బకాయి బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (ఎన్‌సీఎల్‌పీ) పీడీ దశరథరామయ్యకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విన్నవించారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : బకాయి బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (ఎన్‌సీఎల్‌పీ) పీడీ దశరథరామయ్యకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్‌సీఎల్‌పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ దశరథరామయ్య మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సూచించారు. అయితే గతంలో బిల్లులు చాలా బకాయిలు ఉన్నాయని వారు వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటామని పీడీ హామీ ఇచ్చారు.