ఆరోగ్యానికి అభయం | Huge Allocations of funds to Medical and Health department in AP Budget | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి అభయం

Published Wed, Jun 17 2020 5:46 AM | Last Updated on Wed, Jun 17 2020 5:46 AM

Huge Allocations of funds to Medical and Health department in AP Budget - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో వైద్య, ఆరోగ్య రంగానికి సర్కార్‌ బడ్జెట్‌లో ఏకంగా రూ.11,419.47 కోట్లు కేటాయించింది. 1.42 కోట్ల కుటుంబాలకు అపర సంజీవనిగా ఉన్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 33 శాతం అధికం కావడం గమనార్హం. 

► రూ.5 లక్షలు వార్షికాదాయం లోపు ఉన్న అందరూ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తారు. ఆస్పత్రిలో రూ.1,000 బిల్లు దాటితే వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే కార్యక్రమం ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో అమలవుతుండగా దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. 
► గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు 54 శాతం అధికంగా నిధుల కేటాయింపు
► 108, 104 పథకాల నిర్వహణకు రూ.470.29 కోట్లు కేటాయింపు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 130 శాతం అధికం
► మండలానికొక 108 వాహనం. ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే బాధితుల ముందుకు 108 వాహనం వచ్చేలా పథకాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే ప్రతి పల్లెకూ 104 వాహనం వెళ్లేలా లక్ష్యం నిర్దేశించారు.
► ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేదవాడికి 510 రకాల మందులు అందుబాటులో ఉంచడానికి రూ.400 కోట్లు నిధుల కేటాయింపు 
► జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ.1,800.03 కోట్లు కేటాయింపు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 45 శాతం ఎక్కువ. వివిధ కేంద్ర పథ కాల అమలు (టీకాల నుంచి గర్భిణులకు మందులు ఇచ్చే వరకు)కు నిధుల పెంపు ఉపయోగపడనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement