Police Officers Association
-
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
సామాన్యుడు విసిరిన సవాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్‌లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం. స్లాట్స్ కోసం ఆర్పీఓ వెబ్సైట్... ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్‌రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్ ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ సుభానీతో పరిచయమైంది. లతాధర్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు. తత్కాల్ స్కీమ్ కింద పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్ ఈ పని చేశాడు. రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్‌లోనికి ఎంటర్ అయ్యే లతాధర్ దాని నుంచి నేరుగా సర్వర్‌కు కనెక్ట్ అయ్యే వాడు. ప్రతి రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేసిన తరవాతే స్లాట్స్‌ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్‌లో వెలుగులోకి రావడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు లతాధర్ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్ దొరక్కుండా బ్లాక్ చేస్తున్నట్లు లతాధర్ ఒప్పుకున్నాడు. టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... కేవలం టార్గెట్‌కు తగ్గట్టు సిమ్‌కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు పాత సంతోష్‌కుమార్ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్ శాఖ వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. రబ్బర్‌స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్‌తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్ అనే కెమికల్‌ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. ఇతడిని ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు. ‘ముప్పు’ను ఊహించకపోవడమే... ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్సైట్ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు. ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఇటీవల పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం జగన్ తెలపడంతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి.మస్తాన్‌ఖాన్, ట్రెజరర్ ఎం.సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కే.రామునాయుడు, బి.స్వర్ణలత, పి.శేషయ్య, సీహెచ్.హజరత్తయ్య, డి.సురేష్, ఆర్.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, పి.ఓంకార్, కే.నాగిని, టి.మాణిక్యాలరావు ఉన్నారు. చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా -
చెంగల్రాయుడును అరెస్ట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.రఘురాం, సీఐడీ యూనిట్ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్‌శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్‌రావు, ఎన్.కోటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో, తిరుపతిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడికి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడి వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెంగల్రాయుడిని చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సోమవారం పోలీసుల అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. చెంగల్రాయుడు పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండించని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాము. ఊడిపోవడానికి మా యూనిఫామ్స్ ఏమీ ఖద్దరు దుస్తులు కావు. ఇంకోసారి మమ్మల్ని అవమానిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలో రెచ్చిపోయి మాట్లాడారు. రైల్వేకోడూరుకు చెందిన పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు. ‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు. -
పోలీసులపై టీడీపీ నేతల వ్యాఖ్యలు బాధాకరం: పోలీస్ అధికారుల సంఘం
-
చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. డీజీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను ఆసరాగా తీసుకుని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు. డీజీపీ రాసిన ఉత్తరాలను లవ్ లెటర్స్ అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చంద్రబాబు చెప్పాలన్నారు. పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత అజెండా అమలు చేయడానికి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దురుద్దేశంతోనే డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దురుద్దేశంతోనే డీజీపీ గౌతం సవాంగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మండిపడింది. గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 113 అవార్డులను సొంతం చేసుకోవడం ఆయన సమర్థతకు నిదర్శనమని కొనియాడింది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న డీజీపీపై చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుక్రూ నాయక్‌పై మూకుమ్మడిగా దాడి చేయడం ద్వారా టీడీపీ నేతలు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధుల్లో చేరిన విషయాన్ని గుర్తు చేసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘర్షణల గురించి మీడియా ప్రతినిధులు వివరాలు కోరడంతో.. సమాచారం తెలుసుకునేందుకే సుక్రూ నాయక్ అక్కడకు వెళ్లారని తెలిపింది. తాను పోలీసు అధికారిని అని చెప్పి గుర్తింపు కార్డు చూపించినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోకుండా ఆయనపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. -
లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్ తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం ఘటనను లోకేష్ తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు రాగానే సస్పెండ్ చేశామని పోలీసు అధికారుల సంఘం ఆదివారం తెలిపింది. కాగా లోకేష్ తప్పుడు ప్రచారం ఎంతవరకు సమంజసమని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. చదవండి: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్: వైరల్ ఈ ఘటనను లోకేష్ వక్రీకరిస్తున్నారని తెలిపారు. యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడని ఆయన ప్రచారం చేయటం ఎంతవరకు సరియైనదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం లోకేష్ ఆడే డ్రామాల వల్ల ఆ యువతి, ఆమె కుటుంబం మానసిక వేదనకు గురవుతోందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా ఆమె కుటుంబ గౌరవానికి నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. చదవండి: మహిళలకు సీఎం వైఎస్ జగన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు -
నాలుగో సింహానికి నాలుగు సవాళ్లు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా.. త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్‌గా వారికి సలామ్ చేస్తున్నాను. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం. –జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి: పోలీసులు
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరోసారి ఆలోచించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖలో కరోనాతో 109 మంది ప్రాణాలు కోల్పోయారని.. పోలీసు శాఖలో 14 వేల మంది కరోనా బారిన పడ్డారన్నారు. ఎన్నికల్లో పోలీసులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. పోలీసు శాఖలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. వ్యాక్సినేషన్.. బందోబస్తు ఒకేసారి చేయాలంటే ఇబ్బందికరమని తెలిపారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. ‘‘ఎస్ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎన్నికలు అవసరమే కానీ.. కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది. కరోనా నేపథ్యంలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. మనం ప్రాణాలతో ఉంటేనే కదా.. ఏదైనా చేయగలుగుతాం. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు ఎస్ఈసీని కోరారు. చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని -
‘ఎస్ఈసీ నిర్ణయం ఆందోళనకు గురిచేసింది’
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని.. తమతో పాటు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదని పేర్కొంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా షెడ్యూల్ జారీ చేయడం.. పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసిందన్నారు.(చదవండి: ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) ‘కోవిడ్ మహమ్మారి వలన రాష్ట్రంలో 109 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే ప్రక్రియలో పోలీస్ సిబ్బంది అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వకు పోలీస్ బందోబస్తు నిర్వహించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పెను ప్రమాదంలో పెట్టినట్లే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేవరకు పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించలేరు’ అని పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.(చదవండి: ‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’) -
చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు గురువారం మీడియాతో మాట్లాడారు. 'రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నాం. రాజకీయ మైలేజ్ కోసం పోలీస్ వృత్తిపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఆ నాయకుడు ఏం నేర్చుకున్నాడు. ఇలాంటి వ్యాఖ్యల వలన పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. పోలీస్‌శాఖలో ఎవరికి కుల, మత భేదాలు లేవు' అని ఏపీ పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. చదవండి: (మరో కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం) -
‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’
సాక్షి, గుంటూరు : మాచర్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు జిల్లాలో పర్యటించే ముందు నేతలు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. మంగళవారం జిల్లాలో పోలీసు అధికారుల సంఘ సభ్యులు బాలమురళికృష్ణ, మాణిక్యాలరావు, బేబీ రాణి మాట్లాడుతూ.. పోలీసులకు ముందుగానే సమాచారం అందించామని బోండా ఉమా, బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. మాచర్లలో దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకుని, దాడి నుంచి నేతలను కాపాడారని తెలిపారు. పోలీసులు వాహనంలో రాజకీయ నాయకులను ఎక్కించుకోకూడదని తెలిసినా వారి ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ వాహనంలో నాయకులను తరలించామన్నారు. తమ ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడిన పోలీసులపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే పోలీసులకు పోస్టింగ్‌లు వేశారని మాట్లాడుతున్నారన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రిపోర్టు ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని, సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘పోలీసులపై బురద చల్లవద్దు. రాజకీయ పార్టీలకు అంటగడుతూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు. పోలీసులు నాయకుల ప్రాణాలను కాపాడినా.. నింధించడం బాధ కలిగించింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వలనే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళగలిగారు. పోలీసులు లేకుంటే నేడు మీరు బ్రతికి ఉండే వాళ్ళు కాదు. రాజకీయ నాయకులు పోలీసులపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. మీ పై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడము’ అని పోలీసు అధికారుల సంఘ సభ్యులు హెచ్చరించారు. -
వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తిస్తుంటే వర్ల రామయ్య పోలీసు వ్యవస్థపై అవాస్తవ ఆరోపనలు చేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయే విధంగా, పోలీసుల మనోభావాలు దెబ్బవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ముందు అందరూ సమానమే. అందులో ప్రత్యేకంగా పోలీసు శాఖకు కోర్టులపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఒక మాజీ పోలీసు అధికారి అయివుండి, కోర్టులపై మీసాలు తిప్పి, తొడలు కొడుతూ సవాలు విసరడం మీ అజ్ఞానాన్ని అవగహనారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సమాజంలో జరిగిన ఏ సంఘటన పై అయినా, సరైనా వివరాలు అవసరమై సందర్భరాల్లో విధినిర్వహణలో భాగంగా అధికారులను కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడం సాధారణం. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కోర్టుల ఆదేశాల మేరకు హాజరై వివరాలు తెలిపారు. అదే విధంగా డీజీపీ కూడా విధినిర్వహణలో భాగంగా, బాధ్యత గల అధికారిగా కోర్టులో హాజరై వారి ఆదేశాలను పాటించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ విధినిర్వహణలో సమర్థత, వారి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన గుర్తింపు గల అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. వర్ల రామయ్య లాంటి వ్యక్తుల తప్పుడు ప్రకటనలు ఎవరూ నమ్మరు. మాచర్ల ఘటనలో ఐపీసీ 307 ప్రకారం కేసు నమోదు చేశాము. వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తే.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కళ్లుండి చూడలేని మీరు ఇకనైనా మీ కళ్లకు పట్టిన పచ్చకామెర్లను వదిలించుకుని వాస్తవాలు తెలుసుకుని అవగహనతో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమాను మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హెచ్చరిస్తోంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
జేసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/చిత్తూరు అర్బన్/కడప అర్బన్: ఏపీ పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బూట్లు నాకే సంస్కృతి తమది కాదని, రాజకీయాల్లో ఆ స్థాయికి రావడానికి జేసీ ఎవరి బూట్లు నాకారో చెప్పాలన్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వడం సిగ్గుచేటని.. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్, సంఘం నాయకులు స్వర్ణలత, కె.నాగిని, పి.శేషయ్య పాల్గొన్నారు. జేసీని కుక్కల వ్యాన్‌లో ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలి జేసీ వ్యాఖ్యలు ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ అన్నారు. పిచి్చకుక్కలా మాట్లాడుతున్న దివాకర్‌రెడ్డికు గొలుసులు వేసి కుక్కల వ్యానులో ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలన్నారు. కాగా, మాజీ ఎంపీ జేసీపై కేసులు నమోదు చేయిస్తామని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పుశంకర్, వాటం జగన్మోహన్రెడ్డి తెలిపారు. జేసీని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరి్పంచాలని పోలీసు అ«ధికారుల సంఘం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్ జేసీ కుటుంబసభ్యులకు సూచించారు. -
‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్ అన్నారు. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచామని సీఎం జగన్ తెలిపారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో 64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం జగన్‌ను కలిసిన ఏఎస్పీలు: 2014 నుంచి పెండింగులో ఉన్న ప్రమోషన్లకు అంగీకారం తెలిపి.. పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ.. పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరి అధికారులకు అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని ముఖ్యమంత్రిలతో వ్యాఖ్యానించామని తెలిపారు. గతంలో కొంత మందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని.. ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్న వారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని సీఎం తెలిపామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని కొత్తగా ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదములు: పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని.. పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ విలువ పెంచి మరింత భరోసా ఇచ్చినందుకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
టీడీపీ నేతల వ్యవహారం జుగుప్సాకరం..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ డీజీపీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిలో పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడుపై చెప్పులు, రాళ్లు విసిరిన వారిని అరెస్ట్ చేసి వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాడి ఎందుకు చేశారో విచారణలో నిందితులు చెప్పినవే డీజీపీ మీడియాకు వెల్లడించారన్నారు. దాడి చేయించింది డీజీపీ అని టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. చెప్పులు వేయించే సంస్కృతి పోలీసులది కాదని, చరిత్ర తిరగేస్తే అది ఎవరి సంస్కృతో అర్థం అవుతుందన్నారు. అనుమతి ఇస్తే ఒక రకంగా, ఇవ్వకపోతే మరో రకంగా టీడీపీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని శ్రీనివాస్ మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటే పోలీసులకు గౌరవం ఉందని, అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఆ గౌరవాన్ని పోగొడుతున్నారన్నారు. పోలీసులపై అభాండాలు వేయడం టీడీపీ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలతో టీడీపీ నేతలు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీస్ బాస్‌ను టార్గెట్ చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసుల మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ వ్యవహారం చూస్తుంటే ఆడలేక మద్దెల మీద పడినట్లు ఉందని అన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే న్యాయ పోరాటానికి దిగేందుకు వెనకాడేది లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు.. మీకిది తగదు: పోలీసులు
సాక్షి, అమరావతి: సమాజంలో శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ఖాన్, కోశాధికారి సోమశేఖర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడి అధికారపార్టీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారంటూ చంద్రబాబుచేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు శాంతిభద్రతల కోసం శ్రమిస్తారే తప్ప.. పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం లేదని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీసుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం.. చంద్రబాబుకు తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగులనేవి సాధారణమని.. నిజాయితీ, పనితీరు, నైపుణ్యాలను బట్టి అవి లభిస్తాయని అన్నారు. చట్ట ప్రకారం పోలీసులు విధుల్ని నిర్వర్తిస్తారే తప్ప.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అండగా ఉండరన్న విషయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తున్నామని సంఘం నేతలు పేర్కొన్నారు. (చదవండి: ఫర్నీచర్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు) -
‘ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే ’
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసులు చేసే ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంలో సవాల్ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. -
పోలీసు అధికారుల విభజన ఏకపక్షమేల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు కావస్తోంది. అన్ని విభాగాల్లో అధికారుల విభజన పూర్తయినా పోలీస్ అధికారుల విభజన మాత్రం పెండింగ్‌లోనే ఉంది. దీనికి ప్రధానకారణం సీనియారిటీ సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఎస్ఐలు, డీఎస్పీల సీనియారిటీ జాబితాపై కోర్టుల్లో కేసులుండటంతో సమీక్షించేందుకు సమయం పట్టింది. ఈ సీనియారిటీపై ఏపీ పోలీస్‌శాఖ సమీక్ష నిర్వహించాల్సి ఉండడంతో తెలంగాణ ఉన్నతాధికారులు దీనికి ఎలాంటి పరిష్కారమార్గాలు చూపించే అవకాశం లేకుండాపోయింది. దీనితో తెలంగాణ అధికారుల సీనియారిటీ జాబితాపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండుసార్లు సీనియారిటీ జాబితా సవరించి అభ్యంతరాలు స్వీకరించారు. అయినా, తెలంగాణ అధికారుల సీనియారిటీ సమస్యకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే ఏపీ పోలీస్ శాఖ 2రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు పోలీసులను విభజించాలంటూ ప్రతిపాదిత అధికారుల జాబితానుకేంద్ర శిక్షణ, అంతర్గత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి పంపడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఏకపక్షమెందుకు..? సీనియారిటీ జాబితాను రివ్యూ చేసి, అందులో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిన వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించాల్సిన ఏపీ పోలీస్‌శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలీస్ అధికారులు విభజన, సీనియారిటీ సమస్య పరిష్కారం ఏపీ అధికారుల చేతుల్లో ఉండటంతోనే ఇలా ఏకపక్షంగా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన కాకుండానే కన్ఫర్డ్ జాబితా? రెండు రాష్ట్రాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ అధికారుల విభజన పూర్తి కాలేనప్పుడు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం కేంద్రానికి ప్రతిపాదన ఎలా పంపారన్న దానిపైనా వివాదం ఏర్పడే అవకాశముంది. రెండు రాష్ట్రాలకు 476 మంది డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల విభజన జరగాలి. కానీ, 3 నెలల క్రితం 10 మంది అధికారులను కన్ఫర్డ్ ఐపీఎస్ కోటా కింద పదోన్నతి కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు ఎలా పంపుతారని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలనుకున్న అధికారులు తెలంగాణలో, తెలంగాణకు రావాల్సిన అధికారులు ఏపీలో ఉండగానే ఇది ఎలా చేశారన్న దానిపై కొంతమంది అధికారులు కోర్టుకెళ్లాలని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 650 మందికి పైగా అధికారులకు అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ, డీఎస్పీ పదోన్నతులు కల్పించారు. సీనియారిటీ సమస్య పరిష్కారం కాకుండా అడ్çహాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం కూడా వివాదంగా మారబోతోంది. మా పరిస్థితి ఏంటి? ఏపీలో పనిచేస్తున్న తమ బ్యాచ్ అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా, నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందుతుండటంతో తమ పరిస్థితి ఏంటని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16 కన్ఫర్డ్ ఐపీఎస్ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదని, కేంద్ర హోంశాఖ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో పనిచేస్తున్న తమ పేర్లను సీనియారిటీ ప్రకారం డీవోపీటీకి పంపాలని, ఈ ప్యానల్ ఏడాదైనా పదోన్నతి దక్కేలా చూడాలని గ్రూప్ వన్, ప్రమోటీ అధికారులు కోరుతున్నారు. -
‘రెండు నెలల అదనపు వేతనం ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: కుటుంబాలకు దూరం గా ఉంటూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి 2 నెలల అదనపు వేతనం చెల్లించాలని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించింది. పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించటం తో పాటు ఎస్ఐ ర్యాంకు అధికారులను జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో సైబరాబాద్ అధ్యక్షుడు భద్రారెడ్డి, నిజామాబాద్ అధ్యక్షుడు షకీల్ పాల్గొన్నారు. -
‘అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ముష్కరుల దాడిలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కరణ్కుమార్రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరుడైన హోంగార్డు కుటుంబానికి రూ.25 లక్షలు, గాయపడిన సీఐలు, ఎస్ఐ, హోంగార్డులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా అందించాలని కోరారు. -
పోలీస్ త్యాగం వెలకట్టలేనిది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను సదాస్మరిస్తాం. అమరుల స్మత్యర్థం ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినా తక్కువే. సమాజాభివృద్ధిలో పోలీస్ త్యాగం వెలకట్టలేనిది’ అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పోలీస్ సంక్షేమం, అమరుల కుటుంబాలకు శాఖపరంగా అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ‘సాక్షి’కి సోమవారం వివరించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే... ‘ప్రజల భద్రతే లక్ష్యంగా వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వని అరుదైన శాఖల్లో పోలీస్‌శాఖ ప్రధానమైంది. జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా శత్రువుతో రాజీలేని పోరాటం చేశాం. ప్రజా శ్రేయస్సు కోసం సత్ఫలితాలను సాధించాం. జిల్లాలో దాదాపు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. జిల్లా పోలీసుల సమష్టి కృషి, త్యాగనిరతికి ఇది నిదర్శనం. జిల్లాలో దాదాపు 40 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. వారి కుటుంబాలకు పోలీస్‌శాఖ అండగా ఉంటోంది. వారి కుటుంబసభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నాం. వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నాం. జిల్లా పోలీస్ అధికారుల సంఘం సైతం వారికి అనుక్షణం అందుబాటులో ఉంటుంది. 1996 కంటే ముందు మరణించిన పోలీసులకు సంబంధించి వారి కుటుంబాలు అడుగుతున్న ప్రభుత్వపరమైన రాయితీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకుగాను అడిషనల్ ఎస్పీ, పోలీస్ అధికారుల సంఘం అమరవీరుల కుటుంబాలకు చెందిన వారితో కలిసి రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి సమస్యలను వివరిస్తాం. 1996 కంటే ముందు మరణించిన పోలీస్ అమరుల కుటుంబాలకు కేవలం ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇతర ఆర్థిక ప్రయోజనాలేవీ నెరవేరలేదు. ఈ విషయాన్ని హోంమంత్రికి ప్రతినిధి బృందం నివేదిస్తుంది. విద్యార్థులకు పోలీస్‌శాఖ విధి నిర్వహణపై అవగాహన కల్పించాం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా రక్తదానం, వ్యాసరచన, వక్తృత్వం, క్రీడాపోటీలు, ఓపెన్‌హౌస్, సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం విజయవంతానికి పోలీస్‌శాఖ కూడా విశేషంగా కృషి చేస్తోంది. పోలీసు అమరుల కుటుంబాలకు సంబంధించిన ప్రతి సమస్యనూ పోలీస్ కుటుంబ సమస్యగానే భావిస్తాం. అమరుల కుటుంబాలకు ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల్లో రెండుశాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇతర ఉద్యోగాల్లోనూ దీన్ని అమలు చేయాలనే డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వ దృష్టిలో ఉంది’ అన్నారు. -
జిల్లాలో పోలీసులకు ఇక వారాంతపు సెలవు
అమలు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఎస్పీ రాజకుమారి అనంతగిరి: పోలీసులకు ఇక నుంచి వారంతపు సెలవులు అమలుపరుస్తామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టలోని హరిత రిసార్ట్స్‌లో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వారాంతపు సెలవును ఆయా పీఎస్‌ల ఎస్హెచ్ఓలు రొటేషన్ పద్ధతిలో అందరికి వచ్చేలా చూడాలన్నారు. ఇక నుంచి ప్రతినెల సిబ్బంది సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే అక్కడ విన్నవించుకోవచ్చన్నారు. పోలీసుల సంఘం కార్యాలయం కోసం తమ కార్యాలయ పరిధిలోని ఓ గదిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. పోలీసుల నివాసాల మధ్య డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.85 లక్షలు మంజూరైనట్లు చెప్పా రు. రాజీవ్ గృహకల్ప ఎదుట పోలీసుశాఖకు ఉన్న స్థలంలో మహిళా పీఎస్ ఏర్పాటుకు నిధులు మం జూరయ్యాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్పీల సమావేశంలో వికారాబాద్, తాండూరులలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డీజీపీకి విన్నవించినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ పోలీసుల కోసం కల్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డీపీఓలో ఉన్న క్యాంటీన్లో కిరాణా సరుకులు కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంఘం తరఫున ఎస్పీని, ఏఎస్పీని, డీఎస్పీలను సన్మానించారు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన అన్ని విభాగాల సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణామూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, డీఎస్పీలు షేక్ ఇస్మాయిల్, నర్సింలు, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్, రాష్ట్ర కో-ఆప్షన్ మెంబర్ చైతన్యకుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.