LOCAL BODIES
-
చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్‌లాగే సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఘట్కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో ఆదివారం ఆయన ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివద్ధికి నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గాల తరఫున మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా నిధులు విడుదల చేయనందున మండల పరిషత్ కార్యలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశానన్నారు. నిధుల విడుదలపై చర్చ జరగాలనే సీఎం నేతృత్వంలోని సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎందుకంటే సీఎం సమావేశంలో చర్చించే అవకాశం తమకు రాదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తే చర్చ జరిగి నిధులు వస్తాయన్న నమ్మకం ఉందని, మూడేళ్లుగా మండల పరిషత్ సమావేశాల్లో చాయ్ డబ్బులు చెల్లిద్దామన్న నిధులు లేని దుస్థితి ఉందన్నారు. నిధులు విడుదలపై అధికారులు, మంత్రులు కూడా స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.379.34 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సహా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.379.34 కోట్లను కేంద్రం మంగళవారం విడుదలచేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలవారీగా జనాభా ప్రాతిపదికన 70 : 15 : 15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు కేటగిరీల గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. గతేడాది జూలైకు ముందు తొలి విడతగా కేవలం రూ. 969.51 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు ఆరి్థక సంవత్సరం ముగిసినా రెండో విడత నిధులివ్వలేదు. ఇలా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో విడతగా రూ. 969.51 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు బేసిక్ గ్రాంట్‌గా రూ.379.34 కోట్లు విడుదల చేసింది. మరో రూ.590.15 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాదికి రూ.2,010 కోట్లు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 2,010 కోట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం రెండు విడతల్లో నాలుగు భాగాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. చదవండి: ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు -
AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్మెంట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సర్ చార్జీలు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ.. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలకు మాత్రమే సర్ చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరీ్ణత సమయంలో బకాయిలను చెల్లించకపోతే సర్ చార్జీలు కట్టాల్సివస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరి్థకంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వినియోగదారులు బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
పోరు బాటలో స్థానిక ప్రజా ప్రతినిధులు.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధులు పోరుబాట పట్టారు. నిధులు, విధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. స్థానికసంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పంచాయతీరాజ్ ఫోరం ఆధ్వర్యంలో పోటీకి దిగాలని నిర్ణయిం చారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిచి రెండేళ్లు దాటినా రాష్ట్రప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అన్నిసీట్లలో పోటీ చేయ నున్నట్టు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు రెండేసి స్థానాలున్న జిల్లాల్లో ఒక ఓటు టీఆర్ఎస్కు, మరోఓటు సంఘానికి వేయాలని అధి కార పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ సంఘాలు పిలుపునిచ్చాయి. వివిధ జిల్లాల్లోని టీఆర్ఎస్ అసంతృప్త ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పలువురు మద్దతు తెలిపినట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, రంగా రెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తమ బలానికితోడు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కూడా మద్దతు తెలిపితే ఆయాస్థానాల్లో గెలుపొందడం ఖాయమని సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలతో ప్రాథమిక చర్చలు ముగియగా సూత్రప్రాయంగా వారు అంగీకరించినట్టు చెబుతున్నారు. విన్నవించుకున్నా ఫలితం శూన్యం ‘విధులు, నిధులు, బాధ్యతలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా మా డిమాండ్లపై ప్రభు త్వం నుంచి స్పందన లేదు. ఆత్మగౌరవం చంపుకోలేకే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిర్ణయించాం. మా ఓట్లు మాకే వేయించుకొని గెలిపించుకుంటాం. ఒకవేళ గెలవకపోయినా మా నిరసన ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతోనే బరిలో నిలుస్తున్నాం. అభివృద్ధికి నిధులివ్వలేదు. రూ.లక్ష కోట్ల మైనింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. టీఆర్ఎస్ ఎంపీటీసీలు బయటకు రాకపోయినా మాకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు’ అని సాక్షికి తెలంగాణ పంజాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సీహెచ్. సత్యనారాయణరెడ్డి తెలిపారు. మా ఓట్లను మాకే వేసుకొని.. నేను ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామ ఎంపీటీసీ సభ్యుడిని. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విధులు, నిధుల కోసం గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోవటంతో మా ఓట్లను మాకే వేసుకొని మా సమస్యలను మేమే సాధించుకోవాలని నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ చాంబర్ పక్షాన పోటీ చేస్తున్నాను. – కొండపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఫోరం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. మేం ఎంపీటీసీలుగా గెలిచి రెండున్నరేళ్లు కావొస్తున్నా నిధులు, విధులు లేవు. ఎంపీటీసీలకు ఎలాంటి ఆత్మ గౌరవం లేదు. మా హక్కుల సాధనకు సంఘం తరఫున ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం ఎంపీటీసీలను కనీసం పట్టించు కోలేదు. అందుకే మా సమస్యల పరిష్కారానికి మేమే పోటీచేయాలని నిర్ణయించాం. రంగారెడ్డి జిల్లాలో రెండుస్థానాలు ఉండటంతో టీఆర్ఎస్ ఎంపీటీసీలు సైతం ఒక ఓటు పార్టీ్టకి, మరొక ఓటు సంఘానికి వేసి మద్దతు తెలుపుతామన్నారు. – చింపుల శైలజ సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.581.7 కోట్లు
సాక్షి, అమరావతి: 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు టైడ్ గ్రాంట్ రూపంలో మొదటి విడతగా కేంద్రం మంగళవారం రూ.581.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం 70–15–15 నిష్పత్తిలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. నిబంధనల ప్రకారం.. టైడ్ గ్రాంట్ రూపంలో ఇచ్చే నిధులను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లు గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదల కార్యక్రమాలకు మాత్రమే ఖర్చుపెట్టాలి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేటాయించారు. అందులో బేసిక్ గ్రాంట్ మొదటి విడతగా రూ.387.80 కోట్లను ఇప్పటికే కేంద్రం విడుదల చేయగా, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు బదలాయించింది. ఇవీ చదవండి: ఏపీ మరో రికార్డు.. రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం -
పంచాయతీల మాదిరిగానే నిధులు, విధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్ట విధులు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్లోనే ఈ నిధులు కేటాయిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, పంచాయతీలు నిధులను వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందన్నారు. దీన్ని సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను క్రియాశీలం చేస్తామని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్లో స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విధులు, బాధ్యతలు... ‘స్థానిక సంస్థల బలోపేతం ప్రభుత్వ విధాన నిర్ణయం. దాన్ని అమలు చేస్తున్నం. ఇందులో ఆర్థిక సంఘం.. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్ యార్డులు, నర్సరీలు, వైకుంఠ ధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తం. వీటిని నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే జెడ్పీలు, ఎంపీపీలకు విధులు అప్పగించాలి. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జెడ్పీ చైర్ పర్సన్లతో నేనే స్వయంగా చర్చిస్తా. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటం. మొత్తంగా జిల్లా, మండల పరిషత్‌లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది’అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: (సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ) సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ఆ నిధులు వినియోగించుకోవచ్చు... ‘గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టినం. కానీ కొన్ని చోట్ల రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నరు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉంది. ఎవరి జోక్యం అక్కరలేదు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలి’అని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పీఆర్ కమిషనర్ రఘునందన్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదు. ఆ డబ్బును అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఖర్చు చేయాలి. ఈ సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) సాధించే దిశగా అడుగులు వేయాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ►మున్సిపాలిటీల ఉద్యోగుల జీత భత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్ నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులను శుభ్రం చేయాలి. డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలి. ►ఇందుకోసం స్వల్ప మొత్తంలో యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్ ఎం) మాత్రమే చార్జీలుగా వసూలు చేయాలి. ఎస్ఓపీ రూపొందించాలి ►మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వ్యయం ఎంత? జీతాల కోసం, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించండి. ►ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఎస్ఓపీ ఉండాలి ►ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థలకు నిధులొస్తున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థలకు శుభవార్త. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జిల్లా పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటా దక్కనుంది. 2015–20 వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు బదలాయించేది. వాస్తవానికి 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలకు పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి మంగళం పాడింది. ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి.. 100 శాతం నిధులను పంచాయతీలకే బదలాయించింది. మధ్యంతర నివేదిక ఆధారంగా.. 15వ ఆర్థిక సంఘం ఇటీవల కేంద్రానికి మధ్యంతర నివేదిక అందజేసింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847కోట్లు కేటాయించింది. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ సర్దుబాటు చేయనుంది. ఆర్థిక సంఘం నిధులకు సమానం గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను ఇస్తుందని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో రూ.1,847 కోట్లను రాష్ట్రం సర్దుబాటు చేస్తుం దని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా రూ.339 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తోంది. గతేడాది కంటే ఎక్కువే... వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం గతేడాది కన్నా రూ.396 కోట్లు అధికంగా ఇవ్వనుంది. రూ.1874 కోట్లను రెండు విభాగాలుగా ఖర్చు పెట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ పత్‌జోషి.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఇటీవల రాసిన లేఖలో సూచించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లోని తక్షణ అవసరాలకు ఖర్చు చేసేందుకు ఇందులో సగం నిధులను ఉపయోగించుకోవచ్చని, అయితే సిబ్బంది జీతభత్యాలకు మాత్రం ఈ నిధులు వెచ్చించొద్దని స్పష్టం చేశారు. మిగిలిన సగం నిధులు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ లాంటి పనుల కోసం ఉపయోగించాలని వెల్లడించారు. ఇక, గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల వారీగా పరిశీలిస్తే మొత్తం నిధుల్లో కనిష్టంగా 70 శాతం, గరిష్టంగా 85 శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయిస్తారు. మండల పరిషత్‌లకు అదే తరహాలో 10–25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5–15 శాతం నిధులివ్వనున్నారు. నిధుల్లేక.. నీరసపడి వాస్తవానికి, గతంలో గ్రామపంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా తలసరి గ్రాంటు కేటాయింపులు ఉండేవి. అయితే, 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి తలసరి నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే కేటాయించారు. దీంతో సీనరేజ్ సెస్, స్టాంపు డ్యూటీ వాటా, అరకొర సాధారణ నిధులు తప్ప జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల్లేక నీరసపడ్డాయి. కనీసం సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి కొన్ని జిల్లా పరిషత్‌లు వెళ్లిపోయాయి. ఇప్పుడు కేంద్రం నేరుగా గ్రామాలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరు చేయనుండటంతో ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ ఆ రెండు వ్యవస్థలు కళకళలాడనున్నాయి. -
నూతన చట్టం.. ఎవరికీ కాదు చుట్టం!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్, పంచాయతీ, మున్సిపల్, ఎస్సీ కార్పోరేషన్, మత్చ్యశాఖ, వ్యవసాయం, మార్కెటింగ్‌తో పాటు ఇతర శాఖలు కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చేవే. వీటన్నింటిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్యవేక్షణ జరుగుతుంది. ప్రభుత్వం ‘స్థానిక అభివృద్ధి’ వైపు దృష్టి సారించినందున స్థానిక సంస్థల ద్వారా జరిగే పనులన్నీ ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఉండాలని భావించి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్ట్ క్రియేట్ చేసింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పని చేస్తారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టడం, అవినీతి, అక్రమాలు జరగకుండా చూస్తారు. స్థానిక సంస్థల్లో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి రాబడి పెంచడం.. వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేయించడం వంటివి ఉంటాయని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం.డేవిడ్ అన్నారు. నూతన చట్టం ఎవరికీ చుట్టం కాదని, అక్రమాలకు పాల్పడితే చైర్మన్లనూ సస్పెండ్ చేసే అధికారం అధికారులకు ఉందని అంటున్న ఆయన.. సోమవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రధాన లక్ష్యం ఏమిటి.? అదనపు కలెక్టర్: స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియామకమైన కలెక్టర్ ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థలను బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపించడం. స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సక్రమంగా వినియోగించేలా కృషి చేయడం. వృథా ఖర్చులను తగ్గించడం.. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, చట్టాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయించడం.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ స్థానిక సంస్థల ద్వారా విజయవంతం చేయడం వంటివి ఉన్నాయి. సాక్షి:స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలపై ఎలా దృష్టి పెడతారు.? అదనపు కలెక్టర్: గ్రామ పంచాయతీలకు చాలా రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇంటి పన్ను వసూళ్లు నుంచి ఇసుక పెనాల్టీ వరకు అన్ని రాబడిని పెంచేవే. అయితే ఆ నిధులను దేనికి వినియోగిస్తున్నారనేది క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పంచాయతీలో ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సృష్టించి వచ్చిన నిధులు పంచాయతీకే వినియోగించేలా చూస్తాం. ఇక మున్సిపాలిటీల్లో కూడా ఆస్తి పన్ను వసూళ్ల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకు చాలా మార్గాలు ఉన్నాయి. పట్టణాల్లో కూడా కొత్త ఆదాయ మార్గాల ద్వారా రాబడిని పెంచేలా కృషి చేస్తాం. సాక్షి:అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అధికారాలు ఎలా ఉండనున్నాయి.? అదనపు కలెక్టర్: స్థానిక సంస్థల్లో అవినీతి అక్రమాలు జరగకుండా చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేయించడం. అవినీతికి పాల్పడితే విచారణ చేపట్టడం. అవినీతికి పాల్పడ్డారని తేలితే చిన్నస్థాయి అధికారి నుంచి మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ఇదంతా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం పంచాయతీరాజ్, మున్సిపల్ నూతన చట్టాల్లో స్పష్టంగా ఉంది. అందుకే లోకల్ బాడీస్‌పై అదనపు కలెక్టర్ పూర్తిగా దృష్టి సారించనున్నారు. సాక్షి:పచ్చదనానికి, పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుంది. ఇందులో మీరేలా ముందుకెళ్తారు.? అదనపు కలెక్టర్: నూతన చట్టం ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం నిధులు గ్రీనరీకి కేటాయించాలి. ఈ నిధులతో గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం తీసుకొస్తాం. నర్సరీల ద్వారా పెంచిన మొక్కలను ఖాళీ స్థలాల్లో నాటి వాటిని సంరక్షిస్తాం. పట్టణాల్లో ప్రస్తుతమున్న పార్కులను అభివృద్ధి చేస్తాం. లేని చోట కొత్తగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పచ్చదనంతోపాటు పరిశుభ్రతకు ప్రధాన్యతనిస్తాం. డ్రెయినేజీలోని మురుగునీరు రోడ్లపై రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తాం. ఈ పనులన్నీ గతంలో పల్లె ప్రగతిలో చేశాం. ఇప్పుడు పట్టణ ప్రగతిలో కూడా చేస్తాం. ఇవి గ్రామాల్లో, పట్టణాల్లో నిరంతరంగా కొనసాగే పనులు. సాక్షి:మున్సిపల్, పంచాయతీరాజ్ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం.? అదనపు కలెక్టర్: పంచాయతీరాజ్, మున్సిపల్ సమ్మేళనాలకు స్థానిక సంస్థల సభ్యులను ఆహ్వానించి వారికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. చట్టాల గురించి వారికి అవగాహన లేకుంటే అదనపు కలెక్టర్‌కు ఉండే హక్కులను హరించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, ఇతర స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన కల్పించి స్థానిక సంస్థలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సమ్మేళనాలు చేపడుతుంటారు. దీంతో స్థానిక సంస్థలకు చట్టాలపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. సాక్షి:పల్లెల్లో, పట్టణాల్లో మీ పర్యవేక్షణ ఎలా ఉండనుంది.? అదనపు కలెక్టర్: గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పూర్తి చేయించడం. పల్లెలు ప్రతి రోజు పరిశుభ్రత పాటించే విధంగా చూడడం. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, నర్సరీల్లో మొక్కలు పెంచడం, నాటిన మొక్కలు సంరక్షించడంపై దృష్టి సారిస్తాం. ప్రభుత్వం టాప్ ప్రయార్టీగా తీసుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయించడం, ట్యాక్స్ వసూలు, అభివృద్ధి పనులు, ప్రజలందరికీ మంచినీరు సరఫరా, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ఖర్చు, మిగులు వంటి వివరాలను ప్రభుత్వానికి నివేదించడం లాంటివి జరుగుతాయి. పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలు, తాగునీరు, రోడ్లు, మురికి కాలువల శుభ్రం, వీధి దీపాలు, భవన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులివ్వడం, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కాపాడడం, అక్రమ లే అవుట్లపై నిఘా సారించి చర్యలు తీసుకోవడ, పచ్చదనం, పరిశుభ్రత లాంటి తదితర వాటిపై పర్యవేక్షణ ఉంటుంది. -
నూతన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎర్రబెల్లి సందేశం
సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లకు, వైస్ చైర్పర్సన్లకు, జెడ్పీటీసీలకు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారికి ఓ సందేశాన్ని పంపారు. ‘బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారు. సుస్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, హరిత హారం వంటి బృహత్తర ప్రాజెక్టులను చేపట్టారు. ఆదాయం పెంచాలి-పేదలకు పంచాలి అనే నినాదంతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీపై కీలక బాధ్యత ఉంది. మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా సీఎం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. స్థానిక సంస్థల పునర్విభజనతోపాటు వాటికి ఎన్నో అధికారాలను, బాధ్యతలను అప్పగించారు. పాలనలో జవాబుదారీతనం పెంచేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మీరు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ... అందరికీ శుభాకాంక్షలు' అని మంత్రి దయాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన కేబినెట్ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్ సిద్ధూకు, త్రిప్త్ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్ప్రీత్ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు. నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పటియాలా, ఎస్ఏఎస్నగర్ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు. నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు. -
ముగిసిన తెలంగాణ రెండో విడత పరిషత్ ఎన్నికలు
-
అభ్యర్థులకోసం అన్వేషణ
సాక్షి, యాదాద్రి : నూతన పంచాయతీల ఏర్పాటు కొలిక్కిరావడంతో పాటు కొత్త పంచాయతీరాజ్ చట్టం గెజిట్ విడుదల, ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధి కార యంత్రాంగానికి ఆదేశాలు అందిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు పల్లెపోరుకు సమాయాత్తం అవుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకోసం యంత్రాంగం కసరత్తు చేస్తుండడంతో ఆయా పార్టీల్లో జోష్ నెలకొంది. భవిష్యత్ వ్యూహంపై క్షేత్రస్థాయిలో కేడర్ బలోపేతానికి తమ కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో ఎన్నికల బరిలో నిలిపేందుకు సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. మరో వైపు స్థానిక సీట్లపై కన్నేసిన నాయకులు ఆయారామ్ గయారామ్ అవుతున్నారు. ప్రధాన పార్టీల్లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు జిల్లాలో ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల ప్రాతినిథ్యం కూడా ఉంది. వీటి పరిధిలో 16 మండలాలు విస్తరించి ఉన్నాయి. ఆయా మండలాల్లో కొత్తవి, పాతవి కలుపుకుని మొత్తం 401 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 401 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆగస్టు 1వ తేదీతో పాలకవర్గాల పదవీ కాలం ముగి యనుంది.ఈ లోపే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో యం త్రాంగం కూడా అందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీ ఐ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీతో పాటు తెలంగాణ జన సమితి వంటి పార్టీలు స్థానిక ఎన్ని కల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించా యి. ఆయా వ్యక్తుల గుణగణాలు, కులం, మతం, డబ్బు, స్థానిక ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ఎదుటి పార్టీ అభ్యర్థిని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తున్నాయి. అయితే ఈసారి గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నం దున అం దుకు అనుగుణంగా తమ అభ్యర్థిని రంగంలో దింపే పనిలో ఆయా పార్టీ ల నేతలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇటీవల జిల్లాలోని ఓ ప్రధాన రాజకీ య పార్టీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించా ల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఆయా పార్టీల నేతలకు సవాల్‌గా మారింది. సర్పంచ్‌లే కీలకం సహజంగా సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందాలంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ తరఫునైనా మెజార్టీ సర్పంచ్‌లు ఉంటే సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీలుగా అలవోకగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు విజయం సాధిస్తారు. ఇందుకోసం తమ ముఖ్య అనుచరులను గెలిపించుకునే దిశగా ప్రధాన పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ఆశావహుల్లో హుషార్.. సర్పంచ్ కావాలని కలలు కంటున్న స్థానిక నేతల్లో హుషారు పెరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తుండడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంచుకోవడానికి అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ తమ పలుకుబడి పెంచుకునే యత్నం చేస్తున్నారు. విందు, వినోదాలు, విహారయాత్రలు, ఆర్థిక సాయం చేయడానికి సైతం వెనుకాడడం లేదు. ఇదే క్రమంలో తమ పార్టీల పెద్దలను సీటు సంపాదించే పనిలో పడ్డారు. ఏది ఏమైనా స్థానిక సంస్థలకు త్వరలో జరగబోయే ఎన్నికలు స్థానిక నాయకుల కంటే ప్రధాన పార్టీలకే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. -
పట్నం బాబుల పాలిట్రిక్స్
ఉద్యోగం, వ్యాపారం ఇతర కారణాలతో పల్లెలను వదిలి పట్టణాల్లో స్థిరపడ్డ వారు మళ్లీ ఉన్న ఊరిపై మమకారం పెంచుకుంటున్నారు. ఆర్థికంగా బలపడడంతో వారి కన్ను ఇప్పుడు స్థానిక రాజకీయాలపై పడింది. ఇంకేముంది.. డబ్బు సంచులతో గ్రామాల్లో దిగిపోతున్నారు.లోకల్ పవర్ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విందులు, బేరసారాలు.. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి పట్నం బాబుల రాకతో పల్లె రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో పట్నం బాబుల్లో కదలిక మొదలైంది. రాజధానిలో ఉండి ఆర్థికంగా బలపడిన వారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రేటర్‌కు పొరుగునే ఉండడం.. వచ్చివెళ్లడానికి అంత కష్టమైన పనేమీ కాకపోవడంతో పదవీ కాంక్ష పెంచుకుంటున్నారు. అదే లక్ష్యంగా ముందస్తుగానే గ్రామాలకు చేరుకుని జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విందులు, బేరసారాలు ఇస్తున్నారు. ఎంత డబ్బయినా ఖర్చు పెడుతామంటూ ఎక్కడికక్కడ సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా జరుగుతున్న గ్రామీణ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇంతకాలం హైదరాబాద్ నగరంలో ఓటరుగా ఉన్న వారు.. ప్రస్తుతం గ్రామాల్లో ఓటు హక్కు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాగా వేయడమే లక్ష్యంగా.. జిల్లాలో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. అదనంగా మరో 100 వరకు నూతన పంచాయతీలు, ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ పంచాయతీలకు స ర్పంచ్‌లు, వార్డు సభ్యులను, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్లను, కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. ఇందుకోసం సర్పంచ్‌లు, నగర, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులుగా, కౌన్సిలర్లుగా గెలిస్తే ఎం త డబ్బు ఖర్చు చేసైనా పాగా వేయొచ్చనే లక్ష్యంతో పట్నం బాబులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వార్డుల వారీగా ఓటర్లు, ప్రస్తుతం ఉన్న జనా భా, కులం, మతం, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి కోసం చేయాల్సిన ఖర్చు తదితర అంశాలపై లెక్కలు గడుతున్నారు. పదవికోసం కొందరు.. ఉన్నవారికి సేవ చేసేందుకు మరికొందరు.. ప్రధానంగా జీవనోపాధి, ఉద్యోగం, విద్య, వ్యాపారం నిమిత్తం పల్లెలను వదిలిన పలువురు పట్టణాల్లో ఆర్థికంగా బలపడ్డారు. వీరిలో కొందరు మాతృభూమికి సేవ చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం స్థానిక సంస్థల్లో పవర్ సాధించడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారం కోసం పావులు కదుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజధాని హైదరాబాద్‌కి పొరుగునే ఉండడడంతో పట్నం బాబులు, పల్లెలకు వచ్చి వెళ్లడం చాలా సులువుగా ఉంటుంది. ముమ్మరంగా సాగుతున్న కసరత్తు.. మరోవైపు అధికార యంత్రాంగం నూతన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. నూతన గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు సంబంధించిన భౌగోళిక మ్యాప్‌లు, వాటి ఆదాయ, వ్యయాలు, ఓటర్ల విభజన, ఆస్తులను విభజన చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈనెల 25వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో అధికారులు ముందుకు సాగుతున్నారు. -
విధులు-నిధులు-చర్యలు
-
విధులు-నిధులు-చర్యలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలకంగా పనిచేసేలా కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో విఫలమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై అవగాహన, అనుభవం కలిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. చట్టం తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయానంద్, తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెట్ కన్సల్టెంట్ జి.జయపాల్‌రెడ్డి, కన్సల్టెంట్లు శంకరయ్య, లింబగిరి స్వామి, ఎన్జీవో ప్రతినిధులు ఎ.పి. రంగారావు, బాలాజీ ఊట్ల తదితరులను ముఖ్యమంత్రి ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ఎలా ఉండాలి? స్థానిక సంస్థలకు ఎలాంటి విధులు అప్పగించాలి? వారు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి? నిధులు ఎలా సమకూర్చాలి? ప్రజలకు మరింత జవాబుదారీగా, మరింత క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 13 వేల వరకు చేరనున్న పంచాయతీలు రాష్ట్రంలో త్వరలోనే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడతాయని, దాంతో పంచాయతీల సంఖ్య 12–13 వేలు దాటుతుందని సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు విధులు, బాధ్యతలు లేకుండా ఉన్నాయని.. అవి నామమాత్రంగా కొనసాగడానికి వీల్లేదని చెప్పారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వేల కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అవన్నీ ప్రజలకు నూటికి నూరు శాతం చేరాలంటే స్థానిక సంస్థలు బాగా పనిచేయాలి. ఏ గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇవన్నీ ప్రజలకు చేరుతాయి. ఇప్పుడున్న విధానం కొనసాగితే ప్రయోజనం లేదు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ప్రమాదంలో ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏజన్సీలుగా ఉన్న పంచాయతీలు, స్థానిక సంస్థలు రానురాను రాజకీయపరమయ్యాయి. ఇప్పడు సమూలంగా మార్పు రావాలి. గ్రామ పంచాయతీలను శక్తివంతం చేయాలి. ప్రతి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. ప్రతి గ్రామం మారితేనే యావత్ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అందుకే గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వర్తించాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? అనే విషయంలో పూర్తి స్పష్టతనిస్తూ కొత్త చట్టం తయారు కావాలి. సర్పంచ్ల తరహాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా విధులు, బాధ్యతలపై స్పష్టత రావాలి..’’అని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో నిధులు.. కేవలం విధులు, బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంటే గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పని చేయలేవని సీఎం కేసీఆర్ చెప్పారు. వాటికి కావాల్సినన్ని నిధులు అందించాలని, వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు వాటి జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తామని... కేంద్ర నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే నిధులన్నీ గ్రామ పంచాయతీలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు శ్రమదానం ద్వారా పనులు చేసుకునే ధోరణిని అలవాటు చేయాలన్నారు. స్థానిక సంస్థలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అన్ని విధాలా సహకారం అందించినా... విధుల నిర్వహణలో విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలని చెప్పారు. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తయారు కావాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు నిర్ణీత కాల పరిమితి ప్రకారం వచ్చే ఏడాది పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ ఎన్నికలు పూర్తవగానే సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని.. విధులు, నిధులు, అధికారాలు, బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ‘‘ఎవరి గ్రామ అభివృద్ధి ప్రణాళికను వారే తయారు చేసుకునేలా తర్ఫీదునివ్వాలి. ఆ గ్రామానికున్న అవసరం ఏమిటి, భవిష్యత్తులో వారికి ఇంకా ఏమవసరం.. వంటి అంశాలను బేరీజు వేసుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో చాలామందికి మంచిపేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. వారిని ప్రోత్సహించి, అవకాశం కల్పించేలా ప్రభుత్వ విధానం ఉండాలి..’’అని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కోవ లక్ష్మి, రవీందర్‌నాయక్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పంచాయతీలపై ప్రతిపాదనలు రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు కోరుతూ లేఖలు రాయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గిరిజన తండాలు, గోండు, కోయ గూడేలు, చెంచు పల్లెలతో పాటు ప్రధాన గ్రామానికి దూరంగా ఉన్న పల్లెలు, గూడేల వివరాలు సేకరించాలని సూచించారు. 500 మందికిపైగా జనాభా ఉన్న ఆవాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించినందున.. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించాలని స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు
- నేడు వెలువడనున్న నోటిఫికేషన్ - నేటి నుంచే నామినేషన్ల పర్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీటీసీ స్థానాలు, 16 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 133 వార్డుసభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనుంది. నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి స్పష్టం చేశారు. నామినేషన్లు శనివారం నుంచి స్వీకరించనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండ లం పహాడీషరీఫ్ గ్రామ పంచాయతీకి ఈనెల 13న, వరంగల్ జిల్లా నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డుకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయా స్థానాల్లో ఎన్నికల నియమా వళి తక్షణమే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. -
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ!
- రిటర్నింగ్ అధికారిగా జేసీ హరికిరణ్ - 9 మంది ఎమ్మెల్యేలకు ఓటర్లుగా అవకాశం - ఈ నెల 21న నోటిఫికేషన్ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ వ్యవహరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలయింది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21ను జారీ కానుంది. ఆదే రోజు నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి1 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3వరకు అవకాశం ఉంటుంది. మార్చి 17న పోలింగ్ జరుగుతుంది. కాగా.. గతంలో జరిగిన ఎన్నికలకు కూడ జేసీనే రిటర్నింగ్ అధికారిగా ఉండి సమర్థవంతంగా నిర్వహించారు. మరోసారి కూడా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలను రిటర్నింగ్ అధికారి హోదాలో జేసీ నిర్వహించనున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు.. స్థానిక సంస్థల నియోజకవర్గంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉన్నందున వీరు కూడ ఓటర్లుగా ఉంటారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగనందున కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలకు ఓటు లేకుండా పోయింది. మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేనందున సంబంధిత ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉండటం, వాటిల్లో ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉండటం వల్ల ఓటర్లుగా ఉంటున్నారని తెలిపారు. ఎంపీలకూ అవకాశం.. మున్సిపాలిటీల్లో ఎంపీలు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉంటారు. దీంతో వారు కూడా ఓటర్లు ఉంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వీరు ఏదో ఒక మున్సిపాలిటీలో మాత్రమే సభ్యులుగా ఉండాలి. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు నగరపాలక సంస్థలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఎన్నికలు జరుగకపోవడంతో ఎంపీ ఓటరుగా అర్హత పొందలేకపోయారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికారులు తెలిపారు. నంద్యాల ఎంపీ మాత్రం స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటరుగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ఓటర్ల జాబితాను తయారు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. -
‘ఒప్పంద’ సెగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ‘ఒప్పంద’ సెగలు రగులుతున్నాయి. ఎన్నికల ముందు ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్ సహా పలు పదవులకు రెండున్నరేళ్లు ఒకరిని, మిగిలిన కాలానికి మరొకరిని నియమించేలా ఒప్పందాలు కుదిరాయి. రెండున్నరేళ్లు గడిచినా పదవుల్లో ఉన్నవారు తప్పుకోకపోవడంతో వారితో రాజీనామాలు చేయించేందుకు పార్టీ ముఖ్యులు సామదాన దండోపాయల్ని ప్రయోగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల పెనుగొండ ఎంపీపీ వివాదం తెరపైకి రాగా.. తాజాగా ఏలూరు ఎంపీపీ, జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఒప్పందాలు టీడీపీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. కుదరదంతే.. పెనుగొండ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు పల్లి జూలీ సురేఖ ససేమిరా అనడంతో తెలుగుదేశం పార్టీలో వివాదం రాజుకొంది. ఎంపీపీ పదవికి మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖ, అనంతరం చీకట్ల భారతి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. ఈ ప్రకారమే ఎన్నికల ఖర్చును ఇద్దరూ భరించాలని పెద్ద మనుషులు తీర్మానం చేయించారు. సురేఖ పదవీ కాలం జనవరి 4వ తేదీతో ముగిసింది. అయితే, డిసెంబర్ నెలలోనే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలసిన సురేఖ తాను ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. ఏలూరు ఎంపీపీ రాజీనామా విషయంలో ఎంపీపీ భర్త, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినటయగా పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించే స్థాయికి ఈ వివాదం వెళ్లింది. చింతమనేని ప్రభాకర్ ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు రూ.40 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. ‘దెందులూరు నియోజకవర్గంలోని అమాయక ప్రజల భయపడతారు కానీ.. ఏలూరు నగరంలో నీ ఆటలు సాగవు’ అంటూ చింతమనేనిని బహిరంగంగా హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవహారం కూడా ముదురుతోంది. ఈ పదవి కేటాయింపు విషయమై కుదిరిన ఒప్పందంలో తొలి గడువు ముగియడంతో.. వైఎస్ చైర్మన్ ఎన్నిక తెరపైకి వచ్చింది. 2014లో జెడ్పీ చైర్మన్ పదవి ముళ్లపూడి బాపిరాజుకు ఏకగ్రీవం అయినప్పటికీ ఉపాధ్యక్ష పదవిలో పోటీ ఏర్పడింది. ఈ పదవిని వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా జెడ్పీటీసీకి కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆకివీడు, బుట్టాయగూడెం జెడ్పీటీసీలు వైస్‌చైర్మన్ గిరీకోసం పోటీ పడ్డారు. మెట్ట ప్రాంతానికి చైర్మన్ పదవి వచ్చినందున, డెల్టా ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని అక్కడి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. 2014 జనవరి 4న ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలనే దానిపై చర్చించారు. చర్చల్లో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పట్టుదలతో రెండున్నరేళ్లు ఒకరికి, మరో రెండున్నరేళ్లు పదవిని కట్టబెట్టేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తన అనుచర వర్గానికి చెందిన బుట్టాయగూడెం జెడ్పీటీసీ చింతల వెంకట రమణకు పదవిని కేటాయించారు. ఈ ఏడాది జనవరి 5 తేదీ నాటికి ఆమె వైస్ చైర్మన్ పదవి చేపట్టి రెండున్ననేళ్లు పూర్తయ్యింది. దీంతో ఆకివీడుకు చెందిన జెడ్పీటీసీ మన్నే లలితాదేవి జెడ్పీ వైస్ చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఒప్పందం ప్రకారం తనకు రెండున్నరేళ్ల అనంతరం పదవిని కేటాయిస్తానని అప్పట్లో మాట ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రస్తుత జెడ్పీ వైస్ చైర్మన్ రాజీనామా చేయకపోవడంతో ఈ వ్యవహారం పార్టీలో ముసలం రేపే పరిస్థితి కనిపిస్తోంది. -
ఐక్యత గెలిపించింది... విభేదాలు ఓడించింది
(వెబ్ ప్రత్యేకం) ఐక్యంగా పనిచేసిన చోట కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వర్గ విభేదాలతో సతమతమవుతున్న చోట కాంగ్రెస్ ఓటమి పాలైంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశం స్పష్టంగా రుజువైంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ లోని బలం, బలహీనతలు బయటపడ్డాయి. నల్గొండలో... రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడులైనప్పటి నుంచి అందరి దృష్టి ప్రధానంగా ఈ రెండు జిల్లాల పైనే పడింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ మొదటి నుంచి తన హవా కొనసాగించినప్పటికీ ఈ రెండు జిల్లాల్లో సాధ్యపడలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ వలసలను ప్రోత్సహించినప్పుడు నల్గొండ వాటిని నిలువరించడంలో కాంగ్రెస్ నేతలు విజయం సాధించారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకోవడంతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ నేతలను ఒక్కతాటిపై ఉంచడంలో సక్సెస్ అయ్యారు. నల్గొండలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో కాంగ్రెస్ కు చెందిన ఒక అభ్యర్థి రెబెల్ గా రంగంలో నిలిచారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి తేవడంలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల (సర్పంచు, ఎంపీటీసీ, జేడ్పీటీసీ) నుంచే కింది స్థాయి వరకు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి చేసిన కృషి, మొదటి నుంచి ఆయన కొనసాగించిన వ్యక్తిగత సంబంధాలు ఈ ఎన్నిక సందర్భంగా ఆయనకు కలిసొచ్చింది. జిల్లా నేతలతో సఖ్యత ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచే రాజగోపాల్ రెడ్డి స్వయంగా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేతలందరినీ ఒప్పించడంలో విజయం సాధించారు. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డిలతో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి ముఖ్య నేతలందరినీ కలుపుకుని పనిచేయడం రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఓటమి పాలైతే పార్టీ పరువు పోతుందన్న ఆ నేతల అభిమతం కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దోహదం చేసింది. మరోవైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీకి చెందిన ఓటర్లందరినీ చివరి వరకు కాపాడుకోవడంలో తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అంతర్గత విబేధాలతో రంగారెడ్డిలో కాంగ్రెస్ కుదేల్ రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు లు విజయం సాధించారు.తొలి రెండు ప్రాధాన్యతా ఓట్లలోనూ రెండో అభ్యర్థి రాజు గెలవలేకపోయారు. మూడో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తే తప్ప టీఆర్ఎస్ అభ్యర్థి బయటపడలేకపోయారు. కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై ఉండి ఉంటే పోటీ చేసిన ఒక్క స్థానాన్ని సులభంగా గెలుచుకునేది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థి గెలుచుకోగలిగినన్ని ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి. జిల్లాలో ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని అనుకున్న కాంగ్రెస్ నేతలు చివరి దశలో పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతలు సుధీర్ రెడ్డి, కే లక్ష్మారెడ్డి (కేఎల్లార్), చంద్రశేఖర్, ప్రసాదరావు, మల్ రెడ్డి రంగారెడ్డి ఇలా నాయకులంతా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేని కారణంగా ఎమ్మెల్సీ స్థానాన్ని చేజార్చుకున్నారు. హైకమాండ్ ధోరణితో... ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ జిల్లా నేతలను సంప్రదించకుండా, చివరి నిమిషంలో ప్రకటన చేయడం కూడా పార్టీ నేతలకు రుచించలేదు. ఈ జిల్లా నుంచి ముందు టికెట్ ఎవరికి ఇవ్వాలన్న సమస్య ఉత్పన్నమైనప్పుడు సబితా ఇంద్రారెడ్డి పేరు తొలి వరుసలో నిలిచింది. ఆ తర్వాత కేఎల్లార్ లేదా సుధీర్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్ ల పేర్లు తెరమీదకొచ్చాయి. ఈ తరుణంలో ఎవరికి టికెట్ ఇచ్చినా పరస్పరం సహకరించుకోవాలని భావించారు. మొదట్లో అంగీకరించినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తే మద్దతునిస్తానన్న కేఎల్లార్ ఉన్నట్టుండి రూటు మార్చారు. జిల్లాలో సబిత ప్రాభవం పెరుగుతుందని భావించిన కేఎల్లార్ వ్యూహాత్మకంగా చంద్రశేఖర్ అభ్యర్థిత్వం వైపు మొగ్గారు. చంద్రశేఖర్ ను నిలిపితే ఓకే అన్నారు. చంద్రశేఖర్ అభ్యర్థిత్వం తెరమీదకు రావడంతో మరో నేత మాజీ ఎమ్మెల్యే ప్రసాదరావుకు మింగుడు పడలేదు. ఎమ్మెల్సీగా గెలిస్తే భవిష్యత్తులో తన రాజకీయ భవితవ్యానికి గండి పడుతుందన్న భావనతో చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ స్థానం నుంచి ఎవరిని పోటీ నిలపాలని పీసీసీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్న సమయంలో కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పారు. ఉన్నట్టుండి హైకమాండ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అప్పటివరకు చర్చోపచర్చల్లో మునిగితేలుతున్న పీసీసీ నాయకులకు ఎటూ పాలుపోని పరిస్థితి తలెత్తింది. హైకమాండ్ అభ్యర్థిని ఫైనల్ చేసిన రోజు నుంచి నాయకులు ఎవరికి వారే అన్న చందంగా పట్టీపట్టనట్టు వ్యవహరించారు. సొంత ఓట్లను కాపాడుకోవడానికి క్యాంపులు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. మరీ ముఖ్యంగా ప్రసాదరావు పూర్తిగా టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ మద్దతిచ్చినా.. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకస్థానంలో గెలుచుకునే ఓట్లతో పాటు టీడీపీ సైతం మద్దతునిచ్చినా కాంగ్రెస్ రెండో స్థానం గెలుచుకోలేకపోవడం విశేషం. టీడీపీకి చెందిన రెండో ప్రాధాన్యత ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలని ఆ పార్టీ నిర్ణయించగా, కాంగ్రెస్ లోని కలహాలు టీడీపీని సైతం బేజారెత్తించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనూ కాంగ్రెస్ నేతలెవరూ పెద్దగా కనిపించకపోవడం టీడీపీ నేతలకు అంతుబట్టని విషయం. దానం జోక్యం కూడా.. జిల్లా నేతలందరూ ఎమ్మెల్సీ ఎన్నికలపై తర్జనభర్జన పడుతున్న సమయంలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో జోక్యం చేసుకోవడం కూడా ప్రతికూల ఫలితానికి ఒక కారణంగా మారింది. గ్రేటర్ ఎన్నికల పేరుతో దానం రంగారెడ్డి జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై జిల్లాలోని పలువురు ముఖ్య నేతలకు ఏమాత్రం మింగుడుపడలేదు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలను పక్కనపెట్టి ముఖ్య నేతలు మకాం ఢిల్లీకి మార్చారు. దానం జోక్యమేంటని హైకమాండ్ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో తమ ఓటర్లను క్యాంపులకు తరలించడం వంటి కార్యక్రమాలను వదిలేసి ఢిల్లీకి వెళ్లడంతో ఆ ఓటర్లందరినీ టీఆర్ఎస్ తనవైపు తిప్పుకోవడానికి వీలు కల్పించినట్టయింది. కొసమెరుపు... దానం నాగేందర్ ఇదే తరహాలో తమ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. -
నల్లగొండ బరిలో నువ్వా నేనా..
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేతులెత్తేశాయి. నిన్నమొన్నటి వరకు హడావిడి చేసిన పార్టీలు అనేక చోట్ల అసలు నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 12 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ అన్నింటికీ నామినేషన్లు వేసింది. మిగతా పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేదు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. నల్లగొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలైనా ఆ ప్రభావం కాంగ్రెస్ పై ఉండదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా పెంచాల్సి ఉన్న నేపథ్యంలో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల్లో అదనంగా ఒక్కో స్థానాన్ని పెంచిన విషయం తెలిసిందే. మొత్తంగా 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఈ స్థానాలన్నీ గతమే ఒకటి నుంచి ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. 12 వ తేదీ వరకు ఉపసంహరణకు గడువుంది. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. బరిలో నిలిచింది వీరే... రంగారెడ్డి (2 స్థానాలు): పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), శంభీపూర్ రాజు (టీఆర్ఎస్), ఎ. చంద్రశేఖర్ (కాంగ్రెస్), దారా సింగ్ (కాంగ్రెస్), బుక్కా వేణుగోపాల్ (టీడీపీ), కొత్త అశోక్‌గౌడ్ (ఎంపీటీసీల ఫోరం). కరీంనగర్ (2 స్థానాలు): నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్), భానుప్రసాదరావు (టీఆర్ఎస్), మునిపాక తిరుపతిరావు (స్వతంత్ర), ముద్దసాని రంగయ్య (స్వతంత్ర), తాటిపాముల రాజు (స్వతంత్ర), ముత్యాల ప్రియారెడ్డి (స్వతంత్ర), సిరిసిల్ల ప్రసాద్ (స్వతంత్ర). మహబూబ్‌నగర్ (2 స్థానాలు): ఎస్.జగదీశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్), కె.నారాయణరెడ్డి (టీఆర్ఎస్), కె.దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), కె.దయాకర్‌రెడ్డి (టీడీపీ), కె.శ్రీనివాసాచారి (స్వతంత్ర), బోళ్ల కరుణాకర్ (స్వతంత్ర), జగదీశ్వర్‌రెడ్డి (స్వతంత్ర). ఆదిలాబాద్ (1 స్థానం): పురాణం సతీష్‌కుమార్ (టీఆర్ఎస్), రియాజుద్దీన్ (ఎంపీటీసీల ఫోరం), ఐ.నారాయణ రెడ్డి (టీడీపీ), నల్లగొండ (1 స్థానం): తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్), సాదినేని శ్రీనివాసరావు (టీడీపీ), మిట్ట పురుషోత్తమరెడ్డి (స్వతంత్ర). నిజామాబాద్ (1 స్థానం): ఆర్.భూపతిరెడ్డి (టీఆర్ఎస్), కె.వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్), బి.జగదీష్ (ఎంపీటీసీల ఫోరం). ఖమ్మం (1 స్థానం): బాలసాని లక్ష్మీనారాయణ (టీఆర్ఎస్), పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ), లింగాల కమల్‌రాజ్ (వైఎస్సార్సీపీ), జి. లక్ష్మీనారాయణ (స్వతంత్ర), కె.లక్ష్మీనారాయణ (స్వతంత్ర). వరంగల్ (1 స్థానం): కొండా మురళి (టీఆర్ఎస్) మహబూబ్ రెడ్డి (స్వతంత్ర), చంద్రమౌళి (స్వతంత్ర), మోడెం మల్లేష్ (స్వతంత్ర), ఎ.నరేందర్‌రెడ్డి (టీడీపీ), రంగరాజు రవీందర్ (స్వతంత్ర). మెదక్ (1 స్థానం): వి. భూపాల్‌రెడ్డి (టీఆర్ఎస్), శివరాజ్ పాటిల్ (కాంగ్రెస్) , కొన్యాల బాల్‌రెడ్డి (టీడీపీ). -
కాంగ్రెస్, టీడీపీలు ఏకమై...
టీపీసీసీ నేతలతో టీటీడీపీ నాయకుల సమావేశం హైదరాబాద్ శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు... రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దశాబ్దాల కాలంగా బద్ధశత్రువులైన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనడానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని పరస్పరం ప్రతిపాదించాయి. తెలంగాణ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 2 న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం స్థానాలను గెలుచుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఘోర పరాభవం నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొత్త పొత్తులపై దృష్టి సారించాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న ప్రాతిపదికన కొన్ని సీట్లను గెలుచుకోవడానికి కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ముందు ప్రతిపాదించారు. తెలంగాణ పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సోమవారం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు కలిసి ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై వారు కొద్దిసేపు చర్చలు జరిపినట్టు తెలిసింది. కలిసి పనిచేయడం వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించవచ్చని, అందుకు ఒక అంగీకారానికి రావాలని టీడీపీ నేతలు కోరారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 9వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతోంది. డిసెంబర్ 27న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నందున రెండింటిలో మహబూబ్‌నగర్ స్థానంలో తమకు మద్దతునివ్వాలని టీటీడీపీ నేతలు కోరినట్టు తెలిసింది. ఇదే అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నేతలను సంప్రదించగా, వారు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. దాంతో ఏం చేయాలో నేతలకు పాలుపోలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజులు గడువు ఉన్నందున మంగళవారం మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్టు తెలిసింది. -
తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను సర్ధుబాటు చేస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి,మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్ధానం పెరిగింది. విభజన చట్టంలో తెలంగాణకు 40 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారు. వాటిలో 14 స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటా ఉండాల్సి వుండగా ప్రస్తుతం కేవలం 11 ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే వున్న నేపథ్యంలో 3 స్థానాలను పెంచారు. త్వరలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
స్థానిక సంస్థలకే నిర్ణయాధికారం!
- కార్మికుల వేతనాలపై నిర్ణయం మున్సిపాలిటీలదే - సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం - 3 శ్లాబుల్లో వేతనాలు.. సీలింగ్ ఖరారుకే సర్కారు పరిమితం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాధికారాన్ని మున్సిపాలిటీలకే వదిలేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలవారీగా కార్మికులకు పెంచాల్సిన వేతనాలపై సీలింగ్‌ను మాత్రం ప్రభుత్వమే నిర్ణయించనుంది. సీలింగ్ గరిష్ట అవధికి మించకుండా, కనిష్ట అవధికి తగ్గకుండా వేతనాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలకే సర్కారు కట్టబెట్టే అవకాశాలున్నాయి. పురపాలక శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగర, పురపాలికలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 వరకూ చిన్న, మధ్యతరహా పురపాలికలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాయి. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ప్రస్తుతం వేతనాలనూ సక్రమంగా చెల్లించలేకపోతున్నాయి. వరంగల్, కరీంనగర్ వంటి నగరాలు, పట్టణాలు మినహా ఇతర మున్సిపాలిటీల పరిస్థితి బాగాలేదు. ఆస్తి, ఇతర పన్నులు, లెసైన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రంగా ఉంటే, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. కార్మికుల వేతనాలు పెంచాలంటే.. ఆస్తి పన్నుల పెంపు తప్పా మరో దారి లేదని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో పురపాలికల ఆర్థిక స్థితిగతులపై తెప్పించుకున్న వాస్తవిక నివేదిక ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది. వేతనాల పెంపు డిమాండ్‌తో మున్సిపల్ కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎట్టకేలకు సమ్మె విరమించడంతో వేతనాల విషయంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం తాత్కాలిక కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 వేతనాన్ని చెల్లిస్తున్నారు. పురపాలికల స్థాయిని బట్టి ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే వేతనాలు ఉండే అవకాశాల్లేవు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వేతనాల పెంపు కోసం 3 శ్లాబులను నిర్ణయించి సీలింగ్ విధించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నా యి. ఈ శ్లాబుల సీలింగ్ నగర పంచాయతీలకు రూ.8 వేల నుంచి 9 వేలు, మున్సిపాలిటీలకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు, కార్పొరేషన్లకు రూ.10 వేల నుంచి రూ.11 వేలు ఉండొచ్చని అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ సీలింగ్‌లోపు ఆయా పురపాలికలే వేతనాలు నిర్ణయించుకోవాలి. పారి శుధ్య కార్మికుల వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, మున్సిపాలిటీలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. -
''స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేస్తున్నారు''
-
లెక్కతీస్తే చిక్కులే
- ఆడిటింగ్ అంటేనే హడల్ లక్షలకు లక్షలు ఖర్చు చేశారు.. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలంటూ హడావుడి చేసేశారు. తీరా ఇపుడు లెక్కలు చెప్పమంటే నీళ్లు నములుతున్నారు. కనీసం రికార్డులైనా ఇవ్వమంటే...మాకాడ ఏడున్నయ్ సారూ.. ఆ పాత సర్పంచ్ తీసుకుపోయిండు అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో 2013-14 సంవత్సరానికి సంబంధించిన లోకల్ ఫండ్ ఆడిట్ జిల్లాలోని చాలా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జరగడం లేదు. ఎలాగైనా లెక్కలు తేల్చాయని సిద్ధమైన ఆడిటింగ్ అధికారులు మాత్రం చివరగా కలెక్టర్ ద్వారా నోటీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి: ఆడిటింగ్ అంటే చాలు స్థానిక సంస్థలు హడలి పోతున్నాయి...తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోనన్న భయంతో ఆడిటింగ్‌కు ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ ఆడిటింగ్‌కు పంచాయతీలు, మండల పరిషత్‌లు సముఖంగా కనిపించటంలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు సైతం లోకల్ ఆడిటింగ్ విషయంలో బెట్టు ప్రదర్శిస్తున్నాయి. ఆడిటింగ్ అధికారులు పలుమార్లు పంచాయతీలు, మండల పరిషత్, మార్కెట్ కమిటీలకు నోటీసులు ఇచ్చినా స్పందన కనిపించడం లేదు. బీఆర్జీఎఫ్ నిధుల వ్యయంలో అవకతవకలు బట్టబయలవుతాయన్న గుబులుతోనే పంచాయతీలు, పలు మండల పరిషత్ కార్యాలయాలు ఆడిటింగ్‌కు ముందుకు రావటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ ఏకంగా రెండేళ్లుగా ఆడిటింగ్ పనులు ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆడిటింగ్‌కు ముందుకురాని పంచాయతీలు, మండల పరిషత్‌లపై కొరడా ఝళిపించేందుకు కలెక్టర్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సగం పంచాయతీలు కూడా లెక్కజెప్పలే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వ్యయానికి సంబంధించి జిల్లా స్థాయిలో లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు ఏటా పంచాయతీలు, మండల పరిషత్, మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఆడిటింగ్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం 2013-14 సంవత్సరానికి అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,066 పంచాయతీలకుగాను ఇప్పటి వరకు 685 పంచాయతీల్లో ఆడిటింగ్ పనులు పూర్తయ్యాయి. 46 మండల పరిషత్‌లకుగాను 37 మండల పరిషత్‌లో ఆడిటింగ్ జరిగింది. 17 వ్యవసాయ మార్కెట్లు ఉండగా వీటిలో కేవలం ఒకే ఒక్క మార్కెట్ కమిటీలో ఆడిటింగ్ జరిగింది. జిల్లాలో ఇంకా 381 పంచాయతీలు, 9 మండల పరిషత్, 16 మార్కెట్ కమిటీల్లో ఆడిటింగ్ జరగాల్సి ఉంది. ఆడిటింగ్ నిర్వహణ కోసం పంచాయతీలు, మండల పరిషత్, మార్కెట్ కమిటీలపై ఆడిటింగ్ శాఖ అధికారులు ప్రస్తుతం ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అయితే గత సర్పంచ్‌లు రికార్డులు అప్పగించకపోవటం, పంచాయతీ కార్యదర్శులు చాలాచోట్ల ఇన్చార్జిలుగా వ్యవహరించటం వల్లే ఆడిటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అతీగతీ లేని బీఆర్జీఎఫ్ ఆడిట్ బీఆర్జీఎఫ్ ఆడిటింగ్ సైతం ఆశించినస్థాయిలో సాగటం లేదు. జిల్లాలోని 220 పంచాయతీలు, మూడు మండల పరిషత్‌లలో బీఆర్జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్ పనులు ప్రారంభం కాలేదు. కల్హేర్, మిర్దొడ్డి, మునిపల్లి మండల పరిషత్‌లలో బీఆర్జీఎఫ్ ఆడిట్ జరగలేదు. అలాగే నారాయణఖేడ్ మండలంలో 25 పంచాయతీలు, కౌడిపల్లి మండలంలో 18 పంచాయతీలు, కల్హేర్‌లో 15, జహీరాబాద్‌లో 14, పుల్కల్, శివ్వంపేట మండలాల్లో పది పంచాయతీల చొప్పున ఆడిటింగ్ జరగలేదు. రాయికోడ్, కంగ్టి, కొండపాక, పాపన్నపేట, పటాన్చెరు మండలాల్లో ఐదు నుంచి పది పంచాయతీల్లో బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించిన ఆడిటింగ్ పెండింగ్‌లో ఉంది. బీఆర్జీఎఫ్ నిధులకు సంబంధించి చాలాచోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే లెక్కలు చెప్పేందుకు పంచాయతీలు, మండల పరిషత్ అధికారులు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. పూర్తిస్థాయి ఆడిటింగ్ జరిగితే తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందేమోనన్న భయంతోనే పంచాయతీ, మండల పరిషత్ యంత్రాంగం ఆడిటింగ్‌కు ముందుకు రావటంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ ద్వారా వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం ఆడిటింగ్‌కు ముందుకురాని పంచాయతీలు, మండల పరిషత్, వ్యవసాయ మార్కెట్ కమిటీలను దారిలోకి తెచ్చేందుకు ఆడిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కలెక్టర్ ద్వారా పంచాయతీలు, మండల పరిషత్ అధికారులకు నోటీసులు పంపేందుకు సమాయత్తమవుతున్నారు. ఆడిటింగ్ చేయించని పంచాయతీల జాబితాను సిద్ధం చేశామని, ఈ జాబితాను త్వరలో కలెక్టర్‌కు అందజేయనున్నట్లు లోకల్ ఫండ్ జిల్లా ఆడిటింగ్ అధికారి విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు. ఆడిటింగ్ పూర్తి చేసుకోని పంచాయతీలకు నోటీసులు జారీ చేసి నిధుల వ్యయంపై లెక్కలేస్తామని ఆయన వెల్లడించారు. -
ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్
హైదరాబాద్: ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే ప్రభుత్వ విధానాలు రూపొందాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. 13వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులను స్థానిక సంస్థల అభివృద్ధికి వాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల్లో స్త్రీల ఆధిపత్యం
శ్రీకాకుళం సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దాదాపు పరిసమాప్తమైంది. జిల్లాలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లా రాజకీయాల్లో ఇప్పటి దాకా కొనసాగిన పురుషాధిక్యానికి తెర పడింది. ముఖ్యంగా సర్పంచ్ మొదలు జిల్లా పరిషత్తు వరకు స్థానిక సంస్థల అధికార పీఠాలను అత్యధిక సంఖ్యలో మహిళలు సొంతం చేసుకోవడంతో ఐదేళ్లపాటు జిల్లా రాజకీయ, పరిపాలనా వ్యవహారాలను వారే నిర్దేశించనున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మున్సిపల్, మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల్లోనూ సగానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన మహిళలు గత మూడు రోజులుగా జరిగిన మున్సిపల్, మండల, జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అదే స్థాయిలో అధికార పీఠాలు సొం తం చేసుకోవడం ద్వారా మహిళా రాజ్యానికి శ్రీకారం చుట్టారు. సద్వినియోగించుకుంటేనే..తమ చేతికి అందివచ్చిన అధికార దం డాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే భవిష్యత్తు రాజకీయాల్లోనూ మహిళలు రాణించగలుగుతారు. సహజంగా భర్త చాటు భార్యలన్న పేరున్న మన మహిళామణులు ఇప్పటివరకు రాజకీయాల్లోనూ భర్తల అదుపాజ్ఞల్లో నే నడుస్తున్నారన్న అపవాదు ఉంది. ఇప్పుడు కొత్త ఎన్నికైన మహిళా ప్రతి నిధులు, సారధులు దాన్ని చెరిపేసి తమదైన సొంత ముద్ర వేయాల్సిన అవసరముంది. ఎన్నికైన వారిలో ఎక్కువమంది విద్యావంతులు ఉన్నం దున రాజకీయాలు, పాలనలో పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపించాల్సి ఉంది. జిల్లాలో ఎన్నికైన మహిళా ప్రతినిధులను పరిశీలిస్తే.. శ్రీకాకుళం, పాలకొండ ఎమ్మెల్యేలుగా గుండ లక్ష్మీదేవి, విశ్వాసరాయి కళావతిలు గెలుపొందారు. జిల్లా పరిధిలో ఉన్న అరకు ఎంపీగా కొత్తపల్లి గీత ఎన్నిక య్యారు. తాజాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా చౌదరి ధనలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా ఖండాపు జ్యోతిలు ఎన్నికయ్యారు. రెండు రోజుల క్రితం జరి గిన నాలుగు మున్సిపాలిటీల అధ్యక్ష ఎన్నికల్లో ఆమదాలవలస,పాలకొండ, ఇచ్ఛాపురం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను మహిళలే చేజిక్కించుకున్నారు. ఇక జిల్లాలో 38 మండలాలు ఉండగా 27 మండల పీఠాలపై మహిళలే జెండా ఎగురవేశారు. 17 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులను వారే సొంతం చేసుకున్నారు. 38 జెడ్పీటీసీల్లో 24 స్థానాల్లో విజయం సాధించారు. ఆ మూడు నియోజకవర్గాల్లో వారే.. పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలోని అన్ని మం డలాలకూ మహిళలే పాలకులయ్యా రు. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గంలో నాలుగేసి మండలాలు ఉం డగా.. మూడేసి మండలాల్లో మహళలకే అధ్యక్ష పదవులు దక్కాయి. జిల్లా లో ఉన్న 1099 పంచాయతీలు ఉండ గా 680 చోట్ల మహిళలే సర్పంచుల య్యారు. మరో 450మంది ఉప సర్పం చులుగా గ్రామ పాలనలో భాగస్వాములవుతున్నారు. గతంలో ఎన్నడూ దక్కని ఈ సువర్ణావకాశాన్ని భర్తలపాలు చేయకుండా స్వ యం నిర్ణయాలతో పాలనపై పట్టు సాధించినప్పుడే మహిళల పోరాటానికి సార్ధకత లభిస్తుంది. -
స్థానిక సంస్థలకు డబ్బే డబ్బు!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత నిధుల పండుగ కేంద్రం నుంచి విడుదల కానున్న వందల కోట్ల నిధులు కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు నిధుల పండుగ రాబోతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాక కాసులు గలగల్లాడనున్నాయి. పంచాయతీ సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందున ఆగిపోయిన రూ.వందల కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కేంద్రం 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది డిసెంబర్లో రూ.489 కోట్లు విడుదలవగా, ఈ వారంలో మరో రూ. 516 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులొచ్చే సమయానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అవి స్థానిక సంస్థలకు సర్దుబాటు కాకుండా ఆగిపోయాయి. స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రూ. 2,900 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉంటే.. ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్లే విడుదలయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాక మిగిలిన నిధులనూ విడుదల చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి ఇంకా రూ. 1,900 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అయితే ఇందుకు ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసినట్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో గ్రామపంచాయతీలకు 70 శాతం, జిల్లా పరిషత్‌లకు 20 శాతం, మండల పరిషత్‌లకు పది శాతం నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులన్నీ.. ఆయా జిల్లాల్లోని జనాభా ప్రతిపాదిక లెక్కన విడుదల చేస్తారు. ఇవి కాక వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు ఫండ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 462 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.137 కోట్లే విడుదలవ గా.. ఇంకా రూ. 325 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈసారి ఆ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం లేదని పంచాయతీరాజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సంస్థలకు తలసరి గ్రాంటు కింద ఇచ్చే నిధుల్లో జిల్లా పరిషత్‌లకు ఒక్కరికి రూ. 4 లెక్కన జెడ్పీటీలకు రూ. 22.16 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 8 లెక్కన రూ. 44.32 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ. 4 లెక్కన రూ. 22.16 కోట్లు, సీనరేజి కింద జిల్లా పరిషత్ , పంచాయతీలకు చెరో రూ. 30 కోట్లు, మండల పరిషత్‌కు రూ. 50 కోట్ల నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ విడుదల చేసే రూ. 300 కోట్ల నిధులు అదనం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ నిధులు అందుబాటులోకి రానున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ వేతనం రూ.7,500: జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు రూ. 7,500, ఎంపీపీలకు రూ. 1,500, సర్పంచ్‌లకు రూ. 1,500 నెలసరి గౌరవ వేతనంగా ఇదివరకు నిర్ణయించినదే కొనసాగనుంది. జెడ్పీటీసీలకు రూ. 2,250 ఎంపీటీసీలకు రూ. 750 గౌరవ వేతనం ఇస్తారు. వీరికి సమావేశాలకు హాజరైనప్పుడు సిట్టింగ్ ఫీజు కింద రూ. 100 నుంచి రూ. 150 చెల్లిస్తారు.