సాక్షి, అమరావతి: వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో పలు మార్పులు చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పరిగణిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చింది.
చదవండి: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు!
కేవలం వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలు వరకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్దిదారులకు చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీలు మినహాయిస్తూ మరో రెండు నోటిఫికేషన్లను జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment