ఉప్పునుంతల: మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ ఉపాధిహామీ పథకం కూలీల వేతనం బిల్లులపై డ్వామా ఫైనాన్స్ మేనేజర్ ఫయాజ్ పాషా, డీబీటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఏపీడీ పాపయ్యలు బుధవారం స్థానిక కార్యాలయంలో విచారణ చేశారు. కూలీలకు సంబంధించిన మస్టర్లు, ఎఫ్‌టీఓలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఇటీవల జరిగిన ఏడో విడత సామాజిక తనిఖీలో మండలంలో కూలీలకు సంబంధించి రూ. 14 లక్షల వేతనం బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించామని క్లస్టర్ ఏపీడీ పాపయ్య తెలిపారు. ఈజీఎస్ ఏపీఓ సాయిశంకర్ అక్రమంగా డ్రా చేసిన రూ. 26 లక్షలు తిరిగి రికవరీ చేశామన్నారు.
వాటిలో కూలీలకు అందాల్సిన బిల్లులపై విచారణ చేసి అందించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు. సీఆర్‌డీ నుంచి అందిన ఆదేశాలమేరకు మొదట పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏస్థాయిలో నిలిచిపోయావనే అంశాలపై రికార్డుల పరంగా విచారణ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నేరుగా కూలీలతో మాట్లాడి వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని డబ్బులను పంపిణీ చేయనున్నామని ఏపీడీ తెలిపారు.
ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై విచారణ
Published Wed, Sep 30 2015 6:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement