
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్‌ఫర్మ్‌డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది.
కన్‌ఫర్మ్‌డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్‌పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్‌లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్‌లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment