రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్ | helping for rajanna family :kcr | Sakshi
Sakshi News home page

రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్

Published Thu, Jan 21 2016 5:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్

రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్

కొడుకు వైద్యంతో పాటు కూతురి పెళ్లి కూడా జరిపిస్తానని హామీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, గాయకుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కొడుకు అజయ్‌కి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా రాజన్న ప్రజల్లో చైతన్యం కలిగించారు. ‘తెలంగాణ వచ్చేదాకా తెగించి మాట్లాడుడే’ లాంటి పాటలెన్నో రాశాడు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కూడా కల్పించింది. అయితే ఇటీవల ఆయన కొడుకు అజయ్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఎంటెక్ చదివిన కూతురు శ్వేత వివాహం కూడా నిశ్చయమైంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంను కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి కూతురు పెళ్లి జరిపిస్తానని, ఆర్థిక సహాయం కూడా అందిస్తానని, కుమారుడి వైద్య ఖర్చులన్నీ భరిస్తానని రాజన్నకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement