హౌసింగ్ కార్పొరేషన్ ఎస్‌ఈ శ్రీరాములును కూడా రెండేళ్లు డెప్యుటేషన్‌పై సీఆర్‌డీఏకు
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 34 మంది డిప్యూటీ కలెక్టర్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ఈమేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుం టూరు జిల్లాలో రాజధాని భూసమీకరణ ప్రక్రియలో వీరు భాగస్వాములవుతారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్లు కె. శ్రీనివాసరావు, ఎంవీ రమణ, వి.వి. విశ్వేశ్వరరావు, పి. అరుణ్‌బాబు, జీసీ కిషోర్‌కుమార్, ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎన్. ప్రభాకర్‌రెడ్డి, పి. గ్లోరియా, ఎల్. విజయసారథి, కె.పెంచల కిషోర్, ఎస్. శ్రీనివాసమూర్తి, వి. సుబ్బారావు, కె. మల్లికార్జునుడు, ఎస్. లావణ్య, సీహెచ్ రమేష్‌బాబు, ఆర్‌వీ సూర్యనారాయణ, ఏఎన్ సలీంఖాన్, బి. శ్రీనివాసరావు, కె. చంద్రశేఖర్‌రావు, వి. శ్రీనివాసరావు, జి. మల్లికార్జున, ఇ మురళి, కె. ఝాన్సీలక్ష్మి, ఎ. వెంకట్రావు, కె. లలిత, ఎన్. ఏసురత్నం, బి. పద్మావతి, కె. మధుసూధనరావు, పి. వరభూషణరావు, కె. మాధురి, కె. ఉమారాణి, కె. పద్మలత, డి. పుష్పమణి, టి.సునీతారాణిలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం గుంటూరు కలెక్టర్ నేతృత్వంలో సీఆర్‌డీఏ పని కోసం వారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీ అయిన వారిలో 8 మంది ఆర్డీవోలు కూడా ఉన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, మెప్మా పీడీలు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ బాధ్యతల్లో ఉన్న వారు మినహా, మిగిలిన వారు తక్షణమే రిలీవై పట్టణాభివృద్ధి శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా సీఆర్‌డీఏలో ఏడాదిపాటు పనిచేస్తారు. వీరి జీతభత్యాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇస్తుంది. వీరిని సీఆర్‌డీఏ పని కోసమే వినియోగించుకోవాలని గుంటూరు కలెక్టర్‌కు సూచించారు. మంగళవారం గుంటూరులో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు డిప్యూ టీ కలెక్టర్లు తమ జిల్లాల్లో రిలీవ్ కాకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎలా పనిచేస్తామని ప్రశ్నించి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న పి. శ్రీరాములును కూడా రెండేళ్లు డెప్యుటేషన్‌పై నియమిస్తూ మరో జీఓ జారీ చేశారు.
సీఆర్‌డీఏకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లు
Published Thu, Jan 1 2015 2:51 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement