ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కుటుంబాలకు దూరం గా ఉంటూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి 2 నెలల అదనపు వేతనం చెల్లించాలని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించింది. పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించటం తో పాటు ఎస్‌ఐ ర్యాంకు అధికారులను జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో సైబరాబాద్ అధ్యక్షుడు భద్రారెడ్డి, నిజామాబాద్ అధ్యక్షుడు షకీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment