స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు
- నేడు వెలువడనున్న నోటిఫికేషన్
- నేటి నుంచే నామినేషన్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీటీసీ స్థానాలు, 16 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 133 వార్డుసభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనుంది. నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి స్పష్టం చేశారు. నామినేషన్లు శనివారం నుంచి స్వీకరించనున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండ లం పహాడీషరీఫ్ గ్రామ పంచాయతీకి ఈనెల 13న, వరంగల్ జిల్లా నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డుకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయా స్థానాల్లో ఎన్నికల నియమా వళి తక్షణమే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.