కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు లబ్ధి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014–15 నుంచి 2020–21 మధ్య ఎస్సీల్లో 1.64 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,235 కోట్లు అందచేసింది. అలాగే గిరిజనుల్లో లక్ష మంది వరకు లబ్ధి పొందగా వారికి రూ. 764 కోట్లు పంపిణీ చేసింది. ఇక బీసీల్లో 2.98 లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందగా.. వీరికి రూ.2,752 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక షాదీ ముబారక్ పథకం కింద మైనారిటీల్లో 1.68 లక్షల మందికి లబ్ధి చేకూరగా రూ.1,112 కోట్లను ప్రభుత్వం వారికి ఆర్థిక సాయంగా అందించింది.
పెరుగుతున్న పట్టణ జనాభా
పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో పట్టణ జనాభా పెరుగుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నగరాల్లో ప్రస్తుతం 46.1 శాతం ఉన్న జనాభా 2036 నాటికి 57.3 శాతం వరకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 18 శాతం అధికంగా ఉంటుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2011లో పట్టణ జనాభా 28.9 శాతం ఉంటే.. ఇప్పుడది 46.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 31.1 శాతం నుంచి 34.5 శాతానికి పెరిగింది. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న వారు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. రాష్ట్ర జనాభా ప్రస్తుతం
3.8 కోట్ల వరకు ఉంటే అందులో 2 కోట్లకుపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది.
►పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 29,271కోట్లు
►ఐటీ రూ. 360 కోట్లు
►వైద్య, ఆరోగ్య శాఖ రూ. 6,295కోట్లు
►మహిళా,శిశు సంక్షేమం రూ. 1,632కోట్లు
►రోడ్లు, భవనాలు రూ. 8,788కోట్లు
►పశుసంవర్థక,మత్స్య శాఖ రూ. 1,730కోట్లు
►వ్యవసాయం రూ. 25,000కోట్లు
►పాఠశాల విద్య రూ. 11,735కోట్లు
►ఉన్నత విద్య రూ. 1,873కోట్లు
►విద్యుత్ రూ. 11,046కోట్లు
►హోం శాఖ రూ. 6,465కోట్లు
►అటవీ శాఖ రూ. 1,276కోట్లు
►బీసీ సంక్షేమ శాఖ రూ. 5,522కోట్లు
►మైనారిటీ సంక్షేమం రూ. 1,606కోట్లు
►ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,306కోట్లు
►ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 12,304కోట్లు
►సాంస్కృతిక, పర్యాటక శాఖ రూ. 726కోట్లు
►సాగునీటి రంగం రూ. 16,931కోట్లు
►పరిశ్రమలు రూ. 3,077కోట్లు
►పౌర సరఫరాలు రూ. 2,363కోట్లు
►పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ రూ. 15,030కోట్లు
Comments
Please login to add a commentAdd a comment