రెండేళ్లలో రూ. 10 లక్షల కోట్లు అప్
ఆర్‌బీఐ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్‌బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్‌కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.
కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.
ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
Comments
Please login to add a commentAdd a comment