
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ విరాళాన్ని ప్రకటించారు. తమ తరుపున రెండు రోజుల వేతనం 74 లక్షల 40 వేల 112 రూపాయలు సాయం చేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలోనే గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ నవీన్ కుమార్, ఉద్యోగుల సంఘం జేఏసీ ఛైర్మన్ రామచంద్రారెడ్డి, భాస్కరరావు, శ్రీరాములు, మల్లిఖార్జున్ రావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment