funds allocation
-
నీతిఆయోగ్‌లో కేంద్రాన్ని నిలదీస్తా: మమతా బెనర్జీ
కలకత్తా: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్లో సవతితల్లి ప్రేమ చూపించారని తృణమూల్కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో శనివారం(జులై 26) జరిగే నీతిఆయోగ్ సమావేశానికి హాజరై చెబుతానన్నారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం(జులై26) ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు నాకు మాట్లాడటగానికి నాకు అనుమతివ్వకపోతే నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వస్తా అని మమత తెలిపారు. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమత తొలి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలాంటి వివక్ష లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపడం లేదని.. వివిధ రూపాల్లో రాష్ట్రానికి గణనీయంగా నిధులు అందాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ అన్ని రాష్ట్రాలకూ ప్రధానమంత్రి అని, ఏ రాష్ట్రానికీ తక్కువ నిధులు ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రంగాలు, పథకాలు, కేటాయింపులను పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే అధిక కేటాయింపులు దక్కాయన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో గుజరాత్ కన్నా తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహకారాన్ని అందిస్తోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో.. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు వివిధ శాఖలు, రంగాలవారీగా వివిధ రూపాల్లో అందజేసిన నిధులు, రుణాలు, వివిధ సంస్థలకు చేసిన కేటాయింపుల వివరాలను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట వీడియోతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకం కాదు తనది రాజకీయ పార్టీ కార్యక్రమమో, ఒక ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజెంటేషనో కాదని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యమని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను అధికారిక డాక్యుమెంట్ల ద్వారా రాష్ట్ర ప్రజల పరిశీలనకోసం అందుబాటులో ఉంచుతున్నట్టు వివరించారు. కేంద్రం ఇంత చేస్తున్నా ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రంలో కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అండగా నిలుస్తామన్నారు. కిషన్‌రెడ్డి ప్రజెంటేషన్‌లో పేర్కొన్న గణాంకాలివీ.. ► కేంద్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో ఇచ్చిన నిధులు రూ.1.78 లక్షల కోట్లు ► కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో చేసిన ఖర్చు రూ.4.99 లక్షల కోట్లు ► వేస్ అండ్ మీన్స్ అలవెన్సులు, ఓడీలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అనేక సార్లు ఆర్బీఐ అందించిన సహకారం రూ.2.31 లక్షల కోట్లు ► తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్రం చేసిన ఖర్చు (ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతుధర వంటివి) రూ.1.58 లక్షల కోట్లు ► 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి పరిహారంగా అందినది రూ.8,379 కోట్లు. 2020–22 మధ్య (కరోనా కాలంలో) ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణం (దీనిని కేంద్రమే భరిస్తుంది) కూడా కలిపితే రూ.15,329 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా 2014 నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో కేటాయించిన/విడుదలైన నిధులు సుమారు రూ.5లక్షల కోట్లు. ► 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు.. కేంద్రం, దాని ఆధ్వర్యంలోని సంస్థలు, పీఎస్‌యూల ద్వారా అందిన రుణాల మొత్తం (బడ్జెటేతర రుణాలతో సహా) దాదాపు రూ 7.5 లక్షల కోట్లు. ► రాష్ట్ర ప్రజలకు, వివిధ వర్గాలకు కేంద్రం ద్వారా అందించిన రుణాలు దాదాపు రూ.9.26 లక్షల కోట్లు సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ.నాగేశ్వర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివిధ రంగాల వారీగా కేటాయింపులు/నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు.. – తెలంగాణలో 1947– 2014 మధ్య నిర్మించిన జాతీయ రహదారులకు సమానంగా గత తొమ్మిదేళ్లలోనే మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మించింది. – రోడ్ల కోసం చేసిన ఖర్చు రూ.1.08 లక్షల కోట్లు (2014–2022 మధ్య నిర్మించిన రోడ్ల పొడవు 2,500 కి.మీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు 2,269 కి.మీ). – హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్డు (348 కి.మీ) అంచనా వ్యయం రూ.21,201 కోట్లు – రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు రూ.32,823 కోట్లు – విద్యుత్, నీటిపారుదల కోసం రూ.23,937 కోట్లు – గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూ.34,090 కోట్లు – ఐటీ, డిజిటలీకరణకు రూ.7,479 కోట్లు రంగాలు, సంక్షేమ పథకాలకు.. – వ్యవసాయం, అనుబంధరంగాలు, పశు సంవర్థక, మత్స్యపరిశ్రమకు రూ.40,559 కోట్లు – రసాయనాలు, ఎరువులకు రూ.39,649 కోట్లు – ఆరోగ్యం, పారిశుధ్యం కోసం రూ.14,572 కోట్లు – జీవనోపాధి, కరోనా సమయంలో మద్దతు కింద రూ.38,256 కోట్లు – అడవులు, పర్యావరణం కోసం రూ.3,205 కోట్లు మానవాభివృద్ధి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వం కోసం – విద్య, క్రీడలకు రూ.18,657 కోట్లు – మహిళాశిశు సంక్షేమానికి రూ.8,031 కోట్లు – ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.2,802 కోట్లు – మైనారిటీలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,568 కోట్లు కేంద్ర శాఖల ఆధ్వర్యంలో ఖర్చు – రక్షణశాఖ నుంచి రూ.1.15 లక్షల కోట్లు, హోంశాఖ రూ.6,218 కోట్లు తెలంగాణలో వ్యయం – కేంద్రం తెలంగాణలో ఉన్న రక్షణ రంగ సంస్థలకు రూ.78 వేల కోట్లు ఇచ్చింది. 5 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ అప్పుల గణాంకాలివీ.. – రాష్ట్రం మొత్తంగా తీసుకున్న అప్పులు: రూ. 7,49,982 కోట్లు – పీఎఫ్సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో టాప్ తెలంగాణ – నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5వ స్థానం.. తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – ఆర్ఈసీ ద్వారా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు 1.31 లక్షల కోట్లు -
జీహెచ్ఎంసీకి పైసా పరేషాన్.. గండం గట్టెక్కేనా?
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నప్పటికీ, చెల్లింపులు మాత్రం గోరంతలు కూడా ఉండటం లేదు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచీ వివిధ ప్రభుత్వ భవనాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను, వాటిపై బకాయిలు దాదాపు రూ.6000 కోట్లు పేరుకుపోయాయి. వీటిల్లో పాత సచివాలయ భవనాలకు సంబంధించి దాదాపు రూ. 400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ సచివాలయం అంతర్ధానమై, కొత్త సచివాలయం త్వరలో ప్రారంభం కానున్నప్పటికీ జీహెచ్ఎంసీ బకాయిల చిట్టాలో మాత్రం అలాగే ఉంది. దాంతోపాటు వైద్యారోగ్య, విద్యాశాఖ, ఎక్సైజ్, ట్రాన్స్‌కో, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన భవనాల నుంచి దశాబ్దానికిపైగా ఆస్తిపన్ను బకాయిలు పెనాల్టీలతో కలిపి కొండల్లా పేరుకుపోయాయి. బడ్జెట్లో పద్దు ఉన్నా.. ఆస్తిపన్ను బకాయిలు ఏటికేడు పెరిగిపోతున్నా, జీహెచ్ఎంసీ ఆయా ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిందిగా లేఖలు రాస్తున్నా నయాపైసా కూడా విదిల్చడం లేదు. వీటి చెల్లింపుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఓ పద్దు కూడా ఉంది. కానీ.. చెల్లింపులే ఉండటం లేదు. ఆరేడేళ్ల క్రితం ఏటా కనీసం రూ. 50 కోట్లయినా బడ్జెట్లో కేటాయించి విడుదల చేసేవారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇది కేవలం రూ.10 కోట్లు మించడం లేదు. తాజా రాష్ట్ర బడ్జెట్లోనూ రూ. 10 కోట్లే విదిల్చారు. జీహెచ్ఎంసీకి తప్పని తిప్పలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన, పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు సదరు ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడం, మరోవైపు జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంబంధిత ఉన్నతాధికారులు నిధుల లేమి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా.. లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేయడంతో వాటి వడ్డీలు, ఇతరత్రా ఖర్చులు భరించలేక సిబ్బంది జీతాలకే పలు అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోకపోతే జీహెచ్ఎంసీ గడ్డు పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఓటీఎస్‌ను వినియోగించుకోని వైనం.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన వారు పెనాల్టీల భారాన్ని మోయలేకే చెల్లించడం లేదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద ఆస్తిపన్ను పెనాల్టీలపై 90 శాతం రాయితీనిచ్చింది. ప్రభుత్వ భవనాలకు ఆ స్కీమ్‌ను సైతం వినియోగించుకోలేదు. దాన్ని వినియోగించుకొని చెల్లించినా, జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం సమకూరేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెనాలీ్టలే అసలును మించి భారీ బకాయిల గుట్టలుగా మారాయి. ఎన్నెన్నో భవనాలు.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా ఉన్న భవనాల్లో అసెంబ్లీ, రవీంద్రభారతి, హెచ్ఎండీఏ, ఆస్పత్రులు, విద్యాలయాలకు చెందినవే కాకుండా పెట్రోలు బంకులు, క్యాంటీన్ల వంటివి సైతం ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి రావాల్సింది జీహెచ్ఎంసీకి రావాల్సిన మొత్తం సచివాలయ పాతభవనం : రూ.400 కోట్లు వైద్యారోగ్యశాఖ భవనాలు : రూ.1190 కోట్లు ఎక్సైజ్ శాఖ భవనాలు: రూ. 900 కోట్లు విద్యాశాఖ భవనాలు: రూ.400 కోట్లు జలమండలి భవనాలు : రూ.70 కోట్లు -
‘కేసీఆర్ సర్కార్ సర్పంచ్ల గొంతులు నొక్కేస్తున్నది’
సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్రం నిధుల విషయంలో కూడా బీజేపీ సర్కారు తీరుపై గులాబీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రామపంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆయిలపామ్ సాగును కేంద్రం ప్రోత్సహిస్తోంది. తెలంగాణకు కేంద్రం రూ.5వేల కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ప్రభుత్వం దారిమళ్లించింది. పంచాయతీల ఖాతాల్లోకి నిధులు వేసిన గంటలోనే మళ్లించారు. ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు. పంచాయతీ నిధుల కోసం సర్పంచ్‌లు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల నిర్బంధం ద్వారా సర్పంచ్‌లు నిధుల కోసం ప్రశ్నించకుండా ప్రభుత్వం వారి గొంతు నొక్కుతోంది. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై అదనంగా 13 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం విధించే వ్యాటే ప్రధాన కారణం. కేంద్రం కోరిక మేరకు 13 రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ధరలు పెరిగితే పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
బ్యారెల్ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్ యూనియన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. రూటు మార్చిన రష్యా రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నల్ల మార్కెట్‌కూ తరలించొచ్చు... ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.379.34 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సహా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.379.34 కోట్లను కేంద్రం మంగళవారం విడుదలచేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలవారీగా జనాభా ప్రాతిపదికన 70 : 15 : 15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు కేటగిరీల గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. గతేడాది జూలైకు ముందు తొలి విడతగా కేవలం రూ. 969.51 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు ఆరి్థక సంవత్సరం ముగిసినా రెండో విడత నిధులివ్వలేదు. ఇలా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో విడతగా రూ. 969.51 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు బేసిక్ గ్రాంట్‌గా రూ.379.34 కోట్లు విడుదల చేసింది. మరో రూ.590.15 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాదికి రూ.2,010 కోట్లు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 2,010 కోట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం రెండు విడతల్లో నాలుగు భాగాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. చదవండి: ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు -
హైదరాబాద్‌ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు
కేంద్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి ‘బూస్టర్’ దక్కలేదు. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎస్సార్డీపీ పనులకు నిధులు విదిల్చలేదు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.48వేల కోట్లు కేటాయించినప్పటికీ, వీటిలో గ్రేటర్ నగరానికి ఎన్ని నిధులందుతాయో చెప్పలేని పరిస్థితి. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం శూన్య హస్తమే చూపింది. ప్రధానంగా జలమండలి, మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కరువైంది. రెండు అంశాల్లో మాత్రం నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర బడ్జెట్లో నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్లో ఈసారి జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్‌రోడ్లు, స్లిప్రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. (చదవండి: ఒక్కరోజే 2,850 కరోనా కేసులు) పోస్టాఫీసులకు మహర్దశ ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. పరుగులు పెట్టనున్న వందే భారత్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి.కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. (చదవండి: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం! ) -
కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది?
సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్రమే అప్పుల ఊబిలో ఉంది.. ఇంక తెలంగాణకు ఏమిస్తది? కేంద్రానికి మనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ అప్పులున్నాయి. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదు.. కేంద్రానికే తెలంగాణ ఇస్తోంది. ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది రూ.42 వేలకోట్లు.. కానీ తెలంగాణ నుంచి వెళ్లిన మొత్తం రూ.2.74 లక్షల కోట్లు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్బీఐ నివేదికే చెప్తోంది..’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో భట్టి విక్రమార్క (కాంగ్రెస్), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), రాజాసింగ్ (బీజేపీ), జీవన్‌రెడ్డి (టీఆర్ఎస్) ప్రస్తావించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత చేశాయని, కానీ బాగా, గొప్పగా చేశామనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంక్షేమానికి ఏడేళ్లలో రూ.74,165 కోట్లు ఖర్చు ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ చేయనన్ని సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్త్రీశిశు సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.21,663 కోట్లు అయితే.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.74,165 కోట్లు వెచ్చించింది. అదీ మా నిబద్ధత. ఎస్సీ సంక్షేమం కోసం 2004 నుంచి 2014 వరకు రూ.6,198 కోట్లు ఖర్చు పెట్టారు. మేం ఏడేళ్లలో రూ.23,296 కోట్లు ఖర్చు చేశాం. ఎస్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,430 కోట్లు ఖర్చుచేస్తే.. మేం రూ.14,447 కోట్లు ఖర్చుపెట్టాం. బీసీ వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ రూ.6,593 కోట్లు ఖర్చుపెడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,535 కోట్లు ఖర్చు చేసింది. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ రూ.925 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,971 కోట్లు ఖర్చు పెట్టింది. స్త్రీశిశు సంక్షేమానికి కాంగ్రెస్ రూ.4,510 కోట్లు ఖర్చు చేస్తే.. మేం రూ. 9,916 కోట్లు ఖర్చు చేశాం. బీజేపీ నేతలవి ఉత్త మాటలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు అయితే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలు. ఈ విషయంలో కేంద్రంతో పోలిస్తే రెట్టింపులో ఉన్నాం. అలాంటప్పుడు తెలంగాణకు ఏం ఇస్తారు? కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇచ్చే నిధులు తప్ప.. ఒక్కపైసా కూడా కేంద్రం నుంచి రావడం లేదు. ఏడున్నర ఏళ్లలో కేంద్రం నుంచి రూ.42 వేల కోట్లు వస్తే.. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన మొత్తం రూ.2.74 లక్షల కోట్లు. తెలంగాణనే కేంద్రానికి ఇస్తోంది. అప్పుల ఊబిలో ఉన్న కేంద్రం తెలంగాణకు ఇచ్చేదేమీ లేదు. కేంద్రం నిధులిస్తోందని, రాష్ట్రం మళ్లిస్తోందని బీజేపీ నేతలు ఉత్త మాటలు చెప్పడం ఆపేయడం మంచిది. కేంద్రమే డయ్యింగ్ పొజిషన్లో ఉంది. ఇక మేం నిధులు డైవర్ట్ ఎక్కడ చేస్తాం? ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరుస్తున్నాయి అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా? ధర్మపురి నుంచి మొదలుకొని వేములవాడ, బాసర సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయబోతున్నాం. నవంబర్ ఆఖరులో గానీ డిసెంబర్ మొదటి వారంలోగానీ సుదర్శన యాగం చేసి ఆలయాన్ని ప్రారంభిస్తాం. ప్రధానిని, రాష్ట్రపతిని కూడా ఆహ్వానించాం. ఫీల్డ్ అసిస్టెంట్ల అంశాన్ని పరిశీలిస్తాం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగి, ఆస్తుల కల్పన జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా తయారైంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా తామేదో ఉద్యోగులం అనుకుంటున్నారు. వారిని మేం తొలగించలేదు. వారే సమ్మెలోకి వెళ్లారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాం. రోశయ్య సభకు ఉరితాడు తెచ్చుకున్నడు కాంగ్రెస్ ఏమీ చేయలేదని మేం అనట్లేదు. మంచిగా చేయలేదని అంటున్నాం. కాంగ్రెస్ కరెంట్, నీళ్లు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. గతంలో కరెంట్ ఇవ్వలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని రోశయ్య అన్నారు. ఆయన తన సూట్‌కేçసులో ఉరితాడు కూడా తెచ్చుకున్నాడు. మేమందరం వారించాం. ఓ ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇస్తానని చెప్పి.. ఇవ్వలేకపోయారు. కానీ మేం కరెంటు కోసం రూ.20వేల కోట్లు ఖర్చు పెట్టినం. 4 వేల మెగావాట్ల కరెంటును ఎన్టీపీసీ నుంచి కొట్లాడి తెచ్చుకుంటున్నం. 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ తెచ్చినం. కాంగ్రెస్‌కు మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. టీఆర్ఎస్కు ఉన్నాయి. అన్ని వర్గాలకు మేలు.. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు దక్కని ఏ వర్గం ఉండకూడదనేదే మా అభిమతం. దేశంలో ఎక్కడా లేనివిధంగా హోంగార్డులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇస్తున్నం. బీసీల్లోని సామాజిక వర్గాలన్నింటికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అగ్రవర్ణాల వారికి కూడా సామాజిక భవనాల కోసం స్థలాలు ఇచ్చాం. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మళ్లీ అర్జీలు స్వీకరిస్తాం. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాం. సచివాలయంలో మసీదు, గుడి పెద్దగా నిర్మిస్తాం. కేజీ టు పీజీ బదులు గురుకులాలు ‘కేజీ టు పీజీ’ విద్య అనేది నా కల. అయితే పిల్లల నిపుణులు, సైకాలజిస్టులు 5వ తరగతిలోపు పిల్లలకు నిర్భంద విద్య వద్దని సూచించారు. అందుకే 6వ తరగతి నుంచి విద్యార్థులకు గురుకులాల్లో విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై గురుకులాల్లో రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. కేజీ నుంచి 5వ తరగతిలోపు పిల్లలకు మరింత మెరుగైన విద్య అందించే విషయాన్ని అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది.’’ అప్పిచ్చువాడు, వైద్యుడు.. అందుకే వలసలు తెలంగాణలో ఉపాధి పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పనికి, ఉపాధికి మన కూలీలు సరిపోవడం లేదన్నారు. ఒకనాడు మనం వలసపోయామని.. కానీ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షలకుపైగా కార్మికులు ఇక్కడికి వలస వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని పద్యాన్ని గుర్తు చేశారు. ‘‘అప్పిచ్చువాడు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ’’ .. అని పద్యం ఉంది. తెలంగాణలో అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. అద్భుతమైన వైద్యం ఉన్నది. నీళ్లు, కరెంట్ ఉన్నాయి. ఉపాధి దొరుకుతోంది. అందుకే బెంగాల్, యూపీ నుంచి వచ్చి కార్మికులు వచ్చి నాట్లు వేస్తున్నారు. బిహార్, ఒడిశా, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పత్తి ఏరడానికి వస్తున్నారు. కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్‌కు పత్తి ఏరేందుకు కూలీలు వస్తున్నారు. ఒకప్పుడు ముంబైకి వలసలు కట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి పనులు చేస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము తప్పులు చేస్తే విమర్శించవచ్చని, కానీ అనవసరంగా రాష్ట్ర పరువును బజారున పడేయొదని ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు. -
తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎన్ని నిధులు...
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు లబ్ధి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014–15 నుంచి 2020–21 మధ్య ఎస్సీల్లో 1.64 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,235 కోట్లు అందచేసింది. అలాగే గిరిజనుల్లో లక్ష మంది వరకు లబ్ధి పొందగా వారికి రూ. 764 కోట్లు పంపిణీ చేసింది. ఇక బీసీల్లో 2.98 లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందగా.. వీరికి రూ.2,752 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక షాదీ ముబారక్ పథకం కింద మైనారిటీల్లో 1.68 లక్షల మందికి లబ్ధి చేకూరగా రూ.1,112 కోట్లను ప్రభుత్వం వారికి ఆర్థిక సాయంగా అందించింది. పెరుగుతున్న పట్టణ జనాభా పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో పట్టణ జనాభా పెరుగుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నగరాల్లో ప్రస్తుతం 46.1 శాతం ఉన్న జనాభా 2036 నాటికి 57.3 శాతం వరకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 18 శాతం అధికంగా ఉంటుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2011లో పట్టణ జనాభా 28.9 శాతం ఉంటే.. ఇప్పుడది 46.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 31.1 శాతం నుంచి 34.5 శాతానికి పెరిగింది. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న వారు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. రాష్ట్ర జనాభా ప్రస్తుతం 3.8 కోట్ల వరకు ఉంటే అందులో 2 కోట్లకుపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. ►పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 29,271కోట్లు ►ఐటీ రూ. 360 కోట్లు ►వైద్య, ఆరోగ్య శాఖ రూ. 6,295కోట్లు ►మహిళా,శిశు సంక్షేమం రూ. 1,632కోట్లు ►రోడ్లు, భవనాలు రూ. 8,788కోట్లు ►పశుసంవర్థక,మత్స్య శాఖ రూ. 1,730కోట్లు ►వ్యవసాయం రూ. 25,000కోట్లు ►పాఠశాల విద్య రూ. 11,735కోట్లు ►ఉన్నత విద్య రూ. 1,873కోట్లు ►విద్యుత్ రూ. 11,046కోట్లు ►హోం శాఖ రూ. 6,465కోట్లు ►అటవీ శాఖ రూ. 1,276కోట్లు ►బీసీ సంక్షేమ శాఖ రూ. 5,522కోట్లు ►మైనారిటీ సంక్షేమం రూ. 1,606కోట్లు ►ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,306కోట్లు ►ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 12,304కోట్లు ►సాంస్కృతిక, పర్యాటక శాఖ రూ. 726కోట్లు ►సాగునీటి రంగం రూ. 16,931కోట్లు ►పరిశ్రమలు రూ. 3,077కోట్లు ►పౌర సరఫరాలు రూ. 2,363కోట్లు ►పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ రూ. 15,030కోట్లు -
పురపాలకానికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖకు బడ్జెట్లో నిధుల వరద పారింది. 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021– 22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. ఇందు లో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు రూ.1,261.98 కోట్ల నుంచి రూ.3,978.01 కోట్లకు పెరగగా.. ప్రగతిపద్దు కేటాయింపులు రూ.11,020.31 కోట్ల నుంచి రూ.10,134.23 కోట్లకు తగ్గాయి. హైదరాబాద్ నగరానికి ఈసారి కూడా భారీగా కేటాయింపులు ఉన్నాయి. నిర్వహణ పద్దు కింద జల మండలికి రుణాలను రూ.900 కోట్ల నుంచి రూ.738.52 కోట్లకు తగ్గించారు. అభివృద్ధి పనుల కోసం కొత్తగా రూ.668 కోట్లను కేటాయించారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల ఇంటేక్ నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే పనుల కోసం రూ.725 కోట్ల రుణానికి ఓకే చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ కోసం హెచ్ఎండీఏకు రూ.472 కోట్లు రుణాలుగా కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాగా స్మార్ట్‌సిటీలకు రూ.288.60 కోట్లు, అమృ త్ నగరాలకు రూ.203.02 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో పనుల కోసం.. రాష్ట్ర పథకాల కింద మూసీ పరీవాహక ప్రాంత అభి వృద్ధికి రూ.200 కోట్లు, టీయూఎఫ్ఐడీసీకి రూ.219.33 కోట్లు, హైదరాబాద్ ప్రజలకు 20వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా కోసం జలమండలికి రూ.250 కోట్లు, కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లకు రూ.75.47 కోట్లు, వరంగల్ మెట్రో ప్రాజెక్టుకు రూ.150.94 కోట్లు, హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ పనులకు రూ.1,962.22 కోట్లు కేటాయించారు. యాదాద్రికి రూ.350 కోట్లు గత బడ్జెట్ తరహాలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.350 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.50 కోట్లు ఇచ్చారు. పదిలక్షలపైన జనాభా గల నగరాలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద హైదరాబాద్ నగరానికి రూ.318 కోట్లు, ఇతర నగరాలకు రూ.354 కోట్లను ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్‌కు భారీగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద స్వచ్ఛ భారత్‌కు రూ.783.75 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కు రూ.166.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.889 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు ఆరోగ్య రంగం కింద ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.107.51 కోట్లను కొత్తగా కేటాయించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వడ్డీలేని రుణాల కింద నిధుల కేటాయింపులను రూ.226.41 కోట్ల నుంచి 566.02 కోట్లకు పెంచారు. -
కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి?
♦ రైతు మద్దతిచ్చారు... బడ్జెట్లో ఢిల్లీ చుట్టూ ఆందోళనలు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపై చట్టంలో హామీ దొరక్కపోయినా... బడ్జెట్లో దొరికింది. కాకుంటే కనీస మద్దతు ధర మరీ కనీసంగా.. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉంది!! సాగు రుణ పరిమితి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచినా ఇవ్వాల్సింది బ్యాంకులు కదా! ‘ఆపరేషన్ గ్రీన్’ 22 ఉత్పత్తులకు విస్తరించటం ఊరటే. చదవండి: బడ్జెట్ 2021: ఈ విషయాలు మీకు తెలుసా! ♦ విద్యార్థి ఆన్లైన్... అర్థమైందా? స్కూలు బ్యాగు మోసి.. క్లాసు మొహం చూసి ఏడాదవుతోంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యాయో లేదో అర్థంకాని పరిస్థితి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైళ్లు లేనివారి గురించి ఆలోచించలేదెవ్వరూ! ఆలోచిస్తే ఈ బడ్జెట్లో మొబైల్ రేట్లు పెంచేస్తారా ఏంటి? మరి ఊహించని సిలబస్‌ను చూసి నష్టపోయిన పిల్లలకు ఈ బడ్జెట్లో ఏమైనా ఒరిగిందా అంటే.. అదీ లేదు. డిజిటల్ విద్య ఊసే లేదు. కాకుంటే మరో 15వేల కొత్త స్కూళ్లు, 100 సైనిక్ స్కూళ్లు తెస్తామన్నారు. ఇక.. ఉన్నత విద్య నియంత్రణకొక కమిషన్, లేహ్‌లో ఓ సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్టీ విద్యార్థుల కోసం 750 ఏకలవ్య స్కూళ్లు ఇలా భవిష్యత్తు బాటలు చాలా ఉన్నాయ్. కానీ కోవిడ్ లాంటి వైరస్లు కోరలు చాస్తే..? తగిన ఆన్లైన్ పాలసీ అవసరమైతే ఉంది!. చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ♦ ఉద్యోగి అయినా... పన్ను మారలేదు పన్ను పోటులో మార్పేమీ లేదు. కాకపోతే కొన్ని చిన్నచిన్న ఊరటలున్నాయ్. రిటర్నులు రీ–ఓపెన్ చేసే కాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే వడ్డీకి టీడీఎస్ ఉండదు. ఇక తక్కువ ధరలో ఇల్లు కొనుక్కున్న వారికి రూ.1.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ ఇచ్చే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. పన్ను వివాద మెకానిజం మరింత సులభం చేశారు. కానీ మధ్య తరగతి ఆశగా చూసే ఆదాయపన్ను శ్లాబుల జోలికి మాత్రం వెSళ్లలేదు. పైగా అగ్రిసెస్సు కారణంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి జేబుకు చిల్లు పడొచ్చనే ∙దిగులు వచ్చి పడింది..! చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు ♦ సీనియర్ సిటిజన్ ఇదేం రకం ఊరటబ్బా? 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు టాక్స్ రిటర్న్స్ వేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు తాజా బడ్జెట్లో కల్పించారు. కానీ కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకే ఈ వెసులుబాటని క్లాజ్ పెట్టారు. ఈ ప్రకటనతో వారికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పని తప్పింది కానీ, పన్ను మాత్రం రూపాయి తగ్గలేదు. బ్యాంకులే పెన్షన్‌లో పన్ను మినహాయించేసుకుంటాయి. మరి దీన్ని ఊరట అనుకోవాలా? అయినా మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. అలాంటప్పుడు 75 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తే ఎందరికి లాభమట? ♦ కార్పొరేట్స్ సూపరో.. సూపర్! కార్పొరేట్ల హ్యాపీ అంతా ఇంతా కాదు. ఆ సంతోషమంతా మార్కెట్లలో చూపించేశారు లెండి. పన్ను పెంచలేదు. పైపెచ్చు డివిడెండ్ మినహాయింపులు, ఇన్ఫ్రా డెట్‌ఫండ్స్ నిధులు సమీకరించుకునే వీలు, ఎన్ఎఫ్ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, గిఫ్ట్ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీకి పన్ను ప్రోత్సాహకాలు, టాక్స్ ఆడిట్ టర్నోవర్ పెంపు, జీఎస్టీ ఫైలింగ్ సరళీకరణ, కస్టమ్స్ డ్యూటీ క్రమబద్ధీకరణ, మొబైల్స్, ఐరన్, టెక్స్టైల్స్, కెమికల్స్, బంగారం, వెండి, పునర్వినియోగ ఇంధన వనరుల రంగాలకు తాయిలాలు లాంటివన్నీ నవ్వులు పూయించేవే. ఇక ప్రయివేటీకరణ అంటూ అమ్మకానికి పెట్టిన ఆస్తులన్నీ కొనేది ఎలాగూ వీరే. అందుకే తాజా బడ్జెట్‌తో మార్కెట్ రయ్యి... మంది. -
అగ్రి ఇన్ఫ్రాలో ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు
సాక్షి, అమరావతి: ‘ఆత్మ నిర్బర్ భారత్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే. ► ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది. ► రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా. ► తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ► గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు. ఈ పథకం ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చునంటే ► ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫారాలు, సప్లై చెయిన్ సర్వీసులు ► గిడ్డంగులు, గరిశలు (సిలోస్) ► ప్యాక్ హౌసులు ► పరీక్ష, తనిఖీ యూనిట్లు ► సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ► లాజిస్టిక్ సౌకర్యాలు (ఏదైనా ఒక పనికి సంబంధించిన లావాదేవీలన్నీ) ► ప్రాథమిక శుద్ధి కేంద్రాలు ► పండ్లు మాగబెట్టే గదులు కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు.. ► సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్లు ► జీవన ఎరువుల తయారీ యూనిట్లు ► తక్కువ ఖర్చుతో సాగు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ► సప్లై చెయిన్‌కు అవసరమైన ప్రాజెక్టులు ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రోత్సహించే ప్రాజెక్టులు ఎవరెవరు అర్హులు... ► రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు ► పీఏసీఎస్, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలు, ఎంఎసీలు ► స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు ► ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీ ఎఫ్‌డబ్లు్యతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు. -
ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో వైద్య, ఆరోగ్య రంగానికి సర్కార్ బడ్జెట్లో ఏకంగా రూ.11,419.47 కోట్లు కేటాయించింది. 1.42 కోట్ల కుటుంబాలకు అపర సంజీవనిగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 33 శాతం అధికం కావడం గమనార్హం. ► రూ.5 లక్షలు వార్షికాదాయం లోపు ఉన్న అందరూ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తారు. ఆస్పత్రిలో రూ.1,000 బిల్లు దాటితే వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే కార్యక్రమం ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో అమలవుతుండగా దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ► గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు 54 శాతం అధికంగా నిధుల కేటాయింపు ► 108, 104 పథకాల నిర్వహణకు రూ.470.29 కోట్లు కేటాయింపు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 130 శాతం అధికం ► మండలానికొక 108 వాహనం. ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే బాధితుల ముందుకు 108 వాహనం వచ్చేలా పథకాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే ప్రతి పల్లెకూ 104 వాహనం వెళ్లేలా లక్ష్యం నిర్దేశించారు. ► ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేదవాడికి 510 రకాల మందులు అందుబాటులో ఉంచడానికి రూ.400 కోట్లు నిధుల కేటాయింపు ► జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ.1,800.03 కోట్లు కేటాయింపు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 45 శాతం ఎక్కువ. వివిధ కేంద్ర పథ కాల అమలు (టీకాల నుంచి గర్భిణులకు మందులు ఇచ్చే వరకు)కు నిధుల పెంపు ఉపయోగపడనుంది. -
బాండ్లలో స్థిరమైన రాబడులు
దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గడం ద్రవ్యలోటుపై భారాన్ని మోపేదే. ఇదంతా బాండ్ మార్కెట్‌పై ప్రతిఫలిస్తుంది. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ బాండ్ల పరంగా అధిక సరఫరా నెలకొనే పరిస్థితులు ఉన్నాయని అంచనా. అంటే ప్రభుత్వం అధికంగా రుణ సమీకరణ చేస్తే అది బాండ్ మార్కెట్‌పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ద్రవ్యలోటు అంచనాలను మించే అవకాశాలు, అలాగే, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం బాండ్ ఈల్డ్స్‌ను నిర్ణయించనున్నాయి. స్వల్పకాల బాండ్లలో ర్యాలీ నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో దీర్ఘకాల గిల్డ్ ఫండ్స్ తీసుకోవడం కొంత రిస్కే అవుతుంది. కనుక ఈ విధమైన పరిస్థితుల్లో అన్ని రకాల కాల వ్యవధులు కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను పెట్టుబడులకు పరిశీలించడం అనుకూలం అవుతుంది. మార్కెట్లలో రేట్లకు అనుగుణంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియోలోని బాండ్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో ఉంటారు. కనుక ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్‌సీజన్స్ బాండ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పనితీరు..: డైనమిక్ బాండ్స్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్‌సీజన్స్ బాండ్ పథకం నిలకడైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై రాబడులు 10.4 శాతం. కానీ, ఈ కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 7.8 శాతమే. అలాగే, మూడేళ్లలో వార్షిక రాబడులు 6.9 శాతంగా ఉంటే, ఐదేళ్లలో సగటు వార్షిక రాబడులు 8.8 శాతంగా ఉండడం బాండ్లలో మెరుగైన పనితీరుగానే చూడాల్సి ఉంటుంది. మూడేళ్లలో డైనమిక్ బాండ్స్ విభాగం సగటు వార్షిక రాబడులు 5.1 శాతం, ఐదేళ్ల కాలంలో 7.1 శాతంతో పోలిస్తే ఈ పథకం పనితీరు బాగానే ఉంది. కొంత రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారికి మంచి ఫండ్. పెట్టుబడుల విధానం.. డిసెంబర్లో ఆర్బీఐ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత పదేళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ వేగంగా పెరిగాయి. 30 బేసిస్ పాయింట్ల వరకు పెరిగి 6.7–6.8 శాతాన్ని చేరాయి. కానీ, ఆర్బీఐ ట్విస్ట్, ఓఎంవో చర్యలతో మళ్లీ ఈల్డ్స్ తగ్గాయి. అయితే, దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్స్ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. సాధారణంగా దీర్ఘకాలిక బాండ్లు వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. కనుక అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలమైన కాలానికి బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. -
అన్ని శాఖలకు నిధులు తగ్గించాలి..
సాక్షి, హైదరాబాద్ : దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటాలో రూ. 924 కోట్ల మేర కోత.. ‘2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ. 19,719 కోట్లు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 18,560 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ. 10,304 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ. 10,528 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికరంగా ఇప్పటివరకు రూ. 224 కోట్ల మేర రాబడి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం పక్కనపెడితే ఈ ఏడాది 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 700 కోట్లు అధికంగా రావాల్సి ఉండగా రూ. 224 కోట్ల మేర కోత పడటంతో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా మొత్తంగా రూ. 924 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పన్నుల వాటా 8.3 శాతం తగ్గిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాటాలో రాబడి 15 శాతం మేర తగ్గితే రూ. 2,957 కోట్ల మేర కోత పడుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో అనేక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్ని శాఖలకు నిధులు తగ్గించండి... ‘అన్న వస్త్రం కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. కేంద్ర పన్నుల వాటా రాబడి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలి’అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుల తగ్గింపును ఏదో ఒక శాఖకు వర్తింపజేయకుండా అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడిందని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని, అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఖర్చుల్లో కోత, ఆర్థిక నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్ర నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకుంటే ఎదురయ్యే ఇబ్బందులను ఐదారు రోజుల్లో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలోఉన్నట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయండి... కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనిపక్షంలో వాస్తవాలను విడుదల వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ శనివారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం ఎగ్గొంటిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీ ద్వారా 14 శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టాన్ని పూడుస్తామని జీఎస్టీ చట్టం అమలు సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,719 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు. -
కలెక్టర్లకూ ఓ ఖజానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా కలెక్టర్లకు అధికారం, దర్పం, హోదా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు చిల్లిగవ్వ కూడా వారి ఖజానాలో లేని దుస్థితి. ఆసుపత్రి అభివృద్ధి నిధులనో, ఖనిజాభివృద్ధి నిధులనో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఓ ఖజానాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్‌కు ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు రూ.195 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా.. కలెక్టర్ల విచక్షణకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఇప్పటికే రూ.6.5 కోట్ల మేర నిధుల వినియోగానికి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారానే అన్ని పనులు వాస్తవానికి గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను(ఎస్డీఎఫ్) కేటాయించింది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించింది. కానీ, నిధుల వినియోగంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం రెయిన్గన్ల కొనుగోలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసింది. ఇందులో కొన్ని పనులను అప్పటి అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై అప్పగించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ పని అయినా టెండర్ ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో రూ.6.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఎక్కడా నామినేషన్ పద్ధతిని పాటించడం లేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్‌ను సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తాం. తద్వారా రానున్న రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే రెండేళ్లలో పరిస్థితిలో మరింత సానుకూల మార్పు రావడం ఖాయం’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. -
అప్పుతోనే ‘సాగు’తుంది!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కోత పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్లలో రూ.25 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఈసారి రూ.8,476.17 కోట్లకే పరిమితం చేసింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.3 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.3 కోట్లు కేటాయించింది. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రుణాల ద్వారా సేకరించిన నిధులనే ఖర్చు చేయనుండగా, సీతారామ, వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టుల తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణాలతో నెట్టుకు రానున్నారు. మొత్తంగా రూ.12,400 కోట్ల రుణాలతో ప్రాజెక్టుల పనులను వేగిరం చేసే అవకాశం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా మూడేళ్ల పాటు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్లో 6 నెలలకే రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం సాగునీటికి కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో అధికంగా సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,324.02 కోట్లు కేటాయించగా, కాళేశ్వరం రూ.1,080.18 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర పథకాల నుంచి నిధులు వచ్చే అవకాశాల నేపథ్యంలో దీనికి రూ.545 కోట్లు కేటాయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా, రూ.78 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారు. ఇందులో కల్వకుర్తికి రూ.4 కోట్లు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు చెరో రూ.25 కోట్ల మేర కేటాయింపులతో సరిపెట్టారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తవడం, తూముల నిర్మాణంతో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం మాత్రమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడింది. గతంలో ప్రతిసారి రూ.2 వేల కోట్లకు పైగా కేటాయిస్తూ వస్తుండగా, ఈసారి రూ.643 కోట్లకు పరిమితం చేశారు. రుణాలతోనే గట్టెక్కేది.. 2018–19 వార్షిక బడ్జెట్లో సాగునీటికి రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేయగా, దీన్ని ప్రస్తుతం రూ.19,985 కోట్లకు సవరించారు. ఇది కాళేశ్వరం రుణాల ద్వారా మరో రూ.15 వేల కోట్లు, దేవాదుల, సీతారామలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా మరో రూ.3 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. రుణాలతో కలిపి ఖర్చు చేసిన మొత్తాలను చూస్తే ఈ ఏడాది రూ.35 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగింది. అయితే రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు చేసిన పాలమూరు–రంగారెడ్డికి రూ.3 వేల కోట్లు కేటాయించగా, దాన్ని రూ.2,179 కోట్లకు సవరించారు. తుపాకులగూడేనికి రూ.700 కోట్లు కేటాయించగా, దాన్ని రూ.518 కోట్లకు సవరించారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ను పూర్తిగా కుదించారు. రూ.8,476 కోట్లకు కుదించడంతో పూర్తిగా రుణాల ద్వారానే భారీ ప్రాజెక్టులకు నిధుల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మొదటి దశ పనుల పూర్తికి కార్పొరేషన్ ద్వారా రూ.45 వేల కోట్ల రుణాలు సేకరించగా, ఇందులో ఇప్పటికే రూ.38 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను ఖర్చు చేసి మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్ పనులను పూర్తి చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, ఇప్పటికే రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ.6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను వినియోగించుకుంటూ మొత్తం పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్లు రుణం తీసుకుంటున్నారు. దీంట్లోంచే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా అన్ని ప్రధాన ప్రాజెక్టులకు కలిపి రుణాల ద్వారానే రూ.12,400 కోట్లకు పైగా ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లెక్క తేలాల్సిందే!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై లెక్క తేల్చేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా విభాగానికి చెందిన ప్రత్యేక అధికారులతో కూడిన బృందం ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 3,157 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 వరకు సెకండరీ పాఠశాలలు (హైస్కూల్ స్థాయి) ఉన్నాయి. సాక్షి, మచిలీపట్నం: పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రకాలుగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వ శిక్షాభియాన్ విభాగం నుంచి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ విభాగం నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు స్కూల్ కాంప్లెక్స్(పాఠశాల సముదాయం)గా గుర్తించిన వాటికి ప్రత్యేకంగా ఏడాదికి సుమారుగా రూ. 20 వేల వరకు నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ రూపేణా వేర్వేరుగా నిధులు విడుదల చేయగా, 2017–18 విద్యా సంవత్సరంలో ఈ రెండింటినీ కలిపి, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని స్కూల్ గ్రాంట్ రూపేణా నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ. 12,500, ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయిలోని విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ కోసం రూ. 34 వేల నుంచి రూ.50 వేల వరకు మంజూరు చేశారు. ఇవే కాకండా పాఠశాలల్లో స్వచ్ఛభారత్ పేరిట, టీఎల్ఎం మేళా, సైన్స్‌ఫేర్ నిర్వహణ, విద్యార్థులను ఎక్స్కర్షన్ ట్రిప్‌కు తీసుకువెళ్లేందుకు ఇలా వివిధ రకాలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఎలా వినియోగించారనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అధికారులు పరిశీలనకు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ఇలా.. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు. నందిగామ డివిజన్ల వారీగా ఆర్‌ఎంఎస్‌ఏ బృందం సభ్యులు పర్యటించనున్నారు. డివిజన్ కేంద్రాల్లోని ఒక చోట అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తగిన రికార్డులు, నివేదికలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 20న గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్, 21న నూజివీడులోని డెప్యూటీ డీఈఓ కార్యాలయం, 22న విజయవాడ, నందిగామ డివిజన్లకు చెందిన పాఠశాలల రికార్డులను పరిశీలించనున్నారు. రెండు డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులంతా విజయవాడలోని పటమట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 24న మచిలీపట్నంలోని ఆర్సీఎం హైస్కూల్లో బృందం అందుబాటులో ఉండి డివిజన్లోని పాఠశాలల నివేదికలను పరిశీలించనున్నారు. సమగ్ర పరిశీలన బ్యాంక్ స్టేట్మెంట్, 2019 మార్చి 31 వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకం, నిధుల మంజూరీకి సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర ఉత్తర్వులు సిద్ధం చేసుకొని తీసుకువెళ్లాలి. అదేవిధంగా లావాదేవీలకు సంబంధించిన పుస్తకం, నగదు నిల్వ పుస్తకం, ఇందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో కాకుండా చేతిలో ఉన్న నగదు, ఎందుకు నగదు ఉంచుకున్నారనే దానిపై తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో చేసిన సివిల్ వర్క్స్ వివరాలు, వాటికి వెచ్చించిన నిధులు, మెజర్మెంట్ (ఎంబుక్) పుస్తకం, పాఠశాల అభివృద్ధి కమిటీ తీర్మానాల పుస్తకం, మిగులు నిధులు బ్యాంకులో చెల్లిస్తే, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విచారణ బృందానికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి ఆర్‌ఎంఎస్‌ఏ బృందం విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మళ్లీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదికలతో ఆడిట్ బృందం ముందు హాజరుకావాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. -
తిన్నది ఎవరో తెలవడం లేదు..?
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : మండలంలో టీడీపీ ప్రభుత్వం ప్రచార యావతో నిర్వహించిన జన్మభూమి సభల నిర్వహణ నిధులు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ వాటిని ఇప్పటికీ పంచాయతీలకు పంపిణీ చేయలేదు. ఆ నిధుల ఖర్చులో మండల పంచాయతీ అధికారి చేతివాటం చూపినందునే పంపిణీ జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి సభలు నిర్వహించింది. అప్పట్లో దీనికోసం నిధులు వెంటనే ఇవ్వలేదు. దాంతో పంచాయతీ కార్యదర్శులే చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో కార్యదర్శుల పైనే ఈ భారం పడింది. ప్రతీ గ్రామంలో సభ కోసం 3 షామియానాలు, 500 కుర్చీలు, బల్లలు, వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, సభ నిర్వహణపై ముందురోజు ఆటోలతో ప్రచారం, వైద్య శిబిరాలు ఉన్న చోట వాటికి ప్రత్యేకంగా షామియానాల ఏర్పాటు.. ఇలా ఒక సభ నిర్వహణకు తడిసిమోపెడు ఖర్చులయ్యాయి. ఇవన్నీ అయ్యాక అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలకు అదనంగా మరింత ఖర్చు అయింది. సభకు రూ.20 నుంచి రూ.25వేల వరకు ఖర్చు.. సభల నిర్వహణ కోసం ఒక్కోదానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అయినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇటీవల పంచాయతీకి రూ.5వేల చొప్పున 22 పంచాయతీలకు రూ.1.10 లక్షలు విడుదల చేసినట్లు పంచాయతీ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా మాకు అందలేదని కార్యదర్శులు చెబుతున్నారు. వాటి కోసం ఎంపీడీఓను కార్యదర్శులు అడగ్గా ఆయన ఈఓపీఆర్డీకి చెక్ రాసి ఇచ్చానని, ఆయన్నే ఆడగాలని సూచించారు. ఈఓపీఆర్డీని అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. ఈఓపీఆర్డీ చేతివాటం చూపినట్లు కార్యదర్శులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ విద్యాసంస్థలకు రూ. 6143 కోట్లు కేటాయించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా సంస్థలకు 6,143 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కోసం జరిపిన నిధుల కేటాయింపు గురించి వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి ఈ మొత్తం కేటాయించినట్టు గురువారం రాజ్యసభలో వెల్లడించారు. అంతేకాకుండా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. విద్యాసంస్థలకు కేటాయించిన మొత్తంలో 2018 డిసెంబర్ నాటికి 195.14 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2017-18 బడ్జెట్లో విద్యా సంస్థలకు 250 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని చెప్పిన సత్యపాల్ సింగ్.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2018 డిసెంబర్ 14వ తేదీన లోక్‌సభ ఆమోదం పొందినట్టు తెలిపారు. కేటాయింపుల్లో.. సెంట్రల్ యూనివర్సిటీకి 902 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి(తెలంగాణతో కలిపి) 834 కోట్లు, ఐఐటీ తొలి దశకు 1074 కోట్లు, ఎన్ఐటీకి 460 కోట్లు, ఐఐఎంకు 594 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్‌కి 1979 కోట్లు, ట్రిపుల్ ఐఐటీకి 297 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా విద్యా సంస్థలను శాశ్వత క్యాంపస్‌లకు తరలించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఐఐటీ భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి గుర్తుచేశారు. -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు. -
యోగివేమన యూనివర్సిటీకి నిధుల కొరత
-
హిందూ ఆలయంపై పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రావల్పిండిలోని శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. రావల్పిండి, ఇస్లామాబాద్ జంటనగరాల్లో మనుగడలో ఉన్న పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఇది ఒక్కటే. ప్రావిన్స్ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్ ఆసిఫ్ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్ పేర్కొన్నారు. 1897లో కంజీమాల్, రామ్ రచ్‌పాల్ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేయించాక.. వివిధ పండగలప్పుడు మరింతమంది హిందువులు వచ్చి పూజలు చేసుకొనేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. -
పోల'వరం' దక్కేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో తాజా బడ్జెట్లో రూ.8,829.39 కోట్లు కేటాయించింది. అయితే, కేంద్రం నుంచి కచ్చితంగా నిధులు వస్తాయా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నెలన్నర తర్వాత రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.6,889 కోట్లు కేటాయించారు. ఆ నిధులన్నీ కేంద్రం నుంచే వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ, కేంద్రం రూ.1,582.56 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో పోల వరానికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు. అయితే, కేంద్రం నుంచి రూ.8,829.39 కోట్లు వస్తాయని చూపి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిం చారు. కేంద్రం నుంచి రాకపోతే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకపోవడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొంటున్నారు. పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ఏ ఇతర జాతీయ ప్రాజెక్టుకు లేని తరహాలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, ఒప్పందం చేసుకోకుండా, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక హోదాను వదులుకోవడానికి సిద్ధపడటంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. నిర్మాణ బాధ్యతలు దక్కిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. ఈ పాపం ఎవరిది? విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగించి ఉంటే.. నిర్మాణ భారం ఒక్క పైసా కూడా రాష్ట్ర సర్కార్‌పై పడేది కాదు. నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించేటప్పుడు కేంద్రం విధించిన షరతుల వల్ల ఆదిలోనే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. విద్యుత్, తాగునీటి ప్రాజెక్టు వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడంపై కేంద్రం నివ్వెరపోయింది. కేంద్రం ఆమోదముద్ర వేయకుంటే రాష్ట్ర ఖజనాపై రూ.45,265.15 కోట్లకుపైగా భారం పడుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 540 గ్రామాల ప్రజలకు తాగునీరు, విశాఖకు 23.44 టీఎంసీల నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి రాకుండా పోతోంది.