చెన్నై: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు పలికారు. నీతిఆయోగ్ భేటీలో మమత మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన శనివారం(జులై 27) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలి. వారిని శత్రువులుగా చూడకూడదు.
కోఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాగించాలంటగే చర్చలకు అవకాశం ఉండాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, నీతిఆయోగ్ మీటింగ్‌లో కేవలం 5 నిమిషాలే తనను మాట్లాడించారని, తర్వాత మైక్ కట్ చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment