Telangana Budget 2021-22: LIVE Update, Highlights, Analysis, in Telugu - Sakshi
Sakshi News home page

తెలంగాణ 2021-22 బడ్జెట్ హైలైట్స్‌‌

Published Thu, Mar 18 2021 10:59 AM | Last Updated on Thu, Mar 18 2021 1:15 PM

Telangana Assembly Budget Session 2021: Live Updates And Highlights In Telugu - Sakshi

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది. కాగా బడ్జెట్‌ ప్రసంగం అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కాగా బడ్జెట్‌లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. 

►2020-21 జీఎస్‌డీపీ అంచనా రూ.9,78,373 కోట్లు.. తలసరి ఆదాయం అంచనా రూ.2,27,145 కోట్లు

►సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌కు రూ. వెయ్యి కోట్లు.. మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు.. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరాకు రూ.250 కోట్లు.. ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణానికి రూ. 100 కోట్లు

►మెట్రో రైలు కోసం రూ. 1000 కోట్లు.. పురపాలక, పట్టణాభివృద్ధి అభివృద్ధి కోసం రూ.15, 030 కోట్లు

►వైద్య ఆరోగ్య శాఖ కోసం రూ.6295 కోట్లు

►పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు.. ఉన్నత విద్య కోసం రూ.1873 కోట్లు.. రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం

►విద్యుత్ రంగానికి 11, 046 కోట్లు.. పరిశ్రమ శాఖ కు రూ.3077 కోట్లు..

► ఐటీ రంగానికి రూ. 360 కోట్లు .. దేవాదాయ శాఖకు రూ. 720 కోట్లు.. హోమ్ శాఖకు రూ.6465 కోట్లు

► ఆర్ అండ్ బీ కి రూ. 8,788 కోట్లు.. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు

►పౌర సరఫరాల శాఖకు రూ.2, 363 కోట్లు

►చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు.. బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు.. గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు.. సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు

►స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు.. మైనార్టీల సంక్షేమానికి రూ.1606 కోట్లు

►డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు

► పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు

► సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు

► ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

► రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో ఆ రంగానికి దాదాపు రూ. 25వేల కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్‌లో రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు..  రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించింది.

►రీజనల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.. నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు.. పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు

►దేవాదాయశాఖకు రూ.720 కోట్లు.. అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.. ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు

► 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 2,30, 825.96 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1, 69, 383.44 కోట్లు..  క్యాపిటల్ వ్యయం రూ. 29, 046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6, 743.50 కోట్లు.. ఆర్థిక లోటు రూ. 45, 509.60 కోట్లుగా ఉంది.

► శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్‌ శాసనసభలో రెండోసారి బడ్జెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు.

►జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆశలకు అనుగుణంగానే బడ్జెట్‌ ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం బడ్జెట్‌ ప్రతులతో హరీష్‌ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం  రూ.2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:30 గంటలకు ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా.. మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా, ప్రస్తుతం అమల్లో అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనలుంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అలాగే రైతుబంధు, పెన్షన్లు, రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించనుంది. దీంతోపాటు ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీకి సంబంధించి నిధుల ప్రతిపాదన బడ్జెట్‌ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement