స్థానిక సంస్థల్లో స్త్రీల ఆధిపత్యం | Dominance women in local bodies | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల్లో స్త్రీల ఆధిపత్యం

Published Sun, Jul 6 2014 2:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

స్థానిక సంస్థల్లో స్త్రీల ఆధిపత్యం - Sakshi

స్థానిక సంస్థల్లో స్త్రీల ఆధిపత్యం

 శ్రీకాకుళం సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దాదాపు పరిసమాప్తమైంది. జిల్లాలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లా రాజకీయాల్లో ఇప్పటి దాకా కొనసాగిన పురుషాధిక్యానికి తెర పడింది. ముఖ్యంగా సర్పంచ్ మొదలు జిల్లా పరిషత్తు వరకు స్థానిక సంస్థల అధికార పీఠాలను అత్యధిక సంఖ్యలో మహిళలు సొంతం చేసుకోవడంతో ఐదేళ్లపాటు జిల్లా రాజకీయ, పరిపాలనా వ్యవహారాలను వారే నిర్దేశించనున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మున్సిపల్, మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల్లోనూ సగానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన మహిళలు గత మూడు రోజులుగా జరిగిన మున్సిపల్, మండల, జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అదే స్థాయిలో అధికార పీఠాలు సొం తం చేసుకోవడం ద్వారా మహిళా రాజ్యానికి శ్రీకారం చుట్టారు.
 
 సద్వినియోగించుకుంటేనే..తమ చేతికి అందివచ్చిన అధికార దం డాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే భవిష్యత్తు రాజకీయాల్లోనూ మహిళలు రాణించగలుగుతారు. సహజంగా భర్త చాటు భార్యలన్న పేరున్న మన మహిళామణులు ఇప్పటివరకు రాజకీయాల్లోనూ భర్తల అదుపాజ్ఞల్లో నే నడుస్తున్నారన్న అపవాదు ఉంది. ఇప్పుడు కొత్త ఎన్నికైన మహిళా ప్రతి నిధులు, సారధులు దాన్ని చెరిపేసి తమదైన సొంత ముద్ర వేయాల్సిన అవసరముంది. ఎన్నికైన వారిలో ఎక్కువమంది విద్యావంతులు ఉన్నం దున రాజకీయాలు, పాలనలో పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపించాల్సి ఉంది.
 
 జిల్లాలో ఎన్నికైన మహిళా ప్రతినిధులను పరిశీలిస్తే.. శ్రీకాకుళం, పాలకొండ ఎమ్మెల్యేలుగా గుండ లక్ష్మీదేవి, విశ్వాసరాయి కళావతిలు గెలుపొందారు. జిల్లా పరిధిలో ఉన్న అరకు ఎంపీగా కొత్తపల్లి గీత ఎన్నిక య్యారు. తాజాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా చౌదరి ధనలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా ఖండాపు జ్యోతిలు ఎన్నికయ్యారు. రెండు రోజుల క్రితం జరి గిన నాలుగు మున్సిపాలిటీల అధ్యక్ష ఎన్నికల్లో ఆమదాలవలస,పాలకొండ, ఇచ్ఛాపురం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను మహిళలే చేజిక్కించుకున్నారు. ఇక జిల్లాలో 38 మండలాలు ఉండగా 27 మండల పీఠాలపై మహిళలే జెండా ఎగురవేశారు. 17 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులను వారే సొంతం చేసుకున్నారు. 38 జెడ్పీటీసీల్లో 24 స్థానాల్లో విజయం సాధించారు.
 
 ఆ మూడు నియోజకవర్గాల్లో వారే..
 పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలోని అన్ని మం డలాలకూ మహిళలే పాలకులయ్యా రు. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గంలో నాలుగేసి మండలాలు ఉం డగా.. మూడేసి మండలాల్లో మహళలకే అధ్యక్ష పదవులు దక్కాయి. జిల్లా లో ఉన్న 1099 పంచాయతీలు ఉండ గా 680 చోట్ల మహిళలే సర్పంచుల య్యారు. మరో 450మంది ఉప సర్పం చులుగా గ్రామ పాలనలో భాగస్వాములవుతున్నారు. గతంలో ఎన్నడూ దక్కని ఈ సువర్ణావకాశాన్ని భర్తలపాలు చేయకుండా స్వ యం నిర్ణయాలతో పాలనపై పట్టు సాధించినప్పుడే మహిళల పోరాటానికి సార్ధకత లభిస్తుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement