సాక్షి, అమరావతి: ‘ఆత్మ నిర్బర్ భారత్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే.
► ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది.
► రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా.
► తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.
► గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు.
ఈ పథకం ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చునంటే
► ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫారాలు, సప్లై చెయిన్ సర్వీసులు
► గిడ్డంగులు, గరిశలు (సిలోస్)
► ప్యాక్ హౌసులు
► పరీక్ష, తనిఖీ యూనిట్లు
► సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు
► లాజిస్టిక్ సౌకర్యాలు (ఏదైనా ఒక పనికి సంబంధించిన లావాదేవీలన్నీ)
► ప్రాథమిక శుద్ధి కేంద్రాలు
► పండ్లు మాగబెట్టే గదులు
కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు..
► సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్లు
► జీవన ఎరువుల తయారీ యూనిట్లు
► తక్కువ ఖర్చుతో సాగు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన
► సప్లై చెయిన్‌కు అవసరమైన ప్రాజెక్టులు
► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రోత్సహించే ప్రాజెక్టులు
ఎవరెవరు అర్హులు...
► రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు
► పీఏసీఎస్, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలు, ఎంఎసీలు
► స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు
► ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీ ఎఫ్‌డబ్లు్యతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు.
అగ్రి ఇన్‌ఫ్రాలో ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు
Published Tue, Aug 11 2020 4:31 AM | Last Updated on Tue, Aug 11 2020 4:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment