్ కార్పొరేషన్ మిగతా ఉద్యోగులను ఏయే శాఖల్లో సర్దుబాటు చేయాలనే అంశంపై మళ్లగుల్లాలు పడుతోంది. ఈక్రమంలో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖకు ఉద్యోగుల సమాచారాన్ని పంపింది. అర్హతల ఆధారంగా ఆయా శాఖలు సుముఖత వ్యక్తం చేస్తే వారికి సైతం డిప్యుటేషన్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ శాఖలకు పంపించేవారిలో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఏఈఈ), ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు(డీఈఈ), కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఈఈ) ఉన్నారు. వారికి నెలవారీ వేతనాలను ఆయా శాఖలే చెల్లించాలి. సీఐడీ కేసుల సంగతేంటి!: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలువరు హౌసింగ్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిధుల దుర్వినియోగం, నిర్మాణాల్లో అక్రమాలు, ఇళ్ల మంజూరీలో తాజాగా కార్పొరేషన్‌లోని ఉద్యోగులనంతా డిప్యూటేషన్‌పై పంపితే విచారణ ప్రక్రియ ఎలా సాగుతుందనే గందరగోళం కూడా ఉంది. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
-
టీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూ.1.50 కోట్ల పెట్టుబడి నిధులతో ఈ సంస్థను రిజిస్టర్ చేయాలని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంయుక్త కార్యదర్శి (తెలంగాణ)ని ఆదేశించారు. -
సదా మీ సేవలో
- ఫోన్ చేస్తే చాలు సమస్యలను పరిష్కరిస్తా - అర్హులందరికీ ఇళ్లను హౌసింగ్ శాఖ ద్వారా నిర్మిస్తాం - చేనేత వృత్తిదారుల్లో 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు అందజేస్తాం - చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తాం - నాణ్యమైన చీరలు నేస్తున్నా దళారుల వల్ల నష్టపోతున్నాం నేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా అందే సౌకర్యాలన్నీ నేరుగా వారికే అందజేసేలా చర్యలు తీసుకుంటా.. అలాగే కష్టాల్లో ఉన్న నేత కార్మిక కుటుంబాలకు అండగా నిలబడతానంటున్న చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి. సత్యనారాయణరావు శనివారం కోడుమూరు పట్టణం కొండపేటలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చితికిపోతున్న నేత బతుకులు ఎంత అధ్వానంగా ఉన్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారి కోడుమూరు పట్టణంలో పర్యటించి.. మగ్గాలు నేస్తున్న కార్మికులను పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ చేనేతల గడపగడపను తట్టారు. మీకు ఎలాంటి కష్టమొచ్చినా తనకు ఫోన్ చేస్తే చాలు.. మీ సమస్యకు పరిష్కారం చూపుతానని వారికి భరోసా ఇచ్చారు. అలాగే చేనేత కార్మికుల రుణాలకు సంబంధించిన సమస్యపై కోడుమూరు స్టేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్లతో చర్చలు జరిపి దాదాపు 800 మందికి రుణాలు అందేవిధంగా వారితో హమీ తీసుకున్నారు. ఏడీ : అమ్మా మీ పేరేంటి? మీ సమస్యలేంటి? వృద్ధురాలు : సార్, నా పేరు రామలక్ష్మి. చేనేత గుర్తింపు కార్డు రాలేదు. ఏడీ : మీ ఇంట్లో మగ్గం ఉందా? రామలక్ష్మి : ఉంది సర్, దానిమీద పట్టు చీరలు నేస్తాము. అయినా ఇప్పటి వరకు మాకు చేనేత గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఏడీ : ఇప్పుడు ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. అందులో మీ వివరాలు నమోదు చేయించి.. మీరు నిజంగా చేనేత కార్మికులు అయితే కార్డులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాను. ఏడీ : మీ పేర్లేంటమ్మా.. మీ సమస్యలేమైనా చెబుతారా? మహిళలు : సార్, నా పేరు నాగమ్మ.. నా పేరు వెంకమ్మ. మా ఇద్దరికి పింఛన్లు రావడం లేదు. చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం.. ఏడీ : 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పింఛన్లు వస్తాయి. మీకు రాకపోవడానికి కారణాలేంటో తెలుసుకుంటా. వృద్ధుడు : సార్, చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి? మీరే వాటికి పరిష్కారం చూపించాలి.. ఏడీ : పెద్దాయన నీ పేరేంటి? చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలు తెలుసుకునేందుకే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇక్కడికి వచ్చాను. చెప్పండి మీ సమ్యలేంటో? వృద్ధుడు : నా పేరు ఆదేష్ రాజు. సర్ గతంలో ఐసీఐసీఐ లాంబార్డు ఇస్తున్న ఆరోగ్య బీమా పథకం రద్దు చేశారు. దీంతో చేనేత కార్మికులు ఈ ఏడాది ఆరోగ్య బీమా పథకానికి దూరమవుతున్నారు. సిల్క్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ రూ. 600 నుంచి రూ. 1,000 పెంచితే కార్మికులకు మేలు జరుగుతుంది. ఏడీ : ఐసీఐసీఐ లాంబార్డు ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాది డిసెంబరు నెలాఖరున రద్దు చేశారు. ఆ స్థానంలో రాష్ట్ర స్వస్థ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ప్రస్తుతం రూ. 15వేలు ఉన్న బీమా కాస్త రానున్న రోజుల్లో రూ. 30 వేలు కానుంది. ఇక సిల్క్‌పై సబ్సిడీ పెంచే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం. ఏడీ : అమ్మా మీ సమస్య ఏంటి? లక్ష్మిదేవి : నా భర్త చనిపోయి 30 ఏళ్లు అవుతోంది. చేనేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గతంలో నాకు రూ. 200 పింఛను వచ్చేది. ప్రస్తుతం దాన్ని నిలిపివేశారు. నా భర్త చనిపోయిన సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్ నేను ఎక్కడ తెచ్చేది. మీరే నాకు సాయం చేయాల. ఏడీ : మీ సమస్యను డీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. వారితో మాట్లాడి పింఛను వచ్చే ఏర్పాట్లు చేయిస్తాను. సీబీ లత, సర్పంచ్ : ఏడీ సార్, కోడుమూరు పట్టణంలో 2 వేల మగ్గాలు ఉన్నాయి. గద్వాల బ్రాండ్ పట్టుచీరలు నేస్తున్నారు. అయితే మార్కెటింగ్ సౌకర్యంలేక చేనేత కార్మికులు తయారుచేసిన చీరలను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ముడిసరుకుల ధరలూ పెరిగిపోయాయి. బ్యాంక్‌లో అప్పులు రెన్యువల్ చేయడంలేదు. సిల్క్, కాటన్‌పై సబ్సిడీలు పెంచితే బాగుంటుంది. గతంలో ఇక్కడ 250 మంది చేనేతకార్మికులకు బ్యాంకులు రుణాలు అందజేశాయి. ఇప్పుడు వాటిని రెన్యువల్ చేయడం లేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి వీరికి న్యాయం జరిగేలా చూడండి. ఏడీ : పట్టు పరిశ్రమశాఖ చేనేత కార్మికులకు కిలోకు రూ. 150 చొప్పున నెలకు 4 కిలోల సిల్క్‌పై రూ. 600 వరకు సబ్సిడీ ఇస్తోంది. కాటన్పైనా కోడుమూరులోనే యారన్ డిపోలో కొనుగోలు ధరపై 10 శాతం తగ్గించి విక్రయిస్తారు. రుణాల విషయంలో ఈ రోజే(శనివారం) బ్యాంకు అధికారులతో మాట్లాడుతాను. ఏడీ : ఏమయ్యా మగ్గం నేస్తున్నావా, నీ పెరేంటీ, చేసే పని గిట్టుబాటు అవుతుందా , ఎన్నేళ్లు నుంచి ఈ వృత్తిలో ఉన్నావు. మాధవస్వామి : పింఛన్లు రావడంలేదు, ఇన్సూరెన్స్ కార్డుల సమయం ముగిసిపోయింది. బ్యాంక్ రుణాలు రావడంలేదు. రుణాల కోసం ఎన్నిసార్లు ధరఖాస్తులు పెట్టుకున్న బ్యాంక్ అధికారులు పట్టించుకోవడంలేదు. 850 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పట్టించుకోవడంలేదు. చేనేతలంటే అప్పులు కట్టరని బయటికి పంపుతున్నారు. నోటీసులిచ్చి పరువు తీస్తున్నారు. ముడిసరుకు సబ్సిడీ సరిగా రావడంలేదు. మా బతుకులు ఇవీ. సమస్యలు పరిష్కరించి మా బతుకుల్లో వెలుగు నింపండి. ఏడీ : జీవిత బీమా సౌకర్యం పెంచి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. అప్పుడు మళ్లీ అందరికీ జీవిత బీమా కార్డులు అందజేస్తాం. రుణాల గురించి బ్యాంకు అధికారులతో మాట్లాడి మీకు రుణాలు అందించేలా చూస్తాను. తీసుకున్న రుణాలు కూడా సక్రమంగా చెల్లించాలి. ఏడీ : అయ్యా నీవు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పు? శీలప్ప : కరెంట్ మగ్గాలు వచ్చి మా బతుకులను నాశనం చేశాయి. 25 సంవత్సరాల నుంచి మగ్గం నేస్తున్నా. బ్యాంక్‌లో అప్పులివ్వడంలేదు. ఎన్నిసార్లు ధరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడంలేదు. జిరాక్స్ కాగితాలకే మా డబ్బులన్ని సరిపోతున్నాయి. ఏడీ : బ్యాంకర్లతో మాట్లాడి చేనేత కార్డులున్న వారందరికీ రుణాలు ఇప్పిస్తాం. ధరఖాస్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. అర్హులైనవారందరికీ రుణాల ధరఖాస్తులు చేనేత కార్యాలయం నుంచి ఉచితంగానే అందజేస్తాం. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఇస్తే చాలు. చేనేత కార్మికుడు : సార్, నాపేరు శివయ్య, కాటన్ చీరలకు, చిన్న మగ్గాలకు సబ్సిడీ తీసేశారు. హెల్త్ కార్డులు కుటుంబంలో నలుగురికే ఇస్తున్నారు. మీగతా వారి పరిస్థితి ఏమిటి, దళారుల బెడద ఎక్కువైంది. ఏడీ : దళారీ వ్వవస్థను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. ప్రతి చేనేత కార్మికుల్ని గుర్తించాలన్నదే ఈ సర్వే ఉద్ధేశ్యం. భవిష్యత్తులో అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందజేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సర్వే కోసం వచ్చిన వారిని కలిసి తమ మగ్గాల ఫోటోలు తీయించుకొని, బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇవ ్వండి. నేత పనిమీద ఆధార పడ్డావారిని ఆదుకుంటాం. చేనేతల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినా జీవిత భీమాకు ప్రతి ఒక్కరూ రూ.80 చెల్లించండి. ఏడీ : పెద్దాయన ఆరోగ్యం బాగుందా.. పనిచేయడం చేతనవుతుందా.. నీ వయసెంత? చిన్న తిప్పన్న : కళ్లు కనిపించడంలేదయ్యా, చేనేత కార్డు లేదని పింఛన్ ఇవ్వడంలేదు. పేరు తప్పుందని రూ.1000 పింఛన్ తీసేశారు. గతంలో రూ.200 పింఛన్ అందుతుండేది. ఇప్పుడు పెంచిన పింఛను అందడం లేదు. ఏడీ : పెద్దాయన, సర్వే ముగిసిన తరువాత చేనేత కార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే ఉచితంగా కంటి చికిత్సలు చేసి కళ్లద్దాలు ఇస్తారు. కుటుంబ సభ్యులు ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి. నాగరాజు : కేంద్ర ప్రభుత్వం నూలు కొనుగోలు కోసం ఇచ్చే రూ.600 సబ్సిడీ రావడంలేదు. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా. ఏడీ : పట్టుపరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డు ఉన్నా వారందరికీ ముడిసరుకు సబ్సిడీని ఇప్పించేందుకు కృషి చేస్తా. క్రిష్ణ : ఎంతో నాణ్యత , నైపుణ్యంతో మగ్గాలు నేస్తున్నారు. కోడుమూరులో తయారయ్యే చీరలకు ఒకప్పుడూ ఎంతో పేరుండేది. కరెంట్ మగ్గాలు రావడంతో చేనేత మగ్గాలు పూర్తిగా పడిపోయి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ వృత్తిని వదిలేసి హోటళ్లు, దుకాణాలలో పనులు చేసే పరిస్థితి ఏర్పడింది. అప్పులు తీర్చలేక మూడు, నాలుగేళ్ళలో దాదాపు 30 మంది కార్మికులు చనిపోయారు. మగ్గం పని గిట్టుబాటు కాదని మగ్గాలు తీసేసి వేరే పనులకు వెళ్తున్నారు. అధికారులు కార్మికుల కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయండి. ఏడీ : ఇక నుంచి అంతా పారదర్శకంగా ఉంటుంది. చేనేత కార్మికుల పేర్లన్ని ఆన్లైన్లో నమోదు అవుతాయి. బోగస్ లబ్ధిదారులను అరికట్టేందుకు సర్వే జరుగుతోంది. మగ్గం ఉన్నవారికే ప్రభుత్వ రాయితీలు అందుతాయి. మార్చి వరకు సర్వే జరుగుతుంది. ఇప్పటివరకు 1200 మంది కార్మికులను గుర్తించాం. అందరి పేర్లు నమోదయ్యేలా చూసుకోండి. సిల్క్ సబ్సిడీ అందరికీ అందేవిధంగా సిరికల్చర్ అధికారులతో మాట్లాడుతాం. దళారులను ఆశ్రయించవద్దు. నాకు ఫోన్(8008705739) చేస్తే చాలు మీ పనులు చేసి పెడతాం. ఇక్కడ కార్మికుల అవసరాల కోసం నర్సింహరెడ్డి అనే అధికారిని ఏడీగా నియమించాం. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. -
సీఆర్డీఏకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లు
హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఈ శ్రీరాములును కూడా రెండేళ్లు డెప్యుటేషన్‌పై సీఆర్డీఏకు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 34 మంది డిప్యూటీ కలెక్టర్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ఈమేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుం టూరు జిల్లాలో రాజధాని భూసమీకరణ ప్రక్రియలో వీరు భాగస్వాములవుతారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్లు కె. శ్రీనివాసరావు, ఎంవీ రమణ, వి.వి. విశ్వేశ్వరరావు, పి. అరుణ్‌బాబు, జీసీ కిషోర్‌కుమార్, ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎన్. ప్రభాకర్‌రెడ్డి, పి. గ్లోరియా, ఎల్. విజయసారథి, కె.పెంచల కిషోర్, ఎస్. శ్రీనివాసమూర్తి, వి. సుబ్బారావు, కె. మల్లికార్జునుడు, ఎస్. లావణ్య, సీహెచ్ రమేష్‌బాబు, ఆర్వీ సూర్యనారాయణ, ఏఎన్ సలీంఖాన్, బి. శ్రీనివాసరావు, కె. చంద్రశేఖర్‌రావు, వి. శ్రీనివాసరావు, జి. మల్లికార్జున, ఇ మురళి, కె. ఝాన్సీలక్ష్మి, ఎ. వెంకట్రావు, కె. లలిత, ఎన్. ఏసురత్నం, బి. పద్మావతి, కె. మధుసూధనరావు, పి. వరభూషణరావు, కె. మాధురి, కె. ఉమారాణి, కె. పద్మలత, డి. పుష్పమణి, టి.సునీతారాణిలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం గుంటూరు కలెక్టర్ నేతృత్వంలో సీఆర్డీఏ పని కోసం వారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో 8 మంది ఆర్డీవోలు కూడా ఉన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, మెప్మా పీడీలు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ బాధ్యతల్లో ఉన్న వారు మినహా, మిగిలిన వారు తక్షణమే రిలీవై పట్టణాభివృద్ధి శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా సీఆర్డీఏలో ఏడాదిపాటు పనిచేస్తారు. వీరి జీతభత్యాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇస్తుంది. వీరిని సీఆర్డీఏ పని కోసమే వినియోగించుకోవాలని గుంటూరు కలెక్టర్‌కు సూచించారు. మంగళవారం గుంటూరులో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు డిప్యూ టీ కలెక్టర్లు తమ జిల్లాల్లో రిలీవ్ కాకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎలా పనిచేస్తామని ప్రశ్నించి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో ఎస్ఈగా పనిచేస్తున్న పి. శ్రీరాములును కూడా రెండేళ్లు డెప్యుటేషన్‌పై నియమిస్తూ మరో జీఓ జారీ చేశారు. -
బాబు రాక.. జాబు పోక..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన ఉపాధి ఎఫ్ఏల తొలగింపునకూ నిర్ణయం వీధిన పడతామంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమండ్రి: జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాటలపై చాలీచాలని జీతాలతో, కనీస ఉద్యోగ భద్రత కూడా లేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశ పెంచుకున్నారు. ఆయన అధికారంలోకి వస్తే తమ వంటి చిరుద్యోగుల భవిష్యత్తు వెలిగిపోతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గృహ నిర్మాణ సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించే జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణశాఖలో.. గృహ నిర్మాణశాఖలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2,600 మంది ఉద్యోగులున్నారు. వీరు 2006 నుంచి పనిచేస్తున్నారు. ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో రూ.15 వేల లోపు జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరిలో సుమారు 60 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి కూడా దాటిపోయింది. ఈ తరుణంలో ఉద్యోగాల నుంచి తొలగించటంతో వారికి దిక్కుతోచడంలేదు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి ఇదీ ఉపాధి హామీ పథకంలో 13 జిల్లాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు తొమ్మిదివేల మందిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం కనికరించకపోవడంపై ఉద్యమించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమవుతున్నారు. జలయజ్ఞం ఉద్యోగులకు చెల్లుచీటీ జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేసే సుమారు 700 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ గతనెల 17నే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల రెండో తేదీ నుంచి వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీచేశారు. కానీ ఉద్యోగులు ఆందోళన చేయడంతో గవర్నర్ పాలనలోని అధికారులు ఉత్తర్వులను నెలపాటు నిలిపేశారు. ఈ ఉత్తర్వులను మళ్లీ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ కోణమా.. ఆయా శాఖల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటీ మేనేజర్లు, అకౌంటెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన వారే కావడంతో కేవలం రాజకీయ కారణాలతోనే ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం నడుం కట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. వీధిన పడతాం.. సుమారు ఎనిమిదేళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఈ ఉద్యోగంపై ఆధారపడే చేయాలి. మా తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయి. - పి.పోతురాజు, గృహ నిర్మాణసంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి, రాజమండ్రి -
అవినీతి అధికారికి మళ్లీ పోస్టింగ్
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: అవినీతికి కేరాఫ్‌గా మారిన జిల్లా గృహనిర్మాణ సంస్థలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఆ శాఖలో కొత్తగూడెం ఏఈగా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన అప్పారావుకు మళ్లీ జాయినింగ్ ఆర్డర్లు వచ్చాయి. విచారణ పూర్తికాకముందే సస్పెన్షన్ ఎత్తివేయడం ఎమిటనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నా యి. ఈ వ్యవహరమంతటికీ జిల్లా గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. 2012 జనవరి 1న ప్రవేశపెట్టిన మురికివాడల అభివృద్ధి పథకం కింద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో కమీషన్ వస్తుందని భావించిన అప్పటి కొత్తగూడెం ఏఈ అప్పారావు ఇళ్ల నిర్మాణం పూర్తికాక ముందే లభ్దిదారులకు అడ్వాన్స్‌గా రూ.46.15 లక్షలు చెల్లించారు. దీనిపై విచారించిన ఈఈ సాయినాథ్ ఈ మేరకు నివేదిక ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ అప్పారావును అదే సంవత్సరం ఫిబ్రవరి 9న సస్పెండ్ చేసి, అతనిపై విచారణకు అప్పటి పోలవరం సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తున్న శివ శ్రీనివాస్‌ను నియమించారు. అ యితే ఏడాదిన్నర కావస్తున్నా విచారణ పూర్తి చేయలేదు. హౌసింగ్‌లో పనిచేస్తున్న కీలక అధికారే దీనికి కారణమనే ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ పూర్తి కాకముందే అతనిపై సస్పెండ్‌ను ఎత్తివేసి, హైదరాబాదు ఎండీ ఆఫీసుకు సరెండర్ చేయడం ఆ ఆరోపణలకు మరింతగా బలం చేకూరుస్తోంది. ఈ విషయమై పీడీ భాస్కర్‌ను వివరణ కోరగా ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ అధికారి ఇంత వరకూ పూర్తి చేయలేదని, దీంతో ఏడాదిన్నరగా సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న అప్పారావు కలెక్టర్‌ను కలిసి తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నారని తెలిపారు. మరో నెలరోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని డీఆర్వో శివశ్రీనివాస్‌ను సైతం కలెక్టర్ ఆదేశించారని పేర్కొన్నారు.