కోలాహలం.. పట్టాల యజ్ఞం  | All The Poor Womens In AP Are Happy With House Patta Distribution | Sakshi
Sakshi News home page

కోలాహలం.. పట్టాల యజ్ఞం 

Published Mon, Jan 4 2021 6:11 AM | Last Updated on Mon, Jan 4 2021 6:11 AM

All The Poor Womens In AP Are Happy With House Patta Distribution - Sakshi

చిత్తూరు జిల్లా పాకాలమండలం రామిరెడ్డిగారిపల్లెలో ఆదివారం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యజ్ఞం వరుసగా పదోరోజైన ఆదివారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో జరిగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30.75లక్షల మందికి నివాస స్థలాలు/ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారం అవుతోందని అక్కచెల్లెమ్మలంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు పెద్దఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా.. ఓ ఉత్సవంలా ఉంది.  

► శ్రీకాకుళం జిల్లాలో 1,909 మంది లబ్ధిదారులకు ఆదివారం పట్టాలను అందజేశారు. పది రోజుల వ్యవధిలో 37,127 మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరిగింది. 
► విజయనగరం జిల్లాలో ఆదివారం 18,917 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 7,845, పీసీ/ఈఆర్‌ కింద మరో 11,072 పట్టాలు ఉన్నాయి. డిసెంబర్‌ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 55,224 పట్టాల పంపిణీ జరిగింది.
► విశాఖ జిల్లాలో 2,676 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు అందజేశారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో 211 మందికి పట్టాలు అందజేశారు. ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లులో 166 మందికి పంపిణీ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 1,886 మందికి టిడ్కో ఇళ్ల ఒప్పందపత్రాలు, పొజిషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. కశింకోటలో 314 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేశారు. నాతవరం మండలంలో 99 పట్టాలు అందజేశారు.
► తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 90,493 మందికి ఇళ్ల పట్టాలు.. 1,547 మందికి టిడ్కో ఇళ్లు, 9,202 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. ఆదివారం ఒక్కరోజే 19,926 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 56,204 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. గృహనిర్మాణం చేపట్టేందుకు 10,335 మంది ఆప్షన్‌ ఫారాలు అందించారు. కరప మండలం యండమూరు, కాకినాడ రూరల్‌ మండలం చీడిగలో 3,646 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 
► ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మొత్తం 4,660 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో మొత్తం పది రోజుల్లో 74,319 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. తణుకు నియోజకవర్గం ఇరగవరంలో 312 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో 530 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 
► కృష్ణా జిల్లాలో ఆదివారం 11,687 ఇళ్ల పట్టాలను అందచేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 95,878 ఇళ్ల పట్టాలను ఇచ్చారు. 
► ప్రకాశం జిల్లాలో ఆదివారం 2,478 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి 38,728 మందికి పట్టాలిచ్చారు. ఒంగోలులో టిడ్కో ఇళ్ల సేల్‌ అగ్రిమెంట్లు 215 పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 670 సేల్‌ అగ్రిమెంట్లు పంపిణీ చేశారు.
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 4,822 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 
► వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆదివారం 4,782 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు పదిరోజుల్లో మొత్తం 64,934 మంది ఇళ్ల పట్టాలు పొందారు. 
► అలాగే, కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో 155, ఆదోనిలో 343, పత్తికొండ 191, ఆలూరు 619, శ్రీశైలం 248, నంద్యాల 71, కోడుమూరు నియోజకవర్గంలో 418 ఇళ్ల పట్టాలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. 
► అనంతపురం జిల్లావ్యాప్తంగా ఆదివారం 5,732 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం కామరుపల్లి లేఅవుట్‌ వద్ద ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. 
► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9,289 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రంలో మోడల్‌ కాలనీగా పేరేచర్ల లేఅవుట్‌ 
గుంటూరు జిల్లా పేరేచర్లలోని లేఅవుట్‌ను రాష్ట్రంలోనే వైఎస్‌ జగనన్న మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతామని గృహ నిర్మాణ, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ లేఅవుట్‌లో ఇంటి పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌రావు, జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ.. పేరేచర్లలో 400 ఎకరాల్లో 18,492 ప్లాట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద వైఎస్సార్‌ జగనన్న కాలనీ నిరి్మతమవుతుందన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఆదివారం 26,422 పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో 26,347 ఇళ్ల పట్టాలు ఇవ్వగా, 75 టిడ్కో అగ్రిమెంట్‌లను లబ్ధిదారులకు అందజేశారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లోనూ పట్టాల పంపిణీ జరిగింది.

చంద్రగిరిలో వినూత్నంగా..
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి పట్టాతో పాటు ప్రతి తోబుట్టువుకు లెనిన్‌ కాటన్‌ చీర, జాకెట్, శ్రీవారి లడ్డూ, శ్రీ పద్మావతి అమ్మవారి పసుపు–కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, స్వీట్లు, చక్కటి బ్యాగుతో కూడిన సారెను తన స్వహస్తాలతో అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement