
కలకత్తా: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్‌లో సవతితల్లి ప్రేమ చూపించారని తృణమూల్‌కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో శనివారం(జులై 26) జరిగే నీతిఆయోగ్ సమావేశానికి హాజరై చెబుతానన్నారు.
నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం(జులై26) ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నా.
ఒకవేళ వాళ్లు నాకు మాట్లాడటగానికి నాకు అనుమతివ్వకపోతే నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వస్తా అని మమత తెలిపారు. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమత తొలి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు.