సాక్షి, పశ్చిమగోదావరి: క్వారంటైన్‌కి వచ్చే పేషెంట్స్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలని మంత్రి బుధవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెనుగొండ ఎస్‌వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, నెగ్గిపూడి ఆచార్య ఎన్జీ రంగా రైతుభవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
రోజురోజుకి కేసులు అధికమవుతుండటంతో నియోజకవర్గంలో ఉన్న కళాశాలలు, స్కూల్స్‌ను ప్రజలకు దగ్గరగా క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నాం. నియోజవర్గ ప్రజలలో కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని, పాజిటివ్ వచ్చిన వారిని పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, క్వారంటైన్ కేంద్రాలకి తరలిస్తున్నారని అక్కడ బాధితులు పెరిగిపోవడంతో నియోజక వర్గ ప్రజలకు దగ్గరగా ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి నియోజకవర్గంలో క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. (వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్: పేర్నినాని)
Comments
Please login to add a commentAdd a comment