‘ఆప్కో బకాయిలు ఇప్పించండి’ | pay the aapco pending bills, asks chairman hanmantha rao | Sakshi
Sakshi News home page

‘ఆప్కో బకాయిలు ఇప్పించండి’

Published Sat, Feb 14 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రూ. 116 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ఆప్కో చైర్మన్ ఎమ్. హన్మంతరావు కోరారు.

సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రూ. 116 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ఆప్కో చైర్మన్ ఎమ్. హన్మంతరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఆప్కోకు చెల్లింపులు లేకపోవడంతో ఆరునెలలుగా చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, ఆ కారణంగా సం ఘాల వాళ్లు నూలు కొనుగోలు చేయలేక, కార్మికులకు కూలీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement