Gopi Reddy
-
నరసరావు పేటలోని స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
నరసారావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు
-
‘రెండు నెలల అదనపు వేతనం ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: కుటుంబాలకు దూరం గా ఉంటూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి 2 నెలల అదనపు వేతనం చెల్లించాలని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించింది. పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించటం తో పాటు ఎస్ఐ ర్యాంకు అధికారులను జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో సైబరాబాద్ అధ్యక్షుడు భద్రారెడ్డి, నిజామాబాద్ అధ్యక్షుడు షకీల్ పాల్గొన్నారు. -
‘హెచ్చుమీరుతున్న కోడెల కుటుంబ అవినీతి’
సాక్షి, విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ అవినీతిపై విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఎస్పీ గనులు, పశుగ్రాసం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కోడెల శివప్రసాద్ ట్యాగ్( కేఎస్టీ) పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 72 ప్యాకేజీల కింద పనులను విభజించి టెండర్లు నిర్వహించారని, తమకు అనుకూలమైన వారికే టెండర్ ఫారంలు ఇచ్చారని మండిపడ్డారు. కోడెల కుమారుడి నేతృత్వంలో అందరూ కలిసి రింగ్‌గా మారారని, 25 నుంచి 30 శాతం అధికంగా కోట్ చేశారన్నారు. 5 శాతం అధికం వేస్తే రివ్యూ కమిటీకి పంపుతారు.. కానీ అంతకన్నా అధికంగా వేసినా రివ్యూ కమిటీకి పంపలేదని తెలిపారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. నీటి పారుదల శాఖలో ఇది నిదర్శనమని, కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వంద కోట్ల పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. మరో వైపు పశుగ్రాసం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు. 3500 ఎకరాల్లో గడ్డిని పెంచాలని, వాటిని కొనుగోలు చేయాలని నిర్ఱయించారన్నారు. పుశుసంవర్థక శాఖ ద్వారా టీడీపీ అనుయాయులు పేర్లతో గడ్డి కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు. ఒక్కో ఎకరానికి ఇరవై వేల చొప్పున ఏడు కోట్ల రూపాయలు స్వాహా చేశారని తెలిపారు. అసలు ఏ రైతు తన పొలంలో గడ్డి పెంచారో చెప్పాలన్నారు. మొక్కజొన్న గడ్డలు, గడ్డి కలిపి సైలేజ్‌ను తయారు చేస్తున్నారని, కేంద్రం దీనికి 50 శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి సైలేజ్ యంత్రాలను పెట్టి ఈ సబ్సిడీని కాజేస్తున్నారని వెల్లడించారు. పశువులు తినలేని సైలేజ్‌ను వీరు తయారు చేసి, బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మండిపడ్డారు. కోడెల కుటుంబం చేస్తున్న అవినీతి హెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ఓ శాఖను, కుమార్తె ఓ శాఖను పంచుకుని అవినీతి పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్‌గా ఉన్న కోడెల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. తన కుమార్తె, కుమారుడి అవినీతికి కోడెల బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పశుగ్రాసం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది
-
నెల్లూరుకి చేరుకున్న గోపి రెడ్డి పాదయాత్ర
-
చులకనగా చిత్రీకరిస్తే క్రిమినల్ కేసులు..
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో పోలీసు పాత్రలను చులకనగా చిత్రీకరిస్తే పరువు నష్టం, క్రిమినల్ కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. సమాజంలో పరువు ప్రతిష్టలు కలిగిన పోలీసులను సినిమాల్లో చులకనగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడారు. సినిమాలో పోలీసు పాత్రధారులు చొక్కాలు విప్పడం, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి తమను కించపరిచే పదాలు ఉపయోగిస్తే కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఖాకీలు, పోలీసోడు వంటి పదాలు ఉపయోగించినా సహించబోమన్నారు. ఇటీవలి కాలంలో ‘మెంటల్ పోలీస్’ పేరుతో తీస్తున్న సినిమాను పేరు మార్చాలని లీగల్ నోటీసులు పంపినా వారి నుంచి స్పందన రాలేదని.. వారిపై న్యాయస్థానంలో పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు గోపిరెడ్డి తెలిపారు. అలాగే ‘పోలీసోడు’ అనే సినిమా పేరును మారుస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా సినిమాల్లో తెలంగాణ పోలీసు యూనిఫాం, లోగోలను ఉపయోగించి గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు ఎన్.శంకర్‌రెడ్డి, సైబరాబాద్ అధ్యక్షులు సీహెచ్ భద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఎడతెగని సేవా గుణం...
ఎనిమిది పదుల సాహస కోణం... ఆదర్శం హైదరాబాద్ నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరిన విమానంలో పదిమంది భారతీయులు ఉన్నారు. వారంతా వారంరోజుల పాటు ఈజిప్ట్‌లో విహరించడానికి బయలుదేరారు. ఆ పదిమందిలో సీతా పెయింటాల్ ఉన్నారు. ఆమె తన బ్యాగ్‌లోంచి ఓ ఐపాడ్ తీసి మెసేజెస్ చెక్ చేసుకుంటూ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసిన వారంతా ‘అంత పెద్దావిడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వాడటమా’ అని ఆశ్చర్యపోయారు. కాశ్మీర్ సిక్కు కుటుంబానికి చెందిన సీతా పెయింటాల్కి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకున్నదీ అంతా ఢిల్లీలోనే. ఎం.ఏ. ఎకనామిక్స్ చదివి, నాలుగేళ్లపాటు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న దల్జీత్ సింగ్ పెయింటాల్తో వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి గృహిణిగా మారారు. ‘‘నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. వారి ఆలనపాలనలతోటే సమయమంతా గడిచిపోయేది. మా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలంటే కష్టమనిపించి, బి.ఇడి. చేశాను. ఇప్పుడు మా పెద్దమ్మాయి డాక్టరు. రెండో అమ్మాయి సైకాలజీలో ఆనర్స్ చేసింది. అబ్బాయి ఐ.ఐ.టి. పూర్తయ్యాక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎమ్.బి.ఏ, చేసి కెనడాలో స్థిరపడ్డాడు. మా వారి ఉద్యోగరీత్యా అనేక నగరాల్లోనే కాక ఇంగ్లాండ్‌లోనూ ఉన్నాం. ఆయన ఉద్యోగ విరమణ చేశాక ఢిల్లీలోనే స్థిరపడ్డాం’’ అని తన గురించి క్లుప్తంగా వివరించారు సీతా పెయింటాల్. కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం ప్రారంభించారు పెయింటాల్. మొబైల్ క్రష్‌లో... కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం కోసం ఎన్నో సేవలు చేశారు. అంధ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి కోసం చరిత్ర, ఆర్థికశాస్త్రం మొదలైనవి తన గొంతులో రికార్డ్ చేసి వినిపించారు. అక్కడితో ఆగలేదామె. ప్రత్యేకించి క్యాన్సర్ బాధితులకు ఎన్నోరకాలుగా తన సేవలు విస్తరించారు. ఆమె అలా క్యాన్సర్ బాధితుల పక్షాన నిలవడానికి కారణం... ‘‘ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న మా చెల్లికి రొమ్ము క్యాన్సర్ సోకిందని తెలిసింది. నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నాను. క్యాన్సర్ గురించిన పుస్తకాలు తెచ్చుకుని కూలంకషంగా అధ్యయనం చేశాను. ఆ వ్యాధి బారిన పడ్డవాళ్లకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. అందుకు తగ్గట్లే ఆమె ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి క్యాన్సర్ సహయోగ్ ఢిల్లీ శాఖలో చేరి, ఆరోగ్యసేవ కొనసాగిస్తున్నారు. ఈ సేవాస్ఫూర్తిని మరింతమందిలో రగిలించడానికి ఎంతోమందిని వలంటీర్లుగా తయారుచేసి వారి ద్వారా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ‘‘ఇప్పుడు ఆ సంస్థలో వందలాదిగా స్వచ్ఛంద సేవకులు వచ్చి చేరుతున్నారు. సంస్థకు వచ్చే విరాళాలతో రొమ్ము క్యాన్సర్ పీడితులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నాం’’ అని వివరించారు సీతా పెయింటాల్. వయసెరుగని... ఇటీవలే ఆమె తన కుటుంబ సభ్యులతో ఈజిప్ట్ పర్యటించారు. తనతో పాటు ఓ బుల్లి కెమెరాను తెచ్చుకున్నారు. పిరమిడ్లను చకచకా ఎక్కుతూ ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. నైలునదిలో నౌకావిహారం చేస్తూ అక్కడి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. స్వయంగా తాను కూడా క్యాన్సర్ బారినపడ్డ ఆమె, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, తమ దైనందిన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి భావోద్వేగాలను పంచుకుని, వ్యాధిని ఎదుర్కొనడానికి తగిన సలహాలు ఇస్తున్నారు. అప్పుడే ఆమె ఇద్దరు చెల్లెళ్లూ, భర్త మరణించారు. అయినా ఆమె తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. ‘‘క్యాన్సర్ వ్యాధి మీద మరింత మందికి అవగాహన కల్పించాలనుకున్నాను. ‘క్యాన్సర్ సహయోగ్ సంస్థ’ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నాను. ‘నాకు హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారెవరైనా ప్రతి రోజూ రాత్రి నాకు ఫోన్ చేయచ్చు (ఫోన్ నం. 9818488122). వారికి నైతిక స్థైర్యాన్ని అందజేస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పే ఈ పండుటాకును జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే వారందరూ ఆదర్శంగా తీసుకుని తీరాలి. ఆమెలోని అనుకూల దృక్పథాన్ని అందరూ అలవరచుకోవాలి. - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి