పేద ప్రజలకు అద్భుతమైన వరం లాంటి ‘వన్ టైమ్ సెటిల్మెంట్‘ (ఓ.టి.యస్.) చెల్లించటం ద్వారా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధి పొందిన ప్రజలు రాష్ట్ర మంతటా ఎంతో ఉత్సాహంతో డిసెంబర్ 21న మంగళవారం పండుగ జరుపుకొంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం ప్రారంభించారు. ఓ.టి.యస్. లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల లబ్ది కల్పించింది. రుణ బకాయిల రద్దుతో మరో రూ. 10 వేల కోట్ల లాభం ప్రజలకు చేకూరింది. ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి తేడా చూపబోమని తొలినాళ్లలో ప్రకటించిన విధంగానే గత ప్రభుత్వ హయాంలో కట్టిన వారికికూడా మేలు కలిగేలా ప్రభుత్వం నిర్ణయం చెయ్య డంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...)
ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి వారు గమనించాల్సినది ఏమిటంటే వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలనూ గత ప్రభుత్వం అసలు పరిశీలించనేలేదని! సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా గృహ నిర్మాణాల రుణం నిమిత్తం చెల్లించారు. గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కోరినా పట్టించుకోని చంద్రబాబు రేపు అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని అనడం ప్రజలను మభ్య పెట్టడమే. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేస్తున్న ప్పుడు ప్రజల గుండె చప్పుడు విన్నందున.. వారి సంక్షేమానికి అనుకూలమైన నవరత్నాల ద్వారా జనరంజక పాలన అందిస్తున్నారు. (చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు)
గత ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ము కునే హక్కు కల్పించలేదని, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసిందని పాదయాత్రలో తెలుసుకుని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఓ.టి.ఎస్. పధకాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు పేద ప్రజలకు అందు తోంది. డి.ఫారం పట్టాలపై రుణం తీసుకుని ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేదలకు ప్రస్తుతం అమలులో వున్న నిబంధనలను సవరించి ఓ.టి.ఎస్. ద్వారా శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన పేదలు తమ ఇల్లు అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా పూర్తి హక్కులు వస్తాయి.
ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధి దారులు మొత్తం 56,69,000 మంది. ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసు కున్నారు. వీరి రుణ బకాయిలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కన్నా తక్కువ ఉంటే ఆ మొత్తం కడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌లో చెప్పిన మొత్తం కట్టి సెటిల్ చేసుకుంటున్నారు. ఎలాంటి రుణం తీసుకోని వారు 12 లక్షల మంది వరకూ ఉన్నారు. వాళ్లు కేవలం 10 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ లేవు.
ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(అ) జాబితా నుంచి తొలగించినందువల్ల ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజి స్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుంది. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచి వాలయంలోనే రిజిస్ట్రేషన్‌చేసి సచివాలయంలోనే అందజేస్తారు.
సామాన్యుల ఇళ్లలో పేదరికం ఎంత దారుణంగా ప్రభావం చూపుతుందో తన పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వారికి ఆత్మగౌరవం కలిగేలా పేదలకు ఇచ్చిన వరం లాంటి ఓ.టి.ఎస్.ను వినియోగించుకొని తమ ఆస్తికి విలువను కల్పించు కోవడంలో ప్రజలు ఎంత మాత్రం వెనుకాడటం లేదు.
- దవులూరి దొరబాబు
చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment