సాక్షి, హైదరాబాద్: ముష్కరుల దాడిలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అమరుడైన హోంగార్డు కుటుంబానికి రూ.25 లక్షలు, గాయపడిన సీఐలు, ఎస్‌ఐ, హోంగార్డులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా అందించాలని కోరారు.