Guaranteed
-
సీటు గ్యారంటీ! పేటీఎంలో రైలు టికెట్ బుకింగ్‌పై కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది. కన్ఫర్మ్డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్‌పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది. -
నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ తాము కచ్చితంగా ఉక్రెయిన్‌పై విజయం సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమాగా చెప్పారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ రష్యా దళాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చెప్పారు. లెనిన్గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అక్కడ ఒక కర్మాగంలో కార్మికులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా కచ్చితంగా తమకు గెలుపును తెచ్చిపడతాయని విశ్వాసంగా చెప్పారు. అంతేగాదు పుతిన్ క్షిపణి తయారుదారు అల్మాజ్ ఆంటెలో భాగమైన ప్లాంట్‌లో ప్రసంగిస్తూ రష్యా రక్షణ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే ఉక్రెయిన్‌లో రష్యా టాప్ కమాండర్‌ని నియమించిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదీగాక రష్యా ప్రత్యేక 'సైనిక ఆపరేషన్' పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ దాడికి దిగి సరిగ్గా ఏడాది కావస్తున్న తరుణంలో రష్యాలో ఒకింత భయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సమర్థింపు చర్యగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఉక్రెయిన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. మంత్రితో సహా 16 మంది దుర్మరణం) -
ఆస్తి అమ్మైనా అప్పు తీర్చేస్తా..
తల్లాడ: తన కుమారుడు రైతుల వద్ద నుంచి మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టినందువల్ల కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న మిర్చిని విక్రయించి రైతులకు పంపిణీ చేస్తానని, మిగిలిన పైకం కూడా తన ఆస్తులను అమ్మైనా చెల్లిస్తానని అఖిల పక్షానికి జలంధర్ తండ్రి ఎస్బీ ప్రసాద్ హామీ పత్రం రాసి ఇచ్చారు. తల్లాడ శ్రీరామా, శ్రీ కృష్ణ కోల్డ్ స్టోరేజ్‌ల్లో కొంత మిర్చి తన కుమారుడు ఉంచాడని, అది విక్రయించగా మిగిలిన సొమ్మును తన స్తోమత మేరకు చెల్లిస్తానన్నారు. గత నాలుగు రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఐపీ వ్యాపారి జలంధర్ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారి తండ్రి దిగి వచ్చి అఖిల పక్షానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, బాధిత రైతులు గద్దె అశోక్, కొండల్రావు, కోయిన్ని వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వరరావు, పడాల లక్ష్మయ్య, నాగేంద్రబాబు, గొడుగునూరి లక్ష్మారెడ్డి, యరమల నాగార్జున్‌రెడ్డి, వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రెడ్డెం రామకృష్ణ, కుప్పాల రామకోటయ్య, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్
కొడుకు వైద్యంతో పాటు కూతురి పెళ్లి కూడా జరిపిస్తానని హామీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, గాయకుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కొడుకు అజయ్‌కి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా రాజన్న ప్రజల్లో చైతన్యం కలిగించారు. ‘తెలంగాణ వచ్చేదాకా తెగించి మాట్లాడుడే’ లాంటి పాటలెన్నో రాశాడు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కూడా కల్పించింది. అయితే ఇటీవల ఆయన కొడుకు అజయ్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఎంటెక్ చదివిన కూతురు శ్వేత వివాహం కూడా నిశ్చయమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంను కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి కూతురు పెళ్లి జరిపిస్తానని, ఆర్థిక సహాయం కూడా అందిస్తానని, కుమారుడి వైద్య ఖర్చులన్నీ భరిస్తానని రాజన్నకు హామీ ఇచ్చారు. -
‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే
- అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు - రూ.84.22 కోట్లతో డబుల్ బెడ్రూం ప్లాట్లు - 1384 మందికి ప్రయోజనం - రూ. 20కోట్లతో మౌలిక వసతులు - త్వరలోనే పనులు ప్రారంభం వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్‌లోని నివాసాల స్థానంలో జీప్లస్-1, జీప్లస్-3 పద్ధతిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ శాఖ ఎంపిక, టెండర్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు కట్టబెట్టింది. రూ.వంద కోట్లకు పైగా వ్యయం కానున్న జీప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతను జిల్లా కలెక్టర్ ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ శాఖ పూర్తి స్థాయిలో డీపీఆర్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహాయం తీసుకొని ఈ డీపీఆర్‌కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలోని కమిటీ ఈ డీపీఆర్‌కు ఆమోదం వేయగానే ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు నిర్వహించారు. రూ.43 కోట్లతో జీప్లస్-3 నిర్మాణం: హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని 7 ఎకరాల స్థలంలో జీప్లస్-3 పద్ధతిలో అ ర్హులుగా గుర్తించిన 592మందికి డబుల్ బెడ్రూం ఇ ళ్లు నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో ప్లాట్లు, రోడ్లు, వి ద్యుత్ సౌకర్యం, ఇతరత్రా మౌలిక సదుపాయాలతో పాటు సీవరేజీ ప్లాంటు నిర్మిస్తారు. ఇళ్ల నిర్మాణానికి రూ.34కోట్లు, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వ్య యానికి రూ.9కోట్లు కేటాయించారు. ఈ పనుల కో సం నిర్వహించిన టెండర్లలో నాలుగు ఏజెన్సీలు పో టీ పడ్డాయి. ఈ టెండర్ల ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 1.17శాతం మైనస్, బీపీఆర్ కంపెనీ రూ.1శాతం మైనస్‌కు టెండర్లు వేయగా 7.29శాతం తక్కువ వేసిన మంద ఐలయ్య కంపెనీ ఈపనులను దక్కిం చుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో అగ్రిమెంటు కాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.71.80కోట్లతో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం: వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్‌లోని 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేందుకు యత్నించగా స్థానికుల నుంచి వ్యతి రేకత రావడంతో అర్హులుగా గుర్తించిన 792మందికి జీప్లస్-1పద్ధతిలో ఇళ్లు నిర్మించనున్నారు. ఇందులో నిర్మాణాలను గ్రేడ్లుగా విభజించారు. - గ్రేడ్‌లో 4+4, బి-గ్రేడ్‌లో 2+2, సి- గ్రేడ్‌లో 1+1, డి-గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూపొందించారు. ఇందులో సి, డీ గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఎ, బి గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేందుకు జిల్లా కమిటీ నిర్ణయించింది. రూ.71.80కోట్ల వ్యయంతో ఇందులో రూ.50.22కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.10.40కోట్లతో మౌలిక సదుపాయాలు, రూ.11.18కోట్లు ఇతరత్రా వ్యయానికి కేటాయించారు. ఈ పనుల కోసం నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొనగా నలుగురు అర్హత పొందారు. బీపీఆర్ కంపెనీ రూ.0.01ప్లస్‌కు, మంద ఐలయ్య కంపెనీ 0.90శాతం ఎక్కువకు టెండర్లు వేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 4.14శాతం మైనస్‌తో ఈపనులను దక్కించుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ పనుల అగ్రిమెంటు పూర్తి కావడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.130కోట్ల వ్యయంతో డబుల్బెడ్రూం నిర్మాణం ప్రభుత్వం నగరంలో నిర్మించ తలపెట్టిన డబుల్‌రూం ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.130కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రూ.110కోట్ల వరకు ఇళ్ల నిర్మాణానికి వ్యయం చేస్తుండగా రూ.20కోట్లు మౌలిక వసతుల కోసం వెచ్చిస్తాం. రోడ్లు, విద్యుత్ సరఫరాలతో పాటు నగరంలో మొదటి సారిగా సీవరేజి ప్లాంట్లు నిర్మిస్తాం. కాలనీల్లో వినియోగించిన నీటిని సీవరేజీ ప్లాంటులో శుద్ధి చేయడం వల్ల వాటిని మొక్కల పెంపకానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ రెండు టెండర్ల ప్రక్రియ పూర్తయి అగ్రిమెంటు పూర్తింది. ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వగానే పనులు ప్రారంభిస్తాం. ఈ రెండు పనులు 15నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. - మోహన్‌నాయక్, ఎస్ఈ, ఆర్అండ్బీ -
ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోండి
వైఎస్సార్ సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిల బెట్టుకోవాలని కేంద్రానికి వైఎస్సార్ సీపీ ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మౌనం వహించడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారన్నారు. ‘రాష్ట్రం విడిపోయి పది నెలలు కావస్తున్నా, ప్రత్యేక హోదా సహా ఏపీవిభజన చట్టం-2014లోని ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని హామీ ఇస్తే, పదేళ్లు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ డిమాండ్ చేసింది. ఇప్పు డు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడినందున విభజన చట్టంలోని హామీలను అమలు చేసి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నా’ అని పేర్కొన్నారు.