‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే | Complete of tendering process of government house | Sakshi
Sakshi News home page

‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే

Published Fri, Sep 25 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే

‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే

- అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు
- రూ.84.22 కోట్లతో డబుల్ బెడ్‌రూం ప్లాట్లు
- 1384 మందికి ప్రయోజనం
- రూ. 20కోట్లతో మౌలిక వసతులు
- త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ :
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్‌ఆర్ నగర్‌లోని నివాసాల స్థానంలో జీప్లస్-1, జీప్లస్-3 పద్ధతిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ శాఖ ఎంపిక, టెండర్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు కట్టబెట్టింది. రూ.వంద కోట్లకు పైగా వ్యయం కానున్న జీప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతను జిల్లా కలెక్టర్ ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ శాఖ పూర్తి స్థాయిలో డీపీఆర్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహాయం తీసుకొని ఈ డీపీఆర్‌కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలోని కమిటీ ఈ డీపీఆర్‌కు ఆమోదం వేయగానే ఈ ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించారు.
 
రూ.43 కోట్లతో జీప్లస్-3 నిర్మాణం: హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని 7 ఎకరాల స్థలంలో జీప్లస్-3 పద్ధతిలో అ ర్హులుగా గుర్తించిన 592మందికి డబుల్ బెడ్‌రూం ఇ ళ్లు నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో ప్లాట్లు, రోడ్లు, వి ద్యుత్ సౌకర్యం, ఇతరత్రా మౌలిక సదుపాయాలతో పాటు సీవరేజీ ప్లాంటు నిర్మిస్తారు. ఇళ్ల నిర్మాణానికి రూ.34కోట్లు, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వ్య యానికి రూ.9కోట్లు కేటాయించారు. ఈ పనుల కో సం నిర్వహించిన టెండర్లలో నాలుగు ఏజెన్సీలు పో టీ పడ్డాయి. ఈ టెండర్ల ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ 1.17శాతం మైనస్, బీపీఆర్ కంపెనీ రూ.1శాతం మైనస్‌కు టెండర్లు వేయగా 7.29శాతం తక్కువ వేసిన మంద ఐలయ్య కంపెనీ ఈపనులను దక్కిం చుకున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో అగ్రిమెంటు కాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు.
 
రూ.71.80కోట్లతో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం: వరంగల్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లోని 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేందుకు యత్నించగా స్థానికుల నుంచి వ్యతి రేకత రావడంతో అర్హులుగా గుర్తించిన 792మందికి జీప్లస్-1పద్ధతిలో ఇళ్లు నిర్మించనున్నారు. ఇందులో నిర్మాణాలను గ్రేడ్‌లుగా విభజించారు. - గ్రేడ్‌లో 4+4, బి-గ్రేడ్‌లో 2+2, సి- గ్రేడ్‌లో 1+1, డి-గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూపొందించారు. ఇందులో సి, డీ గ్రేడ్‌ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఎ, బి గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేందుకు జిల్లా కమిటీ నిర్ణయించింది.

రూ.71.80కోట్ల వ్యయంతో ఇందులో రూ.50.22కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.10.40కోట్లతో మౌలిక సదుపాయాలు, రూ.11.18కోట్లు ఇతరత్రా వ్యయానికి కేటాయించారు. ఈ పనుల కోసం నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొనగా నలుగురు అర్హత పొందారు. బీపీఆర్ కంపెనీ రూ.0.01ప్లస్‌కు, మంద ఐలయ్య కంపెనీ 0.90శాతం ఎక్కువకు టెండర్లు వేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ 4.14శాతం మైనస్‌తో ఈపనులను దక్కించుకున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ పనుల అగ్రిమెంటు పూర్తి కావడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు.
 
రూ.130కోట్ల వ్యయంతో డబుల్‌బెడ్‌రూం నిర్మాణం
ప్రభుత్వం నగరంలో నిర్మించ తలపెట్టిన డబుల్‌రూం ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.130కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రూ.110కోట్ల వరకు ఇళ్ల నిర్మాణానికి వ్యయం చేస్తుండగా రూ.20కోట్లు మౌలిక వసతుల కోసం వెచ్చిస్తాం. రోడ్లు, విద్యుత్ సరఫరాలతో పాటు నగరంలో మొదటి సారిగా సీవరేజి ప్లాంట్లు నిర్మిస్తాం. కాలనీల్లో వినియోగించిన నీటిని సీవరేజీ ప్లాంటులో శుద్ధి చేయడం వల్ల వాటిని మొక్కల పెంపకానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ రెండు టెండర్ల ప్రక్రియ పూర్తయి అగ్రిమెంటు పూర్తింది. ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వగానే పనులు ప్రారంభిస్తాం. ఈ రెండు పనులు 15నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
 - మోహన్‌నాయక్, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement