
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌లో తాత్కాలిక వేతనంతో ఐదేళ్లు పనిచేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పటికీ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కార్పొరేషన్ తెలంగాణలో ఉన్నందున తమ ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 1991లో ఉమ్మడి ఏపీలో జీవో 182 జారీ అయింది.
దీని ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలి. తాము 1989లో నియమితులయ్యామని, కార్పొరేషన్‌లో అసిస్టెం ట్ ఇంజనీర్లు, అర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మన్, డ్రాఫ్ట్‌మన్‌లుగా ఐదేళ్ల సర్వీసు పూరై్తందని, తమకు జీవో 182 వర్తించదంటూ 2006లో ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని తాత్కాలిక ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. జీవో 182 ప్రకారం అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వర్క్ ఇన్‌స్పెక్టర్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును కార్పొరేషన్ సవాల్ చేసింది. జీవో 182 అమలు వర్తించదనే కార్పొరేషన్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment