సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సహా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.379.34 కోట్లను కేంద్రం మంగళవారం విడుదలచేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలవారీగా జనాభా ప్రాతిపదికన 70 : 15 : 15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది.
15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు కేటగిరీల గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. గతేడాది జూలైకు ముందు తొలి విడతగా కేవలం రూ. 969.51 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు ఆరి్థక సంవత్సరం ముగిసినా రెండో విడత నిధులివ్వలేదు. ఇలా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో విడతగా రూ. 969.51 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు బేసిక్ గ్రాంట్‌గా రూ.379.34 కోట్లు విడుదల చేసింది. మరో రూ.590.15 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
ఈ ఏడాదికి రూ.2,010 కోట్లు
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 2,010 కోట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం రెండు విడతల్లో నాలుగు భాగాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది.
చదవండి: ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు
Comments
Please login to add a commentAdd a comment