శివారుకు సవాల్!
రూ.800 కోట్ల నిధులు దారిమళ్లింపు
జలమండలి ఖజానా ఖాళీ
శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రిజర్వాయర్లు,
పైపులైన్ల పనులకు బ్రేక్
రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు
సిటీబ్యూరో: గ్రేటర్ శివార్ల దాహార్తిని తీర్చేందుకు హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.800 కోట్ల తొలివిడత నిధులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా దారి మళ్లించడంతో జలమండలి ఖజానా ఖాళీ అరుుంది. దీంతో గ్రేటర్ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులకు రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయారుు. ఖజనాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇటు బోర్డు అధికారులు సచివాలయం చుట్టూ....అటు పనులు చేపట్టిన సంస్థలు జలమండలి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తుండడం గమనార్హం. కొత్తగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 2700 కి.మీ మేర పైప్‌లైన్ పనులకు నిధుల లేమి శాపంగా మారింది. ఇటీవలే ఈ పనులకు జీహెచ్‌ఎంసీ రహదారి కోత అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన పైపులైన్లను కొనుగోలు చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని దుస్థితి తలెత్తింది. ఈనేపథ్యంలో పనులు చేపట్టిన సంస్థలు ఎలా ముందుకెళ్లాలా అన్న సంశయంలో పడ్డారుు. పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితితో శివార్ల దాహార్తి తీర్చే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
దాహార్తి తీరే దారేదీ....
మహానగర పాలకసంస్థలో 2007లో 11 శివారు మున్సిపల్ సర్కిళ్లు విలీనమయ్యారుు. వీటి పరిధిలో సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలు దశాబ్దాలుగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేక తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నారుు. ఆయా ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో హడ్కో సంస్థ జలమండలి సంస్థాగత భూములను తాకట్టుపెట్టుకొని రూ.1900 కోట్ల రుణం జారీ చేసేందుకు అంగీకరించింది. అరుుతే హడ్కో సంస్థ మంజూరు చేసిన తొలివిడత రుణం రూ.800 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా ఇతర పథకాలకు దారిమళ్లించడంతో దాహార్తి తీర్చే పనులకు నిధుల లేమి తలెత్తింది. ప్రస్తుతం నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో జలమండలి నెలవారీగా రూ.90 కోట్ల రెవెన్యూ ఆదాయం లభిస్తుండగా..విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిపితే నెలకు రూ.102 కోట్ల వ్యయం అవుతోంది. ఇప్పటికే నెలకు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తున్న బోర్డుకు ఇప్పుడు శివారు మంచినీటి పథకాలకు బిల్లులు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. ఇప్పటివరకు చేపట్టిన 56 రిజర్వాయర్ల నిర్మాణం పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. పూర్తిచేసిన పనులకు సంబంధించి గత రెండు నెలలుగా రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన సంస్థలు బోర్డు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇచ్చిన చెక్కూ వృథానే..!
కాగా జలమండలికి హడ్కో సంస్థ మంజూరు చేసిన నిధులను పెద్దమొత్తంలో దారిమళ్లించిన సర్కారు....బోర్డు అవసరాలకు రెండు నెలల క్రితం జారీ చేసిన రూ.50 కోట్ల చెక్కు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున జలమండలికి నిధులలేమి కారణంగా శివార్లలో చేపట్టిన పనులను ఎలా పూర్తిచేయాలన్న అంశంపై బోర్డు అధికారులకు మింగుడు పడడంలేదు