సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేయనున్న ప్రసంగంతో ఈ సమావేశాలు షురూ కానున్నాయి. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తొలగని పరిస్థితుల్లో కొన్ని ఆంక్షలు, నిబంధనలతో ఈసారి బడ్జెట్ భేటీకి అసెంబ్లీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే శాసనసభ్యులు, వారి సహాయకులతో పాటు పోలీసులు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. ఉభయసభల్లోనూ సభ్యులు కూర్చునే సమయంలో భౌతికదూరం పాటించేలా సీట్ల ఏర్పాటు చేశారు.
అదనపు సీట్లు ఏర్పాటు చేసి సభ్యునికి సభ్యునికి మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన సమావేశాల తరహాలోనే మీడియా పాస్‌లపై ఆంక్షలు విధించారు. అటు మండలి, ఇటు శాసనసభలో ఒక్కో మీడియా సంస్థ నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించేలా పాసులు జారీ చేసిన శాసనసభ సెక్రటేరియట్ ఈసారి కూడా విజిటర్స్‌కు ఎంట్రీని నిషేధించింది. కేవలం సభ్యులు, వారి వ్యక్తిగత సిబ్బంది, అసెంబ్లీ స్టాఫ్, పోలీస్, మీడియా వర్గాలను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు.
నేడు షెడ్యూల్ ఖరారు
తొలిరోజు సోమవారం శాసనమండలి, సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత శాసననభా వ్య వహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ అయి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. మంగళవారం సిట్టింగ్ సభ్యుడు నోముల నర్సింహయ్యతో పాటు గత సమావేశాల అనంత రం మరణించిన మాజీ సభ్యులకు సంతాపాల తీర్మానాల వరకు పరిమితమయ్యే అవకాశముంది. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి.. అదే రోజు చర్చ, సీఎం సమాధానం, అనంతరం ఆమోదం ఉండే లా షెడ్యూల్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాతి రోజున అంటే ఈనెల 18వ తేదీన 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచనున్నా రు. 19న సెలవు ప్రకటించి 20 నుంచి 5 లేదా 6 రోజుల పాటు వరుసగా సమావేశాలు జరిపి హోలీ కంటే ముందే బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాగా ఈసారి బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. గత ఏడాది రూ. 1.83 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కరోనా దెబ్బ పడింది. అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయవనరులు గాడిలో పడటం, ఈసారి సొంత ఆదాయాలను పెంచుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు పె ట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండటంతో ని రుటి కంటే ఎక్కువగానే ఈసారి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను కొనసాగిస్తూనే, నిరుద్యోగ భృతికి కూడా నిధుల కేటాయింపు చేస్తారని తెలుస్తోంది. భూముల అమ్మకా లు, మార్కెట్ విలువల సవరణలతో అదనపు ఆ దాయం సమకూర్చుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా ఈనెల 18వ తేదీ ఉదయం శాసనసభ ఆవరణలోనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై.. వచ్చే ఏడాది కోసం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుందని అధికార వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment