
వెంటనే టెండర్లు పిలవండి: హరీష్
హైదరాబాద్: 'మిషన్ కాకతీయ' పనుల నిమిత్తం ఖర్చు చేయాల్సిన బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ అంశంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం సక్రమంగా జరగాలన్నారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. రెండో విడతలో అనుమతి లభించిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని మంత్రి హరీష్ అధికారులను ఆదేశించారు.