ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోండి
వైఎస్సార్ సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిల బెట్టుకోవాలని కేంద్రానికి వైఎస్సార్ సీపీ ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మౌనం వహించడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారన్నారు.
‘రాష్ట్రం విడిపోయి పది నెలలు కావస్తున్నా, ప్రత్యేక హోదా సహా ఏపీవిభజన చట్టం-2014లోని ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని హామీ ఇస్తే, పదేళ్లు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న ఎన్‌డీఏ డిమాండ్ చేసింది. ఇప్పు డు కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ ఏర్పడినందున విభజన చట్టంలోని హామీలను అమలు చేసి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నా’ అని పేర్కొన్నారు.