One Time settlement
-
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
రెలిగేర్ ఫిన్వెస్ట్ వన్‌టైమ్ సెటిల్మెంట్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ 16 రుణదాత సంస్థలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పూర్తిచేసుకున్నట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి తుది చెల్లింపుకింద రూ. 400 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. గడువుకంటే దాదాపు నెల రోజుల ముందుగానే మార్చి 8న సెటిల్మెంట్ను పూర్తి చేసినట్లు తెలియజేసింది. 2022 డిసెంబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ పూర్తికావడంతో గత ప్రమోటర్ల అవకతవకల కారణంగా తలెత్తిన లెగసీ సమస్యలకు ముగింపు పలికినట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ రష్మి సలుజ పేర్కొన్నారు. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 జనవరి నుంచి రెలిగేర్ ఫిన్వెస్ట్ రూ. 9,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రస్తావించారు. కాగా.. తాజా సెటిల్మెంట్ పూర్తి నేపథ్యంలో తిరిగి ఎంఎస్ఎంఈలకు రుణాలందించడం తదితర బిజినెస్‌లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్మెంట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సర్ చార్జీలు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ.. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలకు మాత్రమే సర్ చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరీ్ణత సమయంలో బకాయిలను చెల్లించకపోతే సర్ చార్జీలు కట్టాల్సివస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరి్థకంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వినియోగదారులు బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో రూ. 25 లక్షలు టోకరా
పంజగుట్ట: వన్‌టైం సెటిల్మెంట్లో బ్యాంకు రుణాన్ని తక్కువ చేయిస్తానని నమ్మించి రూ. 25 లక్షలు తీసుకుని పరారైన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీకి చెందిన వి.రవికుమార్, తన సోదరుడు రాఘవేందర్ డైరెక్టర్లుగా మరికొందరితో కలిసి పంజగుట్టలో రామకృష్ణా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ విస్తరణ నిమిత్తం అప్పటి ఆంధ్రాబ్యాంకు, ప్రస్తుత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2019లో రూ.81 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా, లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరక్క కిస్తీలు కట్టలేకపోయారు. దీంతో బ్యాంకు వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించడంతో రూ. 7 కోట్లు చెల్లించారు. 2021 సెప్టెంబర్‌లో నగరానికి చెందిన పి.విక్రమ్ అనే వ్యక్తి రవికుమార్ సోదరులను కలిశాడు. బ్యాంకు లైజనింగ్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న అతను మీరు తీసుకున్న రుణానికి వన్‌టైం సెటిల్మెంట్ కింద సగం తగ్గిస్తానని చెప్పాడు. వన్‌టైం సెటిల్మెంట్ రూ.47 కోట్లకు ఒప్పందం కుదిరిందని బ్యాంకు జనరల్ మేనేజర్ పేరుతో నకిలీ లెటర్ సృష్టించి వారికి ఇచ్చాడు. మొదట రూ.25 లక్షలు బ్యాంకుకు ముందస్తుగా చెల్లించాలని తీసుకున్నాడు. ఆ తర్వాత రవికుమార్ బ్యాంకు జీఎం పేరుతో ఉన్న లేఖను తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అది నకిలీదిగా తేలింది. విక్రమ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అతనికోసం గాలింపు చేపట్టారు. -
స్కాములెన్ని ఉన్నా.. వన్‌టైమ్ సెటిల్మెంట్లో పీఎన్బీనే మిన్న
వరుస స్కామ్‌లలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతోంది పంబాజ్ నేషనల్ బ్యాంక్. స్కాములు వెంటాడుతున్నా మొండి బకాయిలు వసూలు చేసుకోవడంలో మెరుగైన పనితీరునే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కనబరుస్తోంది. గతేడాది వన్‌టైమ్ సెటిల్మెంట్లో పీఎన్బీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. పార్లమెంటులో దేశంలోని 11 బ్యాంకులు గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 డిసెంబర్ వరకూ, అలాగే అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాలు) వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా దాదాపు రూ.61,000 కోట్లను రికవరీ చేశాయని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మంత్రి ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారం, తమ బోర్డు ఆమోదించిన లోన్ రికవరీ పాలసీని బ్యాంకులు కలిగి ఉండాలి. తద్వారా రాజీ, వన్–టైమ్ సెటిల్మెంట్ మార్గాలతో మొండిబకాయిలకు సంబంధించి రుణ రికవరీ జరగాలి. కనిష్ట వ్యయంతో సాధ్యమైనంత గరిష్ట ప్రయోజనం పొందేలా రికవరీ ప్రక్రియ ఉండాలి. - బ్యాంకులు తమ నిధులను సత్వరం పొందడం, తిరిగి వాటిని రుణాలకు వినియోగించుకోవడం, తగిన ప్రయోజనం పొందడం (రీసైకిల్) వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రధాన ఉద్దేశం. - ఆయా పక్రియ ద్వారా 11 జాతీయ బ్యాంకులు గడచిన నాలుగు సంవత్సరాల్లో 38,23,432 కేసులను వన్‌టైమ్ సెటిల్మెంట్గా పరిష్కరించాయి. తద్వారా రూ.60,940 కోట్లు రికవరీ చేశాయి. - వన్ టైమ్ సెటిల్మెంట్ విషయంలో 8.87 లక్షల కేసులతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి స్థానంలో నిలిచింది. తరువాత వరుసలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.97 లక్షలు) బ్యాంక్ ఆఫ్ బరోడా (4.34 లక్షలు) ఇండియన్ బ్యాంక్ (4.27 లక్షలు), కెనరా బ్యాంక్ (4.18 లక్షలు) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.02 లక్షలు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.99 లక్షలు), యూకో బ్యాంక్ (2.38 లక్షలు)ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (1.33 లక్షలు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (63,202) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (20,607) ఉన్నాయి. -
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్
సాక్షి, అమరావతి: దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు వైఎస్సార్ బడుగు వికాసం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా దళిత పారిశ్రామికవేత్తలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2008–2020 మధ్య ఏపీఐఐసీ ద్వారా భూములు పొంది వివిధ కారణాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. దళిత పారిశ్రామికవేత్తలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కోరారు. గతంలో పదేళ్లపాటు భూమిని లీజుకు కేటాయించడం వల్ల రుణ మంజూరు సమస్యలు తలెత్తి చాలామంది యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములను పునరుద్ధరిస్తూ జీవో నంబర్–7 విడుదల చేసినట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో మరింత మేలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరింత మేలు చేసే దిశగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదేళ్లుగా ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం, నిర్ణీత సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో జాప్యం, చెల్లింపులు, జరిమానాలు కట్టలేని పరిస్థితుల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్లాట్లు పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయినా, నగదు చెల్లించకపోయినా, తమ ప్లాటును, నగదును వెనక్కి తీసుకున్నా, ప్లాటు రద్దయినా మార్చి 31వ తేదీలోగా జిల్లాల వారీగా ఏపీఐఐసీ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వ్యక్తిగత దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ప్లాట్లు పొందిన నాటి ధరలను వర్తింపజేయడమే కాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఓటీఎస్ వర్తింపు ఇలా.. ఓటీఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి భూములను కేటాయించి అందుకు సంబంధించిన లెటర్లు ఇస్తారు. సంబంధిత మొత్తాలను 3 నెలల్లోపు వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. 91వ రోజు నుంచి 180 (3 నెలలు దాటి 6 నెలల లోపు) రోజుల వరకూ 4 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 181వ రోజు నుంచి రెండేళ్ల వరకూ 8 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. -
పేద ప్రజలకు ఇదో వరం
పేద ప్రజలకు అద్భుతమైన వరం లాంటి ‘వన్ టైమ్ సెటిల్మెంట్‘ (ఓ.టి.యస్.) చెల్లించటం ద్వారా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధి పొందిన ప్రజలు రాష్ట్ర మంతటా ఎంతో ఉత్సాహంతో డిసెంబర్ 21న మంగళవారం పండుగ జరుపుకొంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం ప్రారంభించారు. ఓ.టి.యస్. లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల లబ్ది కల్పించింది. రుణ బకాయిల రద్దుతో మరో రూ. 10 వేల కోట్ల లాభం ప్రజలకు చేకూరింది. ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి తేడా చూపబోమని తొలినాళ్లలో ప్రకటించిన విధంగానే గత ప్రభుత్వ హయాంలో కట్టిన వారికికూడా మేలు కలిగేలా ప్రభుత్వం నిర్ణయం చెయ్య డంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి వారు గమనించాల్సినది ఏమిటంటే వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలనూ గత ప్రభుత్వం అసలు పరిశీలించనేలేదని! సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా గృహ నిర్మాణాల రుణం నిమిత్తం చెల్లించారు. గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కోరినా పట్టించుకోని చంద్రబాబు రేపు అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని అనడం ప్రజలను మభ్య పెట్టడమే. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేస్తున్న ప్పుడు ప్రజల గుండె చప్పుడు విన్నందున.. వారి సంక్షేమానికి అనుకూలమైన నవరత్నాల ద్వారా జనరంజక పాలన అందిస్తున్నారు. (చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు) గత ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ము కునే హక్కు కల్పించలేదని, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసిందని పాదయాత్రలో తెలుసుకుని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఓ.టి.ఎస్. పధకాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు పేద ప్రజలకు అందు తోంది. డి.ఫారం పట్టాలపై రుణం తీసుకుని ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేదలకు ప్రస్తుతం అమలులో వున్న నిబంధనలను సవరించి ఓ.టి.ఎస్. ద్వారా శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన పేదలు తమ ఇల్లు అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా పూర్తి హక్కులు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధి దారులు మొత్తం 56,69,000 మంది. ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసు కున్నారు. వీరి రుణ బకాయిలు వన్‌టైమ్ సెటిల్మెంట్ కన్నా తక్కువ ఉంటే ఆ మొత్తం కడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌లో చెప్పిన మొత్తం కట్టి సెటిల్ చేసుకుంటున్నారు. ఎలాంటి రుణం తీసుకోని వారు 12 లక్షల మంది వరకూ ఉన్నారు. వాళ్లు కేవలం 10 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ లేవు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(అ) జాబితా నుంచి తొలగించినందువల్ల ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజి స్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుంది. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచి వాలయంలోనే రిజిస్ట్రేషన్‌చేసి సచివాలయంలోనే అందజేస్తారు. సామాన్యుల ఇళ్లలో పేదరికం ఎంత దారుణంగా ప్రభావం చూపుతుందో తన పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వారికి ఆత్మగౌరవం కలిగేలా పేదలకు ఇచ్చిన వరం లాంటి ఓ.టి.ఎస్.ను వినియోగించుకొని తమ ఆస్తికి విలువను కల్పించు కోవడంలో ప్రజలు ఎంత మాత్రం వెనుకాడటం లేదు. - దవులూరి దొరబాబు చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ -
పేదలంటే వారికి ఏహ్యభావం
సాక్షి, అమరావతి: పేదలంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆ పార్టీలో అంతర్భాగమైన ‘ఈనాడు’ రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఏహ్య భావమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు మేలు జరుగుతుంటే చూడలేని ఆ ముగ్గురినీ చెత్త బుట్టలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల క్రితం గృహ నిర్మాణ సంస్థ వద్ద అప్పు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలు అసలు, వడ్డీ కలిపి రూ.9 వేల కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టుకోలేక, విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు రుణ భారాన్ని తప్పించి, నామమాత్రపు ధరతో ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి, వారికి సంపూర్ణ హక్కు కల్పించడానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ప్రవేశపెట్టాం. రూ.6 వేల కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 50 లక్షల మందికి పైగా పేదలు గృహ నిర్మాణ సంస్థ నుంచి అప్పు తీసుకోగా, వారిలో 12 లక్షల మంది అసలు, వడ్డీ చెల్లించినా వారికి ఆ ఇళ్లపై ఇప్పటికీ సంపూర్ణ హక్కు లేదు. 2014 నుంచి 19 మధ్య అప్పుపై వడ్డీనైనా మాఫీ చేయాలని గృహ నిర్మాణ సంస్థ ఐదు సార్లు ప్రతిపాదనలు పంపినా.. అప్పటి చంద్రబాబు సర్కారు తిరస్కరించింది. ఆ ఐదేళ్లలో 43 వేల మందే అసలు, వడ్డీ చెల్లించారు. వారికీ టీడీపీ సర్కారు ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పించలేదు. ఇప్పుడు ఓటీఎస్ కింద అసలు, వడ్డీని ఏకకాలంలో పరిష్కరించి.. గ్రామాల్లో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే ఆ ఇళ్లను లబ్ధిదారుల పేర్లతోనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గతంలో రుణాలు చెల్లించిన వారికి రూ.10కే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకాన్ని వర్తింపజేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంటి పట్టా ఇచ్చిన పదేళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అసైన్మెంట్ చట్టంలో సవరణ చేశామని కూడా గుర్తు చేశారు. మీడియా ముసుగులో ఉగ్రవాదపు రాతలా? ‘పేదలకు ఉపయోగకరమైన ఓటీఎస్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మీడియాలో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్లు భజన చేసే ఆ పత్రికలు.. ఇతరులు అధికారంలో ఉంటే సహించలేవు. అధికారంలో ఉంటే బాబు ఉండాలి.. లేకుంటే రాష్ట్రం సర్వనాశనమై పోవాలన్నదే వాటి లక్ష్యం. అందుకే ఆధారాల్లేకుండా విషపు రాతలు రాస్తున్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలను పట్టుకుని మీడియా ముసుగులో ఉగ్రవాదం, దాష్టీకాలు సాగిస్తున్నాయి. ‘సాక్షి’ ఆధారాల్లేకుండా ఏనాడూ ఎవరిపైనా ఎటువంటి కథనాలూ రాయలేదు. ప్రభుత్వంపైన, సీఎం వైఎస్ జగన్‌పైన టీడీపీ, ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలను కూడా ‘సాక్షి’ ప్రచురిస్తూ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అభ్యుదయం కోసం విషపు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలను ప్రజలు బహిష్కరించాలి. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. బాబు అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ సంస్థ రుణాలు మాఫీ చేసి, ఉచితంగా ఇళ్లపై పూర్తి హక్కు కల్పించాలని ఎందుకు రాయలేదు?’ అని సజ్జల ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయాలు సూచించాం.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే లాభసాటిగా నడిపేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే కేంద్రానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారని చెప్పారు. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన నేత పవన్.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నడిపేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు. మహిళా సాధికారత కోసం గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖల నుంచి ఒకే జీవో జారీ చేయడానికే ప్రస్తుత జీవోలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ప్రతిపక్షాన్ని రాష్ట్రంలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. సీపీఎస్‌ను రద్దు చేస్తాం ‘టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని ఆలస్యంగా వేసి, ఉద్యోగులకు అన్యాయం చేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టగానే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. పీఆర్సీ కచ్చితంగా ఇస్తాం. సీపీఎస్‌ను రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీలకు కట్టుబడి ఉన్నాం. సీపీఎస్ రద్దుపై కమిటీ అధ్యయనం చేస్తోంది. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదు. వారి హెచ్చరికలతో వెనక్కి తగ్గం. ముందుకూ వెళ్లం. ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టం. ప్రజల్లో, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు’ అని ఆయన పునరుద్ఘాటించారు. చదవండి: (ఆంధ్రజ్యోతివి అసత్య కథనాలు) -
AP: సంపూర్ణ గృహహక్కు పథకం.. వాస్తవాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఏనాడు ఆలోచించని చంద్రబాబు.. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఓటీఎస్ పథకంపై అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. దాన్ని ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతో ఈ పథకంపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు గ్రామస్థాయిలో పనిచేసే అధికారుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకుగాను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లు కానీ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కానీ నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకాన్ని ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న గ్రామ స్ధాయిలో ఎక్కడో ఒక చోట ఒక పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇచ్చిన ఆదేశాలను సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం, అదే ప్రచారాన్ని మరుసటి రోజు టీడీపీ కరపత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు రాయించడం ఇవన్నీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చర్యలో భాగంగా కుట్రలకు పాల్పడుతున్నారు. గతంలో 28 లక్షల మంది లబ్ధిదారులకిచ్చే ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఇలాగే కోర్టులకెక్కి ఆపించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేయడంతో పేదల సొంతింటికల త్వరలోనే నెరవేరబోతోంది. ప్రస్తుతం ఓటీఎస్‌ను అలాగే నిలిపివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాగూ మేలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు చేస్తోన్న మేలు కూడా వారికి అందకుండా చేస్తున్నారు. అప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని ఆపారు. ఇప్పుడు రుణసదుపాయం పొందిన వారికి వాళ్ల ఇళ్లపై సంపూర్ణ హక్కులను కూడా పొందనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపూర్ణ గృహహక్కు పథకంపై వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే.. వాస్తవాలు ఇవిగో.. 1. వన్ టైం సెటిల్ స్కీం 24 జనవరి 2000లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం వడ్డీ మాఫీ మాత్రమే ఇచ్చేది. రుణం చెల్లించిన తర్వాత తనఖా పెట్టుకున్న పత్రాన్ని తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేవారు. మార్చి 31, 2014 వరకు అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్ మెంట్ స్కీంను వినియోగించుకున్నారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 2. 2014 ఏఫ్రిల్ నుంచి 2019లో మన ప్రభుత్వం వచ్చేంతవరకు ఈ పథకం ఎప్పుడూ అమలు కాలేదు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్లు సెప్టెంబర్ 30, 2016న జరిగిన బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్మెంట్ స్కీంను పొడగించమని ప్రతిపాదనలు పంపారు. అదే విధంగా మరో నాలుగు దఫాలు 27–10–2016, 03–11–2016, 10–04–2018 మరియు 13–02–2019 మొత్తం ఐదు దఫాలుగా ప్రభుత్వాన్ని పదే, పదే కోరారు. ఇన్ని సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చాలా నిర్ధయగా, అప్పటి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చినా, పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి తిప్పి పంపింది. అప్పటికే 14 సంవత్సరాలు అమల్లో ఉన్న స్కీంను కనీసం వడ్డీ మాఫీ చేయడానికి కూడా అప్పటి ప్రభుత్వానికి మనసు కూడా రాలేదు. 2014–19 మధ్యలో ఒక్కరంటే ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీ కూడా మాఫీ చేయలేదు. అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు. 3. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో ఆయన్ను కలిసిన ప్రజలు.. ఉన్న వన్‌టైం సెటిల్ మెంట్ స్కీంను కూడా నిలిపివేశారని ఆయన దగ్గర తమ కష్టాలను ఏకరువు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ముకునే హక్కు కల్పించడం, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. దీంతో ఓటీఎస్ పథకం కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వైఎస్ జగన్ సంపూర్ణ గృహహక్కు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. 4. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) చట్టం 1977 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆగస్టు 15, 2011 కంటే ముందు ఇచ్చిన నివేసిన పత్రాలు కానీ, డీఫామ్ పట్టాలు కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఈ పథకంలో లబ్ధిపొందుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో కూడా సవరణలు తీసుకురావడం జరిగింది. 5. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. లబ్ధిదారులకి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలుతో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్ణయించిన మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లించి ఈ పథకానికి అర్హులు కావచ్చు. నిర్ణయించిన మొత్తం కంటే కట్టవలసిన సొమ్ము ఎక్కువగా ఉంటే.. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఉన్న మొత్తం పూర్తిగా మాఫీ చేయబడుతుంది. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఒక లబ్ధిదారుడు రూ.9వేలు రుణభారం ఉందనుకుంటే.. సదరు లబ్ధిదారుడు రూ.10వేలకు బదులు రూ.9 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే మరో లబ్దిదారుడు రూ.50,000 రుణం చెల్లించాల్సి ఉందనుకుంటే.. ఆ లబ్ధిదారుడు రూ.10వేలు కడితే అతడికి రూ.40,000 మాఫీ అయి, ఆ మేరకు లబ్దిపొందుతాడు. 6. అలాగే సుమారు 12 లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన రుణం తీసుకోకుండా ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లందరికీ రూ.10 నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు వాళ్ల పేరు మీదే, వాళ్ల ఇంటికి సంబంధించిన నివేసిత స్ధలానికి ఇవ్వబడుతుంది. 7. గతంలో అమలైన ఓటీఎస్ స్కీంలో నిర్ణయించిన మొత్తాన్ని కట్టిన వారికి, తాకట్టు పెట్టిన నివాసిత స్థలపత్రం కానీ, డీఫామ్ పట్టా కానీ తిరిగి ఇవ్వబడేది. ఏ విధమైన అమ్ముకునే హక్కు కానీ, వారసులుకు బహుమతిగా రిజిస్ట్రేషన్ చేసే హక్కు కానీ లభించేది కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో లబ్ధిదారుడికి వాళ్ల ఇళ్లపై సర్వహక్కులు కల్పించబడతాయి. అమ్ముకోవడానికి, బహుమతిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రభుత్వమే వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. భవిష్యత్తులో ఏ విధమైన ఇతర లింకు డాక్యుమెంట్లు అవసరం లేకుండా, ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్ డాక్యుమెంటుతో అమ్ముకుని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 8. లబ్ధిదారుడికిచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి డిసెంబరు 21 తర్వాత సచివాలయంలోనే అందజేస్తారు. 9. గతంలో ఉన్న ఓటీఎస్ స్కీంలో నివేసిత పత్రం మీద కానీ, డీఫామ్ పట్టాల మీద గానీ బ్యాంకులు రుణసదుపాయం కల్పించేవి కావు. ఇప్పుటి ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద భూమి, ఇంటి విలువ మీద 75 శాతం వరకు కూడా బ్యాంకులు రుణ సదుపాయం కల్పించనున్నాయి. ఉదాహరణకు స్ధలం విలువ రూ.6 లక్షలు అనుకుంటే, ఇంటి విలువ రూ.2లక్షలు అనుకుంటే బ్యాంకులు 75 శాతం వరకు రుణం అంటే రూ.6 లక్షలు వరకు లోన్ సదుపాయం ఉంటుంది. కార్పొరేషన్లో స్ధలం విలువ రూ.12 నుంచి 15 లక్షలు అనుకుంటే ఇంటి విలువ రూ. 1 నుంచి 3 లక్షలు అనుకుంటే అతనికి 75 శాతం రుణం అంటే రూ. 8 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు కొత్తగా రుణం పొందే సౌకర్యం ఉంటుంది. 10. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో యూజర్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మూడు మాఫీ చేయబడ్డాయి. మాఫీ అయిన మొత్తం ఒక కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటే సుమారు రూ.1లక్ష లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ లబ్ధిదారుడి పేరుమీద రిజిస్ట్రేషన్ తన సొంత ఖర్చులతో చేసుకోవాలనుకుంటే ఈ రూ.1లక్ష ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. 11. ఈ పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులను రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహిస్తున్న నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగిస్తాం. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెవెన్యూశాఖ నుంచి ఏ విధమైన నిరభ్యంతర పత్రం అవసరం లేదు. 12. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం 13 జిల్లాల్లోనూ ప్రజల సహకారంతో గత 12 రోజులలో 1 లక్షా 6 వేల మంది ఉపయోగించుకున్నారు. అలాగే ప్రతి రోజూ దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఇలా చక్కగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రతిపక్షం ప్రయత్నించడం చాలా దారుణం, ఇది చాలా హేయమైన చర్య. 2014 నుంచి 2019 మధ్యలో 43,776 మంది ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోయినా రుణమొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి, నివేసిత పత్రాలు, డీఫామ్ పట్టాలు వెనక్కి తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో సంవత్సరానికి కనీసం 9 వేలమందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారు. ఇప్పుడు ఈ మంచి పథకాన్ని అడ్డుకోవడానికి..తాము అధికారంలోకి వస్తే పూర్తిగా మాఫీ చేస్తామని, చెప్పడం హాస్యాస్పదం. టీడీపీ అధికారంలో ఉండగా రైతు రుణమాఫీ అని ఏ రకంగా రైతులను వంచించారో ఏ అన్నదాతను అడిగినా చెప్తారు. డ్వాక్రా రుణమాఫీ అని, బ్యాంకుల్లో బంగారం మీ ఇంటికొస్తుందని విడిపించకండని అక్కచెల్లెమ్మలను ఏ విధంగా మోసం చేశారో ఎవరిని అడిగినా కథలు, కథలుగా చెప్తారు. చివరకి మేనిఫెస్టోలో ఇఛ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన పాపానికి, చివరకి వెబ్సైట్ నుంచి పార్టీ మేనిఫెస్టోనే ఏకంగా తొలగించిన ఘనత టీడీపీది. -
AP: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గ్రామ సచివాలయాలు
సాక్షి, అమరావతి: వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో పలు మార్పులు చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పరిగణిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. చదవండి: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు! కేవలం వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలు వరకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్దిదారులకు చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీలు మినహాయిస్తూ మరో రెండు నోటిఫికేషన్లను జారీ చేశారు. -
AP: ‘సంపూర్ణ గృహ హక్కు’పై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై ప్రజల్లో (లబ్ధిదారుల్లో) విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అంతా చొరవ చూపాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ పథకానికి సంబంధించి ఏకకాల పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్)పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈలోగా నియోజకవర్గాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రాష్ట్రంలో 51,08,000 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 39.7 లక్షల మంది రుణగ్రహీతలు, 12.1 లక్షల మంది ఇతరులు (రుణాలు తీసుకోని వారు) ఉన్నారు. డబ్బుల కోసం కాదు: మంత్రి బొత్స దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి బొత్స చెప్పారు. గతంలో ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్లు నిర్మించిన వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. డబ్బుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పొదుపు సంఘాల మహిళలకు దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. మండల, మునిసిపల్ సమావేశాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. 50 లక్షల మందికి ప్రయోజనం: సజ్జల రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ వసతి కల్పిస్తోందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా కృషి చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు: అజయ్‌జైన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు యూజర్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు కల్పించినట్లు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా బ్యాంకు రుణాలను కూడా పొందే వెసులుబాటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్ బాషా, మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేశ్, కురసాల కన్నబాబు, సీహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు దొరబాబు, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాదిమంది పేదల మేలు కోసమే వన్‌టైం సెటిల్మెంట్ స్కీం తీసుకువచ్చామని తెలిపారు. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో సాదకబాధకాలను కూలంకషంగా పరిశీలించాలని తెలిపారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు విడిపించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. తమ తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. -
‘వన్‌టైమ్ సెటిల్మెంట్’ అమలు సమీక్షకు మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: పేదల గృహ రుణాలకు సంబంధించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం అమలును సమీక్షించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం(రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ వారానికి ఒకసారి ఈ పథకంపై సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
సచివాలయాల్లోనే ‘వన్‌టైం సెటిల్మెంట్’
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్మెంట్కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించడంతోపాటు ప్రతిపాదనలను వివరించారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డేటా అప్లోడ్ చేయనుందని, వివిధ సచివాలయాలకు డేటాను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపడతారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితా ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా ఇళ్ల లే అవుట్ల సందర్శన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయినట్లు అధికారులు తెలియచేయగా గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి స్వయంగా పరిశీలన, తనిఖీల కోసం కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్ కమిషనర్లు కచ్చితంగా వారానికో లేఅవుట్‌ను సందర్శించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ జేసీ, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు లే అవుట్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారానికోసారి మంత్రుల కమిటీ సమీక్ష సమగ్ర భూ సర్వేపై నియమించిన మంత్రుల కమిటీ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కూడా వారానికోసారి సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కమిటీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా నియమించాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీ యూనిట్‌గా మౌలిక వసతులు పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుకల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్.భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ నాణ్యత పరిశీలన సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక కిట్‌లో భాగంగా వచ్చే ఏడాది అందించనున్న స్కూల్ బ్యాగ్, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, సీఎం కార్యాలయ అధికారులు చూపించారు. వచ్చే ఏడాది జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇచ్చే బ్యాగ్ నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ -
వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
-
ఎస్బీఐ రుణసమాధాన్‌తో వన్‌టైం సెటిల్మెంట్
ఒంగోలు: నిరర్థక ఆస్తుల పరిష్కారం కోసం చిన్న/సన్నకారు రైతులకు, చిన్నమొత్తాల రుణ వినియోగదారులకు ఏక మొత్తం చెల్లించే పద్ధతిలో రుణసమాధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సంబంధిత బకాయిదారులు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ మేనేజర్ వి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒంగోలు రీజియన్ పరిధిలో రూ.25 లక్షల లోపు రుణాలు ఉన్నవారు మాత్రమే రుణసమాధాన్ కిందకు వస్తారన్నారు. ఇటువంటి వారు 17,270 మంది ఉన్నారని, వారి నుంచి రూ.69.34 కోట్లు నిరర్థక ఆస్తులుగా ఉన్నాయన్నారు. దీనికిగాను రుణ గ్రహీతలు తాము ఏ బ్రాంచి నుంచి అయితే రుణాన్ని తీసుకున్నారో ఆ బ్రాంచిలో ఆధార్ కార్డు/ పాన్‌కార్డు వివరాలతో వెంటనే సంప్రదించాలన్నారు. వారి పేరు నమోదు చేయించుకొని వడ్డీలో పూర్తి రాయితీ, నికర బకాయిలో 50 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉందన్నారు. ఈ పథకం కేవలం ఈనెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఈ పథకం కింద రుణం తీర్చిన వారికి మళ్లీ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం నూతనంగా కూడా రుణం మంజూరు చేస్తామని ఆర్ఎం.వి.కృష్ణమోహన్ తెలిపారు. -
31వరకే వన్‌టైమ్ సెటిల్ మెంట్
– ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నిరర్థక ఆస్తులుగా ఉండిపోయిన రుణాలను వసూలు చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తోందని రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల దెబ్బతిన్న వారు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులు తదితరులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా వన్‌టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ స్కీమ్ ఈ నెల చివరి వరకు ఉంటుందన్నారు. దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీజినల్ పరిధిలోని అన్ని బ్రాంచ్‌లు స్కీమ్‌ను అమలు చేస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం రుణం తీసుకొని ఇప్పటికీ బకాయిగా ఉండి నిరర్ధక ఆస్తులుగా ఉన్న వాటికి ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను వినియోగించుకొని రుణ విముక్తులు కావాలని కోరారు. -
వన్ టైమ్ సెటిల్మెంట్కు సిద్ధం
సరైన విచారణ లేకుండా ప్రభుత్వం దోషిగా నిలబెడుతోంది: మాల్యా ట్వీట్లు న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. సరైన విచారణ జరపకుండానే ప్రభుత్వం తనను దోషిగా నిలబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇతర రుణగ్రహీతల్లాగానే తమకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘కోర్టులు ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాను. కానీ సరైన విచారణ జరపకుండా నన్ను దోషిగా నిలబెట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ నాపై మోపిన అభియోగాలే ప్రభుత్వ ధోరణికి నిదర్శనం‘ అని మాల్యా పేర్కొన్నారు. సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి మాల్యా దాదాపు రూ. 9,000 కోట్లు బ్యాంకులకు బకాయి పడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 2న దేశం విడిచి వెళ్లిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. మరో సంస్థ డయాజియో నుంచి లభించిన 40 మిలియన్ డాలర్లు కోర్టులో జమ చేసేదాకా మాల్యా మాటలు వినిపించుకోవాల్సిన అవసరమే లేదంటూ బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టులో వాదించారు. కోర్టు ధిక్కరణ అభియోగాలపై నోటీసులు జారీ అయిన దరిమిలా ఆయన న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్నారు. మరోవైపు, వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం తాము సిద్ధమని చెప్పినా బ్యాంకులు తమ ప్రతిపాదనను కనీసం పరిశీలించలేదని, ఎకాయెకిన తిరస్కరించాయని మాల్యా తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వన్ టైమ్ సెటిల్మెంట్ విధానాలు ఉంటాయి. వందల కొద్దీ రుణ గ్రహీతల ఖాతాలు సెటిల్ అవుతుంటాయి. మాకు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు‘ అని ఆయన ప్రశ్నించారు. -
పరిశీలనలో వన్‌టైం సెటిల్మెంట్
రుణమాఫీపై సీఎం హామీ ఇచ్చారన్న కడియం సాక్షి, హైదరాబాద్: రైతుల ఇబ్బందులు, సాగు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో రెండు రోజులపాటు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకముందే అనేక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారన్నారు. రుణమాఫీ వన్‌టైం సెటిల్మెంట్ను కూడా ప్రభుత్వం పరిశీస్తుందని, ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఏకమొత్తంలో చేసేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని సీఎం చెప్పారన్నారు. అయినా విపక్షాలు అర్థంపర్థం లేకుండా విమర్శలు చేస్తూ ఆందోళన చేయడమంటే రాజకీయం చేయడమేనన్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను విలేకరులు కడియం దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. గురువారం సచివాలయంలో కడియం విలేకరులతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరే గుండాలతో కొట్టిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ గూండాయిజం, రౌడీయిజం చేయలేదన్నారు. -
వన్‌టైం సెటిల్మెంట్కు విశేష స్పందన
రూ.3.07 కోట్ల బకాయిలు వసూలు చేసిన డీసీసీబీ హన్మకొండ : వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలు చెల్లించాలని డీసీసీబీ పాలకవర్గం ఇటీవల చేసిన ప్రకటనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా రూ.3.07కోట్ల మొండి బకాయిలు వసూలు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పేరుకుపోయిన దీర్ఘకాలిక రుణాల వసూళ్లకు డీసీసీబీ పాలకవర్గం గత డిసెంబర్లో వన్‌టైం సెటిల్మెంట్ పథకాన్ని చేపట్టింది. అయితే గతంలో బావుల వద్ద పైపులైన్లు వేసుకునేందుకు, ట్రాక్టర్ల కొనుగోలు, పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు డీసీసీబీ రైతులకు రుణాలు అందించింది. కాగా, 1992 సంవత్సరానికి ముందు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు చెల్లించకపోవడంతో పెద్దఎత్తున పేరుకుపోయాయి. దీంతో బకాయిలు బ్యాంకును నష్టాల్లో చూపిస్తున్నాయి. అయితే వాటిని ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనతో పాలకవర్గం, అధికారులు వన్‌టైం సెటిల్మెంట్కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్లో దీర్ఘకాలిక రుణాలు ఏక మొత్తంలో చెల్లించిన రైతులకు లాభం చేకూర్చేందుకు పథకాన్ని ప్రకటించారు. కాగా, డీసీసీబీలో 1992 నుంచి 700 మంది రైతులకు చెందిన రూ.8.08కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అయితే వాటిని తిరిగి వసూలు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్లో ఒకే మొత్తంలో రుణాన్ని చెల్లించిన వారికి 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతుల నుంచి స్పందన వచ్చింది. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తంలో 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతులు పాత బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. దీనికి తోడు డీసీసీబీకి చెందిన 26 ప్రత్యేక బృందాలు రైతులను నేరుగా కలిసి అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో సుమారు 300 మంది రైతులు తమ బకాయిలు రూ.3.07 కోట్లు చెల్లించారు. కాగా, ఒకేసారి బకాయిలు చెల్లించడం ద్వారా 35 శాతం కింద డీసీసీబీకి రూ.1.07 లక్షల మాఫీ ద్వారా లబ్ధి చేకూరింది. అలాగే రైతులకు ప్రయోజనం కలిగింది. -
సీనరేజి బకాయిలకు వన్‌టైం సెటిల్మెంట్
2,034 మంది బకాయిదారులు ఆరు నెలల గడువు మూడు కేటగిరీలుగా ఫీజు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సీనరేజి బకాయిల వసూలుకు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ప్రకటిం చింది. నిర్మాణ రంగానికి అవసరమైన భూగర్భ ఖనిజవనరుల అక్రమ వినియోగంపై భారీ జరిమానాలకు బదులుగా ఈ విధానం అమలు చేయనుంది. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఆరు నెలల పాటు అమల్లో ఉండే వన్ టైం సెటిల్మెంట్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఇసుక, మొరం, రాయి, కంకర, గ్రానైట్, సున్నపురాయి, బిల్డింగ్ స్టోన్.. ఖనిజ వనరుల తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తే జరిమానా తప్పదు. అదే నిబంధనల ప్రకారం అడ్డదారిలో వాటిని వినియోగించుకున్న బాధ్యులు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు.. వాటికి సంబంధించిన సీనరేజి ఫీజురశీదులు చూపించటం తప్పనిసరి. లేకుంటే సీనరేజితో పాటు.. అంతకు మించి అయిదు రెట్ల వరకు జరిమానా విధిస్తారు. చాలాచోట్ల కాంట్రాక్టర్లు నిర్మించిన భవనాలున్నాయి.. కానీ, అసలు యజమానుల వద్ద సీనరేజి చెల్లించినట్లు ఆధారాలేమీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ వింగ్ తనిఖీల్లో ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు బిల్డర్లు, కాంట్రాక్టర్లకు సంబంధించి విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ విభాగం పరిధిలో ఇటువంటివి 2034 కేసులు నమోదయ్యాయి. కేవలం 546 కేసులు కోర్టుల దాకా వెళ్లటంతో అప్పీళ్ల స్థాయిలో ఉన్నాయి. మిగతా పెండింగ్ కేసులు ఏకంగా రెవిన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయి. మధ్యేమార్గంగా ఈ కేసులన్నింటికీ వన్ టైం సెటిల్మెంట్ అవకాశం కల్పిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో సొంత గృహ నిర్మాణాలు, రెండో కేటగిరీలో చిన్న వ్యాపార వాణిజ్య సముదాయాలు (5000 చదరపు అడుగుల లోపు), అంతకు మించిన విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య సముదాయాలను మూడో కేటగిరీలో చేర్చారు. వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం మొదటి కేటగిరీకి చెందిన బకాయిదారులు సీనరే జి ఫీజు చెల్లించాలి. రెండో కేటగిరీలో సీనరేజితో పాటు అంతే మొత్తం జరిమానా, మూడో కేటగిరీకి చెందిన వారైతే సీనరేజిపై రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకుంటే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. -
‘స్వగృహ’కు బంపర్ ఆఫర్
వన్‌టైం సెటిల్మెంట్కు బ్యాంకుల అంగీకారం సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు బ్యాంకులు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. వన్‌టైం సెటిల్మెంట్ కింద సెప్టెంబర్ నాటికి ఏకమొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలని అంగీకరించాయి. అప్పుపై చెల్లించే వడ్డీని ఆరు శాతానికి తగ్గించేందుకు కూడా సరేనన్నాయి. బ్యాంకర్లతో మంగళవారం స్వగృహ కార్పొరేషన్ ఎండీ శ్రీధర్ జరిపిన భేటీలో ఈ ఒప్పందం కుదిరింది. వివరాలిలా ఉన్నాయి... స్వగృహ కార్పొరేషన్ గతంలో ఐదు బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,050 కోట్ల వరకు అప్పు తీసుకుంది. ఒక్కసారి రూ.350 కోట్ల వడ్డీని మాత్రం చెల్లించింది. ఆ తర్వాత చెల్లింపులు జరిపేందుకు నిధులు లేకపోవటంతో వడ్డీ పేరుకుపోవటం మొదలైంది. ప్రస్తుతం ఏడాదికి రూ.60 కోట్లకుపైగా వడ్డీ పడుతోంది. దీంతో గతంలో తాము చెల్లించిన రూ.350 కోట్లను అసలుగా భావించటంతోపాటు, ఇక వడ్డీ విధించకుండా ఉంటే... అప్పు మొత్తాన్ని ఏక కాలంలో చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం బ్యాంకులకు ప్రతిపాదించింది. కానీ ఇది అసాధారణంగా ఉందంటూ బ్యాంకులు తిరస్కరించాయి. ఇప్పుడు వడ్డీ-అసలు అని కాకుండా అన్నీ కలిపి రూ.వేయికోట్లుగా నిర్ధారించి... చెల్లింపు జరిపే వరకు వడ్డీని, ఇప్పటివరకు ఉన్నట్టుగా 11 శాతం కాకుండా 6 శాతంగా మాత్రమే పరిగణిస్తామని బ్యాంకులు చెప్పాయి.