సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సర్ చార్జీలు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ..
వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలకు మాత్రమే సర్ చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరీ్ణత సమయంలో బకాయిలను చెల్లించకపోతే సర్ చార్జీలు కట్టాల్సివస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరి్థకంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వినియోగదారులు బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment