హైదరాబాద్లో గుడిసెలు వేసుకున్నవారికి పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లో గుడిసెలు వేసుకున్నవారికి పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బంజారాహిల్స్ ధరతో సమానంగా ఇంటిధరలు ఉంటాయని చెప్పారు.
ఖైరతాబాద్ ఎన్బీటీ నగర్లో కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల కోసం లంచం ఇవ్వాల్సినవసరం లేదని, మహిల పేరున పట్టాలు ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. పేదలపై ఒక్క రూపాయి కూడా భారంపడదని, పేదలకు గూడుకట్టుకున్న చోటే ఇళ్ల పట్టా మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ అన్నారు.