వారు ఏ రాష్ట్రానికైనా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు | Employees can opt for either both of the states, says high court | Sakshi
Sakshi News home page

వారు ఏ రాష్ట్రానికైనా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు

Published Sun, Apr 9 2017 2:25 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

వారు ఏ రాష్ట్రానికైనా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు - Sakshi

వారు ఏ రాష్ట్రానికైనా ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు

-స్టేట్‌ కేడర్‌ ఉద్యోగుల ఆప్షన్‌పై హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన స్టేట్‌ కేడర్‌ ఉద్యోగులు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట నిబంధనలను అనుసరించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి తమ ఆప్షన్‌ను ఇవ్వొచ్చునని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. స్టేట్‌ కేడర్‌ ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జోన్‌లో పనిచేసినప్ప టికీ, విభజన తరువాత ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే వెసులు బాటు వారికి ఉం దని తెలిపింది. పంచాయ తీరాజ్‌శాఖలో ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్న అహ్మద్‌ అబ్దుల్‌ సమీ, పి.వై. రామచంద్రంలు రాష్ట్ర విభజన తరువా త తెలంగాణకు వారిచ్చిన ఆప్షన్‌ను, దానిని కేంద్రం ఆమోదించడాన్ని తప్పుపట్ట లేమంది. ఈ విషయంలో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

ఈ మేరకు న్యాయమూ ర్తులు జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్, జస్టిస్‌ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు నిచ్చింది. తమ ఆప్షన్‌ మేరకు తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తమను తిరిగి ఏపీకి పంపుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్‌సీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సమర్థిస్తూ పరిపాలన ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సమీ, రామచంద్రంలు హైకో ర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచా రణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృ త్వంలోని ధర్మాసనం, ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల ను తప్పుపట్టింది.  అపాయింటెడ్‌ డే నాటికి పిటిషనర్లు స్టేట్‌ కేడర్‌ ఉద్యో గులని, కాబట్టి వారు రాష్ట్ర విభజన తరువాత ఏ రాష్ట్రాన్నైనా ఎంచుకో వచ్చునంది. ఈ విషయంలో ట్రిబ్యునల్‌ ఉత్తర్వు లు సరికాదంటూ వాటిని రద్దు చేసింది. అలాగే ఈఎన్‌జీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కూడా రద్దు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement