Sub Registrar offices
-
సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో ఆఫీస్‌ల్లో ఏసీబీ తనిఖీలు: భారీ నగదు స్వాధీనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవాప్తంగా ఏసీబీ అధికారులు 7 సబ్ రిజిస్ట్రార్, 2 ఎమ్మార్వో ఆఫీస్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి 9 లక్షల 28 వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, నర్సాపురం, విశాఖ, తుని, కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. మేడికొండూరు, జలమూర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే -
AP: సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు..
సాక్షి, అమరావతి: ఏపీలో పలు సబ్‌రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ 14400 కాల్ సెంటర్, యాప్‌కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చెపట్టింది. బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, తుని, నర్సాపురం, కందుకూరు, మేడికొండూరు, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. -
AP: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గ్రామ సచివాలయాలు
సాక్షి, అమరావతి: వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో పలు మార్పులు చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పరిగణిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. చదవండి: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు! కేవలం వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలు వరకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్దిదారులకు చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీలు మినహాయిస్తూ మరో రెండు నోటిఫికేషన్లను జారీ చేశారు. -
నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యుల సస్పెన్షన్
సాక్షి, విజయవాడ/కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా, నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. -
ఏపీ: వెలుగులోకి నకిలీ చలానాల వ్యవహారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. -
స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్ మరొకరిది
ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెంచర్లో 2000వ సంవత్సరంలో ప్లాట్ నంబర్ 99ఏ కొనుగోలు చేశాడు. ఏటా ఒకటి, రెండు సార్లు ప్లాటు వద్దకు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. అయినా ఇటీవల తన ప్లాటు కర్నూలుకు చెందిన చిట్టిబాబు పేరుతో ఉందని తెలుసుకుని అతన్ని నిలదీశాడు. తాను కూడా కురువ మధు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చిట్టిబాబు వివరణ ఇవ్వడంతో ఈసీ తీశాడు. అప్పటికే 15 మంది చేతులు మారిందని తెలుసుకొని నోరెళ్లబెట్టాడు. ‘నేనెవరికీ ప్లాటు విక్రయించకున్నా ఇలా ఎందుకు జరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులను, వెంచర్ వేసిన వారిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు’ అ బాధితుడు వాపోతున్నాడు. సాక్షి,కర్నూలు(సెంట్రల్): మన పొలమో, ప్లాటో, ఇల్లో ఎక్కడికి పోతుందిలే అనుకుంటే పొరపాటే. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, భూములు, స్థలాలు మన కళ్లెదుటే ఉన్నాయనుకొని ఇంట్లో కూర్చుంటే అక్రమార్కులు బరి తెగించి కొత్త మోసాలతో మాయ చేసేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇతరుల పేరుతో సొంతం చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రిజిస్ట్రేషన్ అధికారుల వ్యవహారంతో ఆస్తులు కోల్పోయి బాధితులు రోడ్డున పడుతున్నారు. పదే పదే రిజిస్ట్రేషన్.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొందరు మాఫియాగా ఏర్పడి భూములు, స్థలాలు, ఇళ్లను రాత్రికి రాత్రే ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వీరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నట్లు సమాచారం. ముందుగా భూమాయగాళ్లు ప్లాటు, స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ పేరుతో గానీ, తమకు తెలిసిన వారి పేర్లతో గానీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ తరువాత అదే స్థలాన్ని పదే పదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ పోతారు. రిజిసే్ర్టషన్ సమయంలో స్థలం/పొలం/ఇంటి వద్దకు వెళ్లరు. మొదటి సారి ఆ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్లు లింకు డాక్యుమెంట్ అడగకుండా మేనేజ్ చేస్తారు. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకుంటూ పోతారు. ఈ ప్రక్రియలో ఎవరైనా ఆస్తిదారులు అప్రమత్తమైతే పంచాయితీకి రమ్మంటారు. ఏదో పొరపాటున జరిగి పోయిందని ఎంతో కొంత చెల్లిస్తే వెనక్కి ఇస్తామని, లేదంటే రిజిస్ట్రేషన్ చార్జీలను అయినా చెల్లించాలని కోరతారు. కె.పుల్లయ్య విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘సెటిల్ చేసుకుందామని పంచాయితీకి పిలుస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వెయ్యికి పైగా కేసులు.. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, పదే పదే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. విష యం తెలుసుకున్న లబ్ధిదారులు కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్లలో దాదాపు 1,000కి పైగా కేసులు వచ్చాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తరువాత దానిని రద్దు చేసే అధికారం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కేసులు కోర్టులకు ఎక్కుతున్నాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా కొన్ని వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు ఫిర్యాదు దారులు పంచాయితీల ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. -
ఇక ఆటోమేటిక్ మ్యుటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరించటాన్ని ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటారు. తద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్లూ మీ–సేవే శరణ్యం ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్‌చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముడుపులిస్తేనే మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి రోజూ వివరాలు.. అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మార్గనిర్దేశం మేరకు రెవెన్యూ శాఖలో ఆటోమేటిక్ మ్యుటేషన్ దిశగా కసరత్తు ఆరంభమైంది. ఆటోమేటిక్ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్ మ్యుటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలను సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు. గ్రామ సచివాలయాల్లోనే 63 సర్టిఫికెట్ల జారీ ప్రజలకు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ లాంటి 63 రకాల సర్టిఫికెట్లను గ్రామ సచివాలయాల్లోనే జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చుక్కల భూముల పరిస్థితిపై కూడా ఆమె సమీక్షించారు. -
వీరు.. మారరు!
జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి బ్రేక్‌లు పడటం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులపై వేటు పడుతున్నా.. మరో పక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా సబ్ రిజిస్ట్రార్లు మాత్రం వెరవడం లేదు. జిల్లా నుంచి ట్రోల్ ఫ్రీ నంబర్ 14400 కాల్ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో రిజిస్ట్రేషన్ శాఖ నాల్గో స్థానంలో ఉన్నట్లు సమాచారం. కాల్ సెంటర్ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. దీంతో దళారులను పెట్టుకుని దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల గూడూరు, తాజాగా బుచ్చిరెడ్డిపాళెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల వద్ద దొరికిన అదనపు సొమ్ములే ఇందుకు నిదర్శనం. సాక్షి నెల్లూరు: జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు అవినీతి జలగల్లా క్రయ విక్రయదారులను పీల్చిపిప్పి చేస్తున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన వీరు దొరికిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. డబ్బులు ముట్టచెప్పితే నిషేధిత జాబితాల్లోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లకు భారీ మొత్తంలో లంచాలు జేబుల్లో వేసుకుంటున్నారు. చేయి తడపకపోతే.. చిన్న చిన్న కారణాలు చూపించి రిజిస్ట్రేషన్లకు కొర్రీలు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ జిల్లాను నెల్లూరు, గూడూరు జిల్లాలుగా విభజించింది. నెల్లూరు జిల్లా పరిధిలో 9, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లతో పాటు భూముల ఈసీలు, డాక్యుమెంట్ల నకళ్లు, జనరల్ పవరాఫ్ అటారీ్న(జీపీ), వీలునామా, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. కానీ ప్రతిదానికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంతో పాటు అదనపు దోపిడీ పక్కాగా జరుగుతోంది. రోజంతా చేసిన వసూళ్లను సాయంత్రానికి అధికారి నుంచి అటెండర్ వరకు స్థాయిని బట్టి మామూళ్ల పంపకం జరుగుతోంది. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు కాకుండా అడపా దడపా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, ప్లాట్లకు కూడా రేటు ఫిక్స్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబరులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో విచారణ జరిపిన అధికారులు వాస్తవాలను నిగ్గు తేల్చి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కోవూరులో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు? గతంలో కోవూరులో కూడా నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన విషయంలో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లపై ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు ఏడాది పాటు ఆ నివేదికను తొక్కిపెట్టారు. తాజాగా అవినీతిపై యుద్ధం చేస్తున్న కొత్త ప్రభుత్వం రాకతో అధికారులు విచారణ నివేదికను రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. ఆ నివేదికపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదుల్లో నాల్గో స్థానం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల చేయించుకుంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖపై ఫిర్యాదుల్లో నాలుగో స్థానంలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా ఉద్యోగుల పైళ్ల కింద, ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద అనధికారికంగా రూ.40,110 దొరికింది. గతంలో గూడూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు గంటల పాటు సోదాలు చేస్తే దళారుల వద్ద రూ.1,39,150 నగదు దొరికింది. నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ దాడులు జరిపితే ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో నగదు దొరికిన ఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ శాఖలో మహిళా అధికారురులే అవినీతిలో టాప్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉండటం కొసమెరుపు. రిజిస్ట్రేషన్ విలువలో ఒక శాతం లంచం.. భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్‌లో సబ్‌రిజిస్ట్రార్‌కు మార్కెట్ విలువలో ఒక శాతం అదనంగా చెల్లించాలి. గిఫ్ట్ డీడ్‌కు అరశాతం, పార్టీషన్ (అన్నదమ్ముల భూపంపకాలు)కు అరశాతం వంతున వసూలు చేయడం బహిరంగ సత్యమే. ఉదాహరణకు వంద అంకణాల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. మార్కెట్ విలువ ప్రకారం అంకణం రూ.12 వేలు వంతున రూ.12 లక్షలకు ఒక శాతం అంటే రూ.12 వేలు సబ్ రిజిస్ట్రార్‌కు అనధికారికంగా చెల్లించాలి. దీంతో పాటు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు రూ. లక్షకు రూ.300 వంతున చెల్లించాలి. అలా చేస్తే కానీ సకాలంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. లేదంటే ఎన్నో కొర్రీలు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ రుసుం (సేల్ డీడీ) బ్యాంక్‌ల్లో చెల్లింపులు చేసినా అదనపు వసూళ్లు మాత్రం పక్కాగా ఇవ్వాలి. ఇదంతా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లావాదేవీలు జరుపుతారు. ఫిర్యాదులొస్తే దాడులు చేస్తాం ప్రభుత్వ కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులన్నింటిపై మా పరిశీలనకు వస్తాయి. అందులో అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచుతాం. బాధితులను పీడించే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. ఏ శాఖపైనా ఫిర్యాదులొస్తే.. వదిలి పెట్టం. – సీహెచ్ దేవానంద్ శాంతో, నెల్లూరు ఏసీబీ డీఎస్పీ -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం మెరుపుదాడులు చేసింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో 13 జిల్లాల్లో ఎంపిక చేసుకున్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సోదాల్లో అనధికార డాక్యుమెంట్ రైటర్లను గుర్తించడంతోపాటు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్ము రూ.10,34,256 స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు ఏసీబీ డీజీ తెలిపారు. బట్టబయలైన అక్రమాలు.. - ఆస్తుల క్రయవిక్రయాలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం వస్తే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ఆస్తిని బట్టి రేటు పెట్టి మామూళ్లు దండుకుంటున్నారు. - ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అనధికార డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులను గుర్తించారు. - రిజిస్ట్రార్, సిబ్బంది వద్ద ఉన్న పుస్తకాలు, డాక్యుమెంట్లు, టేబుల్ సొరుగుల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్మును గుర్తించారు. - రిజిస్ట్రార్లకు ఇచ్చేందుకు అనధికార డాక్యుమెంట్ రైటర్లు తెచ్చిన మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఫలితం రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన స్పందన 14400 టోల్ ఫ్రీ నంబర్ ఫలితాలిస్తోంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు 14400కు వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు. అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ప్రభుత్వ శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పట్టిన అవినీతి మకిలిని వదిలించేందుకు ఏసీబీ డీజీ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏకకాలంలో అన్ని జిల్లాల్లోను సోదాలు నిర్వహించారు. -
సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్, ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ దృష్టికి వెళ్లడంతో.. తీవ్రంగా స్పందించిన ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్, అవినీతి నిరోధక శాఖల్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్‌పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్ రిజిస్ట్రార్ టి.తారకేష్‌ను ఏసీబీ సీఐ గఫూర్ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్‌లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ తీసుకొచ్చిన మధ్యవర్తులు తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించడంతో కేసు పెట్టడం వీలు కాలేదు. ఏసీబీ సీఐ బయట నుంచి డబ్బు తెచ్చి రికార్డుల్లో పెట్టినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సొమ్ముతో లంచం తీసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. ఇందుకోసం విచారణల పేరుతో వేధించారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీపై ఒత్తిడి తెచ్చి సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేయించారు. ఆ తరువాత తారకేష్‌ను డీఐజీ యథాస్థానానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ సీసీ కెమెరాలోని ఫుటేజిని సాక్ష్యాలుగా తీసుకుని మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను కలిశారు. సీసీ ఫుటేజిని వీక్షించిన ఉప ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏసీబీ అధికారులపై విచారణ జరిపించి.. డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. సీసీ ఫుటేజి సాక్ష్యాలను, సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు పంపించారు. ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గి సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖపట్నం డీఐజీని సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, షాద్‌నగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి, పారదర్శకంగా సేవలందించేందుకుగాను ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ నిఘా కెమెరాల కన్నుకప్పి షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దగా జరుగుతోంది. డబ్బులు ఇస్తేగాని దస్తావేజులు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్లాట్లు, భూముల కొనుగోలుకు వేర్వేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి దస్తావేజుకు విధిగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాటు రిజిస్ట్రేషన్‌కు ఐదు వందల రూపాయల వరకు, భూముల రిజిస్ట్రేషన్‌కు ఎకరాకు రెండువేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక సమస్యలున్న భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయితే అధికారులు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల సహాయంతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, సబ్రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి డబ్బులు ముట్టినట్లు సమాచారం అందిన తర్వాతనే కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతోందని బాహాటంగా చెప్పుకుంటున్నారు. నామమాత్రంగానే సీసీ కెమెరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సీసీ కెమెరాలు కేవలం కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని రికార్డింగ్ చేసేందుకే ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ‘చటాన్‌పల్లి’పై కొనసాగుతున్న దర్యాప్తు ఇటీవల చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 717లో ప్లాట్ నెంబర్ 147, 148లో 236 గజాల విస్తీర్ణం గల స్థలానికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాటు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారంలో షాద్‌నగర్ పోలీసులు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ప్లాటు అసలు యజమాని గడగమ్మ రాఘవరావు ఫిర్యాదుతో పోలీసులు ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్, ప్లాటు కొనుగోలుదారులు జి.శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించినట్లు సమాచారం. చటాన్‌పల్లికి చెందిన ఓవ్యక్తితో పాటు, కేశంపేట రోడ్డుకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. ఫోర్జరీ కేసు నమోదైనప్పటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ తన కార్యాలయానికి రాకపోవడంతో అన్ని వ్యవహారాలు కింది స్థాయి సిబ్బందే చూసుకుంటున్నారు. ఆన్‌లైన్‌తో సమస్యలు కల్పితమా..? ఫోర్జరీ డాక్యుమెంట్ వ్యవహారం బయటికొచ్చిన రోజు నుంచి ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆన్లైన్ సమస్యలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలనే ఆన్‌లైన్‌ను బంద్ చేస్తున్నారని, కార్యాలయానికి క్రమం తప్పకుండా వచ్చే వ్యాపారులు, మధ్యవర్తుల పనులను మాత్రమే అధికారులు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఆన్లైన్ సమస్యతో గత నాలుగు రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకందార్లు ఇబ్బందులు పడుతున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏసీబీ దృష్టి సారిస్తే... అవినీతి రాజ్యమేలుతున్న షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత రెండు నెలల క్రితం షాద్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శేఖర్‌రెడ్డి, అదేవిధంగా కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్ఓ అనంతయ్యలు పెద్ద ఎత్తున లంచం డబ్బులు తీసుకుంటూ ఏబీసీ అధికారులకు పట్టుపడ్డారు. ఏడాది క్రితం షాద్‌నగర్ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులు ఆరోపణలు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా వేస్తే అవినీతి చేపలు దొరకే అవకాశాలు ఉన్నాయి. -
ఆగని అక్రమాలు..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ప్రైవేట్ వ్యక్తులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా, కార్యాలయాల సమయంలోనే విధులను నిర్వహించాలని చెప్పినా.. లంచాలు వసూలు చేయొద్దని ఆదేశించినా..అధికారుల తీరు మారడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇదే అదనుగా కార్యాలయాల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం పెచ్చుమీరి పోతోంది. వీరికి సబ్‌రిజిస్ట్రార్లతోపాటు అందులో పనిచేసే సిబ్బంది వారు నియమించుకున్న ప్రైవేట్ సిబ్బంది పూర్తి అండదండలు అందిస్తున్నారనేది బహిరంగ సత్యం. ‘ఏసీబీ’ తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు.. భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వందలాది డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ వద్ద పెండింగ్‌లో ఉండడం ఇక్కడ కొసమెరుపు. రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేస్తూ బీబీనగర్ అధికారుల ఉదాంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఆక్రమించిన బినామీ భూములను జిరాక్స్ కాపీలతో రిజిస్ట్రేషన్ చేస్తూ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లారు. ఇలా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమాల పర్వం జోరుగా సాగుతోంది. పలు కార్యాలయాల్లో అక్రమాల జాతరే.. భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూర్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాల జాతర కొనసాగుతోంది. ఆయా కార్యాలయాల చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. వీటిని తొలగించే ప్రయత్నం ఎవరివల్ల కావడం లేదు. ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగానే అధికారులు వెంటనే డాక్యుమెంట్ రైటర్ల వద్దకు పంపిస్తారు. వారి వద్ద నుంచే డాక్యుమెంట్లు, చలాన్లు చెల్లిస్తారు. భూమికి ఉన్న విలువను బట్టి ప్లాటు, ఎకరాల్లో రిజిస్ట్రేషన్లకు వంతుల వారీగా డబ్బులు నిర్ణయించి రైటర్లే వసూలు చేస్తారు. ఇక్కడ అంతా రైటర్లదే హవా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వద్ద డాక్యుమెంట్ల వారిగా రేట్లు నిర్ణయిస్తారు. సమస్యాత్మక భూములుంటే.. సమస్యాత్మక భూములు ఉంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాదని పక్కన పెట్టేస్తారు. రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సామాన్యుడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. లంచం ఇవ్వకపోతే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. సమస్యలు లేకున్నా సృష్టించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. అయితే జిరాక్స్ కాపీలపై తప్పుడు ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోడాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు ముట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ తతంగం అంతా పూర్తి చేస్తారు. ఏరోజుకారోజు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా సాయంత్రం అధికారులు, ఉద్యోగులు లె క్కలు చూసుకుని వాటాలు పంచుకుని ఇంటికి వెళ్తారు. కార్యాలయాల చుట్టూ అద్దె భవనాలు.. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అలాగే యాదగిరిగుట్టలో కొనసాగుతున్న కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు విచ్చలవిడిగా వెలిశాయి. జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు గదులను అద్దెకు తీసుకుని పాగా వేశారు. కొన్నిచోట్ల ఇతరులకు అద్దె భవనాలు దొరక్కకుండా డాక్యుమెంట్ రైటర్లే కార్యాలయాల చుట్టుపక్కల గల భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రికార్డులు పంపించరు.. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్ల రికార్డులను స్కానింగ్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నేరుగా యజమానికి చేరవేయాలి. కానీ ప్రతి చోట అలా జరగడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు తాము చేయించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకుని తమ వద్దే ఉంచుకుని పంపిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బీబీనగర్‌లో రాత్రి పొద్దుపోయే వరకు.. బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడురోజుల క్రితం రాత్రి 10గంటలు దాటిన రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఉండడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి విధి నిర్వహణ కోసం రానీయవద్దని ఇటీవల ఆశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంటర్ల అనుచరులు ఏసీబీకి పట్టుబడ్డారు. పలు అవకతవకలకు కారణం అవుతున్న ప్రైవేట్ సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే విధి నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ కొనసాగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలేనని ఆరోపణలు ఉన్నా యి. అయితే మధ్యాహ్నం సర్వర్ పని చేయకపోవడం వల్లే అనుమతి తీసుకుని పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేశామని అధికారులు సంజాయిషీ ఇస్తున్నారు. తారస్థాయికి చేరిన అవినీతి.. భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, యాదగిరిగుట్ట, మోత్కూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయిలో కొనసాగుతోంది. జిల్లాలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లాట్లు, భూములు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో రియల్టర్లు తొందరగా పని పూర్తి చేయడం, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు, సమస్యాత్మక భూములు రిజిస్ట్రేషన్లు చేయించడం కోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజేబుతున్నారు. యాదగిరిగుట్టలో.. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన తరువాత ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్ వాహిద్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హుజూర్నగర్ నుంచి సైదులును ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన తరువాత హైదరాబాద్ నుంచి జహంగీర్ వచ్చారు. ఆయన్ని కూడా మార్చి ప్రస్తుతం దేవరకొండ నుంచి శ్రీనివాస్‌రావును సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్ డీఆర్లు తనిఖీలు చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. పైచిత్రం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇటీవల రాజాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, భూమిని భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడకి వచ్చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు అదనంగా మరో రూ.20వేలు అధికారులకు చెల్లించాలని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి కదా ఎందుకు చెల్లించాలని అడగ్గా తనకేమీ తెలియదని అంతా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు జరుగుతుందని సదరు రైటర్ సెలవిచ్చారు. అయితే అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అక్కడనుంచి వెనుదిరిగిపోయారు. యాదగిరి గుట్టలో ఒక్కచోటే కాదు జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తతంగం కొనసాగుతోంది. -
రిజిస్ట్రేషన్ల శాఖలో అంతే!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రిజిస్ట్రేషన్ల శాఖ తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా శాఖ ఉద్యోగులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షలు స్టాంపు డ్యూటీ ఎగవేసిన ఘటన ఇటీవల వెలుగు చూడడమే దీనికి నిదర్శనం. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించకుండా స్థల మార్పిడి చేసిన అధికారులపై మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనాన్ని కలిగించింది. అసలేం జరిగిందంటే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని సర్వే నంబర్ 163లో 605 చదరపు గజాల స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వ్యవస్థలోని లొసుగులు ముఖ్యంగా ‘ఎనీ వేర్ రిజిస్ట్రేషన్’ పద్ధతి ద్వారా ఇదంతా నడిచినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని స్థలాన్ని ఏకంగా అలంపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. స్థలాన్ని చదరపు గజాల్లో కాకుండా గుంటల్లో చూపిస్తూ ఏకంగా ప్రభుత్వ ఖజానాకు రూ.20లక్షల వరకు గండి కొట్టినట్లు చెబుతుండగా.. దీనిపై మూసాపేట మండలం సంకలమద్ది కి చెందిన సింగిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో స్పందించి.. సమగ్ర దర్యాప్తు జరపాల్సిదిగా పోలీసు శాఖను ఆదేశించింది. ఈ మేరకు సంబంధమున్న వారిపై మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులు ఈనెల 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందు లో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారితో పాటు ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న మరో ప్రాంత సబ్ రిజిస్ట్రార్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతా వారిదే హవా.. విలువైన పత్రాలు స్కానింగ్ జరిగే కంప్యూటర్ గదిలో రియల్ వ్యాపారులు, బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లదే పైచేయి. వీరితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకెళ్లిన డాక్యుమెంట్లు అయిన తర్వాతే మిగతావి స్కానింగ్. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల కనుసన్నల్లో ఈ ప్రక్రియ నిత్యకృత్యం. కంప్యూటర్ గదిలో డాక్యుమెంట్ రైటర్లు కంప్యూటర్లపై కూర్చుని డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తతంగం తో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయంలోని ఇద్దరు సబ్రిజిస్ట్రార్ల క్యాబిన్లకు ముందు భాగంలో ఉన్న కంప్యూటర్ గదిలోనే ఇదంతా జరుగుతున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఊసే లేదు.... ప్రభుత్వం సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ విధానం అమలు కాకపోగా దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవగాహన కూడా కల్పించడం లేదు. అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినా అమలు కావడం లేదు. జూలై 24న ప్రభుత్వం పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టంను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ లు కాకపోవడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ తగదు
ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను ప్రైయివేటేజైషన్ చేసి వేలాది మంది దస్తావేజు లేఖర్ల పొట్టగొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ అధ్యక్షతన విజయవాడలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రిజిస్ట్ట్రేషన్ కార్యకలాపాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం పట్ల దస్తావేజు లేఖరుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 291 సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న అనేక వేల మంది రోడ్డున పడతారని, వారి కుటుంబాలకు ఉపాధి పోతుందని దస్తావేజు లేఖరుల సంఘం వాపోయింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. దస్తావేజు లేఖరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ర్ట అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఎలియాజర్, ఏపీసీఆర్డీఏ ఇన్చార్జి పైలా సతీష్‌బాబు పాల్గొని మాట్లాడారు.