
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment