ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్
విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను ప్రైయివేటేజైషన్ చేసి వేలాది మంది దస్తావేజు లేఖర్ల పొట్టగొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ అధ్యక్షతన విజయవాడలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రిజిస్ట్ట్రేషన్ కార్యకలాపాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం పట్ల దస్తావేజు లేఖరుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 291 సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న అనేక వేల మంది రోడ్డున పడతారని, వారి కుటుంబాలకు ఉపాధి పోతుందని దస్తావేజు లేఖరుల సంఘం వాపోయింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. దస్తావేజు లేఖరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ర్ట అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఎలియాజర్, ఏపీసీఆర్‌డీఏ ఇన్‌చార్జి పైలా సతీష్‌బాబు పాల్గొని మాట్లాడారు.
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ తగదు
Published Wed, Jan 27 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM
Advertisement
Advertisement