బ్యాంకు అధికారులతో గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
విజయవాడ: బ్యాంకు అధికారులతో గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2016- 17 సంవత్సరానికి గానూ రూ. 1,65,538 కోట్లతో యాక్షన్ ప్లాన్‌పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బ్యాంకర్ల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఒకే రంగానికి కేటాయించిన నిధులు వేరే రంగానికి మరలుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా జరగాలన్నారు. లేకుంటే లక్ష్యం సాధించలేమని ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకు అధికారులకు సూచించారు.