Updates..
► తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు.
అనంతరం టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభకు సమర్పించారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు సంబంధించిన 1వ, 2వ, 3వ వార్షిక నివేదికలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభకు అందజేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
బడ్జెట్ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 50 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏడుగురే ఉన్నారంటూ కేటీఆర్ అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా చూస్తామన్నారు.
అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్..
► తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయి. అందరిపై దాడులు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎనిమిదిన్నర ఏళ్లుగా విభజన చట్టంలో అంశాలు పెండింగ్ ఉన్నాయి. రివర్స్ పంపింగ్‌కు కేరాఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలించి అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజినీర్స్ ఆహ్వానించింది. మోదీ నాయకత్వంలో 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం.
► మోదీ నాయకత్వంలో అత్యధిక నిరుద్యోగిత. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఇస్తున్నారు. 2021 వరకు బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుందన్నారు. 2021 వరకు ప్రతీ భారతీయుడికి ఇల్లు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 2022 నాటికి ప్రతీ ఇంటికి విద్యుత్ అన్నారు ఏమైంది?. మోదీ నాయకత్వంలో సిలిండర్ ధర రూ.400-1200కు పెరిగింది.
► తెలంగాణ ప్రస్థానం దేశానికే ఆదర్శం. ప్రతిపక్ష నేతల పక్షపాత ధోరణి సరికాదు. దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా తెలంగాణ మారింది. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరింది. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం.. ముచ్చట్లు చెప్పడం అభివృద్ధి కాదు.
► రాష్ట్రాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేయవద్దువిద్యుత్ రంగం కేసీఆర్ రాకముందు ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉంది. కేసీఆర్ నినదిస్తూ దేశమంతా వినిపిస్తున్నారు.
► రైతుబంధు అసాధారణమైన కార్యక్రమం. అసాధారణమైన నాయకులకే ఈ ఆలోచనలు వస్తాయి. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ 65వేల కోట్ల రూపాయలు జమ చేశారు. ప్రపంచలోనే వినూత్న పథకంగా రైతుబంధు కార్యక్రమం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించింది.
► నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు?. దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడే ప్రధాని ఎక్కడా ఉండరు. డిస్కంలను ఎందుకు ప్రైవేటీకరించాలి. ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తాము. మేము రైతు రాజ్యం కావాలంటే.. బీజేపీ కార్పొరేట్ రాజ్యం కావాలంటోంది.
► గుజరాత్‌లో పైకి బిల్డప్ తప్ప లోపల ఏమీ ఉండదు. కచ్చితంగా దేశమంతా కదం తొక్కుతాము అని కామెంట్స్ చేశారు. నాయకుడు నటించొద్దు.. లీనమై పనిచేయాలి. హంతకులే సంతాపలు పలికినట్టు ఉంది వారు తీరు. రాష్ట్రం మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు.
► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి.
► కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మంచి పథకాలు. క్యాన్సర్ రోగుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. యాదాద్రికి మెట్రోరైల్ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. కానీ, అది గవర్నర్ ప్రసంగంలో రాలేదు.
► శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టులు ఎందుకు సాధించలేకపోతున్నారు?. మీ ఉద్యమస్పూర్తి ఏమైంది?. బీఆర్‌ఎస్ పెట్టుకుని ఎక్కడైనా తిరగండి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత మీపైన ఉంది.
► తెలంగాణ శాసన మండలిలో రగడ మొదలైంది. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
► పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
► అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్ ఇచ్చారు.
► పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం
► అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్
► సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ కౌంటర్
► బీఏసీ సమావేశానికి ఎంఐఎం నేతలు ఎందుకు రాలేదని కేటీఆర్ నిలదీత
► గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన సండ్ర వెంకట వీరయ్య.
► రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లను కేంద్రం కాపీ కొడుతోంది. రేషన్ కోసం అవసరమైన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. దళిత బంధు పథకాన్ని విపక్షాలు అర్థం చేసుకోవాలి. పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలి. కోర్టులకు వెళ్లి దళితబంధు పథకం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కడుపు నింపేవి కావు. - సండ్ర వీరయ్య.
► గవర్నర్ ప్రసంగాన్ని బలపరుస్తున్న సండ్ర వెంకట వీరయ్య
► రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
► మొదటి రోజు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
► శనివారం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుంది.
► ఇదిలా ఉండగా.. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. కనీసం 20 రోజులైన సభ జరపాలని ఎంఐఎం కోరింది. అయితే, సమావేశాల కొనసాగింపుపై ప్రభుత్వం ఈనెల 8వ తేదీన నిర్ణయం తీసుకోనుంది. ఇక, బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
► మరోవైపు, సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు. అటు, మండలిలో కూడా గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్.. ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment