Budget session of Assembly
-
సభా సమయం.. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. కాగా బడ్జెట్లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పారీ్టల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. సకాలంలో సమాధానాలు ఇవ్వండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఆఫీసర్ బాక్సులో అధికారులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండాల ని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు. త్వరలో ఓరియెంటేషన్ కార్యక్రమం మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. తొలిసారిగా శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన సభ్యుల కోసం రెండురోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, లెజిస్లేచర్ అడ్వైజర్ ప్రసన్నకుమార్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించాలనే నిర్ణయం నేపథ్యంలో బుధవారం మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు పాత అసెంబ్లీ భవనంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్ఎస్తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. 12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి.. గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్మెంట్లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్ -
టీఎస్ అసెంబ్లీ: అక్బరుద్దీన్ Vs కేసీఆర్ సర్కార్.. హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా? అని ప్రశ్నించారు. కాగా, అక్బరుద్దీన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటూ ఎందుకు నిలదీయలేదు?. గవర్నర్ ఏమైనా మార్పులు, చేర్పులు సూచించారా?. గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉంది అని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కేబినెట్లో జరిగిన ప్రతీ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. చర్చ సమయంలో సభా నాయకుడు కనిపించడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీవీ డిబెట్లకు వెళ్లే టైముంది.. కానీ, సభకు వచ్చే సమయం లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?. ఏవైనా సమస్యలు ఉంటే బడ్జెట్ సెషన్లో చెప్పుకోవాలి. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్ ఇచ్చారు. -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సోమవారానికి వాయిదా
Updates.. ► తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభకు సమర్పించారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు సంబంధించిన 1వ, 2వ, 3వ వార్షిక నివేదికలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభకు అందజేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 50 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏడుగురే ఉన్నారంటూ కేటీఆర్ అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా చూస్తామన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్.. ► తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయి. అందరిపై దాడులు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎనిమిదిన్నర ఏళ్లుగా విభజన చట్టంలో అంశాలు పెండింగ్ ఉన్నాయి. రివర్స్ పంపింగ్‌కు కేరాఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలించి అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజినీర్స్ ఆహ్వానించింది. మోదీ నాయకత్వంలో 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం. ► మోదీ నాయకత్వంలో అత్యధిక నిరుద్యోగిత. గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఇస్తున్నారు. 2021 వరకు బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుందన్నారు. 2021 వరకు ప్రతీ భారతీయుడికి ఇల్లు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 2022 నాటికి ప్రతీ ఇంటికి విద్యుత్ అన్నారు ఏమైంది?. మోదీ నాయకత్వంలో సిలిండర్ ధర రూ.400-1200కు పెరిగింది. ► తెలంగాణ ప్రస్థానం దేశానికే ఆదర్శం. ప్రతిపక్ష నేతల పక్షపాత ధోరణి సరికాదు. దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా తెలంగాణ మారింది. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరింది. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం.. ముచ్చట్లు చెప్పడం అభివృద్ధి కాదు. ► రాష్ట్రాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేయవద్దువిద్యుత్ రంగం కేసీఆర్ రాకముందు ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉంది. కేసీఆర్ నినదిస్తూ దేశమంతా వినిపిస్తున్నారు. ► రైతుబంధు అసాధారణమైన కార్యక్రమం. అసాధారణమైన నాయకులకే ఈ ఆలోచనలు వస్తాయి. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ 65వేల కోట్ల రూపాయలు జమ చేశారు. ప్రపంచలోనే వినూత్న పథకంగా రైతుబంధు కార్యక్రమం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించింది. ► నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు?. దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడే ప్రధాని ఎక్కడా ఉండరు. డిస్కంలను ఎందుకు ప్రైవేటీకరించాలి. ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తాము. మేము రైతు రాజ్యం కావాలంటే.. బీజేపీ కార్పొరేట్ రాజ్యం కావాలంటోంది. ► గుజరాత్లో పైకి బిల్డప్ తప్ప లోపల ఏమీ ఉండదు. కచ్చితంగా దేశమంతా కదం తొక్కుతాము అని కామెంట్స్ చేశారు. నాయకుడు నటించొద్దు.. లీనమై పనిచేయాలి. హంతకులే సంతాపలు పలికినట్టు ఉంది వారు తీరు. రాష్ట్రం మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మంచి పథకాలు. క్యాన్సర్ రోగుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. యాదాద్రికి మెట్రోరైల్ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. కానీ, అది గవర్నర్ ప్రసంగంలో రాలేదు. ► శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టులు ఎందుకు సాధించలేకపోతున్నారు?. మీ ఉద్యమస్పూర్తి ఏమైంది?. బీఆర్ఎస్ పెట్టుకుని ఎక్కడైనా తిరగండి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత మీపైన ఉంది. ► తెలంగాణ శాసన మండలిలో రగడ మొదలైంది. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ► పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ► అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్ ఇచ్చారు. ► పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం ► అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్ ► సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ కౌంటర్ ► బీఏసీ సమావేశానికి ఎంఐఎం నేతలు ఎందుకు రాలేదని కేటీఆర్ నిలదీత ► గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన సండ్ర వెంకట వీరయ్య. ► రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లను కేంద్రం కాపీ కొడుతోంది. రేషన్ కోసం అవసరమైన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. దళిత బంధు పథకాన్ని విపక్షాలు అర్థం చేసుకోవాలి. పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలి. కోర్టులకు వెళ్లి దళితబంధు పథకం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కడుపు నింపేవి కావు. - సండ్ర వీరయ్య. ► గవర్నర్ ప్రసంగాన్ని బలపరుస్తున్న సండ్ర వెంకట వీరయ్య ► రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ► మొదటి రోజు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ► శనివారం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుంది. ► ఇదిలా ఉండగా.. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. కనీసం 20 రోజులైన సభ జరపాలని ఎంఐఎం కోరింది. అయితే, సమావేశాల కొనసాగింపుపై ప్రభుత్వం ఈనెల 8వ తేదీన నిర్ణయం తీసుకోనుంది. ఇక, బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ► మరోవైపు, సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు. అటు, మండలిలో కూడా గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్.. ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు. -
తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపి.. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 7వ తేదీ నుంచి మొదలవుతున్న సమావేశాలు కొత్త సెషన్ కాదని, అంతకుముందు సెషన్‌కు కొనసాగింపేనని పేర్కొందని వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. సాధారణంగా అయితే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభను కొత్త సెషన్‌తో ప్రారంభిస్తారని తమిళిసై తెలిపారు. అయినా మునుపటి సెషన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. సాంకేతిక కారణాలను చూపి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందని విమర్శించారు. ‘‘వాస్తవానికి గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ కార్యాలయం తయారు చేయదు. అది ప్రభుత్వం రాసి ఇచ్చే ప్రకటనే. గతేడాది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలతోపాటు తదుపరి ఏడాదికి సంబంధించిన విధాన సూచికల ప్రగతి నివేదికే (ప్రోగ్రెస్ రిపోర్టు) గవర్నర్ ప్రసంగం. ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై, ప్రభుత్వ పాలనపై సభలో అర్థవంతమైన చర్చ జరగడానికి గవర్నర్ ప్రసంగం అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి ప్రజాస్వామ్య సూత్రాలను పటిష్టం చేయడానికి సభ్యులకు కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించడం వరకే గవర్నర్ పాత్ర పరిమితమని పేర్కొన్నారు. అధికారం ఉన్నా జాప్యం చేయలేదు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగంతోనే సభ ప్రారంభమవుతుందని తెలిపిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దీనిపై వివరణ కోరగా.. అనుకోకుండా జరిగిన తప్పిదం వల్ల అలా వచ్చిందంటూ ప్రభుత్వం నోట్ పంపడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ‘‘రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేశాను. ఈ విషయంలో కావాల్సినంత సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉన్నా.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలు ఉన్నా.. నా తొలి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాబట్టి.. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు శుభం జరగాలని ఆకాంక్షించారు. -
రూ.2 లక్షల కోట్లకు చేరువలో రాష్ట్ర బడ్జెట్!
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 లక్షల కోట్లకు చేరువగా బడ్జెట్ అంచనాలు ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు 2021–22 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గురువారం ఉదయం 11:30 గంట లకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా, ప్రస్తుతం అమల్లో అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలుంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చేలా కేటాయింపులు ఉండనున్నాయి. సొంత రాబడులతో పాటు రుణాల ద్వారా, భూముల అమ్మకాలు, మార్కెట్ విలువల సవరణల ద్వారా నిధులు రాబట్టుకునే ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 లక్షల కోట్ల అంచనాలు ప్రతిపాదించగా, ఈసారి అందుకు 10% అదనంగా రూ.2 లక్షల కోట్లకు చేరువలో ప్రతి పాదిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రూ. 1,000 కోట్లతో దళిత జ్యోతి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారయ్యాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ, రుణమాఫీలకు నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని దళిత వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి నేరుగా నిధులు కేటాయించే విధంగా ‘దళిత జ్యోతి’పేరుతో కొత్త పథకాన్ని కూడా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి తొలి ఏడాది రూ.1,000 కోట్ల నిధులు ప్రతిపాదించనున్నారని సమాచారం. దీంతో పాటు గత ఏడాది కంటే కొంచెం ఎక్కువగా సాగునీటి ప్రాజెక్టులకు రూ. 22 వేల కోట్లు, రైతు బంధు కోసం రూ.12 వేల కోట్లు, రైతు బీమా కింద రూ. 1,200 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ. 12,000 కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.1,000 కోట్లు, అన్ని స్థాయిల్లోని విద్యకు రూ.14 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు కోసం రూ.5,500 కోట్లు, ఆర్టీసీకి అదనపు సాయం కింద రూ.2,500 కోట్ల మేర నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఏడాదికి రూ.3 కోట్లు, గతంలో మూసీ ప్రక్షాళన కోసం కేటాయించిన రూ.10 వేల కోట్లు కొనసాగిస్తారని సమాచారం. దీంతో పాటు బీసీ సంక్షేమానికి కూడా రూ.4 వేల కోట్ల వరకు ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. జీతభత్యాలు, సబ్సిడీలకు రూ.60 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక రాబడులు, ఖర్చులను పరిశీలిస్తే ఈసారి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్లు, వివిధ సబ్సిడీ పథకాల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. 2019–20 బడ్జెట్లో ఈ మూడు పద్దుల కింద రూ.40 వేల కోట్ల వరకు కేటాయించగా, 2020–21లో రూ.45 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈసారి అది రూ.50 వేల కోట్లకు చేరుతుందని, కొత్తగా ప్రకటించనున్న పీఆర్సీ కింద మరో రూ.8 వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి. మొత్తం మీద ఈ మూడు పద్దులకు రూ.60 వేల కోట్లు అవసరం అవుతాయని, రుణాల చెల్లింపులు, వడ్డీల కోసం రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవి పోను, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు కోసం, రెవెన్యూ ఖర్చు కింద రూ.1.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు ఉండనున్నాయి. కాగా నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకే పింఛన్ లాంటి ఎన్నికల హామీల అమలుకు ఈసారి నిధుల కేటాయింపులు అనుమానమేననే చర్చ ఆర్థికశాఖ వర్గాల్లో జరుగుతోంది. వీటికి నిధులు ప్రతిపాదించాలంటే మరో రూ.10 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. రాబడులు పెంచుకునే విధంగా... బడ్జెట్ పద్దులో ప్రభుత్వ అనివార్య ఖర్చులు ఏటేటా పెరుగుతుండటంతో రాబడులను పెంచుకోవడం కూడా అనివార్యమవుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది కరోనా కొట్టిన దెబ్బకు అప్పుల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించినా ప్రభుత్వం ఆశించినంత మేర పద్దులెక్క చేరుకోలేదు. రూ.50 వేల కోట్ల వరకు ఆదాయంపై ప్రభావం పడినందున ఈసారి బడ్జెట్లో సొంత నిధుల సమీకరణ ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భూముల అమ్మకాలు, భూముల మార్కెట్ విలువ సవరణల ద్వారా నిధులు సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఊపందుకున్న రియల్ వ్యాపారంతో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఏడాది రూ.1,000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. దీనికి తోడు భూముల మార్కెట్ విలువలను సవరిస్తే గరిష్టంగా మరో రూ.4 వేల కోట్ల వరకు సమీకరించుకునే అవకాశం ఉంది. ఎక్సైజ్ డ్యూటీల కింద కూడా గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు అదనపు అంచనాలు ప్రతిపాదించనున్నారు. ఇక, భూముల అమ్మకాల విషయానికి వస్తే రాజీవ్ గృహకల్ప, దిల్, కోకాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ.20 వేల కోట్లకు పైగా సమకూర్చుకునే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రతి యేటా ఈ భూముల అమ్మకాల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి సొంత ఆదాయ పెంపు అనివార్యం కావడంతో నిరుపయోగంగా, రక్షణ కష్టంగా ఉన్న భూముల అమ్మకాల ద్వారా రూ.10 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటికి తోడు రుణాల ద్వారా ఈసారి రూ.40 నుంచి 50 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలు పెట్టనున్నారు. -
నేటి నుంచి బడ్జెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేయనున్న ప్రసంగంతో ఈ సమావేశాలు షురూ కానున్నాయి. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తొలగని పరిస్థితుల్లో కొన్ని ఆంక్షలు, నిబంధనలతో ఈసారి బడ్జెట్ భేటీకి అసెంబ్లీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే శాసనసభ్యులు, వారి సహాయకులతో పాటు పోలీసులు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. ఉభయసభల్లోనూ సభ్యులు కూర్చునే సమయంలో భౌతికదూరం పాటించేలా సీట్ల ఏర్పాటు చేశారు. అదనపు సీట్లు ఏర్పాటు చేసి సభ్యునికి సభ్యునికి మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన సమావేశాల తరహాలోనే మీడియా పాస్‌లపై ఆంక్షలు విధించారు. అటు మండలి, ఇటు శాసనసభలో ఒక్కో మీడియా సంస్థ నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించేలా పాసులు జారీ చేసిన శాసనసభ సెక్రటేరియట్ ఈసారి కూడా విజిటర్స్‌కు ఎంట్రీని నిషేధించింది. కేవలం సభ్యులు, వారి వ్యక్తిగత సిబ్బంది, అసెంబ్లీ స్టాఫ్, పోలీస్, మీడియా వర్గాలను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. నేడు షెడ్యూల్ ఖరారు తొలిరోజు సోమవారం శాసనమండలి, సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత శాసననభా వ్య వహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ అయి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. మంగళవారం సిట్టింగ్ సభ్యుడు నోముల నర్సింహయ్యతో పాటు గత సమావేశాల అనంత రం మరణించిన మాజీ సభ్యులకు సంతాపాల తీర్మానాల వరకు పరిమితమయ్యే అవకాశముంది. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి.. అదే రోజు చర్చ, సీఎం సమాధానం, అనంతరం ఆమోదం ఉండే లా షెడ్యూల్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాతి రోజున అంటే ఈనెల 18వ తేదీన 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచనున్నా రు. 19న సెలవు ప్రకటించి 20 నుంచి 5 లేదా 6 రోజుల పాటు వరుసగా సమావేశాలు జరిపి హోలీ కంటే ముందే బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా ఈసారి బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. గత ఏడాది రూ. 1.83 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కరోనా దెబ్బ పడింది. అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయవనరులు గాడిలో పడటం, ఈసారి సొంత ఆదాయాలను పెంచుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు పె ట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండటంతో ని రుటి కంటే ఎక్కువగానే ఈసారి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను కొనసాగిస్తూనే, నిరుద్యోగ భృతికి కూడా నిధుల కేటాయింపు చేస్తారని తెలుస్తోంది. భూముల అమ్మకా లు, మార్కెట్ విలువల సవరణలతో అదనపు ఆ దాయం సమకూర్చుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా ఈనెల 18వ తేదీ ఉదయం శాసనసభ ఆవరణలోనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై.. వచ్చే ఏడాది కోసం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుందని అధికార వర్గాల సమాచారం. -
తెలంగాణ బడ్జెట్‌కు వేళాయే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఆ మరునాడే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలిరోజున గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా వేస్తారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించి.. ఎప్పటివరకు సమావేశాలు జరపాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 16న సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడనుంది. 17న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ, సమాధానం ఒకేరోజు పూర్తి చేసి.. 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో బడ్జెట్‌పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలోనే సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తేదీలపై అధికారంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మార్చి మధ్యలో నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ లెక్కన ఈ నెల 14 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీగా ఉంటున్నందున ఆ తర్వాతే సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని పద్దులపై సుదీర్ఘంగా చర్చలు కాకుండా స్వల్ప వ్యవధిలోనే ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. సమావేశాల్లోనూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. -
ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో వైద్య, ఆరోగ్య రంగానికి సర్కార్ బడ్జెట్లో ఏకంగా రూ.11,419.47 కోట్లు కేటాయించింది. 1.42 కోట్ల కుటుంబాలకు అపర సంజీవనిగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 33 శాతం అధికం కావడం గమనార్హం. ► రూ.5 లక్షలు వార్షికాదాయం లోపు ఉన్న అందరూ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తారు. ఆస్పత్రిలో రూ.1,000 బిల్లు దాటితే వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే కార్యక్రమం ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో అమలవుతుండగా దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ► గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు 54 శాతం అధికంగా నిధుల కేటాయింపు ► 108, 104 పథకాల నిర్వహణకు రూ.470.29 కోట్లు కేటాయింపు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 130 శాతం అధికం ► మండలానికొక 108 వాహనం. ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే బాధితుల ముందుకు 108 వాహనం వచ్చేలా పథకాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే ప్రతి పల్లెకూ 104 వాహనం వెళ్లేలా లక్ష్యం నిర్దేశించారు. ► ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేదవాడికి 510 రకాల మందులు అందుబాటులో ఉంచడానికి రూ.400 కోట్లు నిధుల కేటాయింపు ► జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ.1,800.03 కోట్లు కేటాయింపు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 45 శాతం ఎక్కువ. వివిధ కేంద్ర పథ కాల అమలు (టీకాల నుంచి గర్భిణులకు మందులు ఇచ్చే వరకు)కు నిధుల పెంపు ఉపయోగపడనుంది. -
3 రాజధానులకు మార్గం సుగమం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ‘పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఈ బిల్లులను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ విఫలయత్నాలు చేసింది. ఆ బిల్లులను పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి నివేదించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో మండలి నియమావళిని ఉల్లంఘించింది. నిబంధనల ప్రకారం శాసనమండలి చైర్మన్‌కు ముందస్తు నోటీసు ఇవ్వలేదు. నియమావళిలో నిర్దేశించిన ప్రక్రియను పాటించలేదు. కాబట్టి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించడం సాధ్యం కాదని ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆ రెండు బిల్లులను శాసనసభలో రెండోసారి ప్రవేశపెట్టి ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం ► ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం –1994 సవరణ బిల్లుకు ఆమోదం. ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేసేలా చట్ట సవరణకు ఈ బిల్లు తెచ్చారు. ప్రలోభాలు, అక్రమాలకు స్థానం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా తెచ్చిన మార్పులు కూడా బిల్లులో ఉన్నాయి. ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లుకు ఆమోదం ► జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం మేరకు రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. ► ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లుకు ఆమోదం. ► అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లుకు ఆమోదం. ► పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లుకు ఆమోదం. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రమాణాలు పాటించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది. ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ► రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. -
సీమ సమస్యలపై రేపు చలో అసెంబ్లీ
నీళ్లు, నిధులు కావాలని వామపక్షాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాయలసీమ అభివృద్ధికి నిధులు, నీళ్లు కావాలనే డిమాండ్‌తో పది వామపక్ష పార్టీలు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాయి. డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో చలో అసెంబ్లీ చేపట్టాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమ పరిస్థితిని చర్చించాలని డిమాండ్ చేశాయి. చలో అసెంబ్లీ సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని పేర్కొన్నాయి. రాయలసీమ సమస్యలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రస్తావించి చర్చ జరిగేలా చూడాలని సీపీఐ, సీపీఎంలు విజ్ఞప్తి చేశాయి. పెట్టుబడి రాయితీ, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం, నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరాయి. 22న చలో విజయవాడ: గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తానని వాగ్దానం చేసి 21 నెలలు గడిచినా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 22న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తున్నట్లు పది వామపక్ష పార్టీలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు