
సాక్షి, అమరావతి: ఇటీవల పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం జగన్ తెలపడంతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు.
సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి.మస్తాన్‌ఖాన్, ట్రెజరర్ ఎం.సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కే.రామునాయుడు, బి.స్వర్ణలత, పి.శేషయ్య, సీహెచ్.హజరత్తయ్య, డి.సురేష్, ఆర్.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, పి.ఓంకార్, కే.నాగిని, టి.మాణిక్యాలరావు ఉన్నారు.
చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
Comments
Please login to add a commentAdd a comment