house patta documents
-
లైన్ క్లియర్.. ఒంగోలు ప్రజలకు సీఎం జగన్ శుభవార్త...
-
సిలోన్ కాందిశీకుల కల నెరవేరింది
చీరాల: వారంతా శ్రీలంకలో బతకలేక.. ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో తమిళనాడుకు వలస వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన కాందిశీకులకు వసతులు, ఉపాధి కష్టంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అప్పట్లో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కాందిశీకులకు ఉపాధి కల్పించింది. కాగా.. 1980లో చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద కేంద్ర ప్రభుత్వం నూలు మిల్లు ఏర్పాటు చేసింది. ఆ మిల్లులో పనుల కోసం దాదాపు 200 శ్రీలంక కాందిశీక కుటుంబాలను చీరాల తరలించారు. నూలు మిల్లు పక్కనే 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించి కాందిశీకులకు కాలనీ కట్టించి ఇళ్లు కేటాయించారు. ఆ కాలనీలో కాందిశీకులు నివాసం ఉంటూ నూలుమిల్లులో పనులు చేసుకుంటూ జీవించేవారు. నూలు మిల్లులు నష్టాల పాలవడంతో వాటన్నింటినీ మూసివేశారు. 2000 సంవత్సరంలో చీరాల నూలు మిల్లు కూడా మూతపడింది. అప్పటినుంచి కాందిశీకులు ఈ ప్రాంతంలోనే ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు. కాందిశీకుల కల నెరవేర్చిన జగన్ దేశాయిపేటలో నిర్మించిన సిలోన్ కాలనీలో ఇళ్లలో నివాసం ఉంటున్న కాందిశీకులకు ఆ ఇళ్లపై ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిలోన్ కాలనీలో నివాసం ఉంటున్న కాందిశీకులందరికీ ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో వారికి ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కు లభించింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది శ్రీలంక నుంచి చీరాల వచ్చి స్థిరపడిన కాందిశీకులకు 42 ఏళ్ల తరువాత సొంత గూడు ఏర్పాటుకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సిలోన్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా. – కరణం బలరాం ఎమ్మెల్యే, చీరాల ఇళ్ల పట్టాలు ఇచ్చారు 43 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వలస వచ్చాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సిలోన్ కాలనీలో ఉంటున్నాం. ఆ ఇళ్లపై మాకు పూర్తి హక్కులు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం వాటికి పట్టాలు మంజూరు చేసింది. – ఎం.శివనాడియన్, సిలోన్ కాలనీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిలోన్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూలుమిల్లు మూసివేసిన తరువాత ఈ ప్రాంతంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాం. కాలనీలో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. – ఎం.సత్యవేలు, సిలోన్ కాలనీ -
మారీచులపై నిరుపేదల విజయమిది
మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25 లే అవుట్లలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం వారం పాటు పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతి అక్కచెల్లెమ్మను లే అవుట్ వద్దకు తీసుకెళ్లి, అక్కడే ఇంటి పత్రాలు అంద జేస్తారు. ఆ స్థలంలో ఫొటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తయ్యాక ఇళ్లు కట్టించే కార్యక్రమానికి బీజం పడుతుంది. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశామని.. రాష్ట్రంలో మాత్రం పేదలకు వాటిని ఇవ్వొద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోందని చెప్పారు. ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నామని తెలిపారు. ఇది మారీచులపై నిరుపేదల విజయమని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పోరాటాలు వందలు, వేలు చూశామన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే మారీచు, సుభాహులు అడ్డు పడుతున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా తన పయనం ధర్మం వైపే ఉంటుందని, ప్రభుత్వం నిరుపేదల పక్షానే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు మంజూరు చేసి.. జూలై 8.. నాన్నగారి (దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి) జయంతి రోజున ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారని, దాదాపు 232 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ ఇళ్ల పట్టాలు.. సామాజిక న్యాయ పత్రాలు ♦ ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సభకు, ఈ సందర్భానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రభుత్వ తాపత్రయం ఒకవైపు.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని అడ్డుపడుతున్న పరిస్థితులు ఇంకోవైపు.. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. ♦ ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. ♦మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్‌ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఎంతుంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో జరిగిన వేలంలో గజం రూ.17 వేలకు అమ్ముడుపోయిందని.. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుందన్నారు. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు.. వారికిస్తున్న సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇకపై ఇదే అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుంది. మనందరి అమరావతి అవుతుంది. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.3 లక్షల కోట్లు ♦ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్లో సొంతంగా తామే కట్టుకుంటామంటే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తాం. రెండో ఆప్షన్‌గా వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణ కూలి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్న వాళ్లకు మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు. ♦ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నట్టే.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తాం. సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ మార్కెట్ రేట్ల కంటే తక్కువకే ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో రాజీ పడేది లేదు. దీంతో పాటు రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్లు కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. ♦ మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీరిలో 21 లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా.. 30.75 లక్షల ఇంటి స్థలాల్లో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు విలువ చేసే ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ♦ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు.. మీ అన్నగా, మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నా. గత ప్రభుత్వంలో పాలకులు ఇలాంటి ఆలోచన చేసే సాహసమైనా చేశారా? గతానికీ, ఇప్పటికీ మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు ♦ఈ 50,793 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సీఆర్డీఏ పరిధిలో 8 చోట్ల జగనన్న కాలనీల్లో పీఎంఏవై కింద జీ ప్లస్ 3 విధానంలో నిర్మించిన 5,024 మందికి టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహ ప్రవేశాలు చేయించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీగా రూ.75 కోట్లు ఇస్తే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. ♦ టిడ్కో ఇళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్‌కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుగుకి రూ.2 వేలు వేసుకుంటే.. దాదాపు రూ.5.75 లక్షలు అవుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష అవుతుంది. ♦ అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తే మిగిలిన రూ.3 లక్షల డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున కట్టాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపెడై మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలి. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? కానీ మీ బిడ్డ ఈ ఫ్లాట్‌ను అక్కచెల్లెమల పేరుపై రూ.1కే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు, వారి గజ దొంగల ముఠా, ఎల్లో మీడియా వక్రభాష్యాలు చెబుతూనే ఉంది. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ♦ రెండేళ్లు కోవిడ్ కష్టాలు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా మాకున్న కష్టం కన్నా మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరుగెత్తాడు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. ♦మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. మేనిఫెస్టోలో 98 శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా చేపడుతూ పరిగెత్తిస్తున్నాం. ♦ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.11 లక్షల కోట్లు జమ చేశాం. మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయింది. ఒక్కో ఇంటి స్థలం రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్ల విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. మిగిలిన గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటివి కలిపి అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం. మంచి జరుగుతుంటే తట్టుకోలేక.. ♦ ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా.. అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు దత్తపుత్రుడు కలిసి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం చూశాం. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. అప్పుల పెరుగుదల కూడా ఇప్పుడే తక్కువ. ♦లంచాలు, వివక్ష లేకుండా మరి ఇన్ని లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇప్పుడు ఎలా వెళ్లింది? చంద్రబాబు హయాంలో అలా ఎందుకు జరగలేదని ఆలోచించండి. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. వారి తపన, తాపత్రయం అంతా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి అధికారంలోకి రావడం మాత్రమే. వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ♦ చంద్రబాబు తన పాలనలో 2014–2019 మధ్య ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి, కనీసం ఒక ఇంటి పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి.. రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలు సమీపిస్తుంటే కొత్త మోసాలతో ముందుకొస్తారు జాగ్రత్త. రాష్ట్రంలో క్లాస్ వార్ ♦ ఇప్పుడు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. ♦ ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదో ఒక రూపేణా అడ్డుకుంటూనే ఉన్నారు. ♦ పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడుతుంటే గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడానికే వీల్లేదని అడ్డుకుంటున్నారు. మనం వేసే ప్రతి మంచి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. కానీ మీ జగన్ మాత్రం మీ వెంటే ఉన్నాడు. అమ్మఒడి, ఆసరా, చేయూతతో నా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు. ♦ జగన్ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీల్లో డిబేట్లు పెడతారు. రాబోయో రోజుల్లో పేదలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ♦ మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో ప్రతి కాలనీలోనూ అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా వస్తాయి. ఇక్కడే నవులూరిలో లేక్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. మోసం చేసేవాడిని ఎప్పుడూ నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో గాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు. – సీఎం వైఎస్ జగన్ -
‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ
వెంకటపాలెం(తాడికొండ)/తాడేపల్లిరూరల్: అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పాల్గొని వెంకటపాలెం టీటీడీ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటామంటూ చంద్రబాబు, రాజధాని రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు, కులవాదులు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో బాబు ఆయన అనుయాయుల మనసు మార్చాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బహుజన పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. పలువురు బహుజన పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. నాడు పెత్తందారుల పసుపు నీళ్లు.. నేడు పేదల క్షీరాభిషేకం అమరావతి ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే నాడు ‘పచ్చ’ పెత్తందారులు పసుపు నీళ్లు చల్లి కుట్రలకు తెరదీస్తే.. నేడు అదే ప్రాంతంలో పేదలు జగనన్నకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకుంటున్నారు. అమరావతిలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గురువారం ఆ ప్రాంతంలో పేదలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు శృంగారపాటి సందీప్, పలువురు 11 గ్రామాల్లోని 25 లే అవుట్లలో 2000 లీటర్ల పాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు, ప్లాట్లకు క్షీరాభిషేకం చేశారు. తాడేపల్లి ప్రాంతంలో.. కొండపోరంబోకులోనూ, రైల్వే స్థలాల్లోనూ బిక్కుబిక్కుమంటూ 40–50 సంవత్సరాల నుంచి నివాసముంటున్న పేదలకు సొంతింటి కల నెరవేరడంతో ఆనందంతో తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇత్తడి పండు, ఎం. మార్తమ్మ, జమ్మలముడి సునీత తదితరులు పాల్గొన్నారు. -
51,392 మంది పేదలకు ‘పట్టా’భిషేకం రేపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకటీ రెండూ కాదు.. వందా ఐదు వందలూ అసలే కాదు.. అక్షరాలా 51,392 నిరుపేదల కుటుంబాలు.. ప్రభుత్వం చొరవతో సొంతింటికి హక్కుదారులు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం.. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ‘నవరత్నాలు – పేదలంరికీ ఇళ్లు’ పథకంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారుకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 1402.58 ఎకరాల్లో ఒకొక్కరికి సెంటు చొప్పున 25 లేఅవుట్లలో 51,392 కుటుంబాలకు ప్లాట్లు సిద్ధం చేసింది. అయితే, అమరావతి ప్రాంతం పెద్దలదని, అక్కడ పేదలకు చోటులేదని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, మరికొందరు రైతుల ముసుగులో అనేక అడ్డంకులు సృష్టించారు. కోర్టులకు కూడా వెళ్లారు. దేశంలోనే అతి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకుని వ్యాజ్యాలు వేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పి కోర్టులను అడ్డుపెట్టుకుని చోటు లేకుండా చేయాలకున్నారు. ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కోర్టులు కూడా సమర్ధించాయి. దీంతో ఉద్యమం పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది. 1,402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇస్తున్న 1402.58 ఎకరాల్లో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751.93 ఎకరాల్లో 14 లేఅవుట్లను వేసి 27,532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650.65 ఎకరాల్లో 11 లేఅవుట్లలో 23,860 ప్లాట్లు వేశారు. ఈ లేఅవుట్లలో 67,700 హద్దు రాళ్లు వేసి ప్లాట్లకు పొజిషన్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల మార్కింగ్, నంబరింగ్ పూర్తి చేశారు. 76.28 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించారు. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. తక్కువ సమయంలోనే పూర్తి సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సిద్ధం చేశాం. అన్ని ప్లాట్లకు నంబర్లు కేటాయించి మార్కింగ్ కూడా పూర్తిచేశాం. శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు. అందుకోసం వెంకటాయపాలెంలో వేదికను సిద్ధం చేస్తున్నాం. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేశాం. ఇక్కడి నుంచే టిడ్కో లబిద్ధదారులకు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తాం. – వివేక్ యాదవ్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ పేదలకు పట్టాలివ్వకుండా ఎన్నెన్నో కుట్రలు సీఆర్డీయే పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా తెలుగుదేశం పార్టీ, కొందరు వ్యక్తులు రైతుల ముసుగులో అనేక కుట్రలు పన్నారు. రైతుల పేరుతో ఆ ప్రాంతంలో నిరసనలకు దిగారు. జగనన్న లేఅవుట్లలో పనులు జరగకుండా అడ్డుకొన్నారు. కొందరు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. పోలీసులపైనా దాడులకు దిగారు. కొందరు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టుల్లోనూ సమర్ధంగా వాదనలు వినిపించింది. కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో ఇప్పుడు సీఆర్డీఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత పేదలకు ఇళ్ళ స్థలాలే వద్దన్న బాబు అండ్ కో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆర్ 5 జోన్లో కాకుండా ఆర్–3 జోన్లో ఇస్తే ఇబ్బంది లేదని, సెంటు కాకుండా ఐదు సెంట్లు ఇవ్వాలంటూ మరో రాగం అందుకున్నారు. సెంటు భూమి సమాధులు కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదంటూ చంద్రబాబు పేదలను అవహేళన చేసేలా మాట్లాడారు. తాజాగా దళిత జేఏసీ పేరుతో జడ శ్రావణ్‌కుమార్ తదితరులు తుళ్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్కచేయకుండా బుధవారం అక్కడ అశాంతిని సృష్టించే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకొనేందుకు దీక్ష పేరుతో ఆయన తుళ్లూరు దీక్షా శిబిరానికి దొడ్డిదారిలో చేరుకున్నారు. వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, విజయవాడకు తరలించారు. -
త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్మెంట్ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇళ్లు ఫుల్ స్పీడ్!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద వీరికి ఇళ్ల పట్టాల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైకోర్టుకు అదనపు భవనం.. కోర్టు హాళ్లలో సదుపాయాలు అమరావతిలో 50,004 మంది పేదలకు 1,402.58 ఎకరాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పది లేఅవుట్లలో, ఎన్టీఆర్ జిల్లా లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. దాదాపు 180 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు అదనపు భవన నిర్మాణం కూడా పూర్తవుతున్నట్లు చెప్పారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన పనులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుందరంగా బెజవాడ రివర్ బెడ్ విజయవాడలో కృష్ణానది వరద ముప్పు తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడిన రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా వివిధ సుందరీకరణ పనుల గురించి అధికారులు వివరించారు. నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పరిశుభ్రంగా విశాఖ బీచ్‌లు విశాఖలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మెరుగుపడుతుందన్నారు. గుడివాడ టిడ్కో ఇళ్లు జూన్‌లో పంపిణీ ఫేజ్–1 కింద 1,50,000 టిడ్కో ఇళ్లకు సంబంధించి 1.39 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పటికే 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రెండో విడతకు సంబంధించి 1,12,092 ఇళ్లను సెప్టెంబరు – డిసెంబరు మధ్య లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్‌కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీసర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పేదల రాజధానిలో ఇళ్ల పండగ
సాక్షి, అమరావతి: న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో దాదాపు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ముళ్ల కంపలను తొలగించి స్థలాలను చదును చేయడంతో పాటు వెంటనే ప్లాట్ల మార్కింగ్ జరుగుతోంది. నిరుపేదల కోసం 1,134.58 ఎకరాలను కేటాయించడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మందికి కేటాయించింది. వీరందరికీ అతి త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విశాలమైన రోడ్లు.. అటు తాడికొండ, ఇటు నీరుకొండ.. ఐదు కి.మీ పరిధిలోనే మంగళగిరి, మరికొద్ది దూరంలో తాడేపల్లి.. ఎటు చూసినా 20 నిమిషాల ప్రయాణం దూరం మాత్రమే ఉండే ప్రాంతంలో నిరుపేదల లే అవుట్లు సిద్ధమవుతున్నాయి. సీఆర్డీఏ అధికారులు, సిబ్బందితో పాటు వార్డు సచివాలయాల సిబ్బంది సైతం శరవేగంగా పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలులో 900.97 ఎకరాలను ఆర్ 5 జోన్‌గా మారుస్తూ మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పాటు ఎస్–3 జోన్‌లోని 233.61 ఎకరాలను కూడా ఆర్–5కి జోడించారు. నిరుపేదల కోసం కేటాయించిన మొత్తం 1,134.58 ఎకరాల్లో గుంటూరు జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా (వీఎంసీ) పరిధిలోని లబ్ధిదారులకు 583.93 ఎకరాలు కేటాయించారు. ధర్మమే గెలిచింది రాజధాని ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలను సేకరించిన గత సర్కారు అక్కడ పెద్దలకు మాత్రమే చోటు కల్పించి పేదలకు తావు లేకుండా చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో 5 శాతం నిరుపేదల గృహాల కోసం కేటాయించే వీలున్నా అడ్డంకులు సృష్టించింది. నిరు పేదలకు చోటులేనిది రాజధాని ఎలా అవుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కొత్తగా ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో రెండు జిల్లాలకు చెందిన 48,218 మంది నిరుపేదలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో స్థలాలు కేటాయించింది. గుంటూరు జిల్లాకు చెందిన పేదల కోసం 10 లేఅవుట్లను సిద్ధం చేయగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 11 లే అవుట్లు రూపుదిద్దుకున్నాయి. భారీ భవంతుల మధ్య బడుగు జీవులు ఉండకూడదని టీడీపీ నాయకులు రైతుల ముసుగులో ఆటంకాలు సృష్టించినా ఎట్టకేలకు ధర్మమే గెలిచిందని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15న పట్టాల పంపిణీ యోచన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలు నివాసం ఉండేందుకు మార్గం ఏర్పడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువైందని అక్క చెల్లెమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే చట్టప్రకారం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేయడం, లేఅవుట్ పనులు కూడా పూర్తి కావస్తుండడంతో ఈనెల 15న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. దురుద్దేశంతోనే అడ్డుపడ్డారు వేల మంది నిరుపేదలకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 45పై కొందరు కోర్టును ఆశ్రయించడం బాధాకరం. రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. అలాంటి చోట పేదలకు ఇళ్లు కేటాయించరాదంటూ కొందరు స్వార్ధపూరితంగా కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా అడ్డుకున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే మంగళగిరి చంద్రబాబుకు చెంపపెట్టు పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేలా ఉండాలి. కానీ అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కాపు వర్గానికి చెందిన ప్రజలు ఉండకూడదని చంద్రబాబు భావించారు. రాజధానిలో తన అనుచరులు, తన సామాజిక వర్గం వారు మాత్రమే ఉండాలని కోరుకున్నారు. – జోగి రమేశ్, మంత్రి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. అన్యాయమైన డిమాండ్‌తో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. సామాజిక అసమతుల్యత అంటూ అడ్డుపడ్డ వారికి ఈ తీర్పు చెంప దెబ్బ లాంటిది. త్వరలో ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. రాజధాని అంటే ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరిదీ అనే విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పటికైనా గుర్తించాలి. కమ్యూనిస్టులు కూడా బుద్ధి తెచ్చుకుని పేదల కోసం పని చేయాలి. – లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ అడ్డుకోవడం దుర్మార్గం రాజధానిలో పేదలు ఉండకూడదని అడ్డుకోవడం దుర్మార్గం. రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి పేదలంతా అండగా ఉంటారు. – తమిదం లలిత, మంగళగిరి ఓట్ల వరదలో కొట్టుకుపోతారు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడున్న వారికి వచ్చిన నష్టమేంటో అర్ధం కావడం లేదు. రాజకీయాల కోసం పేదలకు అన్యాయం చేయాలనుకున్న వారికి కోర్టు తీర్పు గుణపాఠం లాంటిది. రాజధానిలో ఎవరైనా నివసించే హక్కు ఉంది. ప్రభుత్వం చేస్తున్న మేలును అడ్డుకుంటున్నవారు పేదల ఓట్ల వరదలో కొట్టుకుపోతారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు. – జగన్నాధం రాజేశ్వరి, మంగళగిరి మిఠాయిలు పంచిన ఎంపీ నందిగం సురేష్ తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని తన కార్యాలయంలో బహుజన పరిరక్షణ సమితి దీక్షా శిబిరం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, బేతపూడి రాజేంద్ర,కుమార్, బొలిమేర శ్యామ్యూల్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, ఇందుపల్లి సుభాషిణి, రాజ్‌కుమార్, కారుమూరి పుష్పరాజ్ పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. న్యాయం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అందరికీ ఇళ్ల స్ధలాలను కేటాయించారు. మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వరంటూ విపక్షాలు ప్రచారం చేసినా కోర్టు కేసుల వల్ల కొంత ఆలస్యమైనా కచ్చితంగా వస్తాయని వలంటీర్లు చెప్పారు. పేదలకు కోర్టులో న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. – ఎస్కె నగీనా, నులకపేట సొంతింటి కల నెరవేరనుంది జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు కూడా ఇళ్ల పట్టాలు వస్తాయని ఎదురు చూశాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. అందరికీ ఇళ్ల స్ధలాలు ఇస్తారని సచివాలయ సిబ్బంది తెలియజేశారు. – ఎస్కె కరీమున్నీసా, డ్రైవర్ కాలనీ ఆటంకాలు తొలగాయి.. కొందరు రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ప్రాంతంలో పేదలంతా అద్దె ఇళ్లల్లోనే నివాసముంటున్నారు. పెళ్లయిన పిల్లలు ఒక చిన్న గదిలో తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం రానుండటం ఆనందంగా ఉంది. – నారాయణరెడ్డి, పోలకంపాడు -
వేగంగా ఇళ్ల పట్టాలు.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మళ్లీ వేగంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లను నిర్మించే పథకాన్ని కూడా వేగంగా అమలు చేయాలని, సొంత జాగాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, జాగా లేని వారికి ప్రభుత్వపరంగా స్థలాలు కేటాయించాలని కూడా నిర్ణయించింది. ఇళ్ల స్థలాల పంపిణీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం సమావేశమయ్యింది. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాసగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2014లో ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కింద 1.25 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. జీఓ నం. 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంటి స్థలాల పట్టాల పంపిణీని ఇక నుంచి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు. పట్టణాల్లో 60 గజాలు, గ్రామాల్లో 120 గజాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. పేదల అనుకూల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వం తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.12 వేల కోట్ల మొత్తాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో సొంత జాగాలు ఉన్నవారికి ఇంటికి రూ.3 లక్షలు చొప్పున మంజూరు చేసి వారే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టుకునేలా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే సొంత జాగాలు లేనివారి సంఖ్య భారీగా ఉన్నందున, వారి నుంచి కూడా ఒత్తిడి వస్తోందంటూ ఇటీవల ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఇప్పుడు వారికి పట్టాలు మంజూరు చేయటం ద్వారా స్థలానికి వీలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నోటరీ పత్రాల గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల పరిష్కారానికి సమయానుకూల కార్యాచరణను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అర్హత ఉన్న వారి కేసుల సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జీఓ నం.58, 59 అంశాలతోపాటు సాదా బైనామాలు, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రూ.850 కోట్ల బకాయిలపై దృష్టి నిధులను వేగంగా సమీకరించుకునే క్రమంలో మంత్రివర్గ ఉపసంఘం హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డుకు పెద్ద మొత్తంలో భూముల నిధి ఉంది. కానీ అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో వాటి విక్రయాలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గతంలో వివిధ ప్రాజెక్టులు, వెంచర్ల కోసం కేటాయించిన భూములకు సంబంధించి ఆయా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి చెల్లించకుండా బకాయిపడ్డ రూ.850 కోట్లను వేగంగా వసూలు చేయటంపై దృష్టి సారించింది. ఏయే సంస్థ ఎన్ని నిధులు చెల్లించాల్సి ఉందో వివరాలను ఆరా తీసి వాటిపై చర్చించింది. బకాయిలు ఇంతకాలం చెల్లించనందుకు పేరుకుపోయిన వడ్డీ వివరాలు తెలుసుకుని, వీలైనంత త్వరగా వాటిని వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటికి సంబంధించి ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపి బకాయిదారులకు నోటీసులు జారీ చేసి ఆ మొత్తాలను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించింది. చిన్న చిన్న బిట్లు వేలం వేయండి గతంలో అమ్మగా మిగిలిన చిన్నచిన్న భూముల బిట్లను సమీకరించి వేలం పాటలో ఉంచి విక్రయించాలని మంత్రులు ఆదేశించారు. ఇక స్వగృహ కార్పొరేషన్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఉన్నవి ఉన్నట్టుగా వేలం వేసేందుకు వీలుగా హెచ్ఎండీఏతో కలిసి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పనులు జరపకుండా ఖాళీగా ఉంచిన భూములను కూడా అమ్మే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. త్వరలో వీటికి సంబంధించిన ప్రణాళికను అందజేయాల్సిందిగా సూచించారు. -
మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ..: సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చాం.. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఒక్కకాలనీలోనే దాదాపుగా 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతోందని, పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని సీఎం జగన్ చెప్పారు. ‘‘ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఒక అన్నగా, తమ్ముడిగా అక్కాచెల్లెమ్మల తరపున భరించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అంటూ సీఎం జగన్ తెలియజేశారు. ‘‘ఈ మంచి పనికి పదహారు నెలల కిందటే అడుగులు వేశాం. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు, నాకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టిందని.. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చామని ఆయన అన్నారు. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంద’’ని సీఎం జగన్ అన్నారు. పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం. కానీ, అదనంగా, మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లులు కట్టిస్తామని సీఎం జగన్ సగర్వంగా తెలియజేశారు. ఇప్పటికే రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అర్హులైన వాళ్లకు ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని, ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని సీఎం జగన్ ఉద్ఘాటించారు. రోజుకో అబద్ధప్రచారంలో మునిగిపోతున్న దుష్టచతుష్టయం చేస్తున్న కుయుక్తులను, మంచిని చేస్తుంటే అడ్డుకుంటున్న ప్రయత్నాలను గమనించాలని ప్రజలను కోరారు సీఎం జగన్. కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పమని, ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇల్లు అంటే మహిళలకు శాశ్వత చిరునామా: సీఎం జగన్
-
Andhra Pradesh: ఇంటిపై సంపూర్ణ హక్కు
ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి. గత వీడియో కాన్ఫరెన్స్ నాటికి 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి ఆ సంఖ్య 758కి తగ్గింది. తద్వారా 8 వేల మందికి మేలు జరిగింది. పెండింగ్‌లో ఉన్న మిగతా కేసుల పరిష్కారంపై కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు దృష్టి పెట్టాలి. ఏజీతో నేను రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాను. దేవుడి దయవల్ల నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను. పెండింగ్ కేసుల్లో 395 కేసులపై తాత్కాలిక స్టేలు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి పెడితే, పేదలకు మేలు జరుగుతుంది. సాక్షి, అమరావతి: డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉందని, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1980 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయని, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చని, తద్వారా పేదలకు చాలా మంచి జరుగుతుందన్నారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్లో చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు, పేదల ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వన్‌టైం సెటిల్మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేశామన్నారు. ఈ పథకం గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అమలు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేటాను అప్లోడ్ చేసేలా చూడాలని, వచ్చే 90 రోజుల్లో ఈ మేరకు అన్ని పనులూ పూర్తి కావాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై ఇటీవలే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, దీనిపై అందరికీ అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఓటీఎస్ వర్తింపు ఇలా.. ► పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఓటీఎస్ వర్తిస్తుంది. ► పట్టా ఉండి, ఇల్లు కట్టుకుని, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని... ఎవరికై నా ఇంటిని అమ్మేసి ఉంటే.. రూరల్ ప్రాంతంలో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు జమ చేసి ఓటీఎస్ కింద లబ్ధి పొందవచ్చు. ► పట్టా మాత్రమే తీసుకుని.. రుణాలు తీసుకోకుండా.. వాళ్లే ఆ స్థలంలో ఉంటే.. ఇలాంటి కేటగిరీ వారికి రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. పట్టా తీసుకున్న వారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మినప్పుడు.. ఆ స్థలంలో ఇతరులు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే.. అలాంటి వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు జమచేస్తే వారికి ఈ పథకం వర్తిస్తుంది. లే–అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారులు మ్యాపింగ్ ► లే అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశాం. మనం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలి. లే అవుట్ల వారీగా వివరాలు తెలియజేయాలి. దీనివల్ల మిగిలిన ప్లాట్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుంది. ► మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలి. విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. జూన్–డిసెంబర్లో మంజూరు ► పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలతో పాటు మనం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి మిస్ అయిన వారిపై దృష్టి పెట్టాలి. వీరందరికీ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్లో ఆ ప్రయోజనాలందిస్తాం. ఈలోగా వెరిఫికేషన్లు పూర్తి చేయాలి. ► ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగులో ఉన్న వాటి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. వీరికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్లో పట్టాలు అందించాలి. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన జీవోపై దృష్టి పెట్టండి. ► భూ బదిలీ ద్వారా భూములను సేకరించడంపై దృష్టి పెట్టండి. ఇళ్ల పట్టాలకు అవసరమైన భూమిని వారి దగ్గర తీసుకోవడం, దానికి బదులుగా వేరేచోట ప్రభుత్వ భూమి ఇవ్వగలగడంపై దృష్టి పెట్టాలి. అక్టోబర్ 25కు బేస్‌మెంట్‌లెవల్ పైకి వచ్చేలా చర్యలు ► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. అక్టోబర్ 25 నాటికల్లా బేస్మెంట్ లెవల్ పైకి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆయా కలెక్టర్లకు అభినందనలు. మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి పెట్టాలి. ఇటుకల తయారీ ► వెయ్యి ప్లాట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట... అక్కడే ఇటుకల తయారీని ప్రారంభించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. సిమెంటు సబ్సిడీ రేటుపై ఇస్తున్నాం. ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. రీచ్ 40 కి.మీ కన్నా ఎక్కువ దూరం ఉంటే.. మనమే రవాణా ఖర్చులు భరిస్తున్నాం. ► ఇళ్ల నిర్మాణం వల్ల మెటల్ ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ధరలను నియంత్రణలో ఉంచితే అనుకున్న ఖర్చుకే ఇళ్లు కట్టవచ్చు. ఆప్షన్ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ► ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా మాట్లాడుతున్నాం. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. లే అవుట్లు సందర్శించాలి ► కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సంబంధిత శాఖలతో కలిసి సమీక్ష చేయాలి. మునిసిపాలిటీ స్థాయిలో, మండలాల స్థాయిలో, పంచాయతీల స్థాయిలో, లే అవుట్ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. అప్పుడే ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది. ► కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను పర్యవేక్షించాలి. జాయింట్ కలెక్టర్ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రతి వారంలో నాలుగు సార్లు లే అవుట్లలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి. అప్పుడే సమస్యలు ఏంటో తెలుస్తాయి. ► పెద్ద లే అవుట్లలో నిర్మాణ సామగ్రిని ఉంచడానికి, సైట్ ఆఫీసుల కోసం ఉపాధి హామీ పనుల కింద గోడౌన్లను నిర్మించాలి. లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు ► ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్ 25 నుంచి మొదలు పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న మేస్త్రీలతో వీరిని అటాచ్ చేయాలి. ► ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తి కావాలి. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలి. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టి పెట్టాలి. ► సిమెంటు, బ్రిక్స్, ఐరన్, మెటల్.. వీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై 3.79 లక్షల మంది ఆసక్తి ► టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. 3.79 లక్షల మంది వీటిపై ఆసక్తి చూపారు. అధికారులు ఇప్పటి దాకా 1,001 ఎకరాలను గుర్తించారు. మరో 812 ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. ► మార్గదర్శకాలకు అనుగుణంగా భూములను వెంటనే గుర్తించాలి. రెగ్యులర్‌గా దీనిపై సమీక్ష చేయాలి. అవసరమైన చోట భూసేకరణ, లేదా ల్యాండ్ పూలింగ్ చేయాలి. ప్రభుత్వ భూములను కూడా ఈ పథకం కోసం గుర్తించాలి. మంచి ప్రాంతాల్లో భూములు ఉండేలా చూసుకోవాలి. ► అప్పుడే న్యాయ వివాదాల్లేకుండా, క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకే మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ లే అవుట్లలో ఏర్పాటు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కేబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ స్ట్రీట్ లైట్లు తదితర మౌలిక సదుపాయాలతో, మంచి ప్రమాణాలతో లే అవుట్లు వారికి అందుబాటులోకి వస్తాయి. తద్వారా చాలా మందికి ప్రయోజనం ఉంటుంది. -
'ఉపాధి'లో రికార్డు: సీఎం వైఎస్ జగన్
ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు ఉపాధి పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదే వేగంతో పనులు ముమ్మరంగా చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. నాలుగైదు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్లు కూడా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఆవశ్యకత ఎంతో ఉంది. ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకే వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ రిఫరెల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్స్ ఉంటాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టడం ద్వారా కోవిడ్ కష్ట కాలంలో రూ.5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా కూలీలకు 25.42 కోట్ల పని దినాలను కల్పించి ఆదుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. చిన్న రాష్ట్రమైనా, దేశంలో మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు. ఇందుకు అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగు పడాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్బీకేల భవనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆలోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీలు) నిర్మాణాలు ఆగస్టు 31 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్‌లో వీటిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9,899 చోట్ల బీఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందులో 3,841 చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ► గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి. 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కోసం 15 ఎకరాల భూమిని గుర్తించాలి. అక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలి. ► ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఇతరత్రా పంటలను ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ కోసం గత సంవత్సరం రూ.4,300 కోట్లు ఖర్చు చేశాం. 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి ► ఇప్పటి దాకా 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యింది. మిగిలిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయడంపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. టిడ్కోలో సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలి. ► ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా వారికి ఇంటి పట్టా ఇవ్వాల్సిందే. ► పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి, పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించాలి. ► ఇళ్ల పట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణం చెప్పగలగాలి. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు ► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. 8,682 కాలనీల్లో ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఆలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్ కార్డుల జారీ.. ఈ పనులన్నీ ఏప్రిల్ 10 లోగా పూర్తి చేయాలి. ► గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మునిసిపాలిటీకి నోడల్ అధికారులుగా నియమించాలి. ప్రతి లే అవుట్లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్‌ను నిర్మించాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దానిపై అవగాహన వస్తుంది. కట్టిన ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది. ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలి. ► లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్మాణ సామగ్రిలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఒకవైపు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగానే.. మరో వైపు కాలనీలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి. -
అధైర్యం వద్దు.. మీకూ స్థలం వస్తుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృఢ సంకల్పానికి గండి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు తాత్కాలికంగా 3.77 లక్షల మందికిపైగా పేదల గూడుకు అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాలను ఆశ్రయించి 3,77,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా అడ్డుకున్నారు. అయితే న్యాయ వివాదాల కారణంగా పేదలు అధైర్య పడకుండా భరోసా కల్పించేందుకు వారికి ఇళ్ల స్థలం మంజూరైందని, కేసులు తేలగానే ఇళ్ల స్థలాల పట్టాలిస్తామని పేర్కొంటూ అధికారులు లేఖలు పంపారు. న్యాయస్థానాల్లో కేసులున్న లబ్ధిదారులందరికీ సీఎం ఆదేశాల మేరకు లేఖల పంపిణీ పూర్తి చేశారు. ఇంత భారీగా ఇదే తొలిసారి.. ఇప్పటివరకు దేశ చరిత్రలోగానీ రాష్ట్ర చరిత్రలోగానీ పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇంత పెద్దఎత్తున సేకరించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను సంతృప్త స్థాయిలో అందచేసేందుకు ఏకంగా 68 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించి పంపిణీ చేయించారు. సుమారు 30.66 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తేవడంతో 3.77 లక్షల మంది పేదలకు మాత్రం ఇళ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే దీన్ని శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరింపచేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళన చెందకుండా అధికారులు లేఖలు పంపారు. దురుద్దేశపూర్వకంగా దాఖలైన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు -
15.60 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు
సాక్షి, అమరావతి: పేదలకు సొంత ఇంటి నిర్మాణాలను వచ్చే నెల నుంచి వేగవంతం చేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే 15.60 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల మంజూరు పత్రాలను కూడా అందించింది. పేదల ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టంగా చెబుతున్నారు. లబ్ధిదారులకు స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకు అందేలా చేయాలని సీఎం ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయిలో రూ.100 కోట్ల వరకు పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రస్తుతం విద్యుత్‌తోపాటు నీటి వసతి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాలనీల్లో రోడ్ల వెడల్పును 20 అడుగులకు తగ్గకుండా చూస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో సచివాలయాల సిబ్బందిదే కీలకపాత్ర ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం మొదలు, ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి బిల్లులు చెల్లించడం, ఇతర అవసరమైన పనులు చేయడంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వలంటీర్లు లబ్ధిదారులకు సహకారమందిస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సమీక్షలు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి సమీక్షలు ప్రారంభిస్తాం. జిల్లాల పర్యటనలో భాగంగా క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడతాం. ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి.. నిర్మాణ బాధ్యతలను ఒకరికి అప్పగించి.. నిరంతరం పర్యవేక్షిస్తాం. నిర్మాణాల కోసం సిమెంట్, స్టీల్ సిద్ధంగా ఉంది. ఇటుకలను స్థానికంగానే కొనుగోలు చేయనున్నాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి -
ఊరూరా ఇంటి పట్టాల జాతర
సాక్షి నెట్వర్క్: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం 27వ రోజైన బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటంతో అక్కచెల్లెమ్మల ఆనందం అవధులు దాటుతోంది. ఎక్కడికక్కడ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో కలిసి వస్తుండటంతో అక్కడ కోలాహలం జాతరను తలపిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల వద్ద ఎవరికి వారు సెల్ఫీలు దిగుతుండగా.. కొందరైతే పట్టాలు అందుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,818 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 1,03,026 మంది ఇళ్ల పట్టాలు పొందారు. చిత్తూరు జిల్లాలో 58,122 మందికి పట్టాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 2,396 మంది ఇళ్ల స్థలాలు, 1,077 మంది టిడ్కో ఇళ్ల పత్రాలు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 4,973 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం 70,949 మందికి లబ్ధి కలిగింది. మరో 4,252 మందికి టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఒంగోలు మండలం కరవదిలో జగనన్న కాలనీ వద్ద ముగ్గు వేస్తున్న గ్రామస్తులు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో బుధవారం 651 మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. పశి్చమగోదావరి జిల్లాలో 662 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 318 మందికి పట్టాల పంపిణీ చేయగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బుధవారం 2,263 మంది పట్టాలు అందుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85,689 మందికి లబ్ధి చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,187 ఇళ్ల పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 62 వేల మందికి పైగా లబ్ధి పొందారు. -
నిర్విఘ్నంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: పేదలకు విలువైన స్థిరాస్తిని ఇచ్చే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 24వ రోజైన ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. విశాలమైన లే–అవుట్లు, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య ఉన్న తమ ప్లాట్లను చూసి మహిళలు మురిసిపోతున్నారు. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల మోముల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,044 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 1,551 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 81,804 మంది లబ్ధిదారులు ఇంటిపట్టాలు అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 1,813 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,822 మందికి పట్టాలిచ్చారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మేకవానిపాలెంలో 194 మందికి, తాళ్లపాలెంలో 417 మందికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పట్టాలు అందించారు. గుంటూరు జిల్లాలో 1,756 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.24 రోజుల్లో మొత్తం 65,510 మంది ఇంటి స్థలాలు పొందారు. 4,252 టిడ్కో ఇంటి పత్రాలు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 2,249 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కోలాహలం
సాక్షి నెట్వర్క్: ‘వదినా.. నీ స్థలం ఎక్కడొచ్చింది. రాఘవత్తా.. నీకు ప్లాటెక్కడిచ్చారు. పోనీలే భార్గవీ ఇన్నాళ్లకు నీకు ఇల్లొచ్చింది. నీ కల నెరవేరింది. ఇక నీ దిగులు పోయినట్టే..’ ఊరూరా ఎక్కడ చూసినా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 17వ రోజైన ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కోలాహలంగా సాగింది. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 80,985 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, 15 వేల మందికి టిడ్కో ఇంటి పత్రాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 72 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,02,225 మంది పట్టాలు పొందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 7,239 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో హక్కు పత్రాలు అందజేశారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 1,751 టిడ్కో ఇళ్ల పత్రాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 17వ రోజున 917 మందికి పట్టాలిచ్చారు. వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 669 మంది పట్టాలు అందుకోగా.. ఇప్పటివరకు 2,41,400 మంది లబ్ధి పొందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2,506 ఇళ్ల పట్టాలను అందించారు. 17 రోజుల్లో 60,101 మంది పట్టాలు అందుకున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం 250 మందికి ఇళ్లపట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో 77,676 మంది లబ్ధి పొందారు. నేడు విరామం అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో ఏడాది సొమ్ము జమ చేయనున్న దృష్ట్యా సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. అధికారులంతా అమ్మఒడి కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో పట్టా అందుకుంటున్న మహిళ పేరు సజ్జల హేమలత. అనంతపురంలోని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్. ఈమె టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా.. అర్హులందరికీ పథకాలను వర్తింప చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఆదివారం అనంతపురం సమీపంలోని కురుకుంట లే–అవుట్లో సజ్జల హేమలతకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పట్టా అందజేశారు. పార్టీలు చూడకుండా, పూర్తి పారదర్శకతతో టీడీపీ నేతకూ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వ తీరును అంతా ప్రశంసించారు. -
ఊరూరా సందడి.. పేదల ఇంట ఆనందం
సాక్షి నెట్వర్క్: తలదాచుకునే గూడు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల చేతికే ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేయడంతో వారంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. సొంతింటి కల నెరవేరుతుందని కలలో కూడా ఊహించలేదని.. ఈ ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ కన్నీళ్లు తుడిచి మరోసారి అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 16వ రోజైన శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చిత్తూరులో శనివారం 3,750 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 7,664 మందికి ఇంటి పట్టాలు, ఇళ్ల హక్కు పత్రాలు అందజేశారు. వైఎస్సార్ జిల్లాలో 2,418 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,02,153 మంది ఇళ్ల పట్టాలు పొందారు. ప్రకాశం జిల్లాలో 298 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 62,298 మందికి లబ్ధి చేకూరింది. గుంటూరు జిల్లాలో 7,708 మందికి ఇళ్ల పట్టాలు, 682 మందికి టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ పత్రాలను అందజేశారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, కాసు మహేష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒక్కరోజే 3,083 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు పట్టాలు అందుకున్న లబ్ధిదారుల సంఖ్య 2,40,731కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం 3,221 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. 16 రోజుల్లో మొత్తం 57,595 మందికి పట్టాలు అందాయి. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు పట్టాలు పంపిణీ చేశారు. -
బాబుది నీచ బుద్ధి
గుడివాడ రూరల్: రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం గుంటాకోడూరులో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం, హోం మంత్రి, డీజీపీ, విజయనగరం జిల్లా ఎస్పీలు క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. క్రిస్టియన్లు అయితే కేవలం క్రిస్టియన్ల కోసం, ముస్లింలు అయితే ముస్లింల కోసం, హిందువులు అయితే హిందువుల కోసమే పనిచేస్తారా.. అంటూ నిలదీశారు. అన్ని వర్గాలూ ఓట్లేస్తేనే తాను సీఎం అయ్యానన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే రాజధానిని అమరావతిలో పెట్టి, తన సామాజికవర్గం వారితో వేలాది ఎకరాలు కొనుగోలు చేయించారని చెప్పారు. రాష్ట్రాన్ని తన సామాజికవర్గానికి దోచిపెట్టిన నీచుడు చంద్రబాబు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి, అలజడులు రేపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, సీఎంగా వైఎస్ జగన్ ఉన్నంత కాలం చంద్రబాబు ఆటలు సాగవన్నారు. సీఎంను లోకేశ్ హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్, పచ్చ మీడియాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. -
కోలాహలం.. పట్టాల యజ్ఞం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యజ్ఞం వరుసగా పదోరోజైన ఆదివారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో జరిగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30.75లక్షల మందికి నివాస స్థలాలు/ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారం అవుతోందని అక్కచెల్లెమ్మలంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు పెద్దఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా.. ఓ ఉత్సవంలా ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో 1,909 మంది లబ్ధిదారులకు ఆదివారం పట్టాలను అందజేశారు. పది రోజుల వ్యవధిలో 37,127 మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరిగింది. ► విజయనగరం జిల్లాలో ఆదివారం 18,917 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 7,845, పీసీ/ఈఆర్ కింద మరో 11,072 పట్టాలు ఉన్నాయి. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 55,224 పట్టాల పంపిణీ జరిగింది. ► విశాఖ జిల్లాలో 2,676 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు అందజేశారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో 211 మందికి పట్టాలు అందజేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో 166 మందికి పంపిణీ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 1,886 మందికి టిడ్కో ఇళ్ల ఒప్పందపత్రాలు, పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కశింకోటలో 314 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేశారు. నాతవరం మండలంలో 99 పట్టాలు అందజేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 90,493 మందికి ఇళ్ల పట్టాలు.. 1,547 మందికి టిడ్కో ఇళ్లు, 9,202 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఆదివారం ఒక్కరోజే 19,926 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 56,204 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. గృహనిర్మాణం చేపట్టేందుకు 10,335 మంది ఆప్షన్ ఫారాలు అందించారు. కరప మండలం యండమూరు, కాకినాడ రూరల్ మండలం చీడిగలో 3,646 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మొత్తం 4,660 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో మొత్తం పది రోజుల్లో 74,319 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. తణుకు నియోజకవర్గం ఇరగవరంలో 312 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో 530 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► కృష్ణా జిల్లాలో ఆదివారం 11,687 ఇళ్ల పట్టాలను అందచేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 95,878 ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ► ప్రకాశం జిల్లాలో ఆదివారం 2,478 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి 38,728 మందికి పట్టాలిచ్చారు. ఒంగోలులో టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు 215 పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 670 సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేశారు. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 4,822 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో ఆదివారం 4,782 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు పదిరోజుల్లో మొత్తం 64,934 మంది ఇళ్ల పట్టాలు పొందారు. ► అలాగే, కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో 155, ఆదోనిలో 343, పత్తికొండ 191, ఆలూరు 619, శ్రీశైలం 248, నంద్యాల 71, కోడుమూరు నియోజకవర్గంలో 418 ఇళ్ల పట్టాలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ► అనంతపురం జిల్లావ్యాప్తంగా ఆదివారం 5,732 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం కామరుపల్లి లేఅవుట్ వద్ద ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. ► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9,289 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మోడల్ కాలనీగా పేరేచర్ల లేఅవుట్ గుంటూరు జిల్లా పేరేచర్లలోని లేఅవుట్‌ను రాష్ట్రంలోనే వైఎస్ జగనన్న మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని గృహ నిర్మాణ, గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ లేఅవుట్లో ఇంటి పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌రావు, జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ.. పేరేచర్లలో 400 ఎకరాల్లో 18,492 ప్లాట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద వైఎస్సార్ జగనన్న కాలనీ నిరి్మతమవుతుందన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఆదివారం 26,422 పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో 26,347 ఇళ్ల పట్టాలు ఇవ్వగా, 75 టిడ్కో అగ్రిమెంట్లను లబ్ధిదారులకు అందజేశారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లోనూ పట్టాల పంపిణీ జరిగింది. చంద్రగిరిలో వినూత్నంగా.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి పట్టాతో పాటు ప్రతి తోబుట్టువుకు లెనిన్ కాటన్ చీర, జాకెట్, శ్రీవారి లడ్డూ, శ్రీ పద్మావతి అమ్మవారి పసుపు–కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, స్వీట్లు, చక్కటి బ్యాగుతో కూడిన సారెను తన స్వహస్తాలతో అందజేశారు. -
స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి ఇరుకు గదుల్లో.. కాలువ గట్ల వెంబడి.. అద్దె వసారాల్లో.. కాలం గడుపుతున్న లక్షలాదిమంది పేదలకు ఇప్పుడు ఆనందం రెట్టింపయింది. ఈ ఆనందాన్ని తమకిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని.. తమ జీవితకాలం మరచిపోబోమని వారు చెబుతున్నారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత పేదలకు ప్రభుత్వం ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేస్తోంది. చేతికి అందిన ఇంటి పట్టాను చూసి సంతోషిస్తున్న సమయంలోనే ఇల్లు మంజూరు పత్రం కూడా చేతుల్లోకి చేరడంతో సొంతింటి కల త్వరలో నెరవేరుతుందని వారు సంతోషిస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు మొదటి విడత 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు రెండులక్షల మందికిపైగా లబ్ధిదారులకు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేశారు. ఇల్లు మంజూరైనవారందరికీ పట్టా అందిన వారంలోగా ఇంటి మంజూరు పత్రం ఇచ్చేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించి అవగాహన కోసం ప్రతి లబ్ధిదారు పేరిట ప్రత్యేకంగా పాస్‌పుస్తకాన్ని ముద్రించారు. లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేసేందుకు అందులో టోల్ ఫ్రీ నంబరు 1902ను ముద్రించారు. పాస్ పుస్తకంలో వివరాలు ఇలా.. ఇంటి నమూనా, వలంటీర్లు, సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల విధులు, ఇంటి నిర్మాణదశలు, నిర్మాణ సామగ్రి, దశల వారీగా దేనికి ఎంత చెల్లించాలనే వివరాలను పాస్‌పుస్తకంలో ముద్రించారు. ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని దినాలు, ఆయా దశల్లో కూలీలకు ఇచ్చే మొత్తం, తుది మెరుగుల వరకు చెల్లింపుల వివరాలు పొందుపరచారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధర కంటే తక్కువకే లబ్ధిదారుల సమ్మతి మేరకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దశల వారీగా అందజేసే నిర్మాణ సామగ్రి, నగదు వివరాలు లబ్ధిదారుతో ధ్రువీకరించుకుని పాసుపుస్తకంలో నమోదు చేస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అధికారుల మొబైల్ నంబర్లు, లబ్ధిదారుకు తన ఇంటి ప్రస్తుత స్థితి వరకు అందిన నగదు, సామగ్రి తదితర వివరాలు తెలియజేసేందుకు వీలుగా పాస్ పుస్తకాన్ని ముద్రించారు. -
పేదలకు స్థలాలివ్వడమే కాదు.. ఇళ్లూ కట్టిస్తాం
బుధవారం(ఈ రోజు) ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుంది. 2020లో ఇదే తొలి కార్యక్రమం. ప్రజా ప్రతినిధులు డిపోల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి. 50 వేలకు పైగా ఉన్న కార్మిక కుటుంబాల దీర్ఘకాలిక కలను నెరవేర్చాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇది తనకు మాత్రమే కాకుండా కలెక్టర్లందరికీ ప్రతిష్టాత్మక కార్యక్రమమని చెప్పారు. ఇందుకోసం ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెబుతూ.. కలెక్టర్లు మరింత గట్టిగా పని చేయాల్సి ఉంటుందన్నారు. రెండు నెలల్లోగా భూ సేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 22,76,420 మంది లబ్ధిదారుల గుర్తింపు జరిగిందని, అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించామని అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలో కనీసం మూడు సార్లు పర్యటించాలని, జిల్లా అధికారులతో సమావేశమై ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం సూచించారు. దేవాలయాలు, ఇతర మతాల ప్రార్థనా మందిరాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలు కాకుండా ఇతర భూములను ఇళ్ల పట్టాల కోసం పరిశీలించాలని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వైఎస్సార్ నవశకం కింద 60 శాతం దరఖాస్తులు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులకు సంబంధించినవే వస్తున్నాయని సీఎం చెప్పారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఫిబ్రవరి ఒకటి నుంచి పంపిణీ చేయాలని, తమకు ఓటు వేయని వారు కూడా అర్హులైతే పథకాలను వర్తింప చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని పథకాలకు సంబంధించిన అర్హతలతో పాటు లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ, సబ్ సెంటర్లు, తీవ్ర వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఫిబ్రవరి నెలాఖరుకు 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జనవరి 3వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, ఆ రోజు 1.5 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామని అధికారులు వివరించారు. జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుందని సీఎం చెప్పారు. మిగతా జిల్లాల్లో 1,259 రోగాలకు ఆరోగ్యశ్రీ సేవలను పెంచి చికిత్స అందిస్తామని, ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు సేవలను విస్తరించుకుంటూ వెళతామని చెప్పారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తారని, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి నెలకు రూ.5 వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. జనవరి చివరి నాటికి ఐదు వేల సబ్‌సెంటర్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలుస్తారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల మధ్యలో సబ్‌సెంటర్ల నిర్మాణానికి జనవరి 6వ తేదీకల్లా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు ఆత్మహత్యలపై వెంటనే స్పందించండి 2014 నుంచి 2019 జూన్ వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 556 మందికి ఇంకా పరిహారం అందలేదని, గతంలో వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని సీఎం తెలిపారు. వీరందరికీ ఫిబ్రవరి 12న ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలన్నారు. 2019 జూన్ నుంచి ఇప్పటి దాకా ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పలువురి కుటుంబాలకు డబ్బులు అందలేదని, ఈ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. వీటిని అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో వేయాలని, ఈ డబ్బు మీద అప్పుల వాళ్లు, బ్యాంకులు ఎలాంటి క్లెయిం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కలెక్టర్ వారి ఇళ్లకు పోయి.. పరిహారం ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్లు వద్ద డబ్బు అయిపోతే వెంటనే అడగాలని, ఏదైనా రైతు కుటుంబానికి జరగరానిది జరిగితే వారం రోజుల్లోగా కలెక్టర్లు స్పందించాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో ఉపయోగం ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. 11,150 కేంద్రాలు ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయన్నారు. వీటి కోసం ఎక్కడెక్కడ భవనాలు, స్థలాలు కావాలో గుర్తించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 1న 3,300 రైతు భరోసా కేంద్రాలు తొలి దశలో ప్రారంభమవుతాయని, వీటివల్ల వ్యవసాయ రంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఈ కేంద్రాల్లో గ్యారెంటీతో లభిస్తాయని, అలాగే డిజిటల్ కియోస్క్ కూడా రైతు భరోసా కేంద్రంలో ఉంటుందని తెలిపారు. భూసార పరీక్షలు, భవిష్యత్తులో రైతుల ఉత్పత్తుల కొనుగోలు, విత్తన పంపిణీ కూడా ఈ భరోసా కేంద్రాల ద్వారానే జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంపైనా రైతులకు శిక్షణ లభిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ఈ కేంద్రాలు బలోపేతం చేస్తాయన్నారు. వీటిని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. జనవరి 2వ తేదీన రైతు భరోసాకు సంబంధించి చివరి విడత డబ్బు పంపిణీ చేయాలి. 46,50,629 రైతు కుటుంబాలకు ఈ డబ్బు అందుతుంది. ఈ మేరకు గ్రామ వలంటీర్లు జనవరి 3వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రశీదు ఇవ్వాలి. వచ్చే ఖరీఫ్ నాటికి మళ్లీ రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలి. ఎవరైనా రైతులు బలవన్మరణానికి పాల్పడితే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ.7 లక్షలు సాయం అందించాలని 2019 జూన్‌లో మార్గదర్శకాలు రూపొందించాం. ఇందుకోసం ప్రతి కలెక్టర్ వద్ద కోటి రూపాయలు ఉంచాం. అయినా తాత్సారం జరుగుతోంది. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని పదేపదే చెబుతున్నా. ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున ఫిబ్రవరి నుంచి నాలుగు నెలలపాటు ఇసుక నిల్వ చేయాలి. జూన్‌లో వర్షాలు మొదలయ్యే నాటికి 60 లక్షల టన్నులు స్టాక్ ఉండాలి. గత ప్రభుత్వం ఈ పని చేసి ఉంటే.. మొన్న ఇసుక కొరత వచ్చి ఉండేదే కాదు. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. దిశ చట్టం అమలుపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టి పెట్టాలి - మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడడం, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలను తీవ్రంగా తీసుకోవాలి. - ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి తాము చేసిన ఈ చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపాం. ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. - జిల్లా ఎస్పీలు ఓనర్షిప్ తీసుకుంటే మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయి. చర్యల విషయంలో అంకిత భావాన్ని ప్రదర్శించాలి. - ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌స్టేషన్‌ను బలోపేతం చేస్తున్నాం. ముగ్గురు ఎస్ఐలు, అదనపు ఎస్ఐలను అక్కడ పెడుతున్నాం. వీటిపై బాగా ప్రచారం చేయాలి. - బోధనాసుపత్రుల్లోని ఒన్ స్టాప్ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. దీనిపై బాగా ప్రచారం చేయాలి. ఆ సెంటర్లలో కూడా ఒక ఎస్ఐని ఉంచుతాం. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలి. - దిశ చట్టం అమలు కోసం ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా పెడుతున్నాం. మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్ అధికారి ఉంటారు. - జిల్లాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కూడా పెడుతున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. - ప్రత్యేక కోర్టుల కోసం ఒక్కో కోర్టుకు రూ.2 కోట్లు చొప్పున రూ. 26 కోట్లు ఇస్తున్నాం. ఈ డబ్బును డిపాజిట్ చేస్తున్నాం. వీటి గురించి ప్రచారం చేయాలి. - తప్పు చేసిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలి. - దిశ కాల్ సెంటర్, యాప్ ఏర్పాటు చేయాలి. - నెల రోజుల్లోగా వీటన్నింటినీ సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. - సమస్యను ఎన్నిరోజుల్లోగా పరిష్కారం చేస్తామన్న దానిపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. - ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన కొనసాగుతుంది. ‘అమ్మఒడి’ ప్రతిష్టాత్మకం జనవరి 9వ తేదీన అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇది చాలా పెద్ద కార్యక్రమమని ముఖ్యమంత్రి చెప్పారు. సోషల్ ఆడిట్ తర్వాత జనవరి 2వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చెప్పగా, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 81,72,224 మంది పిల్లల డేటాను పరిశీలించామని అధికారులు తెలిపారు. 46,78,361 మంది తల్లుల్లో అర్హులైన తల్లుల సంఖ్య 42,80,823 కాగా, రీ వెరిఫికేషన్‌లో మరో 3,97,538 మంది తల్లులు ఉన్నట్లు చెప్పారు. జనవరి 1 నాటికి రీ వెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెప్పగా, త్వరగా అర్హుల సంఖ్యను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. అమ్మ ఒడి కార్యక్రమం సందర్భంగా విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్కూళ్లలో జనవరి 4, 6, 7, 8 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలని, జనవరి 9వ తేదీన పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. నాలుగు అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఇలా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వివిధ జిల్లాల అధికారులు ఒకటవ అంశం : అమ్మఒడి ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయడం లేదు. మనం చేస్తున్న కార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. స్కూళ్ల నిర్వహణలో వారి పాత్ర కీలకం. రెండో అంశం : మధ్యాహ్న భోజనం సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో మార్పులు తీసుకొస్తున్నాం. నాణ్యతతో కూడిన ఆహారం అందిస్తాం. ఇందుకోసం అదనంగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడో అంశం : ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమలుకు పలు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నాం. నాలుగో అంశం : స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించాం. నాడు–నేడు కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు ఇసుక డోర్ డెలివరీ చేయాలనే విషయంలో కొంత మంది రవాణాదారులు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందిందని ముఖ్యమంత్రి తెలిపారు. వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా చేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నామని, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కడా ఉండకూడదన్నారు. బుక్ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా జిల్లాలో జనవరి 2వ తేదీన పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, జనవరి 10న విశాఖ, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని అధికారులు చెప్పారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేస్తామని వివరించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని, జనవరి 20 నాటికి 389 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఉంటాయని, వంద మొబైల్ పార్టీలు పని చేస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 50,348 టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నామని, 4,644 వాహనాలు సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జూన్ నుంచి 2,976 కేసులు, డిసెంబర్లో 248 కేసులు నమోదు చేశామని వివరించారు. 2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విజయవంతానికి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. స్పందనలో వస్తున్న విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యత కోసం ఇప్పటికే విధివిధానాలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, సోషల్ ఆడిట్, అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనే దానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేశామన్నారు. వీటిని అన్ని గ్రామ సచివాలయాలకు, విభాగాలకు పంపిస్తామని తెలిపారు. స్పందన విషయంలో అందరూ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. చరిత్రలో ఎన్నడూలేని చరిత్రాత్మక కార్యక్రమాలు చేపడుతున్నామని, 2020 రాష్ట్రానికి చరిత్రాత్మక సంవత్సరం కావాలని ఆయన ఆకా>ంక్షించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
సొంతింటి కల... నెరవేరిన వేళ!
* పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ * ఖైరతాబాద్‌లో 7వేలు, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మందికి... * జంట జిల్లాల్లో 40 వేల మందికి లబ్ధి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పేదల నిరీక్షణ ఫలించింది. వీరి సొంత గూడు కలను తెలంగాణ సర్కారు నిజం చేసింది. హైదరాబాద్ జిల్లాలో రూ.పది కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి 20,025 కుటుంబాలకు, రంగారెడ్డి జిల్లాలో 20 వేల మందికి ఇళ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేసింది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్లో లక్ష ఇళ్ల పట్టాలు పంపిణీ లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్బీటీ నగర్లో 7 వేలకు పైగా కుటుంబాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చెరువు శిఖం, దేవాదాయ, వక్ఫ్ భూముల్లోని ఇళ్లకు పట్టాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. కోర్టు కేసులు, ప్రైవేట్ భూముల్లో ఉన్న నివాసాలకు సంబంధించి పట్టాలు ఎలా ఇవ్వాలనే అంశమై ఆలోచిస్తున్నామన్నారు. కోర్టు కేసుల్లో భూములు గెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములను కోనుగోలు చేసైనా పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తాన ని చెప్పారు. నగరంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆక్రమిత స్థలాల్లో నివసించే కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి, ఎంపీలు మాల్లారెడ్డి, కేశవరావు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఆక్రమిత భూముల్లో నివాసముంటూ.... పట్టాల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని... సీఎం కేసీఆర్ దయవల్ల ఇళ్ల పట్టాలు వస్తున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన ఎన్బీటీ నగర్లో రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాలుకు శుక్రవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ స్థలంలో ఉంటున్న ఇంటిని కోల్పోతున్న మల్లమ్మ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి అప్పగించారు. స్థానిక మహిళా సంఘం నాయకురాళ్లు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో... *నగరంలోని మలక్‌పేట్ నియోజకవర్గంలో114, అంబర్పేట్ నియోజకవర్గంలో 503, చార్మినార్‌లో 112 మందికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పట్టాలు పంపిణీ చేశారు. * చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 393, యాకత్‌పురలో 161, బహదుర్‌పురాలో 26 , నాంపల్లి నియోజకవర్గంలో 381, కార్వాన్లో 793, గోషా మహల్లో 174 మందికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పట్టాలు అందజేశారు. * ముషీరాబాద్ నియోజకవర్గంలో 1186 మందికి, జూబ్లీహిల్స్‌లో 5314 మందికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. * సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని 495 మందికి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇళ్ల పట్టాలు అందించారు. * మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 1910 మందికి, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 646 మందికి మంత్రి పద్మారావు పట్టాలు పంపిణీ చేశారు. * నగర శివారు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
గుడిసెలు వేసుకున్నవారికి పక్కా ఇళ్లు: కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో గుడిసెలు వేసుకున్నవారికి పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బంజారాహిల్స్ ధరతో సమానంగా ఇంటిధరలు ఉంటాయని చెప్పారు. ఖైరతాబాద్ ఎన్బీటీ నగర్లో కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల కోసం లంచం ఇవ్వాల్సినవసరం లేదని, మహిల పేరున పట్టాలు ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. పేదలపై ఒక్క రూపాయి కూడా భారంపడదని, పేదలకు గూడుకట్టుకున్న చోటే ఇళ్ల పట్టా మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ అన్నారు.